సచివాలయ నిర్వీర్యానికి భారీ కుట్ర..


Ens Balu
5
Tadepalli
2021-06-18 01:44:02

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ లు విచక్షణా రహితంగా జారీచేసిన జీఓల కారణంగా దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొదించిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే భారీ కుట్ర తెరవెనుక జరుగుతోందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. జిఓ-2 ను జారీచేయడం దానిపై కొందరు హైకోర్టుకి వెళ్లడం..అక్కడ కోర్టు పంచాయతీలు ఉండగా..సచివాలయాలెందుకు అని తీవ్రంగా ప్రశ్నించడం చూస్తేంటే కావాలనే సచివాలయ వ్యవస్థను కోర్టుకీడ్చి దానిపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని అవగత మవుతుంది. ప్రభుత్వం జారీ చేసిన జీఓనెంబరు 2 కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వున్న 150003 గ్రామ, వార్డు సచివాలయాల్లోని కార్యదర్శిలు కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో డిడిఓలుగా వీఆర్వోల వద్ద డిగ్రీలు, పీజీలు చదువుకున్న గ్రామ కార్యదర్శిలు పనిచేయడానికి సిద్దంగా లేరనే విషయం బహిర్గతమైపోయి ఆందోళనలు చేస్తున్నారు. అందులోనూ గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీఓలు 110, 149కి విరుద్ధంగా వచ్చిన ఈ జీఓ నెంబరు2ని అడ్డం పెట్టుకొని పంచాయతీల్లోని సర్పంచ్ లను, పంచాయతీ కార్యదర్శిలను రెచ్చగొట్టి వారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చి గ్రామసచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వంపై కూడా వ్యతిరేకత తీసుకు రవాలని చూస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వున్న గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శిలు సామాజిక మాద్యమాల్లో తమ నిరశనను తెలియజేయడం,  ఎంపీడీఓలకు, డీపీఓలకు తమ అధికారాలపై క్లారిటీ ఇవ్వాలని అర్జీలు చేయడం ముమ్మరం చేస్తున్నారు. 

ఇదే విషయమై గుంటూరు జిల్లాకి చెందిన ఒక సర్పంచి హైకోర్టును ఆశ్రయించడం...అక్కడ ప్రభుత్వానికి, గ్రామసచివాలయ వ్యవస్థకు వ్యతిరేకంగా హైకోర్టు వ్యాఖ్యానించడం చూస్తుంటే.. కేవలం ఒక్క జీఓనెంబరు 2ని అడ్డం పెట్టుకొని, సచివాలయ కార్యదర్శిల నిరసనను సాకుగా చూపి భారీ కుట్రకు తెరతీశారని  విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి జిఓ నెంబరు-2 రద్దుకోరుతూ, తమ అధికారాలు లాగేసుకోవద్దని మాత్రమే బాధితులు కోర్టుకి వెళ్లినా దానిని తమకు అనుకూలంగా మార్చుకుని ఆంధ్రప్రదేశ్ లో ఎంతో ప్రజాధారణ పొందిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగుల ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావడం కోసం తెరవెనుక జరుగుతున్న కుట్రపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జీఓ నెంబరు-2,  73వ రాజ్యాంగ సవరణకు, పంచాయతీరాజ్ చట్టానికి విరుద్దంగా ఉందని కేవలం దానిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తే ఖచ్చితంగా సచివాలయ ఉద్యోగుల్లో నిరసన మంట పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తే..ప్రజలు కూడా ప్రభుత్వ చర్యలపై విమర్శలు చేస్తారనే కోణంలోనే వ్యూహ రచన చేస్తున్నారని తెలుస్తోంది. 

చాలా కాలం తరువాత పంచాయతీ సర్పంచ్ లకు అధికారాలు వచ్చినా అవి అతి తక్కువ అర్హత వున్న వీఆర్వోలకి పంచాయతీలపై డిడిఓగా పెత్తనం ఇవ్వడం ద్వారా డిగ్రీ చదివిన ఉద్యోగులు, చాలాచోట్ల ఎక్కువ చదువు చదువు చదువుకున్న సర్పంచ్ ల మనోభావాలు దెబ్బతింటున్నాయనే కోణంలోనూ వ్యతిరేక ప్రచారం జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వంలోని ఐఏఎస్ లు గ్రామ స్థాయిలో వీర్వోలను, మండల స్థాయిలో తహశీల్దార్ లను, డివిజన్ స్థాయిలో ఆర్డీఓలను, జిల్లా స్థాయిలో కలెక్టర్లను బాస్ లను చేయడం ద్వారా ఒక ప్రత్యేక రెవిన్యూ వ్యస్థను తయారు చేయాలనే ఉద్దశ్యంతో ఆలోచిస్తే.. అది మొదటికే ముసలాన్ని తెచ్చిపెట్టింది. ప్రభుత్వ పరిపాలకు సౌలభ్యంగా వుంటుందనుకున్న జీఓ నెంబరు 2 ఇపుడు ప్రభుత్వమే హైకోర్టులో తమ సంజాయిషీ చెప్పుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. అలాగని ప్రభుత్వంలోని ఐఏఎస్ లు కూడా గతంలో జారీచేసిన జీఓ నెంబరు 110, 149 జీఓలను అమలు చేయకపోవడం, తమకు అధికారాలు కట్టబెట్టకపోవడాన్ని రాష్ట్రవ్యాప్తంగా వున్న పంచాయతీ కార్యదర్శిలు వ్యతిరేకిస్తున్నారు. 

ప్రభుత్వం ఇచ్చిన జీఓలను ప్రభుత్వమే అమలు చేయకుండా వాటికి వ్యతిరేకంగా మళ్లీ కొత్తగా జీఓలు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శిల నిరసన, వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక వర్గం ఇదే అదునుగా చేసుకొని సచివాలయ వ్యవస్థపై కుట్రచేస్తే అటు ప్రభుత్వ నిర్ణయాలపై తప్పుచూపి, పంచాయతీ కార్యదర్శిల నుంచి మార్కులు కొట్టేయాలని చూస్తున్నట్టుగా పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. ఏది ఏమైనా జీఓనెంబరు 2పై హైకోర్టులో వచ్చిన తీర్పు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా వున్న గ్రామ పంచాయతీ కార్యదర్శిలు, సచివాలయ కార్యదర్శిలు కార్యాచరణ ఉండబోతుందనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఏం జరుగుతుందనేది హై కోర్టు తీర్పుని బట్టి ఆధారపడి వుంటుంది. ఇదే సమయంలో ప్రభుత్వం కూడా జీఓ నెంబరు2 పై కీలక నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా  పంచాయతీ కార్యదర్శిల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలే మెండుగా వున్నాయి..!