1 ENS Live Breaking News

పెన్నహోబిలంలో వైభవంగా రథసప్తమి పూజలు

అనంతపురం జిల్లాలో రథసప్తమి సందర్భంగా ప్రసిద్ద పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారు సూర్యప్రభ, హనుమ, గరుడ వాహనాలపై విహరించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో వందలాదిమంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, మాజీ చైర్మన్ అశోక్, అర్చకులు ద్వారాకనాథ్, బాలాజీ స్వాములు పాల్గొన్నారు.

Ahobilam

2023-01-28 07:42:55

స్పర్శ, కుష్టు వ్యాధి పై ప్రచారం చేయాలి

జాతీయ కుష్టు నివారణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 30వ తేదీ నుండి ఫిబ్రవరి 13 వరకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి  అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుష్టు వ్యాధి లక్షణాలను తెలియజేయాలన్నారు. ఏ విధంగా వ్యాపించే అవకాశం ఉన్నదో తెలియజేయాలని వ్యాధి సోకిన తర్వాత ఎలా గుర్తించాలి లక్షణాలు కనిపించడానికి ఎంత సమయం పట్టవచ్చు అనే విషయాలపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు.  ఈ విషయమై విస్తృతమైన ప్రచారం నిర్వహించాలని చెప్పారు. ఈ సమావేశంలో డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఎ హేమంత్, అదనపు డిఎం అండ్ హెచ్ ఓ బి శారదాబాయి డి ఎల్ డి వో మంజులవాని బీపీఎమ్ఓ డాక్టర్ సి కిషోర్ కుమార్ బీహెచ్ఈవో ఆఫ్ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2023-01-27 14:31:14

శ్రీ సత్యదేవునికి భక్తుల వెండి వస్తువుల విరాళం

అన్నవరం శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి అన్నవరానకి చెందిన పెమ్మరాజు, గుజరాత్ కి చెందిన వెంకటేశ్వర్రావులు వెండి పూజపాత్రలు విరాళంగా ఇచ్చారు. శుక్రవారం ఆలయంలో వాటిని సిబ్బందికి అందజేశారు. ఒక వెండి ప్లేటు, పంచపాత్, మట్టుగిన్నె, ఉద్దరిణిలు కలిపి సుమారు 969 గ్రాముల వెండి వస్తులు స్వామివారికి సమర్పించినట్టు ఆలయ వర్గాలు తెలియజేశాయి. అనంతరం దాతలు స్వామివారిని దర్శించుకున్నారు. వారికి దేవస్థాన సిబ్బంది తీర్ధ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

Annavaram

2023-01-27 14:23:28

రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించిన జెఈవో వీరబ్రహ్మం

తిరుమలలో శనివారం జరగనున్న రథసప్తమి పర్వదినం సందర్భంగా మాడవీధుల్లో చేపట్టిన ఏర్పాట్లను జెఈఓ వీరబ్రహ్మం శుక్రవారం సాయంత్రం పరిశీలించారు.  గ్యాలరీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆయా ప్రాంతాల్లో డిప్యూటేషన్ విధులు కేటాయించిన సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, టీ, కాఫీ, పాలు నిరంతరాయంగా అందించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని కోరారు. తాగునీటి కోసం ఏర్పాటు చేసిన కొళాయిల వద్దకు భక్తులు సులువుగా వెళ్లేలా దారి ఏర్పాటు చేయాలన్నారు. గ్యాలరీలకు అనుసంధానంగా ఉన్న మరుగుదొడ్ల వద్ద మెరుగ్గా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు.
 జెఈఓ వెంట టిటిడి ఎఫ్ఏసిఎఓ  బాలాజి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు, ఎస్ఇ-2  జగదీశ్వర్ రెడ్డి, విజివోలు  బాలిరెడ్డి,  మనోహర్, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి  శాస్త్రి ఇతర అన్ని విభాగాల అధికారులు ఉన్నారు. 

Tirumala

2023-01-27 13:59:11

టిటిడికి విరాళంగా ట్రాక్టర్

కర్ణాటకలోని భాగళ్ కోటకు చెందిన శ్రీ సాయి అగ్రికల్చర్ ట్రేడర్స్ నిర్వాహకులు రూ.6.25 లక్షల విలువైన ట్రాక్టరును శుక్రవారం టిటిడికి విరాళంగా అందించారు. శ్రీవారి ఆల యం ముందు కొత్త వాహనానికి పూజలు నిర్వహించిన అనంతరం దాతలు టిటిడి తిరుమల డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్  జానకిరామిరెడ్డికి వాహనతాళాలు  అందజేశా రు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. దాతకు టిటిడి అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో టిటిడి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Tirumala

2023-01-27 12:28:15

శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులు వాయిదా

తిరుమల శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులను ఐదు నుండి 6 నెలలపాటు వాయిదా వేస్తున్నామని, త్వరలో మరో తేదీ నిర్ణయిస్తామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో  ఎవి.ధర్మారెడ్డితో కలిసి ఛైర్మన్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విమానగోపురం బంగారు తాపడం పనులను స్థానిక కాంట్రాక్టరు నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయకపోవడంతో ఆలస్యం అవుతోందని చెప్పారు. తిరుమలలో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా నిర్దేశిత వ్యవధిలో ఆనందనిలయం బంగారు తాపడం పనులు పూర్తి చేసేందుకు వీలుగా గ్లోబల్‌ టెండర్లకు వెళుతున్నామని, ఈ ప్రక్రియకు సమయం పడుతుండడంతో తాపడం పనులను వాయిదా వేశామని తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా శ్రీవారి ఆలయంలో తాపడం పనులు పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.

Tirupati

2023-01-27 12:24:48

మిసెస్ ఇండియా పోటీలకు పైడి రజని

రాజస్థాన్ రాష్ట్రం సిటీ ఆఫ్ టైగ్రేసెస్ రంతంపోర్ ప్రాంతంలో ఈనెల 29 నుండి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు జరుగునున్న మిసెస్ ఇండియా గ్రాండ్ ఫినాలే పోటీలకు పైడి రజని హాజరుకానున్నారు. గత ఏడాది మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ టైటిల్ గెల్చుకున్న ఈమె రాజస్థాన్లో జరుగుతున్న జాతీయస్థాయి మిసెస్ ఇండియా పోటీలకు ఫైనలిస్ట్ గా ఎంపికయ్యారు. ఈనెల 29 నుండి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు నాలుగు రోజులు పాటు జరుగనున్న పోటీల్లో వివిధ కేటగిరీల్లో ఎంపిక కావాల్సి ఉంటుందన్నారు. శాస్త్రీయ నృత్యం, ప్రాంతీయ నృత్యం, ప్రాంతీయ వంటకాలు, శాస్త్రీయ వేషధారణ, దేశంపై సామాజిక అవగాహన, సేవా కార్యక్రమాల నిర్వహణ పై నాలుగు రోజులు పాటు జరుగనున్న పోటీల్లో దేశంలోని 29 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మహిళలు పాల్గొననున్నారు. మిసెస్ ఇండియా పోటీ నిర్వహణ ఆల్ ఇండియా డైరెక్టర్ దీపాలి ఫడ్నిస్ ఆధ్వర్యంలో నాలుగు రోజులు పాటు వివిధ కేటగిరీల్లో ఎంపికైన మేరకు కేటగిరీల వారీగా టైటిల్స్ అందజేస్తారని అమె తెలిపారు.

Visakhapatnam

2023-01-27 09:10:48

విశాఖలో సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి పర్యటన ఇలా

ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహనరెడ్డి పర్యటన ఖారు అయ్యింది. శ‌నివారం ఉదయం 9. 15 గంటలకు సీఎం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10. 30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడినుంచి నేరుగా చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠానికి ఉదయం 11 గంటలకు చేరుకుని వార్షికోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12. 30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి అక్కయ్యపాలెం సాగరమాల కన్వెన్షన్‌ హాల్‌కు చేరుకుంటారు. అక్కడ అనకాపల్లి ఎంపీ బి. సత్యవతి కుమారుడు డాక్టర్‌ యశ్వంత్, డాక్టర్‌ లీలా స్రవంతి దంపతులను ఆశీర్వదిస్తారు. మధ్యాహ్నం 1. 30 గంటలకు రుషికొండ ఐటీ పార్క్‌ వద్ద గల విశాఖ ఎంపీ ఎం. వి. వి. సత్యనారాయణ నివాసానికి వెళతారు. ఎంపీ కుమారుడు శరత్‌ చౌదరి, జ్ఞానిత దంపతులకు శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1. 55 గంటలకు ఐపీఎస్‌ అధికారి విద్యాసాగర్‌ నాయుడు, భవ్య దంపతులను వారి నివాసంలో ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈమేర‌కు శుక్ర‌వారం అధికారులు సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న వివ‌రాలు వెల్ల‌డించారు.

Visakhapatnam

2023-01-27 08:48:43

కెజిహెచ్ సుందరీకరణ పనులు వేగవంతం చేయాలి

విశాఖకె.జి.హెచ్.లో జరుగుతున్న సుందరీకరణ నిర్మాణ పనులు  వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున అన్నారు. శుక్రవారం ఉదయం  కె.జి.హెచ్ ఆసుపత్రిని  ఆకశ్మికంగా తనిఖీ చేసారు . ఈ సందర్భంగా కలెక్టర్ ఓపి గేటు పరిసర ప్రాంతాలను అత్యవసర శస్త్ర చికిత్స విభాగమును,  గిరిజన సేవా మరియు గిరిజన కేంద్రాన్ని డ్యూటీలో ఉన్న డాక్టర్ల విశ్రాంతి గదులను, దంతవైద్య విభాగం ను ఔషద నిల్వల స్టోరు రూమ్ తో పాటు రోగులకు అందించే  ఓపి విభాగంను సందర్శించారు . ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓపి విభాగం  ప్రధాన ద్వారం దగ్గర  జరుగుతున్న పార్కు సుందరీకరణ పనులను  వేగవంతం చేయాలన్నారు.  అదే విధంగా ప్రజా మరుగు దొడ్లను పరిశీలించి పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలన్నారు.  మంచినీటి ప్లాట్ ను  తనిఖీ చేసి  ప్రక్కనే ఉన్న మురుగునీటి  కాలవలపై పలకలను ఏర్పాటు చేయాలన్నారు. రోగులతో పాటు వచ్చే సహాయకులకు  ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలా విశ్రాంతి గదులను  తీర్చి దిద్దాలన్నారు.  అత్యవసర శస్త్ర చికిత్స గదులలో  అవసరమైన చోట ఎ సి లను ఏర్పాటు చేసి రోగులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. విధులలో ఉన్న డాక్టర్లు అవసరమైన సమయంలో  విశ్రాంతి తీసుకొనేందుకు  ఆదునీకరించిన డాక్టర్స్ రూమ్ ను పరిశీలించారు.

 అనంతరం దంత వైద్య విభాగాన్ని పరిశీలించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేసారు. రోగులకు ఉచితంగా పంపిణీ చేసే ఔషద నిల్వ ఉంచే స్టోర్ రూమ్ ను పరిశీలించారు. అదే విధంగా  ఓపి రశీదుల విభాగం ను పరిశీలించి రోగులకు  ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆధునీకరించడంతో పాటు వాహనాల పార్కింగ్, రోడ్డు నూతనంగా వేయాలని  అన్నారు.  ఓపి వద్ద ఉన్న గోడకు సుందరంగా పెయింటింగ్ వేయించాలని  ప్రవేశ  ముఖ ద్వారం సుందరంగా తీర్చి దిద్దాలన్నారు. 
ఈ కార్యక్రమంలో  కె.జి.హెచ్ సూపరింటెండెంట్  డా.అశోక్ కుమార్, ఆర్.ఎం .ఓ వాసుదేవరావు, వివిద విభాగాల  డాక్టర్లు, ఎ.పి.ఎం.ఐ.డి.సి  ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2023-01-27 08:33:28

డిడి నిర్మలకుమారికి కలెక్టర్ సూర్యకుమారి ప్రశంస

విజయనగరం జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారిని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి అభినందించారు. 74వ గణతంత్ర దినోత్స వేడుకల్లో మత్స్యశాఖ తరపున శకటం ఏర్పాటు, ఫిష్ ఆంధ్రా(మినీ) రెడీ టూ ఈట్ స్టాల్ నిర్వహణ చక్కగా చేపట్టడంతో కలెక్టర్ నిర్మల కుమారిని అభినందించారు. మెమోంటోతో సత్కరించారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు ఫిష్ ఆంధ్రా ఔట్ లెట్లను నెలకొల్పడంతో విజయనగరం జిల్లా ముందు వరసలో నిలబడే విధంగా పనిచేసి జిల్లాకు పేరుతేవాలని సూచించారు. దానికి ప్రతిగా నిర్మలకుమారి ప్రభుత్వ లక్షాలను అధిగమించేందుకు టీమ్ వర్క్ తో పనిచేస్తామని కలెక్టర్ కి వివరించారు.

Vizianagaram

2023-01-26 14:03:13

గణతంత్ర దినోత్సవంలో ఆకర్షించిన మత్స్యశాఖ శకటం

విజయనగరంజిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన 74వ గణతంత్ర వేడుకల్లో మత్స్యశాఖ శకటనం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రధానమంత్రి  మంత్స సంపద యోజన పథకంలో మత్స్యకారులకు మంజూరు చేసిన ఆటోను నేరుగా వేడుకలో ప్రదర్శనకు ఏర్పాటుచేశారు జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి. తానే స్వయంగా శకటానికి మత్స్యకారులు, గ్రామీణ మత్స్య సహాయకులతో కలిసి, మువ్వన్నెల జెండా పట్టుకొని ముందుకి నడిచారు. ఆ సమయంలో జిల్లా మత్స్యశాఖ ద్వారా ఇటీవల చేపట్టిన ప్రగతిని, చేపట్టబోయే కార్యక్రమాలను వెనుక నుంచి చక్కగా చదివి వినిపించారు.

Vizianagaram

2023-01-26 13:55:04

ఫిష్ ఆంధ్రా రెడీటు ఈట్ స్టాల్ కు విశేష స్పందన

విజయనగరంజిల్లా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏర్పాటుచేసిన ఫిష్ఆంధ్రా(మినీ) రెడీ టూ ఈట్ స్టాల్ కు విశేష స్పందన వచ్చింది. మత్స్యకారులను ఆర్ధికంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి ఈ ఫిష్ ఆంధ్రా ఔట్ లెట్ లను నెలకొల్పుతున్నారు. జిల్లాలోని మత్స్యశాఖ డిడి ఎన్.నిర్మలకుమారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్ లో తాజామత్స్య ఉత్పత్తులను వేడుకలకు వచ్చినవారంతా ఆశక్తిగా తిలకించడంతోపాటు, అక్కడ ఏర్పాటు చేసిన రెడీ ఈట్ ఫుడ్ ను రుచిచూశారు. 2 గంటల్లో సుమారు రూ.7వేల వరకూ అమ్మకాలు జరిపారు. ఆస్టాల్ వద్దే జనం భారీగా గుమికూడి కొనుగోలు జరపడం విశేషం.  

Vizianagaram

2023-01-26 13:43:00

ట్రైబల్ యూనివర్శిటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

విజయనగరం జిల్లాలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో 74వ గణతంత్ర వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ముందుగా  వైస్ ఛాన్సలర్ ఆచార్య తేజస్వి  కట్టిమని మువ్వన్నెల జండాను ఎగురవేసి, స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భారత దేశం పుణ్యభూమి అని ఈ రోజు మనం ఆస్వాదిస్తున్న ఈ స్వాతంత్య్రం ఎందరో త్యాగ ధనుల కృషికి నిదర్శనమని కొనియాడారు. యువత తమ సామర్ధ్యాలకు అనుగుణంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. కార్యాక్రమంలో విద్యార్థులు,అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. 

Vizianagaram

2023-01-26 13:28:43

సచివాలయ మహిళా పోలీస్ శిరీషకు జిల్లాఎస్పీ ప్రశంస

74వ గణతంత్ర దినోత్సవంలో ఉత్తమ గ్రామసచివాలయ మహిళా పోలీస్ గా జిల్లా స్థాయిలో అవార్డు పొందిన జిఎన్ఎస్.శిరీషను ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు అభినందిం చారు. గురువారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శంఖవరం మహిళా పోలీస్ శిరీషను ప్రశంసా పత్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు సేవలందించడంలో పోలీసుశాఖ నుంచి సిబ్బంది, మహిళా పోలీసులు ఒక అడుగు ముందుగా ఉండాలన్నారు. ప్రభుత్వ సేవకులుగా ప్రజలు మెచ్చేలా నిశ్వార్ధంగా సేవలందించాలన్నారు. అవార్డు గ్రహీత జిఎఎస్.శిరీష మాట్లాడుతూ, విధుల్లోకి చేరిన తరువాత వచ్చిన ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచింద న్నారు. జిల్లా ఎస్పీ, సిఐ, ఎస్ఐ సూచనలు పాటిస్తూ సచివాలయ పరిధిలో శక్తి వంచన లేకుండా పనిచేసి ప్రజలకు సేవలందిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా సహచర గ్రామసచివాలయ మహిళా పోలీసులు, గ్రామ సచివాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.

Kakinada

2023-01-26 09:50:40

విజ్ఞాన్‌ విద్యార్థులకు పలు అంశాలపై సదస్సు

అంతర్జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా, ఇండియన్‌ సొసైటీ ఫర్‌ ట్రైనింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విశాఖపట్నం చాప్టర్‌, సాఫ్ట్‌టెక్‌ సొల్యూషన్స్‌తో కలిసి విజ్ఞాన్‌ కాలేజీలో ‘ఇన్వెస్ట్‌ ఇన్‌ పీపుల్‌ అండ్‌ ప్రయారిటైజ్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌’ అనే అంశంపై సెమినార్‌ను నిర్వహించారు. కార్పొరేట్‌ ట్రైనర్‌, సీఆర్‌టీ ట్రైనర్‌, మోటివేషనల్‌ స్పీకర్‌ ప్రవీణ్‌ కుమార్‌ 4టీస్‌`టీమ్‌ ఎడ్యుకేషన్,‌ టైమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, టెక్నాలజీ ఇన్‌ ఎడ్యుకేషన్‌, ట్రాన్స్‌ఫర్మేషన్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఐఎస్‌టీడీ చైర్మన్‌ డాక్టర్‌ ఆర్‌.ఎం.రావు, సాఫ్టెక్ సొల్యూషన్స్  సీఈవో సునీల్‌ పుప్పాల, విజ్ఞాన్ కాలేజ్ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి.అరుంధతి,  రెక్టార్ డాక్టర్‌ వి.మధుసూధన్‌ రావు పాల్గొన్నారు. విద్యార్థులకు  ఆత్మవిశ్వాసం పెంపొందించడం, నిజ జీవితంలో ఆచరణాత్మకంగా వర్తించే విషయాలపై అవగాహన కల్పించారు. 

Visakhapatnam

2023-01-25 14:13:44