ఆంధ్రప్రదేశ్ లో నూనత జిల్లాలో అక్రిడిటేషన్ కమిటీలు ఏర్పాటు చేయకపోతే కొత్త జిల్లాల కలెక్టర్ల పరువు పోతుందని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ యాప్ enslive,న్యూస్ వెబ్ సైట్ www.enslive.netలలో నూతన జిల్లాల్లో ఉత్తుత్తి కలెక్టర్లు శీర్షికిన వార్తను ప్ర చురిచింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం. ఇపుడు రాష్ట్ర కమిషనర్ కార్యాలయంతోపాటు 26 జిల్లాల్లోనూ జిల్లా అక్రిడిటేషన్ కమిటీలను ని యమిస్తున్నట్టు ప్రకటించింది. ఏపీలోని కొత్తజిల్లాలకు రాష్ట్ర గవర్నర్, అసెంబ్లీ ఆమోదంతోనే గెజిట్లు వెలువడ్డాయికానీ కేంద్ర ప్రభుత్వం ద్రు ష్టిలో ఇంకా 13జిల్లాలే. ఈకొత్తజిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం ఇంకా రాలేదు. అంతేకాదు ఆర్ఎన్ఐ వెబ్ సైట్ లోనూ 13జిల్లాలుగానే ఉంది. కొత్త గాఏర్పడిన 13జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం జిల్లాకలెక్టర్లు, జెసిలను నియమించిన ప్రభుత్వం ఇక అన్ని కార్యకలాపాలను జిల్లాల వారీగానే చేపట్టి నిర్వహించనుందని అక్రిడిటేషన్ల కమిటీల కోసం ఇచ్చిన జిఓ-38లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తేల్చిచెప్పేసింది..!