ఎమ్మెల్సీలుగా ఆ 4గురు ప్రమాణస్వీకారం..


Ens Balu
2
Tadepalle
2021-06-21 12:45:56

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులుగా ఆర్వీ రమేష్ యాదవ్, కె.మోషేన్ రాజు, తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని శాసనమండలి చైర్మన్ కార్యాలయంలో ప్రొటెం చైర్మన్ విఠపు బాలసుబ్రహ్మణ్యం...నూతన సభ్యులతో సోమవారం ప్రమాణం చేయించారు. ఈ నలుగురు సభ్యులు గవర్నర్ కోటాలో నియమితులయ్యారు. నూతన ఎమ్మెల్సీలకు ప్రొటెం చైర్మన్ శాసన మండలి నియామవళి కిట్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొడాలి వెంకటేశ్వరరావు(నాని) కన్నబాబు, మేకతోటి సుచరిత, తానేటి వనిత, శ్రీరంగనాథరాజు, గుమ్మనూరు జయరాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.