నాడు-నేడుకి లారస్ ల్యాబ్స్ రూ.4కోట్లు విరాళం


Ens Balu
2
Tadepalle
2021-02-10 21:38:43

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న నాడు-నేడు కార్యక్రమానికి తమవంతు విరాళంగా లారస్ ల్యాబ్స్ రూ.4కోట్లు విరాళం ఇచ్చింది. ఈమేరకు ఆ మొత్తాన్ని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిసి కంపెనీ ప్రతినిధులు అందజేశారు. నాడు నేడు పధకం మొదటి విడతలో భాగంగా నాలుగు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో (తెనాలి, కంచికచర్ల, వీరులపాడు, అచ్యుతాపురం)  ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం వీటిని అందజేసినట్టు కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు. అంతేకాకుండా.. రెండు, మూడో విడతల్లో అదే మండలాల్లోని మిగిలిన పాఠశాలల్లో నేరుగా లారస్‌ ల్యాబ్స్‌ మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేయనున్నట్లు సీఎం జగన్ కి కంపెనీ ప్రతినిధిలు వివరించారు. సీఎంని కలిసిన వారిలో లారస్‌ ల్యాబ్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చావా నరసింహరావు, సీనియర్‌ మేనేజర్‌ రామకృష్ణ , పాల్గొన్న కనెక్ట్‌ టూ ఆంధ్ర సీఈవో వి. కోటేశ్వరమ్మ తదితరులు ఉన్నారు.