ఈఎన్ఎస్ చెప్పిందే నిజమైంది..ఏపీలో అధికారిక కులగణన..!


Ens Balu
84
Visakhapatnam
2023-10-15 04:56:45

ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ(ఈఎన్ఎస్) అధికారికి మొబైల్ న్యూస్ యాప్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net చెప్పింది ఎప్పుడూ ఒమ్ముకా లేదు..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా సామాజిక కులగణన చేపట్టనుందనే విషయాన్ని ప్రత్యేక కథనంగా ప్రజల ముందుంచాం. దానిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం ఇపుడు ఆ మాటను నిజం చేస్తూ కులగణన చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తోంది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు కేవలం కులసంఘా లు మాత్రమే చేసుకునే కుల గణన ఇపుడు నేరుగా ప్రభుత్వమే చేపట్టనుంది. దీని ద్వారా ఆయా కులాలకు ఏర్పాటు చేసిన కార్పోరేషన్ల ద్వారా అభివ్రుద్ది కార్యక్రమాలు, రాజకీయం, ఓటు బ్యాంకు ఇలా అన్నింటికీ సదరు డేటా పనిచేస్తుందని భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏ కులంలో ఎంత మంది ఉన్నారు..? మగవారు ఎంతమంది..? ఆడవారు ఎంతమంది..? పిల్లలు ఎంతమంది..? వారి వయస్సులు.. వారి ఆర్ధిక పరిస్థితి, సొంతిల్లు, ఉద్యోగం, వ్యాపారం, కూలీపనులు, సెల్ నెంబర్లు, ఆధార్ నెంబర్లు ఇలా సమస్త సమాచారం ఈ డేటాలో సేకరించాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. తద్వారా రాష్ట్రంలో ఏ కులంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి..? ఎంతమంది జనాభా ఉన్నారు..? ఏ కులానికి ఏఏ సంక్షేమ పథకాలు అందుతున్నాయి..ఇంకా ఎవరెవరికి అందలేదు..అందులో ధనికులు, పేదవారు ఇలా అన్ని వివరాలు పొందుపరచనున్నారు. ఈ వివరాలు 2024 ఎన్నిక సమయానికి పూర్తి సమాచారం ప్రభుత్వం దగ్గర ఉండనుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 14వేల5 గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30లక్షల మంది ఉద్యోగులు, మరో నాలుగు లక్షల మంది గ్రామ వాలంటీర్ల ద్వారా ఈ డేటాను నవంబరు 14 నుంచి ప్రభుత్వం సేకరించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదే సమయంలో రాష్ట్ర జనాభా సంఖ్య కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలిసే అవకాశం ఏర్పడుతుంది. అనధికారికంగా రాష్ట్రంలో కుల గణన 2023 మార్చినాటి కే పూర్తయి పోయి నట్టు సమాచారం. వాటిని ఆయా కుల సంఘాలు చేపట్టేశాయి. కానీ ఇపుడు అధికారికంగా సేకరించే సమాచారంలో రాష్ట్రంలో ఎంతమంది ప్రజలున్నారు..? ఎన్ని కులాలు ఉన్నాయి..? ఏఏ కులంలో ఎంతమంది జనాభా ఉన్నారనే విషయం అధికారికంగా తెలియనుంది. ఈ కుల గణన వలన అన్ని రాజకీయపార్టీలకు మేలు, కీడు రెండూ జరగనున్నాయని చెబుతున్నారు. కులంలో జనాభా ప్రాతిపధికన కూడా రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ, జెడ్పీ చైర్మన్లు, కుల కార్పోరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు ఇలా ఇతర నామినేటెడ్ పోస్టులు కూడా ప్రభుత్వాలు కుల బలాన్ని బట్టి భర్తీ చేసే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ రెడ్డి, కమ్మ రెండు సామాజిక వర్గాలు మాత్రమే ప్రభుత్వాలను నడుపుతూ వచ్చాయి. ప్రభుత్వం చేపట్టే కులగణనతో ఏ కులం బలం ఎంతుందో తేలిపోయి..వారి వారి కుల బలాన్ని బట్టి పదవులు దక్కే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మాకులంలో అత్యధిక జనాభా, ఓట్లు, ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారని ఏ కులానికి ఆ కులం బల ప్రదర్శన చేసేది.

 అయితే ఇపుడు ప్రభుత్వం చేపట్టే అధికారిక కుల గణనతో ఏ కులంలో ఎంత మంది ఉన్నారనే విషయం ప్రభుత్వమే అన్నికులాల వారికీ తెలియజేయనున్నది. ఇది ఒక రకంగా శుభపరిణామం అనే చెప్పాలి. తద్వారా ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, వర్గాలు వారీగా జాబితా మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ తెలియనున్నది. తద్వారా ఇకపై రాజకీయాలు కూడా రసవత్తరంగా మారే అవకాశాలు బలపడనున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ అధికారులకు గానీ, రాజకీయనాయకులకు గానీ ఏ ఏ కులాల్లో ఎంతమంది జనాభా ఉన్నారనే విషయం తెలీదు. ఇపడు అనకాపల్లి నుంచి అమెరికా వరకూ ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు ఎక్కడున్నారో కూడా తేలిపోతుంది. ప్రస్తుతం రాజకీయాల్లోకి సివిల్ సర్వీస్ ఆఫీసర్లు, ఇతర జిల్లా శాఖల అధికారులు, రిటైర్డ్ ఉన్నతాధికారులు వస్తుండం వలన వారికి ఈ కుల గణన జాబితా ఎంతో చక్కగా ఉపయోగపడనున్నది. ఇప్పటి వరకూ కులాభిమానం చూపించేవారికి, చూపించలేని వారికి, చూపించాలనుకునేవారికి కూడా ఈ జాబితా ఒక వేదిక కానున్నది. ఒక రకంగా కులగణన అనేది కత్తిమీద సాములాంటి వ్యవహారం అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాహసం ప్రదర్శించి చేపట్టనున్న కులగణనపై భారీ అంచనాలు అపుడే నమోదు అవుతున్నాయి. అదేస్థాయిలో అన్ని వర్గాల్లోనూ చర్చలు కూడా ప్రారంభం అయ్యాయి. చూడాలి రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎలాంటి ఫలితాలు కులగణన విషయంలో నమోదు చేస్తుందనేది..!