మార్గదర్శిలో ముసలంతో మంచమెక్కిన రామోజీ


Ens Balu
48
Jubilee Hills
2023-04-03 13:32:25

మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో సిఐడి విచారణ వేగవంతం చేయడంతో విచారణ జరిగే సమయానికి ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్, మార్గదర్శి కేసులో ఏ-1గా ఉన్న రామోజిరావుకి సుస్తీ చేసింది. దీనితో ఆయన మంచానికే పరిమితం అయ్యారు. విచారణకు రామోజి ఫిల్మ్ సిటీకి వస్తారని ముందుగానే సమాచారం ఇచ్చిన సిఐడికి, రావొచ్చునని బదులు ఇచ్చిన ఆయన తనకు సుస్తీచేసిందని మళ్లీ సమాచారం పంపారు. అయితే రామోజీ ఫిల్మ్ సిటీకి కాకుండా జూబ్లీ హిల్స్ లోని తన ఇంటికే రావాలని సిఐడికి సమాచారం అందించారు. మార్గదర్శి ఎండి శైలజ కూడా అక్కడే వుంటున్నారని కూడా తెలియజేశారు. తన ఆరోగ్యం బాగాలేని కారణంగా వైద్యపరీక్షలు చేయించుకోవడానికే ఇంటికి వచ్చినట్టు పేర్కొన్నారు. అయితే బెడ్ పై పడుకొని ఉండగానే విచారణ చేయాలని కూడా సిఐడిని రామోజీరావు కోరిన మేరకు సిఐడి అధికారులు ఆ విధంగానే చేస్తున్నారట సిసి కెమెరాల పర్యవేక్షణలో.  విచారణ సమయానికి ఆయన మంచమెక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది.