ఏపీలో అక్రిడిటేషన్ జారీలో నవశకం..


Ens Balu
2
Velagapudi
2020-12-19 22:24:16

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జర్నలిజం విలువల పరిరక్షణకు నడుం కట్టినట్టు కనిపిస్తుంది. గతంలో వ్యాపారంగా సాగుతూ వచ్చిన  అక్రిడేషన్లు ఇకముందు నిస్పాక్షికంగా జారీచేసేందుకు వివిధ సంబంధిత శాఖల అధికారులతో రాష్ట్ర, జిల్లా కమిటీలను అధికారులతో నియమించడం పట్ల పలువురు హర్షం చేస్తున్నారు. అదే సమయంలో దేశ రాజధాని పీఐబి తరహా అక్రిడిటేషన్ నిబంధనలను కూడా ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం అలా చేయకపోవడం ద్వారా నకిలీ జర్నలిస్టులు(జర్నలిజం లేని వారు, వ్యాపారాలు చేసే వారు, టూరిజం గైడ్లు తదిరులు) అక్రిడిటేషన్ ద్వారా ప్రభుత్వ సేవలు పొందుతున్నారు. ఇలాంటి వారే చాలా మంది అక్రిడిటేషన్ కమిటీ నేతలతో మిలాఖత్ అవడం ద్వారా వర్కింగ్ జర్నలిస్టులకు నష్టం వాటిల్లి, కమిటీ సభ్యులు, కులపెత్తనం చేసే కాస్త తేడా జర్నలిస్టుల పంతాలు నెగ్గించుకొని వారికి అనుకూలంగా వున్నవారికోసం సమాచారశాఖ అధికారులను అడ్డం పెట్టుకొని అక్రిడిటేషన్లు పొందుతున్నారు. దానికి మూలాలూ కూడా లేకపోలేదు..జిల్లా అక్రిడేషన్ కమిటీల్లో అధికారులు మాటలు, కొన్ని యూనియన్ నాయకుల హడావిడి తప్పితే కమిటీలో కూర్చున్న ఏ ఒక్కరూ జిల్లా కలెక్టర్, అక్రిడిటేషన చైర్మన్ కు వాస్తవాలు వివరించలేని పరిస్థితి. దానికి కారణం ఇంగ్లీషుపై పట్టు లేకపోవడం, అసలు అక్రిడిటేషన్ మంజూరుకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకపోవడం, కొందరు సమాచారశాఖ అధికారుల వక్రబుద్ది చూపించడం ఇలా చాలానే వస్తున్నాయి. ఫలితంగా నిజమైన వర్కింగ్ జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోంది.  దానికితోడు అక్రిడేషన్ల వ్యామోహం తోనే అనేకమంది ఈ రంగంలోకి వచ్చి జీతభత్యాలు లేక, జీవన స్థితి గతులు అంతంతమాత్రంగా మారిన స్థితిలో వివిధ అపసవ్య మార్గాన్ని ఎంచుకున్న కొందరి వలన ఈ రంగం కలుషితం అవుతున్నట్లు నిజమైన వర్కింగ్ జర్నలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. అక్రిడేషన్లు జారీలో నిబంధనలు ప్రకారం ఖచ్చితంగా జరీచేసినా లేక, జీతభత్యాలు రావని ఈరంగాన్ని  పలువురు భవిష్యత్లో ఎంచుకునే మార్గం వీడే అవకాశం తో  పత్రికా రంగంలో కేవలం అంకితభావం, అర్హులు మాత్రమే ఉన్నవారి వలన తప్పక ఫోర్త్ ఎస్టేట్ ప్రతిష్ట పెరుగుతుందనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఈ విషయంలో చొరవ తీసుకున్న సమాచార శాఖా మంత్రి పేర్న నాని, కమిషనర్ టి.విజయ్ కుమార్ ల నిర్ణయం చాలా గొప్పదినే భావన వర్కింగ్ జర్నలిస్టుల్లో వ్యక్తం అవుతోంది. దానికి ఇక ఇటీవల తరచుగా లో  మీడియా కి చెందిన వారిపై జూదం,వ్యభిచారం,బ్లాక్మైలింగ్, దారిదోపిడీ,ఫోర్జరీ  తదితర నేరాలకు పాల్పడిన వారి  వార్తలు రావడం కూడా ఫోర్త్ ఎస్టేట్ రంగం కలుషితం అవుతోంది. కనుక ప్రభుత్వం అక్రిడేషన్లు జారీ చేసే ముందు అసలు అక్రిడిటేషన్ కి దరఖాస్తు చేసిన వారు నిజంగా జర్నలిజంలో పనిచేస్తున్నారా...లేదంటే డెస్కులో పనిచేస్తున్నారా.. ఫోటో గ్రాఫర్ గా పనిచేస్తున్నారా.. అనే విషయాలపై  పోలీస్, సమాచారశాఖ అధికారులతో విచారణ జరిపిస్తే.. అక్రిడిటేషన్ కోసం వేల రూపాయలు ఖర్చుచేసి మరీ అక్రిడిటేషన్లు కొనుగోలు చేసేవారు తగ్గుతారని వర్కింగ్ జర్నలిస్టుల వాదన. అలా ఎంక్వయిరీ జరిపించి మరీ అక్రిడేషన్లు జారీచేయాలని పాత్రికేయులు కోరుతున్నారు. అదే సమయంలో చిన్న, మధ్య తరహా పత్రికలు నడిపేవారి సమస్యలను కూడా ప్రభుత్వం గుర్తించాలని కూడా నిజమైన జర్నలిస్టుల కోసం నడిచే పాత్రికేయ సంఘాల నాయకులు కోరుతున్నారు. ముఖ్యంగా ఎల్ఐసీ ఏజెంట్లు, పలు రాజకీయపార్టీలకు చెందిన నాయకులు, ప్రింటింగ్ ప్రెస్ లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారు, బిల్డింగ్ కలెక్షన్ కార్డు జర్నలిస్టులు, యూనియన్ నేతల ముసుగులో దందాలు చేసే జర్నలిస్టులు ఈ విధానాల వలన పూర్తిగా తగ్గే అవకాశాలు ఉన్నాయని అధికారులు, వర్కింగ్ జర్నలిస్టులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వం లో జర్నలిజం కూడా మంచి మార్గంలో వెళ్లేందుకు,కోల్పోతున్న పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలపై నిజమైన వర్కింగ్ జర్నలిస్టులు మీడియా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కొన్ని యూనియన్లు ఆందోళనలు చేసినా అలాంటి వాటిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం విశేషం. అయితే ఇదే సమయంలో సమచారశాఖ వక్రబుద్ధి లాభీయింగ్ లపై కూడా ప్రభుత్వం ద్రుష్టి సారించడం ద్వారా నిజమైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు వచ్చే అవకాశం వుంది. లేదంటే ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకున్నా..గతంలో మాదిరిగానే అడ్డదారిలో వచ్చేవారికే అక్రిడిటేషన్లు వస్తాయనడంలో సందేహం లేదు..!