మళ్లీ మిగిలిపోనున్న ఆపోస్టులు..
Ens Balu
4
Amaravati
2020-10-28 15:26:36
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామసచివాలయ వ్యవస్థలో రెండు విభాగాల్లో పోస్టులు ఆది నుంచి భర్తీకాకుండా అలా మిగిలిపోతున్నాయి. రెండోవసారి సచివాలయ ఉద్యోగాల కోసం నిర్వహించిన ఉద్యోగ ప్రవేశ పరీక్షలో కూడా సెరీకల్చర్, యానిమల్ హజ్బంజడరీ సహాయకుల పోస్టులు మిగిలిపోయే పరిస్థితి కనిపిసోస్తోంది. దానికి కారణం ఆ విద్య చదివిన వారు తక్కువ గా ఉండటమే. తొలుత తీసిన ఉద్యోగాలు అత్యంత తక్కువగా మార్కులు వచ్చినప్పటికీ ఆ ఉద్యోగాలను భర్తీచేసిన ప్రభుత్వం ఈ సారి భర్తీచేయకపోవచ్చునని చెబుతున్నారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అయితే ఏకంగా ఆ ఉద్యోగాలకు దరఖాస్తులు కూడా రాకపోవడం విశేషం. వాస్తవానికి గ్రామస్థాయిలో పశుసంవర్ధక సహాయకుల పోస్టులు భర్తీచేయడం వలన చాలా ఉపయోగాలు, సేవలు ప్రజలకు అందుతాయి. కానీ ఆ చదువు చదివిన వారు తక్కువగా ఉండం వలన ఆపోస్టులు భర్తీకావడం లేదు. కొన్ని ఫిషరీష్ అసిస్టెంట్ పోస్టులు కూడా భర్తీ కాకపోవడం విశేషం. ఈ సారి గ్రామసచివాలయాల ఉద్యోగాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో ర్యాంకింగ్ విధానం ప్రవేశ పెట్టడంతో ఎంత మంది ఉద్యోగాలొస్తాయో తెలియని పరిస్తితి నెలకొంది. అదే జరిగితే ర్యాకుంలో మార్కులు తక్కువ వచ్చిన వారికి వేలల్లో వస్తాయి...అనుకున్నట్టుగా ఆ శాఖల సిబ్బంది భర్తీ కాకపోవచ్చునని అధికారులు భావిస్తున్నారు..