ప్రెస్ & మీడియా అక్రిడిటేషన్ సవరణకు ఓకే కానీ..


Ens Balu
242
Amaravati
2023-03-14 16:24:23

వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రెస్ అండ్ మీడియా విషయంలో అక్రిడిటేషన్ మంజూరుకి సంబంధించిన నిబంధనల సవరణకు తొలిసారిగా..అంటే మూడున్నరేళ్లు పూర్తయిన తరువాత అంగీకారం తెలిపింది. గతంలో దినపత్రికలకు జిఎస్టీ తీసేయాలని, పత్రిక ప్రింటింగ్ లో సడలింపులు ఇవ్వాలని, చిన్న-మధ్య తరహా పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలని యూనియన్లు ప్రభుత్వాన్ని కోరినా ఫలితం దక్కలేదు. కానీ ఎన్నికలకు ఏడాది కాలం ఉందనగా ప్రభుత్వం ప్రెస్ అండ్ మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు, 142 జీఓ సవరణకు ఆమోదం తెలిపినా స్వల్ప మార్పులు మాత్రమే ఉండే అవకాశం ఉంది తప్పా చిన్న, మధ్యతరహా పత్రికలు, న్యూస్ ఏజెన్సీ లకు ప్రభుత్వ ప్రకటనల విషయంలో మార్పు ఉండకపోవచ్చునని చెబుతున్నారు సీనియర్ జర్నలిస్టులు. అంతేకాకుండా మార్చి 31 వరకూ పాత అక్రిడిటేషన్లు ఎక్సటెన్ష న్ ఇచ్చన ప్రభుత్వం కొత్త అక్రిడిటేషన్లు ఇస్తుందా.. వాటికే గడువు పెంచుతుందా తేల్చలేదు..!