ఆ ఎమ్మెల్యే సేవానిరతికి సెల్యూట్ చేయాల్సిందే..


Ens Balu
2
Visakhapatnam
2020-12-22 14:21:03

ఆయన ఎమ్మెల్యే కాకముందు వాయుసేనలో ఫైలట్..భారతదేశానికి ఎనలేని సేవలు అందించి రిటైర్ అయ్యారు..విధినిర్వహణ చేరినపుడే తన ప్రాణం దేశానికే అంకితం అని ఇచ్చిన మాటను మరువకుండా నాటి నుంచి నేటి వరకూ రక్తం దానం చేస్తూనే వస్తున్నారు..అంతేకాదు ఒక వ్యక్తియొక్క ప్రాణానికి ఈయన ఇచ్చే విలువ తెలిస్తే ఎవరైనా సెల్యూట్ చేస్తారు..ఆయనే విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. భారతదేశంలో అన్ని ముఖ్యమైన రోజుల్లోనూ ఆయన రక్తదానం చేస్తారు. ఎక్కడ రక్తదాన శిభిరాన్ని ప్రారంభించడానికి వెళ్లినా ముందు తన రక్తాన్ని దానం చేస్తూ...ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అంతా ఇదేదో ఆయన ప్రచారం కోసం చేస్తారనుకుంటారు..అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే.. ఒక వ్యక్తి రక్తం దానం చేయడం ద్వారా ఆపదలో వున్న నలుగురు ప్రాణాలను కాపాడవచ్చునని అందుకే ప్రతీ మూడు నెలలకొకసారి తాను ఖచ్చితంగా రక్తం దానం చేస్తానని, దానికి రక్తదాన శిభిరాలనే ముందుగా ఎంచుకుంటానని తడుముకోకుండా చెబుతారు. వాయుసేనలో చేరినపుడే తన జీవితాన్ని భారతమాతకు అంకిత మిస్తానని ప్రామిస్ చేశానని...ఆ మాటను నిలబెట్టుకుంటూ క్రమం తప్పకుండా రక్తం దానం చేస్తూనే ఉంటానని చెబుతారు వాసుపల్లి. తన కోసం ఎవరు ఎలా అనుకున్నా డోంట్ కేర్..తను దానం చేసిన రక్తంతో ఒక్క ప్రాణం నిలబడినా నాకు అదే ఆత్మ సంత్రుప్తి అని అంటారు. ఈయన చేసే రక్తదానం స్పూర్తితో ఎందరో యువకులు ఈయనను అనుసరిస్తారు. రక్తం దానం చేయడం ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుందని, అదే సమయంలో మనం మంచి ఆహారం కూడా తీసుకోవాలనే జాగ్రత్తలు కూడా రక్తాన్ని దానం చేసే వారికి హితబోద చేస్తారు వాసుపల్లి. విశాఖలో రక్తదానమంటే ఎమ్మెల్యే వాసుపల్లే అనేంతగా ఈయన సేవలు ఉంటాయనడంలో  అతిశయోక్తి కాదు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పుట్టిన రోజు సందర్బంగా కూడా ఎమ్మెల్యే తన రక్తాన్ని దానం చేసి మరీ రక్తధాన శిబిరాన్ని ప్రారంభించడం విశేషం. ఈ రక్తదాన శిబిరంలో కూడా పెద్దఎత్తున యువత పాల్గొన్నారు.