ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఏపీజేఏసి ఉద్యోగులు అసలైన నిరసన మొదలు పెట్టారు.. ఒకరోజంతా ఉద్యోగులు సెల్ ఫోన్ వాడకూడదు. మామూ లుగా ఉద్యోగులు పనిచేస్తేనే పనులు అంతంత మాత్రంగా పనిచేస్తాయి. అలాంటి ఒకరోజంతా ఉద్యోగులు వారి వారి సెల్ ఫోనులు వినియో గిం చకుండా నిరసన తెలియజేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచిస్తేనే అది ఊహకే అందదు. ఈ విషయాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజె న్సీ, Ens Live App, www.enslive.net లో ఇటీవలే ఉద్యోగుల వర్క్ టు రూల్ నిరసనలో సెల్ ఫోన్ లు కూడా పాల్గొంటాయని ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అపుడు ఉద్యోగ సంఘాలు ఆవిషయాన్ని లైట్ తీసుకున్నాయి. కానీ ఇపుడు ఉద్యోగులు ఒక రోజు సెల్ ఫోన్ డౌన్ చేస్తున్నారని అమరావతి ఏపీజెఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించడంతో ఈఎన్ఎస్ ప్రచురించిన కథనం వాస్తవమేనని.. ఒక్కసారి ఉద్యో గులు రాష్ట్రవ్యాప్తంగా సెల్ డౌన్ చేసి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తామని చెప్పుకొచ్చారు.