అవును రాజధాని పేరు నుంచి విశాఖ ఎగిరిపోయింది.. ఇక శాస్వత రాజధాని అమరావతి మాత్రమే..దానికోసం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే సీఎం చంద్రబాబునా యుడు కార్యాచరణను వేగం పెంచారు. రాజధానిని పూర్తిస్థాయిలో చేపట్టి ఇక రాజధానిని విభజించడానికి వీలు లేకుండా ఒకే దగ్గర కేంద్రీకృతం చేసేలా యోచన చేస్తున్నా రు. ఇక ఎప్పుడూ ఉన్నట్టుగానే విశాఖ ఆర్ధిక రాజధానిగా అభివృద్ధి చెందనుంది. ఇక్కడకు రాబోయే సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా రాజధాని ప్రాంతానికే తరలిపోయే అవకా శాలున్నాయి. గత వైఎస్సార్సీపీ ఓవర్ కాన్ఫిడెన్స్.. మూడు రాజధానుల పేరుతో చేసిన తాత్సారం..మళ్లీ ఎలాగైనా అధికారంలోకి వచ్చేస్తామన్న ఆలోచనతో చేసిన కాల యాప సరిగ్గా కూటమి ప్రభుత్వం వినియోగించుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు అయ్యింది. కూటమి దెబ్బకి ఒక్కసారిగా విశాఖలోని రియలెస్టేట్ కుప్పకూలిపోయింది.
అమరావతి రాజధాని ప్రాంతంలో భూములు కొని దిగాలుగా ఉన్నవారందికీ పంట పడినట్టే. విశాఖలో పడిపోయిన రియలెస్టేట్ అమరావతిలో పుంజుకోనుంది. రాజధాని అక్కడే వస్తుందని ముందుగా ఊహించి భూములు కొన్నవారందరికీ దశ తిరిగిపోనుంది. అదే ఆలోచన భూములు విశాఖలో కొన్నవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. కొన్నబూములను ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడే వారంతా రాజధాని విషయంలో క్లారిటి రావడంతో క్యూ కట్టే అవకాశాలున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఏపీ స్వరూపం పూర్తిగా మారిపోయింది. మీడియా నుంచి మేజర్ కంపెనీ లన్నీ అమరావతికే వచ్చేయనున్నాయి. ఇప్పటి వరకూ ఒక్క సెక్రటేరియట్ అసెంబ్లీ మాత్రమే వున్న రాజధాని ప్రాంతంలో ఇపుడు అఖిల భారత సర్వీసు అధికారుల నుంచి సచివాలయంలోని అధికారులు, ఉద్యోగులకు కూడా నివాసాలు నిర్మించేందుకు యుద్ద ప్రాతిపదిక కార్యాచరణ జరుగుతోంది. వాటితోపాటు 75 ప్రభుత్వశాఖలకు చెందిన రాష్ట్రస్థాయి అధికారులు, మినిస్టీరియల్ స్టాఫ్ కి చెందిన క్వార్ట్రర్స్ కూడా నిర్మాణం చేపడితే అక్కడ పనిచేయడానికి ఉద్యోగులకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండ వనేది ప్రభుత్వం ఆలోచన.
వాటితోపాటు, రాష్ట్రంలోని 13 కొత్త జిల్లాల్లోని అఖిలభారతస్థాయి అధికారులకు కూడా ప్రభుత్వ కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలను కూడా నిర్మించడం ద్వారా పరి పాలన సులభతరం అవతుందనేది ప్రభుత్వం ఆలోచన. ప్రభుత్వ ఆలోచన అమలులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కి రాజధానితోపాటు, అధికారులకు నివాసాలు, క్యాంపు కార్యా లయాలు అంతేవేగంగా వచ్చే అవకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అటు ఎమ్మెల్యేలకు కూడా క్వార్టర్స్ రాజధాని ప్రాంతంలోనే నిర్మాణాలు చేపట్టడం ద్వారా ప్రజాప్రతినిధులకు కూడా రాకపోకలకు వీలుగా వుంటుంది. కూటమి ప్రభుత్వం శాస్వత రాజధానిని అమరావతిలోనే నిర్మించాలనుకోవడంతో విశాఖ కేవలం ఆర్ధిక రాజధా నిగా పేరు మాత్రమే పొందనుంది. ఇక ప్రధాన కార్యకలాపాలన్నీ కూడా అక్కడే జరగనున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా మూడు రాజధానుల పేరుతో చేసిన రాజకీయం, తాత్సారం కూడా నేడు కూటమి ప్రభుత్వం ద్వారా శాస్వత రాజధానిని అమరావతిలోనే నిర్మించుకోవడానికి మార్గం సుగమం అయ్యింది.
ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణానికి అంకురార్ఫణ..
రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మించడం ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా అధికారుల కార్యాలయాలు ఒకేటకు చేర్చితే పరిపాలన కు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అంతేకాకుండా ప్రజలకు కూడా ఇబ్బందులు లేకుండా ఒకేచోట అన్ని కార్యాలయాలూ ఉంటాయి. అటుప్రభుత్వానికి కూడా నిర్వహణ భారం చాలా తగ్గిపోతుంది. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల సమావేశాలకు కూడా చక్కగా ఉంటుందని యోచిస్తున్నారు. తెలంగాణలో మాదిరిగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు నిర్మించి, వాటి ద్వారా వచ్చే ఫలితాలను పొందిన తరువాత ఇంటిగ్రేడెట్ మండల కాంప్లెక్స్ లను నిర్మించడం ద్వారా కూడా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందిచడానికి వీలుగా వుంటుందని ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. అందులోనూ ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా వున్న ప్రభుత్వ కార్యాలయాలన్నీ దాదాపుగా శిధిల స్థితికి వచ్చేశాయి. దీనికారణంగా కొత్తవాటిని అన్ని కార్యాలయాలకు కలిపని ఒకేచోట నిర్మిస్తే పరిపాలన సౌలభ్యానికి వీలుగా వుంటుందనేది ప్రభుత్వ ఆలోచన.
జిల్లా కేంద్రాల్లోనూ అధికారుల నివాసాలు..
అమరావతి రాజధాని తరహాలోనే జిల్లా కేంద్రాల్లోని అధికారులకు, సిబ్బందికి క్వార్టర్స్ నిర్మించడ ద్వారా అందరూ ఒకేచోట నివాసాలు ఉండటానికి వీలుగా వుంటుంది. అంతేకాకుండా అధికారులకు బదిలీలు, పదోన్నతులు ఏర్పడినపుడు వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. అధికారులకు క్వార్టర్స్ నిర్మిస్తే ఎప్పుడు ఏ అధికారికి బదిలీచేపట్టినా వెంటనే విధుల్లోకి చేరడంతోపాటు కుటుంబాలను కూడా వెంటనే మార్చుకునేందుకు తరలించుకోవడానికి వీలుగా వుంటుంది.ఇప్పటికే దానికోసం గత ప్రభు త్వమే యోచన చేసినా అది అమలులోకి రాలేదు. కాని ఇపుడు రాజధాని నిర్మాణంతోపాటే జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలను కూడా అంతేవేగంగా చేపట్ట డం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చుననేది ప్రభుత్వ ఆలోచన. మొత్తానికి రాజధాని వ్యవహారం యావత్ పరిపాలన రూపు రేఖలనే మార్చేసేందుకు మార్గం సుగ మం చేసింది. ఇన్ని ఆలోచనలు, యోచనలు ఉన్నా ప్రభుత్వం ఏ మేరకు నిర్ణయం తీసుకొని అమలు చేస్తుందనేదే ఇక్కడ ప్రశ్న..?!