ఆంధ్రప్రదేశ్ లోని 3.59 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు అధికార వైఎస్సార్సీపీ మాట నమ్ముతారా అంటే.. చచ్చినా నమ్మేది లేదని తెగేసి చె బుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తామని ప్రకటించిన వైఎస్సార్సీపీ మరో ఏడాదిలో అధికారం మొత్తం పూర్తవు తు న్నా ఇంకా చర్చల పేరుతోనే కాలయాపన చేస్తోందని సిపిఎస్ ఉద్యోగులు మండిపడుతున్నారు. తమకు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ ను అ మలు చేయాలని నెత్తీనోరూ కొట్టుకుంటున్నా ప్రభుత్వం ఎక్కడా వీరి గోడు పట్టించుకోలేదు. దీనితో 2024లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు తో నే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నట్టుగా సిపిఎస్ ఉద్యోగులు అపుడే సామాజిక మాద్యమాల ద్వారా ఏకమై వారి కుటుంబాల్లో ని ఓట్ల(సరారి ఒక్కో కుటుంబంలో 4 ఓట్లు)ను పడకుండా చేసుకోవాలని జాగ్రత్త పడుతున్నారు. తమ కుటుంబాల్లో ఒక్కో ఇంట్లో 4ఓట్లు లెక్కేసి నా 359,000x4=1,436,000(14.36లక్షలు) ఓట్లు చేజారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.