1 ENS Live Breaking News

విజయనగరంజిల్లాలో కంట్రోల్ రూమ్లు

విజయనగరం జిల్లాలో అధిక వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో జిల్లా అంతటా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం మీడియాకి ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా జిల్లా కలక్టరు కార్యాలయములో  కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు 08922-236947, రెన్యూ డివిజినల్ అధికారి కార్యాలయం కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు08922-276888, ఆర్డీఓ చీపురుపల్లి  కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు9440717534, ఆర్డీ బొబ్బిలి కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు08944 - 247288, తీర ప్రాంత మండలాలు అయినభోగాపురం&పూసపాటిరేగ తహసీల్దార్   కార్యాలయములలో  కంట్రోల్ రూమ్ ఫోను నెంబరుభోగాపురం: 8074400947, పూసపాటిరేగ : 7036763036,  మత్స్యశాఖ, విజయనగరం  కార్యాలయములలో ఏర్పాటు చేయబడిన కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు 08922-273812, విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు 9490610102 ఉన్నాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు లైన్ డిపార్ట్ మెంట్ అధికారులు అందరికి ఈ విషయాన్ని తెలియచేసి ముందస్తు చర్యలు తీసుకొనవలసినదిగా జిల్లా యంత్రాంగం ఒక ప్రకటనలో తెలియజేసింది. జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రజలందరూ అప్రమత్తం గా వుంటూ జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం కోరింది.

Vizianagaram

2022-07-12 07:51:53

అధిక వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

పార్వతీపురం మన్యం జిల్లాలో వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో మంగళ వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ - 08963 293046 ఏర్పాటు చేశామన్నారు. వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టాల వివరాలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. గర్భిణీలను ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా వసతి గృహాలకు తరలించాలని ఆయన ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. అన్ని ముందస్తు చర్యలతో సిద్దంగా ఉండాలని ఆయన ఆదేశించారు. వరదలు తీవ్రత దృష్ట్యా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆయన పేర్కొన్నారు. పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని, రవాణాకు బస్సులు, వాహనాలు సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పునరావాస కేంద్రాలలో ఆహార సరఫరాకు ఏర్పాట్లు ఉండాలని, ఎం.ఎల్.ఎస్ పాయింట్లు అనుసంధానం చేయాలని ఆయన ఆదేశించారు. మధ్యాహ్న వంట ఏజెన్సీలను సిద్ధం చేయాలని ఆయన అన్నారు. చిన్నారులు, వృద్దులు, గర్భిణీలు, బాలింతలను దృష్టిలో పెట్టుకొని వారికి అవసరమగు పాలు, బిస్కెట్లు, రొట్టెలు తదితర సామాగ్రిని సిద్దంగా ఉంచాలని ఆయన పేర్కొన్నారు. పంటలను కాపాడుకొనుటకు రైతాంగాన్ని అప్రమత్తం చేయాలని వ్యవసాయశాఖను అదేశించారు. గ్రామ రెవిన్యూ అధికారి, గ్రామ వ్యవసాయ సహాయకులను అప్రమత్తం చేయాలన్నారు.  రోడ్లపై  చెట్లు పడిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడితే వెంటనే చెట్లను తొలగించుటకు అవసరమగు పరికరాలు, అందుకు కావలసిన మెషినరీ, కట్టర్స్, జె.సి.బిలు సిద్ధం చేసి తక్షణ చర్యలు చేపట్టుటకు వీలుగా వివిధ మండలాల్లో ఉంచాలని ఆర్ అండ్ బి, అగ్ని మాపక విపత్తుల శాఖను ఆదేశించారు. 

పంచాయతీరాజ్, ఇరిగేషన్ సిబ్బంది చెరువులు, అనకట్టలు తనిఖీ చేయాలన్నారు. సిబ్బంది 24 గంటలు అప్రమత్తం గా ఉండాలని, గేట్లు, లాకులు తనిఖీ చేసి సక్రమంగా పనిచేసేటట్లు చూడాలని, అవుట్ ఫ్లో సక్రమంగా ఉండే విధంగా చూడాలని ఆయన అన్నారు.  లోతట్టు  ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, రాకపోకలకు యిబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, నదులు, వాగులు, వంకలు, చెరువులను ఎవరూ దాటకుండా, దిగకుండా సూచనలు చేయాలని ఆయన తెలిపారు. మత్స్య శాఖ దేశీయ మత్స్యకారులకు సూచనలు చేయాలని ఆయన ఆదేశించారు. వరదల సమయంలో ప్రజలు పాము, తేలు కాట్లుకు గురయ్యే ప్రమాదం ఉందని, వ్యాధులు ప్రభలుటకు అవకాశం ఉందని వాటి చికత్సకు కావలసిన మందులు సిద్ధం చేసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులను అదేశించారు. వరదలు మరింత తీవ్ర రూపం దాల్చి విద్యుత్ అంతరాయం కలిగే అవకాశం ఉంటే తాగు నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా ముందుగా టాంక్ లు నింపడం, జనరేటర్లను సిద్దంగా ఉంచడం చేయాలని ఆర్.డబ్ల్యు.ఎస్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రులలో విద్యుత్ అంతరాయం వలన చికిత్సలకు ఆటంకం లేకుండా ముఖ్యంగా అత్యవసర శస్త్ర చికిత్సలకు ఇబ్బంది కలగకుండా జనరేటర్లు, ఇన్వర్టర్లను సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. విద్యుత్ సౌకర్యం తక్షణం పునరుద్దరణకు సిబ్బంది, విడి పరికరాలు సిద్ధం చేయాలని ఆయన సూచించారు. విద్యుత్ అంతరాయం వలన కమ్యునికేషన్ వ్యవస్థకు అంతరాయం కలిగే అవకాశం ఉందని, సంభందిత టెలి ఆపరేటర్లు ముందస్తు ఏర్పాట్లు చేసి అంతరాయం కలుగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. తుఫాను, వరదల అనంతరం పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మునిసిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, వాటికి అవసరమగు ఆహారం అందించుటకు ఏర్పాట్లు చేయాలని పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. బ్లీచింగ్ , క్లోరినేషన్ నిల్వలు సిద్దంగా ఉంచాలని, తాగు నీటిని ఇంజినీరింగ్ సహాయకులు ద్వారా నెల రోజులు పాటు టెస్టింగ్ చేయాలని ఆయన ఆదేశించారు. పాఠశాలల్లో పారిశుధ్యం పక్కాగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వి.విద్యాసాగర్ నాయుడు, జిల్లా రెవిన్యూ అధికారి జల్లేపల్లి వెంకట రావు, జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ ఆర్. సుగుణాకర రావు, కార్యనిర్వాహక ఇంజినీర్లు ఆర్. అప్పల నాయుడు, ఆర్. రామచంద్ర రావు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బాలివాడ సత్యనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్, జిల్లా ఉద్యానవన అధికారి కె.వి. సత్యనారాయణ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కిరణ్ కుమార్, రహదారులు భవనాలు శాఖ ఇంజినీరింగ్ అధికారి ఎం.జేమ్స్, పంచాయతి రాజ్ ఇంజినీరింగ్ అధికారి డా.ఎం.వి.జి.కృష్ణాజి, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారి జె. శాంతీశ్వర రావు, డి.ఆర్.డి.ఏ పిడి వై.సత్యం నాయుడు, జిల్లా వ్యవసాయ రవాణా మార్కెటింగ్ అధికారి ఎల్.అశోక్ కుమార్, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.రఘురాం, జిల్లా మత్స్య శాఖ అధికారి డి. గోపి కృష్ణ, జిల్లా పశు సంవర్థక అధికారి ఏ. ఈశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-07-12 07:40:54

పౌష్టికాహార ప్రాముఖ్యత తెలుసుకోవాలి

విజయనగరంలోని మహారాజ ఆసుపత్రిలో  పౌష్టికాహార పునరావాస కేంద్రం (ఎన్. ఆర్.సి) లో పౌష్టికాహారం పై బాలింతలకు అవగాహనా సదస్సు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఆదేశాల మేరకు సామ్, మాం, తక్కువ బరువున్న పిల్లలకు ఎన్. ఆర్.సి లో  పౌష్టికాహారం  అందించడం ఐ.సి.డి.ఎస్ సూపర్ వైసర్లకు, తల్లులకు శిక్షణ నిచ్చారు. చిన్న పిల్లల వైద్యులు డా.గౌరీ శంకర్, పౌష్టికాహార నిపుణులు స్వర్ణ ఎలాంటి ఆహారం పౌష్టికారం, ఏ ఆహారం లో ఎలాంటి విటమిన్లు, న్యూట్రియాంట్ లు ఉంటాయి, పిల్లలకు ఎలా తినిపించాలో వివరించారు. ఈ కార్యక్రమంలో 11 మంది తల్లులు వారి పిల్లలతో కలసి హాజరయ్యారు.  ఈ శిక్షణా కార్యక్రమం లో పాల్గొన్న ఐ.సి.డి.ఎస్ పి.డి శాంత కుమారి మాట్లాడుతూ ఈ శిక్షణా కార్యక్రమం మంగళవారం కూడా పెద్దాసుపత్రి లో నిర్వహించనున్నట్లు  తెలిపారు. అదే విధంగా జిల్లా అంతటా విడతల వారీగా పి హెచ్ సి వైద్యులు, సీడీపీఓల అధ్వర్యం లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Vizianagaram

2022-07-11 10:07:31

మనసుపెట్టి సమస్యలు పరిష్కరించాలి

స్పందన గ్రీవెన్స్ అర్జీలకు మనసు పెట్టి పరిష్కారం చూపించాలని, ఇప్పుడు వచ్చిన అర్జీలు మళ్లీ రీఓపెన్ కాకుండా నాణ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్  శ్రీకేశ్ లాఠకర్ స్పందన గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో 275 అర్జీలను ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలో పెండింగ్ లోనున్న స్పందన,ఏ.పి సేవా పోర్టల్ శాఖల వారీగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షిస్తూ స్పందన కార్యక్రమంలో ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించాలని ఆదేశించారు. అందిన దరఖాస్తులు మరల అదే అంశంపై  రీ ఓపెన్ కాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఒకవేళ దరఖాస్తులు రీ ఓపెన్ అయిన యెడల ఆయా దరఖాస్తులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ప్రతి అర్జీని సత్వరమే పరిష్కరిస్తూ  నాణ్యతతో పరిష్కార మార్గాలు స్పష్టతతో పూర్తి స్థాయిలో చూపాలని ఆదేశించారు.ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల పట్ల జిల్లాస్థాయి అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని, బుధవారం ఉదయం నాటికి పూర్తీ కావాలని  ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నేషనల్ ఎడ్యూకేషనల్ పోలసీ 2020ను అనుసరించి, అశాస్త్రీయంగా ఆ విధానాన్ని అమలు పరచి పాఠశాలను విలీనం చేస్తూ అనేక మంది విద్యార్థిని, విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న జి.ఒ రద్దుచేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. పాతపట్నం మండలం గంగువాడ, చిన్నమల్లిపురం గ్రామానికి చెందిన సి.హెచ్.కృష్ణవేణి తమకు కాపునేస్తం మంజూరు చేయమని కోరుతూ దరఖాస్తు అందజేశారు.పలాస మండలం, నీలకంఠపురం గ్రామానికి చెందిన పీతాంబర జగన్నాథరావు తను గత 6 సంవత్సరాలనుండి ప్రజ్ఞా జూనియర్, డిగ్రీ కళాశాలలో వాచ్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నానని తనకు విధులు నుండి తొలగించారని న్యాయం చేయమని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

జిల్లాలో రక్త కొరతను అధిగమించేందుకు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. గత సంవత్సరం రెవెన్యూ శాఖ నుంచి 2 వేల యూనిట్స్ అందజేయడం జరిగిందన్నారు. అలానే ఉపాధ్యాయులు, డ్వామా సిబ్బంది సహకరించారని, ఈసారి అన్ని శాఖలు సమన్వయంతో జిల్లాలో రక్తం కొరత లేకుండా అధికమించేందుకు బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించి అధిక మొత్తంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకుకు ఎక్కువ సంఖ్యలో యూనిట్లు అందజేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  ల్యాప్ టాప్ లను దివ్యాంగులకు కలెక్టర్ అందజేశారు. స్పందన వినతులు స్వీకరణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం విజయ సునీత, జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి, డి.ఆర్.డి.ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శాంతిశ్రీ, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ బి.లక్ష్మిపతి, ఎస్.ఇ ఇరిగేషన్ డోల తిరుమల రావు, ఎస్.ఇ, ఆర్ అండ్.బి ఎస్.ఈ కె.కాంతిమతి, డి.ఎస్.ఓ డి.వెంకటరమణ, వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఎం.త్రినాథరావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-07-11 09:52:35

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రచారం..

Ens Live Appలో మీ వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ద్వారా లక్షలాది పాఠకులకు, ప్రజలకు చేరువ అవ్వొచ్చు.. Ens Live Appతో పాటు www.enslive.net న్యూస్ వెబ్ సైట్ లో ఏక కాలంలో మీ ప్రకటన ప్రజలకు క్షణాల్లో చేరిపోతుంది. Whole sealers, retailers, education, coaching centers, textiles, automobiles, interior developers, real estate వ్యాపారం ఏదైనా మీరు ఆశించిన ఫలితాలు వచ్చేవరకు మీ ప్రకటనలను పాఠకుల దగ్గరకుతీసుకెళ్లడంతో మేము మీకు తోడుగా ఉంటాము. ప్రకటనలకు తక్కువ మొత్తం చెల్లించి అత్యంత ఎక్కువ ఫలితాలను పొంది. మీ వ్యాపారాలను మరింతగా వ్రుద్ధి చేసుకోండి.. ఇపుడే ఈఎన్ఎస్ లైవ్ యాప్ లో ప్రకటనల కోసం సంప్రదించండి..  మరిన్ని వివరాలకు: 9390280270లో సంప్రదించండి.

Visakhapatnam

2022-07-11 09:49:30

విజయనగరం స్పందనకు 220 దరఖాస్తులు

విజయనగరం కలెక్టరేట్  లో సోమవారం నిర్వహించిన స్పందన కు ప్రజల నుండి 220 వినతులు అందాయి. వీటిలో వైద్య శాఖకు 41,  డి.ఆర్.డి.ఏ కు 13,   అందగా  రెవిన్యూ కు సంబంధించి 166 వినతులు అందాయి. ముఖ్యంగా  సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులను సంయుక్త కలెక్టర్  మయూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు,  ఉప కలెక్టర్ పద్మా వతి,  స్వీకరించారు.  అనంతరం జె.సి మయూర్ అశోక్ అధికారులతో మాట్లాడుతూ గడువు దాటి పెండింగ్ ఉన్న అర్జీలను శాఖల వారీగా సమీక్షించారు. రీ ఓపెన్ అయిన వాటిని తక్షణమే తగు సమాధానాలు రాసి    అర్జీలను డిస్పోజ్ చేయాలంబరు. జిల్లా అధికారులే కాకుండా శాఖ లో నున్న విభాగాల అధికారులు కూడా వారి లాగిన్ లో స్పందన అర్జీలను తనిఖీ చేయా లన్నారు. మండలాల్లో మంగళవారం ప్యాత్యేకాధికారులు నిర్వహించనున్న సమీక్షల్లో ఇళ్ల స్థలాల కేటాయింపు పై ఆడిట్, గృహ నిర్మాణాల పురోగతి పై సమీక్షించాలన్నారు. విత్తనాల సరఫరా పై ప్రత్యేకంగా సమీక్షించా లన్నారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సక్రమంగా సరఫరా జరిగేలా చూడాలన్నారు.  రీ సర్వే ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. 

Vizianagaram

2022-07-11 09:37:15

కు.ని. శస్త్ర చికిత్సల సంఖ్య పెరగాలి

చిన్న కుటుంబం చింతలులేని కుటుంబమని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిస్తు న్నాయని, ఆ దిశగా వైద్యులు,సిబ్బంది కృషిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.మీనాక్షి పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీ అనంతరం స్థానిక వైద్య ఆరోగ్య శాఖధికారి కార్యాలయంలో వైద్యులు, సిబ్బందితో ఆమె సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు అనుకున్నంత స్థాయిలో జరగడం లేదన్నారు. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మినహా మిగిలిన చోట్ల జరగడం లేదని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు ప్రోత్సహించడంలో ఉత్తమ సేవలు అందించిన వారికి నగదు పారితోషికం ఉంటుందని, అలాగే జిల్లాకు మంచి పేరు వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపై వైద్యులు, సిబ్బంది తమ పరిధిలో కుటుంబ నియంత్రణలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వేసక్టమీ,ట్యూబెక్టమీలపై దృష్టిని సారించాలని, వేసక్టమీ ఆపరేషన్ చాలా సులభతరమని వివరించాలన్నారు. జిల్లాలోఅంతర ఇంజక్షన్లు అనుకున్నంతగా చేపట్టకపోవడం వలన నగదు పారితోషికం కోల్పోయామని, వచ్చే ఏడాదిలో తప్పక ఆ బహుమానం పొందేలా చర్యలు తీసుకోవాలని, పిపిఐవిసిడిలను కూడా పెంచాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 

అనంతరం  కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించడంలో ఉత్తమ సేవలు అందించిన టెక్కలి పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యులు డా.జయలక్ష్మి, దూసి పి.హెచ్.సి వైద్యులు డా.పి.రేఖలకు ఒక్కొక్కరికి రూ.10వేలు వంతున,నరసన్నపేట, సారవకోట పి.హెచ్.సి సిబ్బంది అగర్త తేజ మరియు బి.భారతిలకు రూ.5వేలు వంతున ప్రోత్సాహక బహుమతితో పాటు సర్టిఫికేట్లను బహూకరించారు. అలాగే శస్త్ర చికిత్సల విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన డిఎహెచ్ఓ కార్యాలయ డెప్యూటీ ఎస్.ఓ డి.శ్రీనివాస పట్నాయక్, పొన్నాడ,చాపర పి.హెచ్.సి వైద్యులు డా.ఎన్. శేషగిరి,డా.జి.గణపతి, జెమ్స్ మెడికల్ ఆఫీసర్ డా.పి.తార తదితరులకు జ్ఞాపికతో పాటు సర్టిఫికేట్లను బహూకరించారు. అదేవిధంగా ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో విజేతలైన బొద్దాన దుర్గ, ఉరిటి సాయితేజ, బి.ఉన్నీషా, డి.ధనలక్ష్మి, ఇ.ఉషారాణి, సిహెచ్.నందిని, పి.రమ్య, లేఖ రాణి తదితరులకు ధ్రువీకరణ పత్రాలు,జ్ఞాపికలను బహూకరించారు.తొలుత ప్రపంచ జనాభా దినోత్సవ ర్యాలీలో జె.సితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకట రమణ, డా.కె.కృష్ణమోహన్, డా.కె.అప్పారావు,డా.ఎన్. శేషగిరి, డా.జి.గణపతి,డా.పి.తార,మంత్రి వెంకటస్వామి, సోమేశ్వర రావు, కె.ఎల్.నారాయణరావు, సూర్యకళ, ఏ.ఎన్.ఎంలు, ఆశావర్కర్లు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-07-11 08:34:59

NPPA తగ్గించిన ధరలను అమలుచేయాలి

కేంద్ర ప్రభుత్వం అత్యవసర మందుల ధరలను తగ్గిస్తూ జారీ చేసిన ఆదేశాలు (జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్ధ-ఎన్‌పీపీఏ ఎఫ్‌.నెం. 8(99)/2022/డి.పి./ఎన్‌పిపిఏ`డిఐవి`11 తేది : 30`6`2022)ను రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వానికి కన్సూమర్‌ ఆర్గనైజేషన్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి పంపిన వినతిపత్రాన్ని శుక్రవారం అనకాపల్లిలో ఆయన ప్రసార మాధ్యమాలకు విడుదల చేశారు. రాష్ట్రంలోని అత్యధిక మందుల షాపులు యాజమాన్యాలు సవరించిన ధరలకు మందులు అమ్మడం లేదని, ఔషధ నియంత్రణ పరిపాలన విభాగం అధికారులు నిఘా ఉంచాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తగ్గించిన మందుల ధరల జాబితాలో రక్తపోటు, మధుమేహం, జీర్ణాశయ సమస్యలు, కొలెస్ట్రాల్‌, గుండెపోటు, పక్షవాతం, నొప్పి నివారణల మొదలగు 84 రకాల అత్యవసర ఔషధాలున్నాయన్నారు. దీనివల్ల వినియోగదారులపై 30 నుంచి 40 శాతం మేర ఆర్ధిక భారం తగ్గనుందన్నారు. ఎక్కువగా సమ్మిళిత ఔషధాల (కాంబినేషన్‌ డ్రగ్స్‌) ధరలు అదుపులోకి వస్తాయన్నారు. ‘ఇంటిగ్రేటెడ్‌ ఫార్మాస్యూటికల్‌ డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఐపీడీఎంఎస్‌)’ ద్వారా మందుల ధరల జాబితాను ఔషధ తయారీదారులు ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రతి రిటైలర్‌, డీలర్‌ ఔషధ ధరలు, అనుబంధ ధరల పట్టికలను వ్యాపార ప్రాంగణాల్లో బహిరంగంగా వినియోగదారులకు కనిపించేలా ప్రదర్శించాలని కాండ్రేగుల వెంకటరమణ ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ మేరకు వినతిపత్రాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, ఔషధ నియంత్రణ పరిపాలన విభాగాలకు పంపినట్టు మీడియాకి విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.

Anakapalle

2022-07-08 14:03:53

పనుల్లో జాప్యం చేస్తే చర్యలు తప్పవు

శ్రీకాకుళం జిల్లాలో జల్ జీవన్ మిషన్ (జెజెఎం) ద్వారా మంజూరైన పనుల్లో జాప్యం వహిస్తే చర్యలు తప్పవని, విధుల నుండి తప్పిస్తామని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ గ్రామీణ నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులను హెచ్చరించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో గ్రామీణ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ జెజెఎం పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ ద్వారా పనులను చేపట్టేందుకు లక్ష్యాలు నిర్దేశించినప్పటికి నేటి వరకు పూర్తి చేయకపోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. తొలుత ఇప్పటివరకు చేపట్టిన పనులపై మండలాల వారీగా సమీక్షించిన కలెక్టర్ అనుమతులు ఉన్న పనులు కూడా ఇంజినీరింగ్ అధికారులు చేపట్టక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పగించిన చిన్న చిన్న పనులు కూడా చేపట్టని గ్రామీణ నీటిపారుదల శాఖ పనితీరు బాగులేదని అసహనం వ్యక్తం చేశారు. చేసిన పనులకు సంభందించిన బిల్లులు సకాలంలో చెల్లింపులు జరుగుతున్నాయని, అయినప్పటికీ పనులు ఎందుకు వేగవంతం కావడం లేదని ప్రశ్నించారు. పనులు వేగవంతం చేయడానికి  ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. మూడు మాసాల్లో లక్ష్యాలను నిర్ధేశించినప్పటికి పూర్తి చేయలేకపోవడంపై వివరణ కోరారు. జిల్లావ్యాప్తంగా 20 వేలు కొళాయి కనెక్షన్లు ఎందుకు పూర్తి చేయలేక పోతున్నారని, 700 మంది ఇంజినీర్లు ఉండి పనులు వేగవంతం కాకపోవడం సరికాదని అన్నారు. జిల్లాలో కొళాయి కనెక్షన్లు కావాలని కోరుతున్నవారు చాలా మంది ఉన్నారని,వారికి మంజూరుచేస్తే సరిపోతుందని, ఆ విషయం కూడా గ్రహించలేక పోతున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న మంచి కార్యక్రమం ఇదని కలెక్టర్ గుర్తుచేశారు.

 ఇందులో అంచనాలు రూపొందించడానికి   జాప్యం ఎందుకు జరుగుతుందని, ఏడాది కాలంలో మీ పనితీరు సంతృప్తి కరంగా లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. బూర్జ మండలాన్ని సమీక్షిస్తూ 37 పనులకు ఎస్టిమేషన్ వేసి టెండర్లకు పిలిస్తే 8 పనులకు మాత్రమే టెండర్లు కన్ఫర్మ్ అయ్యాయని, మిగిలిన టెండర్లకు ఎవ్వరూ పాల్గొనక పోవడానికి కారణాలు తెలపాలని కలెక్టర్ కోరారు.  సహాయ ఇంజనీర్లు, గ్రామ స్థాయి ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో ప్రణాళికలు రూపొందించుకుంటే పనులు వేగవంతం చేయవచ్చని సూచించారు.పనుల పురోగతి సంతృప్తినిచ్చేలా ఎప్పటి కపుడు పరిశీలించుకొని ముందుకువెళ్లాలని అన్నారు. పనుల్లో పురోగతి లేకపోతే మీకు వెనుకకు పంపించాల్సి ఉంటుందని హెచ్చరించారు. జిల్లాలో 20 వేల కనెక్షన్లు పూర్తిచేసేందుకు 700 మంది ఇంజినీర్లు ఉన్నారని, ఒక్కో ఇంజనీర్ సుమారు 30 కనెక్షన్లు చేయవలసి ఉండగ, వాటిని కూడా చేయలేకపోయారని అన్నారు. పనుల నిర్వహణకు మెటీరియల్ అందుబాటులో ఉందని, పనుల నిర్వహణలో సాంకేతిక కారణాల సమస్యలు ఉంటే తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు. శాఖకు సులభతరమైన లక్ష్యాలను నిర్దేశించామని, జూలై మాసాంతానికి లక్ష్యాలను పూర్తిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.అనంతరం కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ పనితీరుపై సమీక్షించిన ఆయన 614 ప్రదేశాల్లో స్థలం అందుబాటులో ఉందని, పనులకు సంబంధించిన చెల్లింపులు జరుగుతున్నాయని,నిధులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. బిల్లులు అప్లోడ్ చేసిన వెంటనే చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు.కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ కట్టడంలో 26 జిల్లాల్లో 24వ స్థానంలో ఉండడం అసంతృప్తిగా ఉందని, ఇకపై ప్రగతి కనబరచాలని అన్నారు. జూలై మాసాంతానికి ఇంకా 23 రోజులే సమయం ఉన్నందున త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్, కార్యనిర్వాహక ఇంజినీర్ ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు, సహాయ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-07-08 13:56:17

శ్రీ సిద్ధేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జులై 10 నుండి  18వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు జులై 9వ తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు. జులై 10న ఉదయం 6.58 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మో త్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి హంసవాహన సేవ నిర్వహిస్తారు. జులై 11, 12, 13, 14 మ‌రియు 17వ తేదీల్లో ఉదయం పల్లకీ ఉత్సవం నిర్వ‌హిస్తారు.  అదేవిధంగా జులై 11న రాత్రి చంద్రప్రభ వాహనం, 12న‌ రాత్రి చిన్నశేష వాహనం, 13న రాత్రి సింహ వాహనం, 14న సాయంత్రం నంది వాహ‌న‌సేవ జ‌రుగుతాయి. జులై 15న సాయంత్రం 6 నుండి రాత్రి 7గంటల వరకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత రాత్రి 7.30 గంటలకు గజవాహనంపై స్వామివారు విహరించనున్నారు.

      జులై 16న సాయంత్రం పల్లకీ సేవ, 17న సాయంత్రం 6 గంటలకు పార్వేట ఉత్సవం, 18న ఉదయం 10 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వ‌ర‌కు త్రిశూలస్నానం, సాయంత్రం 5 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్ర‌హ్మోత్స‌వాల‌లో ప్ర‌తి రోజు ఉద‌యం 8 గంట‌ల‌కు, సాయంత్రం 6 గంట‌ల‌కు వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు.   జులై 19వ తేదీన పుష్పయాగం నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు శ్రీ చెన్నకేశవస్వామి,  శ్రీసిద్ధేశ్వరస్వామివార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగనుంది.  బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Tallapaka

2022-07-07 10:43:32

అప్పన్న గిరి ప్రదక్షిణకు రూట్ మ్యాప్

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీ వరాలక్ష్మీ నారసింహ స్వామివారు(సింహాద్రి అప్పన్న) గిరి ప్రదక్షణ చేయడానికి దేవస్థానం అధికారులు రూట్ మ్యాప్ ని ప్రకటించారు. ఈ మొత్తం రూట్ మ్యాప్ లో భక్తులకు ఎలాంటి ఇబ్బదులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కోవిడ్ లో రెండేళ్ల పాటు నిలిపివేసిన ఈ సింహగిరి ప్రదక్షిణ మళ్లీ ఈ సారి దేవస్థానం అధికారులు ప్రారంభిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ గిరి ప్రదక్షిణ కోసం మొత్తం 25 ప్రాంతాల్లో స్టాల్స్, పది ప్రదేశాల్లో మెడికల్ క్యాంపులు, 22 ప్రదేశాల్లో 200 టాయిలెట్లు, 12 చోట్ల 17 అంబులెన్సులు ఏర్పాటు చేశారు. వీటితో పాటు స్వచ్ఛంద సంస్థలు మంచినీరు, మజ్జిగ, ప్రసాదాలు అందించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యధిక సంఖ్యలో గిరి ప్రదక్షిణ జరుగుతున్నందున భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలనే సంకల్పంతో అధికారులు సర్వం సిద్దం చేశారు. గిరి ప్రదక్షిణ ఏఏ ప్రాంతాలు మీదుగా సాగుతుందనే విషయాన్ని తెలియజేయడానికి ఒక రూట్ మ్యాప్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ రూట్ మ్యాప్ ద్వారా ప్రజలకు మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నది.

Visakhapatnam

2022-07-07 10:29:55

జ్ఞాన సంపదతోనే దేశాభివృద్ధి సాధ్యం

ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకొని, కర్తవ్య నిర్వహణలో సమర్థతను,శక్తిని, ఉత్సాహన్ని పొందేందుకు జాతీయ మీడియా సదస్సు-2022 నిర్వహించడం జరుగుతుందని ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం పేర్కొంది. సంస్థ ప్రతినిధి బి.కె.రామేశ్వ రి(రమ) ఆధ్వర్యంలో గురువారం విశాఖలోని డాబాగార్డెన్స్‌ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సదస్సుకు సంబంధించిన వివరాలను పలువురు అతిధుల ద్వారా వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్కికల్‌ ఎడ్యూకేషన్‌ ఆప్పిలేట్‌ ఆధారిటీ చైర్మన్‌ ఆచార్య జిఎస్ఎన్‌ రాజు. గౌరవ అతిధిగా జీవీఎంసీ అదనపు కమిషనర్‌ డాక్టర్‌ యాదగిరి శ్రీనివాసరావులు మాట్లాడుతూ నిరంతరం సమాజానికి దిక్సూచిగా వ్యవహరించే జర్నలిస్టులకు ఏటా జాతీయ మీడియా సదస్సు ఏర్పాటు చేసి వారికి అవసరమైన జ్ఞాన సంపదను పంచిపెట్టడం అభినందనీయమన్నారు. మీడియాతోనే ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రజా సమస్యల పరిష్కారానికి అవకాశం కలుగుతుందన్నారు. క్రమం తప్పకుండా ఈ జాతీయ సదస్సు ఏర్పాటు చేయడం, అందులో దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల జర్నలిస్టులను భాగస్వాములను చేయడం ఒక్క బ్రహ్మకుమారీలకే సాధ్యపడిందన్నారు. కార్యక్రమంలో అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా జాతీయ మీడియా సదస్సుకు విశాఖ నుంచి పలువురు జర్నలిస్టులు హాజరు కావడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది కూడా మౌంట్‌ ఆబూలో జరిగే మీడియా సదస్సుకు హాజరయ్యే జర్నలిస్టులు తమ అక్రిడేషన్‌, గుర్తింపుకార్డు, ఆధార్‌కార్డు, జెరాక్స్ ,పాస్‌పోర్టు సైజ్‌ ఫోటోను డాబాగార్డెన్స్‌ ప్రెస్‌క్లబ్‌(వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం) కార్యాలయం పనివేళల్లో ఈనెల 15వ తేదిలోగా సమర్పించి, తమ పేర్లును నమోదు చేసుకోవాలని కోరారు.

ఈ ఏడాది జాతీయ మీడియా సదస్సును ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్‌ 2 వరకూ మౌంట్‌ఆబూ శాంతివనంలో నిర్వహించడం జరుగుతుందని బ్రహ్మకుమారీస్‌ ప్రతినిధి బి.కె.రామేశ్వరి తెలిపారు. తొలిరోజు సాయంత్రం సదస్సు ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ సమావేశాలు ముగిసిన అనంతరం సర్టిఫీకేట్లు అందజేసి మౌంట్‌ ఆబూ దర్శనం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ సదస్సుతో జర్నలిస్టులకు తమ జీవితంలో అన్ని విధాలా ముందుకు సాగేందుకు చక్కని విలువలతో కూడిన జీవితం గడిపేందుకు ఉపకరిస్తుందన్నారు. కావున జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామేశ్వరి కోరారు. ఈ సందర్భంగా ఆమె అతిధులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విజెఎఫ్‌ ఉపాధ్యక్షుడు ఆర్‌.నాగరాజు పట్నాయక్‌ స్వాగతం పలకగా, కార్యవర్గ సభ్యులు ఎంఎస్‌ ఆర్‌ ప్రసాద్‌, ఇరోతి ఈశ్వరరావు పాల్గొన్నారు. 

Visakhapatnam

2022-07-07 08:40:51

విద్యార్థులను క్రమ శిక్షణగా తీర్చిదిద్దాలి

విద్యార్థులను క్రమ శిక్షణగా తీర్చి దిద్ది ఉన్నత విద్యావంతులుగా, ఉత్తమ పౌరులుగా తయారు చేయాల్సిన భాద్యత ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. మంగళవారం లోచలి పుట్టు గిరిజన సంక్షేమ శాఖ నెంబర్ వన్ పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీని కలెక్టర్ ప్రారంభించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోందని, పిల్లలను ఉత్తమ పౌరులుగా, విద్యావంతులుగా తీర్చి దిద్దటానికి ప్రభుత్వ కృషి చేస్తోందని వివరించారు. ఇటీవల కోవిడ్  కారణంగా విద్య ఫై  చాలా ప్రభావం పడిందని, విద్య స్థాయి పడిపోయిందని ఆవేదన వ్యక్త పరిచిన కలెక్టర్ ఈ రోజు నుండి ప్రారంభమైన పాఠశాలలకు విద్యార్థులు ప్రతి రోజు శత శాతం హాజరు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతి పేద వారు కూడా పిల్లల్ని చదివించాలనే ఉద్దేశంతో జగనన్న విద్య కనుక కిట్లను పంపిణీ చేస్తోందని తెలిపారు ఇందులో టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్ , డిక్షనరీతో పాటు బేగ్, రెండు జతల యూనిఫామ్,షూస్, రెండు జతల శాక్స్ ఉంటాయన్నారు.   విద్యార్థులు చిన్నతనం నుండే పోటీతత్వం అలవరచుకోవాలి అందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు. మన బడి నాడు-నేడు క్రింద పాఠశాలలను ఆధునీకరించి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపిన కలెక్టర్ మొదటి విడతలో రూ. 104 కోట్లతో 367 పాఠశాలలు ఆధునీకరించామని. రెండో దశలో 393  పాఠశాలలు ఆధునీకరించనున్నామని వివరించారు.  జిల్లాలో అక్షరాస్యత శాతం కేవలం 54శాతం ఉందని, అక్షరాస్యత పెరుగుదలకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ సూచించారు. అమ్మ ఒడి పథకం కింద లక్ష మంది వరకు లబ్ది పొందారని, విద్యార్థుల హాజరు శాతం 75 కు మించి ఉంటె మరికొంతమంది లబ్ది పొందేవారని తెలిపిన కలెక్టర్ తల్లిదండ్రులు పిల్లలను క్రమం తప్పకుండ పాఠశాలకు పంపాలన్నారు.  జగనన్న విద్య కానుక కిట్లను అవకతవకలకు తావు లేకుండా సక్రమంగా పంపిణీ చేయాలనీ,  బయో మెట్రిక్ కు సిగ్నల్ సమస్య ఉంటే సచివాలయాలు సహాయం తీసుకోవాలని డిఇఓను ఆదేశించారు. అదేవిధంగా ఆధార్ అప్డేట్ చేసుకోవాలని కోరారు. కిట్ల పంపిణీలో, ఆధార్ అప్ డేషన్  లో  ఎంపిడిఓలు సచివాలయాల సిబ్బందికి తగు సూచనలు జారీ చేయాలనీ ఆదేశించారు.. 

        జిల్లా విద్యా శాఖాధికారి డా. పి  రమేష్ మాట్లాడుతూ జిల్లాలో 2,716 పాటశాలల్లో 1,58,989 మంది విద్యార్థులు ఉన్నారని, 1,58,914 కిట్లు వచ్చాయని,  ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ పంపిణీ చేస్తామని తెలిపారు. ఐదవ తేదీ నుండి 30 వ తేదీ వరకు  ప్రతి పాఠశాలలో రోజుకు 25 మందికి చొప్పున పంపిణీ జరుగుతుందని, ఏ రోజుకు ఆ రోజు ఆన్లైన్ చేస్తామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో పాడేరు ఎంపిపి రత్న కుమారి, ఎంఇఓ సరస్వతి, ప్రధానోపాధ్యాయులు జివివి ప్రసాద్, కృష్ణమూర్తి, ఎస్టీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధి ఎం శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. 

Paderu

2022-07-05 11:53:31

సమన్వయకర్త పోస్టుకి దరఖాస్తులు ఆహ్వానం

గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో కమ్యూనికేషన్స్ విభాగంలో జిల్లా సమన్వయకర్త పోస్టును ఆరు నెలల కాలానికి నియమిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో సాంఘిక, ప్రవర్తన పరమైన మార్పుల కొరకు కమ్యూనికేషన్ విభాగం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ పోస్ట్ ను ఈ ఏడాది జూలై నుంచి డిసెంబరు వరకు ఆరు నెలల కాలానికి నియామకం జరుగుతుందని పేర్కొన్నారు. నెలకు 48 వేల రూపాయలు ఏక మొత్తంగా వేతనం ఉంటుందని ఆయన పేర్కొంటూ నియామకం చెందిన అధికారి కోవిడ్, ఇతర సమస్యల పరంగా వస్తున్న ప్రవర్తనపరమైన మార్పులు పట్ల ప్రజల్లో స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అదేవిధంగా మహిళలు, బాల్యవివాహాలు, ఇతర సామాజిక రుగ్మతలు, కోవిడ్ వ్యాక్సినేషన్ తదితర అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలో ఏర్పాటు చేసే వివిధ సమావేశాల్లో సమన్వయ అధికారిగా పాల్గొంటూ సంబంధిత సమాచారాన్ని ఇతర శాఖలతో సమన్వయ పరచడం, ప్రజల వద్దకు తీసుకువెళ్లడం చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా దీన్ని ప్రణాళికాబద్ధంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఆయన చెప్పారు.

 ఈ పోస్ట్ కు దరఖాస్తు చేసే అభ్యర్థి కమ్యూనికేషన్స్, పబ్లిక్ రిలేషన్స్, సోషల్ సైన్సెస్, మేనేజ్మెంట్ లేదా ఇతర విభాగాల్లో మాస్టర్  డిగ్రీ కలిగి ఉండాలని, జిల్లా, రాష్ట్రస్థాయి కమ్యూనికేషన్ విభాగాల్లో నాలుగు నుండి ఐదు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని ఆయన వివరించారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు కనీసం మూడు సంవత్సరాల పాటు కమ్యూనిటీ మొబిలైజేషన్ లేదా స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉండాలని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్యం, ఐసిడిఎస్, పంచాయతీరాజ్, విద్య, రెవిన్యూ, మైనారిటీ, మున్సిపాలిటీ, సివిల్ డిఫెన్స్, సమాచార, ఫీల్డ్ పబ్లిసిటీ, మీడియా తదితర విభాగాల్లో స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని వివరించారు. సామాజిక, మతపరమైన, సాంస్కృతిక పరమైన విషయాల్లో స్పష్టమైన అవగాహన కలిగి ఉండి ఆ విభాగాల్లో పని చేసే సామర్థ్యం ఉండాలని చెప్పారు. సొంత లాప్ టాప్,  మొబైల్ ఫోను కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనం ఉండాలని, జిల్లాలో విస్తృతంగా పర్యటించుటకు ఆసక్తి కలిగి ఉండాలని చెప్పారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, డ్రాప్టింగ్, రైటింగ్ స్కిల్స్ తో పాటు మహిళా, శిశు అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. తెలుగు, ఇంగ్లీష్ లో ఫ్లూయెన్సీ ఉండాలని, కంప్యూటర్ విభాగంలో ఎమ్మెస్ ఆఫీస్ లో పనిచేసే సామర్ధ్యం ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్ట్ కు ఈ నెల 6 నుండి 8వ  తేదీ వరకు దరఖాస్తులను సమర్పించాలని ఆయన చెప్పారు. గడువు దాటిన తరవాత అందిన దరఖాస్తులు పరిగణనలోకి తీసుకోవడం జరగదని ఆయన స్పష్టం చేశారు. దరఖాస్తులను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గల జి.ఎస్.డబ్ల్యు.ఎస్ సమన్వయ అధికారి విభాగంలో 8వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా అందజేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 12వ తేదీన మౌఖిక పరీక్ష నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. పోస్టు భర్తీ ప్రక్రియను మార్పులు చేర్పులు చేయుటకు గాని, వాయిదా వేయుటకు గాని, ఎటువంటి సమాచారం లేకుండా భర్తీ ప్రక్రియను పూర్తిగా నిలుపుదల చేయుటకు గాని నియామక చైర్మన్ లేదా అధికారికి పూర్తి హక్కులు ఉన్నాయని ఆయన వివరించారు.

Parvathipuram

2022-07-05 11:10:40

రీసర్వే పనులు వేగవంతం చేయాలి

జగనన్న భూ హక్కు భూ రక్ష కార్యక్రమంలో భాగంగా జిల్లాలో చేపడుతున్న రీ సర్వే వేగవంతం చేసి పూర్తి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టరు డా.కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టరు కృతికా శుక్లా.. జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియ, రెవెన్యూ, సర్వే శాఖల అధికారులతో కలిసి సర్వే పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో జరుగుతున్న సర్వే పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. కాకినాడ డివిజన్ కి సంబంధించి డ్రోన్ సర్వే పనులు జూలై నెల చివరి నాటికి, పెద్దాపురం డివిజన్ కి సంబంధించి అక్టోబర్ నెల చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. రీ సర్వే నిర్వహణలో సరిహద్దులు గుర్తింపులో ఎటువంటి గందరగోళానికి చోటివ్వకుండా స్పష్టంగా రీ సర్వే పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సమావేశంలో సర్వే ఎడీ బి.లక్షీనారాయణ, కాకినాడ, పెద్దాపురం ఆర్డీవోలు బీవీ.రమణ, జే.సీతారామరావు, పెద్దాపురం డీఐఓఎస్ ఎం.జ్యోషిల ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-07-05 11:04:59