ఆ ఉద్యోగుల ప్రమోషన్ డౌటు.. మరి చట్టబద్దత దారెటు


Ens Balu
135
Amaravati
2023-04-06 01:18:45

భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు నేటికీ ప్రమోషనల్ ఛాన ల్  ప్రభుత్వం విదివిధానాలు రూపొందిం చలేదు. కనీసం ఈశాఖకు చట్టబద్దత కూడా కల్పించలేదు. కాకపోతే మంత్రివర్గ సమావేశంలో చట్ట బ ద్దతకి ఆమోదం మాత్రమే తెలిపారు. 19విభాగాల ఉద్యోగుల్లో ఇప్పటివరకూ కేవలం 5విభాగాల ఉద్యోగులకు మాత్రమే ప్రమోషనల్ ఛానల్ రూ పొందించారు. ఉదాహరణకు మహిళా పోలీసులను తీసుకుంటే మొదటి ప్రమోషన్ ఆరేళ్లు దాటగానే హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ ఇస్తా రు. తరువాత ఐదేళ్లకు ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐ వరకూ వీరి పదోన్నతులున్నాయి. ఇవన్నీ జరగాలంటే ముందు గ్రామ, వార్డు సచివాలయ శాఖకు అ సెంబ్లీలో చట్టబద్దత తీసుకురావాలి. దానికంటే ముందు మిగిలిన విభాగాల సిబ్బందికి, సర్వీసు రూల్సు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటుచేయా లి.  అయితే వీరి సర్వీసు రెగ్యులరైన 6ఏళ్లా, లేదంటే విధుల్లోకి చేరిన ఆరేళ్లకు పదోన్నతిస్తారా అనేది క్లారిటీలేదు..!