ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వైద్యాధికారులు వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అత్యవసరం, ముఖ్యమైన పను ల కోసం సెలవులు పెట్టుకున్నా..ప్రభుత్వశాఖలు నిర్వహించే టెలీ కాన్ఫరెన్సు, వీడియో కాన్ఫరెన్సులో ఖచ్చితంగా పాల్గొనాల్సి వస్తోంది. దీ నితో తమకి సెలవులు పెట్టినా, విధినిర్వహణలో ఉన్నా పెద్దగా తేడా ఏమీ తెలియడం లేదని ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ తంలో ఎన్నడూ లేనివిధంగా ఉదయం 8గంటలకే జూమ్ కాన్ఫరెన్సులు, రాత్రి 8గంటల వరకూ జిల్లా కార్యాలయాలు, మండలకార్యాలయా ల్లో పనులు తీవ్రస్థాయిలో పెరిగిపోతున్నాయని వాపోతున్నారు. ప్రభుత్వశాఖల్లో సిబ్బంది లేకపోవడం, పనులు పేరుకుపోవడంతో సొంత ప నులు, కార్యక్రమాల్లో పాల్గొనే తీరిక కూడా దొరకడంలేదని కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఆరోగ్యం బాగాలేక సెలవులు పెట్టినా ఇంటినుంచే పనిచేయాల్సి వస్తుందని..ఇకమేము సెలువులు తీసుకొని ఉపయోగమేమిటో చెప్పాలంటున్నారు.