గురువారం నుండి అందుబాటులోకి ఈ-ఆటోలు


Ens Balu
20
Tadepalli
2023-06-06 14:37:16

క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఇంటింటి చెత్త సేకరణ ఈ-ఆటోలను రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం ఉదయం ప్రారంభించనున్నారని రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరి వై.శ్రీలక్ష్మి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ చీఫ్ సెక్రెటరి మాట్లాడుతూ క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా రాష్ట్రంలో ఇంటింటి చెత్తను తడిపొడిగా వేరుగా సేకరణ చేయడానికి 516 ఈ-ఆటోలను ప్రభుత్వం అందించిందన్నారు. ఈ-ఆటోలను ముఖ్యమంత్రి గురువారం ఉదయం 9 గంటలకు తమ క్యాంప్ కార్యాలయం వద్ద ప్రారంభిస్తారన్నారు. శుక్రవారం నుండి ఆయా నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల వార్డ్ సచివాలయాల వారిగా ఈ-ఆటోలు అందుబాటులోకి వస్తాయని, తద్వారా మెరుగైన ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం చేయడానికి అవకాశం కల్గుతుందన్నారు. ఇప్పటికే ప్రజారోగ్య కార్మికులకు దశల వారిగా ఆటోల డ్రైవింగ్ శిక్షణ ఇచ్చామన్నారు. ఈ-ఆటోల ప్రారంభోత్సవ కార్యక్రమ నిర్వహణకు స్వచ్చంధ్ర కార్పోరేషన్ ఎండి, సిడిఎంఏ, జిల్లా కలెక్టర్, విజయవాడ, మంగళగిరి-తాడేపల్లి కమిషనర్లకు విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు పేర్కొన్నారు.