టీటీడీకి 2 టన్నుల ఊరగాయ బహూకరణ..


Ens Balu
1
Tirumala
2021-02-05 21:11:03

గుంటూరు జిలా తాడేపల్లి మండలం చిర్రావూరు కు చెందిన కాటూరి రాము టీటీడీ కి 2 టన్నుల వివిధ రకాల ఊరగాయలను శుక్రవారం బహూకరించారు. అన్నదానం భవనంలో ఆయన టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి ద్వారా ఊరగాయలను అందించారు. స్వామివారి అన్న ప్రసాదంలో భక్తులకు వీటిని వడ్డించాలని దాత కోరారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, భక్తులకు శ్రీవారి అన్నప్రసాదంలో వడ్డించడానికి ఈ పచ్చడి ఎంతగానో సహాయ పడుతుందన్నారు. ఇటీవల కాలంలో భక్తులు శ్రీవారిపై భక్తిని అన్నదానంలోకి పనికివచ్చే వాటిని వితరణ చేసి ప్రదర్శించుకోవడం శుభపరిణామన్నారు. అశేష భక్తకోటికి జరిగే అన్నదాన కార్యక్రమంలో ఖచ్చితంగా వీటిని అందిస్తామని దాతలకు హామీ ఇచ్చారు.  టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సలహా మండలి సభ్యులు  పి. పెంచలయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.