బాలింతల ప్రాణాలను 33% కాపాడే అజిత్రోమైసిన్
Ens Balu
26
United States
2023-02-20 12:16:36
సాధారణ యాంటీబయాటిక్ అయిన అజిత్రోమైసిన్‌ను బాలింతలకు ఇవ్వడంద్వారా వారికి ఇన్‌ఫెక్షన్‌లు సోకడం, మృత్యువాత పడే ప్రమాదాన్ని 33% వరకు తగ్గించవచ్చుని పరిశోధకులు గుర్తించారు. ఒకరకంగా తల్లులకు ఇదొక శుభవార్త అని అమెరికాకు చెందిన అలబామా విశ్వవిద్యాలయం పరిశోధకులు ప్రకటించారు. ఇటీవలే ప్రసవం ద్వారా బిడ్డనుకన్న 29వేల మందిపై ఈ అధ్యయనాన్ని నిర్వహించగా అందులో మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ప్రసవ సమయంలో వీరిలో కొంత మందికి 2 గ్రా అజిత్రోమైసిన్‌ను అందించారు. ఔషధాన్ని తీసుకున్న సమూహంలో ఇన్‌ఫెక్షన్‌లు, మరణాల శాతం 1.6ఉండగా తీసుకోని సమూహంలో ఇది 2.4 % గా నమోదైంది. ఈ కిటుకును అవలంబించడంవల్ల పుట్టిన శిశువులపై అనుకూల, ప్రతికూల ఫలితాలు ఉండబోవని 2020 సెప్టెంబరు - 2022 ఆగస్టు మధ్య జరిగిన ఆ అధ్యయనం స్పష్టం చేసింది. సో ఇప్పటివరకూ యాంటీ బయోటిక్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయన్న మాటకు విరుగుడు వచ్చినట్టే..