ఆంధ్రప్రదేశ్ లో 3.50లక్షల రిటైర్డ్ ఉద్యోగులు ఏపార్టీవైపు


Ens Balu
97
Amaravati
2023-03-28 11:52:30

ఏపీలో 3.50లక్షల మంది పెన్షర్లు(రిటైర్డ్ ఉద్యోగులు) 2024 ఎన్నికలలో ఏరాజకీయపార్టీని బలపరుస్తారనే చర్చ ఇపుడు రాష్ట్రంలో హాట్ హాట్ గా నడుస్తుంది. ఇటీవలే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగ యువత, ఉద్యోగులతోపాటు, రిటైర్డ్ అధికారులు 70, 80ఏళ్ల వయస్సులో కూడా లైనులో నిలుచొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటువేశారు. పైగా వైఎస్సార్సీపి అధికారంలోకి వచ్చిన తరువాత క్వాంటమ్ పెన్షను వయ స్సుని 70 నుంచి 100ఏళ్లకు పెంచేసింది. అంటే 100ఏళ్లు రిటైర్డ్ ఉద్యోగులు బ్రతికుంటేనే వారికి క్వాంటమ్ పెన్షన్ వస్తుందని తేల్చి చెప్పే సిం ది. పెండింగ్ డిఏలు కూడా ఇవ్వకుండా కాటికి కాలుచాచే వయస్సులో ప్రభుత్వం తమను ఇంత దారుణంగా వేధించడం తామంతా ఏ ప్రభుత్వంలోనూ చూడలేదని చెబుతున్నారు వీరంతా. పెన్షనరుగా మాత్రం వైఎస్సార్సీపీ పార్టీని బలపరిచమని తెగేసి చెబుతున్నారు. అంటే ఒక్కో ఇంట్లో 4 ఓట్లు లెక్కేసినా.. 350,000x4=1,400,000(14లక్షలు) ఓట్లు వైఎస్సార్సీపికి పోయినట్టేనని చాల స్పష్టంగా అర్ధమవుతుంది..!