కులం కాని వ్యక్తిని పద్మశాలీ కార్పోరేషన్ డైరెక్టర్ చేస్తారా..
Ens Balu
2
Visakhapatnam
2020-11-02 21:22:58
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పద్మశాలి కార్పోరేషన్ డైరెక్టర్ తమ్మిన అభ్యర్ధిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ సంఘం ప్రకటిచింది. ఈ మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ను కలిసి కొప్పలరామ్ కుమార్, తెడ్లపు వెంకటేశ్వర్లు, బిపిఎస్ కళ్యాణి, అలేటి హేమలత లు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, అదే సమయంలో పద్మశాలీ కాని వ్యక్తిని పద్మశాలీ కార్పోరేషన్ కు చైర్మన్ గా చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. పద్మశాలీ వంశ వ్రుక్షంలో ఎక్కడా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి నియమించిన తమ్మిన రామ లక్ష్మణ రావు ఇంటిపేరు లేదన్నారు. ఆయన యొక్క గోత్రనామాలేంటో కూడా తెలియదని చెప్పారు. తక్షణమే ప్రభుత్వం పద్మశాలీ కార్పోరేషన్ నుంచి తమ్మిన రామ లక్ష్మణ రావు తప్పించాలని డిమాండ్ చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో తమ్మిన అనే ఇంటి పేరు పద్మశాలీలకు లేదు. వారు నగరాలు కులానికి చెందినవారని స్పష్టం చేశారు. పద్మశాలి అమ్మాయిని చేసుకోవడం వలన, అప్పటిలో నగరాలు OC లు గాను, పద్మశాలీలు బీసీలు గాను ఉండడం వలన వారు తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం తో పద్మశాలీల గా చలామణి అవుతున్నారని చెప్పారు. ఈ నియామకం పద్మశాలీల మనోభావాలకు తీవ్రంగా బంగం కలిగించిందన్నారు. ఈ విషయంలో రాష్ట్రకమిటీ అన్నిజిల్లా కలెక్టర్ విచారణ జరిపించి నివేదిక ప్రభుత్వానికి పంపించాలని వారు మీడియా ముఖంగా కోరారు.