ఏపిపీజీఇసెట్‌ లో 87.98% మందికి అర్హత..


Ens Balu
3
Andhra University
2020-10-23 15:20:39

రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్‌, ‌ఫార్మశీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపిపీజీఇసెట్‌  2020 ‌ఫలితాలను ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి శుక్రవారం ఉదయం విడుదల చేసారు. సెట్‌ ‌కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఫలితాలను విడుదల చేసి వివరాలు వెల్లడించారు. ప్రవేశ పరీక్షకు 28868 మంది దరఖాస్తు చేసారని, వీరిలో 22911 మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. పరీక్షకు హాజరైన వారిలో 20157 మంది పరీక్షలో అర్హత సాధించారన్నారు. ఇంజనీరింగ్‌, ‌ఫార్మశీ రెండు విభాగాలలో కలిసి  87.98 శాతం మంది అర్హత సాధించడం జరిగిందన్నారు. ఇంజనీరింగ్‌ ‌విభాగంలో 17150 మంది పరీక్షకు హాజరుకాగా 14775 మంది ఉత్తీర్ణతతో 86.15 శాతం మంది అర్హత సాధించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 365 కళాశాలల్లో 27300 సీట్లు భర్తీ చేయడం జరుగుతుందన్నారు. ఫార్మశీ విభాగంలో 5761 మంది పరీక్షకు హాజరవగా 5382 మంది ఉత్తీర్ణతతో 93.42 శాతం మంది అర్హత సాధించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 81 కళాశాలల్లో 2787 సీట్లు భర్తీ చేయడం జరుగుతుందన్నారు. త్వరలో కౌన్సెలింగ్‌ ‌వివరాలను వెల్లడిస్తామన్నారు. కార్యక్రమంలో ఏపిపీజీఇసెట్‌ ‌కన్వీనర్‌ ఆచార్య పేరి శ్రీనివాస రావు, ఆచార్య భాస్కర రెడ్డి, ఆచార్య ఆర్‌.‌శివ ప్రసాద్‌ ‌తదితరులు పాల్గొన్నారు.