గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్ ఛానల్ ఎక్కడ


Ens Balu
253
Amaravati
2023-03-19 03:07:39

భారత దేశం మొత్తం తొంగిచూసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకేసారి 1.25 లక్షల ఉద్యోగాలను భర్తీచేసిం ది. అపుడు అన్ని రాష్ట్రాలు ఔరా అన్నాయి. అవే రాష్ట్రాలు ఇపుడు ఏపీ ప్రభుత్వ తీరును చూసి అడ్డెడ్డే అంటున్నాయి. 19ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పూర్తిస్థాయి సర్వీసు రూల్సు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకుండా ఇపుడు వారి ప్రభు త్వ శాఖకు చట్టబద్దత కల్పించడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేయడమేంటని ముక్కున వేలేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని 75 ప్రభుత్వశాఖల్లోని సబార్డినేట్ సర్వీసు రూల్సు సచివాలయ ఉద్యోగులకు అమలు చేస్తున్నామన్న ప్రభుత్వం ప్రమోషనల్ ఛానల్ విషయంలో కొన్నిశాఖల సిబ్బందికే ఫ్రేమ్ చేసి మిగిలిన వారిని గాల్లోపెట్టింది.  2022 జూలైలో సర్వీసులు క్రమబద్దీకరణ జరిగిన ఉద్యోగులందరికీ ఏడేళ్లు లేదా తొమ్మిదేళ్ల తరువాత పదోన్నతులు ఏనిబంధన ఆధారంగా చేపడతారో క్లారిటీ ఇవ్వలేదు.