ఇ-క్రాప్ బుకింగ్ తో దళారులకు చెక్..


Ens Balu
2
Tadepalle
2021-06-18 13:37:01

ఇ-క్రాప్ బుకింగ్,ప్రీఆడిట్ విధానంతో పంట పండించిన నిజమైన రైతులను గుర్తించాకే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము జమ చేయనున్నామని పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీసియో కార్యదర్శి, ఆశాఖ కమీషనర్ కోన శశిధర్ చెప్పారు. ఈమేరకు శుక్రవారం అమరావతి సచివాలయ  ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఇ-క్రాప్ బుకింగ్ విధానం వెబ్ ల్యాండ్ కే పరిమితమై ఉండేదని కాని నేడు ఫ్రీ ఆడిట్ విధానాన్ని కూడా తీసుకురావడంతో ధాన్యం అమ్మింది రైతా,కౌలు రైతా లేక మిల్లరా లేక దళారా అనేది వారి బ్యాంకు ఖాతా,ఆధార్ వంటి పూర్తి వివరాలను పరిశీలించి రైతేనని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వారి ఖాతాలకు సొమ్ము జమచేయడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.గతంలో రైతు పేరిట దళారులు,ఇతర రాష్ట్రాలకు చెందిన వారి బ్యాంకు ఖాతాలను ఇచ్చి సొమ్ము పొందే ప్రయత్నం జరిగేదని ఫ్రీ ఆడిట్ విధానంతో అలాంటి వాటిని పూర్తిగా నివారించగలుగుతున్నామని శశిధర్ స్పష్టం చేశారు.ఈసమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎండి సూర్యకుమారి పాల్గొన్నారు.