sc,bc కుటుంబాలకు రాయితీ రుణాలు..


Ens Balu
3
తాడేపల్లి
2021-06-17 02:56:26

క‌రోనా వైరస్ కారణంగా కుటుంబంలో పెద్ద దిక్కు కోల్పోయిన బీసీ, ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన కుటుంబాలకు  ప్ర‌భుత్వం రూ.5 ల‌క్ష‌ల రుణ స‌దుపాయం క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకుంద‌ని ఎస్సీకార్పోరేషన్ ఎండి అండ్ విసి నవ్య ఒక  ప్ర‌ట‌న‌లో తెలియజేశారు. ఈ మేర‌కు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బాధితుల‌ను గుర్తించి చ‌ర్య‌లు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎస్సీకార్పోరేషన్ ఈడీలకు వర్తమానం పంపారు.  క్షేత్ర స్థాయిలో ఎవ‌రైనా ఎస్సీ, బిసి సామాజిక వ‌ర్గానికి చెందిన ఇంటి పెద్ద మ‌ర‌ణించి.. జీవ‌నాధారం కోల్పోయిన కుటుంబాలు ఉంటే గుర్తించాలని మున్సిపాలిటీల‌ు, మండ‌లాల‌ అధికారుల‌ను ఆదేశించినట్టు పేర్కొన్ారు. ప్ర‌భుత్వం నేష‌న‌ల్ షెడ్యూల్డ్ ఫైనాన్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పోరేష‌న్ (ఎన్‌.ఎస్‌.ఎఫ్‌.డి.సి.) ద్వారా అందించే ఈ రుణంలో రూ.1 ల‌క్ష వ‌ర‌కు రాయితీ ఉంటుంద‌ని, మిగిలిన రూ.4 ల‌క్ష‌ల‌ను వాయిదాల్లో ల‌బ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ లోపు బాధిత కుటుంబ స‌భ్యులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకొనే అవ‌కాశం ఉంద‌ని ఈ సంద‌ర్భంగా ఆమె స్ప‌ష్టం చేశారు. బాధిత కుటుంబ స‌భ్యుల‌కు త‌గిన స‌హాయ స‌హాకారాలు అందించాల‌ని ఎస్సీకార్పోరేషన్ ఎండి అండ్ విసి నవ్య ఆ ప్రకటనలో కోరారు.

అర్హ‌తలు.. ఇత‌ర ప్ర‌క్రియ‌ ఈ విధంగా ఉండాలి..

@కోవిడ్ కారణంగా కుటుంభ పెద్ద మరణించి ఉండాలి

@వయస్సు 18 నుండి 60 సంవత్సరాలు ఉండాలి

@యస్సీ, బీసీ సామాజిక వర్గం అయి ఉండాలి

@వార్షిక ఆదారం 3లక్షలు మించరాదు

@తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి

@అర్హతగల దృవీకరణ పత్రాలతో మీ మండల పరిషత్ అభివృద్ధి అదికారి/మన్సిపల్ కమీషనర్ ను కలవండి.