అధ్యక్షా అసెంబ్లీ సాక్షిగా వైఎస్సార్సీపీకి శ్రుంగభంగం


Ens Balu
148
Tadepalli
2023-03-23 13:28:28

అధ్యక్షా అసెంబ్లీ సాక్షిగా అధికారపార్టీ వైఎస్సార్సీపీకి శ్రుంగభంగం ఎదురైంది. ఎమ్మెల్యేల కోటలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా టిడిపి అభ్యర్ధి పంచుమర్తి అనురాధ23 ఓట్లుతో గెలుపొందారు. పక్కాగా ఈ ఎమ్మెల్సీ సీటుమాదేనని చెప్పుకొని రొమ్మువిరుచుకున్న వైఎస్సార్సీపీ ఈమె విజయంతో ఒక్కసారిగా డీలాపడిపోయింది. అయితే విప్ జారీచేయడం క్రాస్ ఓటింగ్ కి కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు. టీడీపీ తరపున 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ నలుగురు ఫిరాయించారు. అంటే 19 ఓట్లు మాత్రమే ఉన్నాయి. వైఎస్సార్సీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. వారిలో ఇద్దరు  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి. మరో ఇద్దరు వైసీపీతో పాటు క్యాంప్‌కు హాజరై .. సైలెంట్‌గా టీడీపీకి ఓట్లేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఏదిఏమైనా వైఎస్సార్సీపీ కంచుకోట అనుకున్న అసెంబ్లీసాక్షిగా అధికారపార్టీకి టిడిపి ఎమ్మెల్సీ గెలుపు ద్వారా బీటలువారడం చర్చనీయాంశం అవుతోంది.