ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నిర్వహిస్తున్న బదిలీల ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. తొలుత జిల్లా పరిధిలో బదిలీలు చేసి చేతులు దులుపుకున్న ప్రభుత్వం అంతర్ జిల్లాల ఉద్యోగులకు, పరస్పర బదిలీలకు సంబంధించిన సమాచారం ఇంకా ఇవ్వలేదు. ఇటీవలే ఉమ్మడి 13 జిల్లా్లో జరిగిన బదిలీల ఉద్యోగులకు కౌన్సిలింగ్ తరువాత ఆర్డర్లు ఇచ్చారు. వారంతా ఒక్కొక్కరుగా వారికి కేటాయించిన స్థానాల్లో జాయిన్ అవుతున్నారు. వాస్తవానికి జిల్లాల ప్రక్రియ పూర్త యిం ది కనుక అంతర్ జిల్లాల బదిలీలు కూడా చేపడితే ఈ అభ్యర్ధన బదిలీల విషయం పూర్తయిపోతుంది. కానీ అలా చేయకుండా జిల్లా పరిధిలోన బదిలీలను మాత్రమే ప్రభు త్వం పూర్తిచేసింది. తొలుత జూన్ 19న అంతర్ జిల్లా బదిలీలు జరుగుతాయని అధికార వర్గాలు ప్రకటించాయి. కానీ అది జరగకపోవడంతో దరఖాస్తు చేసుకు న్నవా రంతా ప్రభుత్వం ప్రకటన కోసం వేచి చూస్తున్నారు. మిలిన వారికి కూడా బదిలీల ప్రక్రియ చేపడితే మొత్తం బదిలీల ప్రక్రియ శేషం లేకుండా ఉంటుంది.