ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి గెలుపుకంటే ఇపుడు టిడిపి, జనసేన, పీడిఎఫ్ పార్టీలలో మరో ఆశక్తి కరమైన అంశా న్ని ట్రోల్ చేస్తున్నారు. విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించేస్తామని ప్రకటించిన నెలలోనే ఒక ఎమ్మెల్సీ సీటు కోల్పోవాల్సి వచ్చిం దని..ని జంగా పరిపాలన ప్రారంభిస్తే ఇంకెన్ని కోల్పోవాల్సి వస్తుందో నంటూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. అందులోనూ సీఎం గోబ్యాక్ అనే పోస్టర్లు విశాఖలో ఎమ్మెల్సీ కౌంటింగ్ సమయంలోనే వెలయడం, పట్టభద్రులంతా వార్ వన్ సైడ్ చేసేయడం, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత అధికారులు ఇలా అన్ని వర్గాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారని క్రిష్టల్ క్లియర్ గా తేలిపోయింది. అయితే మానసికంగా గెలుపు తమదేనని..కాకపోతే డా.వేపాడ చిరంజీవిరావుకి మామూలుగానే యువతలోనూ మంచి ఫాలోయింగ్ ఉండటం వలన గెలిచారని..ఇది టిడిపి విజయం కాదని వైఎస్సార్సీపీ నాయకులు, కేడర్ అదే సోషల్ మీడియాలో కౌంటర్ ఇవ్వడం విశేషం..!