ఎన్ఎంసీ ద్రుష్టికి గీతం భూ దురాక్రమణలు..


Ens Balu
2
గీతం విద్యాసంస్థలు
2020-10-27 18:06:00

విశాఖలోని గీతం టుబీ డీమ్డ్ యూనివర్శిటీ ప్రభుత్వానికి చెందిన 43.50 ఎకరాల భూమిని అక్రమంగా ఖబ్జాచేసి అందులో కొంతభాగంలో మెడికల్ కాలేజీ, ఆసుప త్రులు, అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మించిన విషయం ఇపుడు నేషనల్ మెడికల్ కమిషన్ ద్రుష్టికి వెళ్లినట్టు సమాచారం. వాస్తవంగా దేశవ్యాప్తంగా నేషనల్ మెడికల్ కమిషన్ మెడికల్ కాలేజీలు, మెడికల్ యూనివర్శిటీలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి అనుమతులు, సీట్ల కేటాయింపు చేస్తుంటుంది. అలాంటి గీతం టుబీ డీమ్డ్ యూనివర్శిటీతోపాటు మెడికల్ కాలేజీ భూములన్నీ సక్రమం కాదు, అక్రమమని తెలిస్తే మెడికల్ కాలేజి గుర్తింపు రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు నేరుగా రాష్ట్రప్రభుత్వమే కొలతలు వేసి, నోటీసులు కూడా ఇచ్చి ఈ ప్రభుత్వ భూమి గీతం ఆక్రమించిందని నోటిఫై చేసిన తరువాత ఈ విషయం మరింత ముదిరి పాకాన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గీతం విషయంలో సిబిఐకి ఫిర్యాలు వెళ్లడం, కోర్టు నుంచి ఉత్తర్వులు తేవడం వంటి విషయాలు గీతంను చక్రబంధం చేసేటట్టు కనిపిస్తున్నాయి. అక్రమాల గీతంలో భూ ఆక్రమణల విషయం రాష్ట్రంలో హాట్ టాపిక్ అవుతుతున్న తరుణంలో గీతం మెడికల్ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలంటూ ఎన్ఎంసీకి ఫిర్యాదులు వెళ్లినట్టు ప్రచారం జరుగుతుంది. అదీ ప్రభుత్వంలోని పెద్దలు ఈ ఫిర్యాదులు చేసివుంటే...ఖచ్చితంగా నేషనల్ మెడికల్ కమిషన్ విచారణ చేపట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. అలా గీతంపై ఎన్ఎంసీ విచారణ చేస్తే...గతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆంధ్రా మెడికల్ కాలేజీ విషయంలోనే సదుపాయాలు, వసతి సక్రమంగా లేవని సీట్లలో కోత విధించిన ఎన్ఎంసీ, ఇపుడు ఏకంగా గీతం పూర్తి అక్రమ భూ కబ్జా మెడికల్ కాలేజీ అని తేలితే ఖచ్చితంగా చర్యలు తీవ్రంగా వుంటాయని తెలుస్తుంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి..