పదేళ్లకు కళకళలాడుతున్న పంచాయతీలు..


Ens Balu
2
Velagapudi
2021-02-18 09:57:07

ఆంధ్రప్రదేశ్ లో 10ఏళ్లకు గానీ గ్రామ పంచాయతీలకు కళ రాలేదు. టిడిపి ప్రభుత్వంలో ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికలకు పంగనామం పెట్టారు. చాలా ఏళ్ల తరువాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించింది. దీంతో పంచాయతీలన్నీ సర్పంచ్ లతో కళ కళ లాడుతున్నాయి. మొన్నటి వరకూ గ్రామంలో ఏ సమస్య వచ్చినా పంచాయతీ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరిగి ఆమ్యామ్యాలు సమర్పిస్తే తప్పా పనులు జరిగేవి కాదు. గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకు వచ్చేందుకు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి  భారత దేశంలోనే ఎక్కడాలేని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి అందులో 14 శాఖల సిబ్బందిని నియమించి ఇంటి గుమ్మం ముందే సేవలు అందించే కార్యక్రమం చేపట్టారు. ఆ సిబ్బందికి ఇపుడు సర్పంచ్ లు కూడా తోడవ్వడంతో గ్రామాలు అభివ్రుద్ధి బాట పట్టడానికి సిద్ధమవుతున్నాయి. టిటిడి ప్రభుత్వంలో గ్రామ కమిటీల ఆధారంగానే వారికి నచ్చిన ప్రాంతంలో అభివ్రుద్ధి పనులు చేపట్టేవారు. ఇపుడు సర్పంచ్ లు వచ్చిన తరువాత గ్రామంలోని మెజార్టీ సమస్యలు తీర్చడానికి మార్గం సుగమం అయ్యింది. ఇప్పటికే 80శాతానికి పైగా గ్రామ పంచాయతీలను కైవసం చేసుకున్న అధికారపార్టీ వైఎఎస్సార్సీపీ అదే ఊపుతో మున్సిపల్ కార్పోరేషన్లలో కూడా ఎన్నికలు నిర్వహిస్తోంది. దీంతో చాలా మందికి ప్రజలు కార్పోరేషన్లలో మేయర్ పదవులు, గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులు, మండ కేంద్రాల్లో మండలాధ్యక్షుల పదవులు కోసం మరిచిపోతున్న తరుణంలో వీటిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తిరిగి ప్రజలకు గుర్తుచేయడం శుభపరిణామంగా చెప్పవచ్చు. చాలా సంవత్సరాల తరువాత స్థానిక సంస్థలకు అధ్యక్షులు వస్తున్న తరుణంలో వీరి పాలన, అభివ్రుద్ధి ఎలావుంటుందనే విషయం తెలియాలంటే మరో ఏడాది ఆగాల్సిందే..!