టోక్యోలో జననం నానాటికీ భారీగా పెరిగిపోతున్నారు. ప్రభుత్వం ఏం చేసినా దానిని నియంత్రించలేకపోతున్న ది. చివరికి దారిలేక జపాన్ ప్రభుత్వం మరో ఆఫర్ ప్రకటించింది. టోక్యోను వీడి వెళ్లే వారికి 10 లక్షల యెన్ లు (దాదాపు రూ.6.35 లక్షలు) ఇస్తామంది. ఈఏడాది ఏప్రిల్ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. జననాల రేటు తక్కువగా ఉన్న, వృద్ధులు అధికంగా ఉన్న ప్రాంతాలకు కుటుంబాలు తరలివెళ్లేందుకు 2019 నుంచి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోంది. టోక్యోకు ప్రజలు పోటెత్తుతుండడంతో మిగిలిన పట్టణాల్లో జనాభా తగ్గిపోయి సంక్షోభంలోకి వెళ్లిపోతున్నాయి.