భారత దేశంలో ఎన్నికల సంఘం ఆదేశాలంటే సుప్రీం కోర్టు ఉత్తర్వులతో సమానం..ఒక్కో సందర్భంలో వాటికంటే ఎక్కువ పవర్ వుంటు ందికూడా. కానీ అలాంటి ఎన్ని కల సంఘం ఆదేశాలు మాత్రం ఆంధప్రదేశ్ ప్రభుత్వంలోని వైద్య ఆరోగ్యశాఖలోని ఆయు ష్ కమిషర్ బుట్ట దాఖలు చేస్తున్నారు. కమిషన్ ఆదేశాలిచ్చిన తరువాత కూడా మొండిగా వ్యహరిస్తూ కమిషన్ ఉత్తర్వులనే అపహాస్యం చేస్తున్నా..వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి. క్రిష్టబాబు సైతం నోరు మెదకపోవడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఆయుష్ కమిషర్ డా.ఎస్.బి. రాజేంద్రకుమార్ చేస్తున్న వ్యవహారాలు ఎన్నికల సంఘాన్ని ఎదిరిస్తున్నట్టే కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఎన్నికల సంఘం ఉత్తర్వులిస్తే ప్రభుత్వశాఖల అధిపతులు వాటిని అమలు చేయాలి. కానీ ఆయుష్ శాఖలో దానికి వ్యతిరేకంగా జరుగుతుం డటమే కాకుండా.. కమిషనర్ వైద్యులు, అధికారులు, సిబ్బందిపై కక్షగట్టి నట్టుగా వ్యవహరిస్తున్న తీరు ఇతర ప్రభుత్వశాఖల అఖిలభారత సర్వీసుల అధికారులకు సైతం విస్మయానికి గురిచేస్తున్నది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిస్పెన్సరీల్లోని వైద్యులకు డిడిఓ పవర్స్‌ను రద్దు చేస్తూ కమిషనర్ ఏకంగా జీఓని తెచ్చి దానిని బలవంతంగా అమలు చేస్తున్నారు. అయితే దానిని వ్యతిరేకించిన వైద్లు సంఘం ఏపీ ఎన్నికల సంఘాన్ని సంప్రదించింది. దానితో (యుఓ) అర్జెంట్ ఆర్డర్ క్రింద ఆయుష్ కమిషనర్ జారీ చేసిన జీఓను వెనక్కి తీసుకొని, రద్దు చేయాలని మార్చి 19న ఉత్తర్వులు జారీచేసింది. సాధారణంగా అయితే ఎన్నికల సంఘం ఉత్తర్వులు వస్తే ఆగమేఘాలపై సదరు ప్రభుత్వశాఖల ముఖ్య కార్యదర్శిలు వెంటనే ఆదేశాలను అమలు చేస్తారు. కానీ ఆయుష్ శాఖలో మాత్రం కమిషనర్ రాజేంద్రకుమార్ చర్యలను, ముఖ్యకార్యదర్శి సమర్ధిస్తున్న ట్టుగానే కనిపిస్తున్నది. ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేయకుండా డిస్పెన్సరీ వైద్యుల సీఎఫ్‌ఎంఎస్ ఐడీలను మ్యాపింగ్ చేయడం మొదలు పెట్టారు. అదీ ఎలా అంటే సదరు సీఎఫ్‌ఎంఎస్ కమిషనర్ తో వీడియో కాన్ఫరెన్సులో పాల్గొని..కమిషనరేట్ అధికారులు, సిబ్బందితో బలవంతంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్యులకు డిడిఓ పవర్స్ రద్దు చేసిన తరువాత మేమే కష్టపడి వారికి జీతాలు ఇవ్వగలమని చెప్పించారట.
కమిషనర్ నేరుగా సిబ్బందిని ఆదేశించడం, చేయలేకపోతే లిఖిత పూర్వకంగా తెల్లకాగితంపై రాసి ఇమ్మని చెప్పడంతో భయపడిన కమిషనరేట్ సిబ్బంది సిఎఫ్‌ఎంఎస్ కమిషనర్ తో తాము చేయగలమని వీడియో కాన్ఫరెన్సులో ఒప్పుకొని ఇపుడు ఆగమేఘాలపై వైద్యుల ఐడీలను మ్యాపింగ్ చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశించినా ఎందుకు చేస్తున్నారంటే..తనను ఏ ఒక్కరూ ఆపలేరని..ప్రభుత్వ సౌలభ్యం కోసమే తాను ఈ నిర్ణయం తీసుకుని పనిచేస్తున్నానని అధికారులకు, సీఎఫ్‌ఎంఎస్ కమిషనర్ కు కూడా చెప్పినట్టు సమాచారం అందుతుంది. అసలు ప్రభుత్వమే ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేస్తున్నప్పుడు ప్రభుత్వంలోని ఒక శాఖకు కమిషనర్ గా ఉన్న అధికారి ఏకంగా ఎన్నికల సంఘం ఆదేశాలు వచ్చినా దానిని కాదని, బుట్టదాఖలు చేసి మరీ తాను అనుకున్నది చేస్తున్నారంటే ఏమనుకోవాలో ప్రభుత్వమే చెప్పాల్సిఉంది. ఇంత జరుగుతున్నా..కనీసం వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కూడా కమిషనర్ మొండి వ్యవహారాన్ని నియం త్రించకపోవడం చూస్తుంటే ఆయన కనుసన్నల్లోనే ఎన్నికల సంఘం ఉత్తర్వులని పక్కన పెట్టేసినట్టు స్పష్టమవుతుంది. మామూలుగా అయితే ముందు ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేసి..ప్రభుత్వం గౌరవాన్ని పెంచుతారు.
కానీ ఆయుష్ కమిషనర్ తాను ఎవరికీ భయపడేది లేదని, అందులోనూ తనపై వ్యతిరేక వార్తలు రాయించిన వైద్యులను అసలకే వదిలిపెట్టేది లేదని కూడా కమిషనరేట్ అధికారుల ముండే ఒంటి కాలిపై లేచారట. దీనితో వైద్యులపై కావాలనే కమిషనర్ చేస్తున్నట్టు బావించిన అధికారులు కూడా మీరు ఎలా చెబితే అలానే చేస్తామని తలూపుతున్నారట. తనను ఎవరూ ఏమీ చేయ లేరని..ఎన్నికల సంఘం తనపై వేటు వేసినా..తాను అనుకున్నది చేసి తీరుతానని మంగమ్మ శపథం చేస్తున్న ఆయుష్ కమిషనర్ తీరు ఇపుడు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. శాఖను ప్రక్షాలన చేస్తానని వైద్యులపై కక్ష సాధిస్తున్న తీరుపై ఇక కమిషన్ నేరుగా ద్రుష్టి పెడితే తప్పా ఉత్తర్వులు అమలయ్యేలా కనిపించడం లేదు..!