1 ENS Live Breaking News

విశాఖ మన్యంలో 5వేల కేసులకు చేరువలో కరోనా...

విశాఖమన్యం కరోనా పాజిటివ్ కేసుల విషయంలో మైదాన ప్రాంతాలతో పోటి పడుతుంది. ఐదువేల కేసులకు చేరువలో ఏజెన్సీలోని 11 మండలాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలోఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆదివారం నాటికి 4688 పాజిటివ్ కేసులు నమోదు కాగా,య ఇందులో 328 మాత్రమే కోలుకున్నారు. కోవిడ్ కేంద్రంలో 685 మంది చికిత్సలు పొందుతున్నారు. నిత్యం ఏదో చోట కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉన్నా, కరోనా మాత్రం గిరిపుత్రులను వెంటాడుతూనే వుంది. మరోవైపు మారుమూల గిరిజన గ్రామాల ప్రజలకు ఈ కరోనా వైరస్ ప్రభావంపై అవగాహన కల్పించాల్సిన అవరముందని వక్తలు అభిప్రాయ పడుతున్నారు. వారిలో అవగాహన తీసుకువస్తే తప్పా, ఏజెన్సీ గ్రామాల్లో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడేటట్టు కనిపించడంలేదు...

Paderu

2020-08-23 21:15:33

సెల్ సిగ్నల్ పడక కొండలు ఎక్కుతున్నాం దొరా...

విశాఖ ఏజెన్సీలోని పెదబయలు మండలంలో సెల్ సిగ్నల్ లేక కొండలు,  గుట్ట లపైకి వెళ్లాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య విశాఖపట్నం జిల్లా సహాయ కార్యదర్శి కూడా రాధక్రిష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బొంగరం, లిగేంటి, గోమంగి, గుల్లేలు, పోయి పల్లి, పంచాయతీలలో సెల్ టవర్ , సెల్ సిగ్నల్ లేక, పది పదిహేను కిలోమీటర్లు దూరం  ఈ కేవైసీ చేసుకోవడానికి  డ్వాక్రా మహిళలు  పడరాని పాట్లు పడుతున్నారని అన్నారు. వారి సమస్యలపై తక్షణమే అధికారులు స్పందించి సెల్ సిగ్నల్ మెరుగు పరచడం కానీ, ఏపీ ఫైబర్ నెట్ సెంటర్లు ఏర్పాటుగానీ చేయాలన్నారు.  డ్వాక్రా మహిళలు  కొద్దిమందికి, లిస్టులో పేర్లు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని దానిపై అధికారులు స్పష్టత ఇవ్వాలన్నారు. ఆదివాసుల కష్టాల పై అధికారులు ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 

Pedabayalu

2020-08-23 15:03:05

అధికార మధం పనిచేయలేదు..సహచట్టం ఆధారాల ముందు

సమాచారహక్కుచట్టం కార్యకర్త చొరవతో ప్రభుత్వం ద్వారా 84 పేద కుటుంబాలకు ఇళ్లస్థలాలు దక్కాయి.. ప్రభుత్వం పార్టీ నాయకులు తన్నీరు రాజారావుకి చుట్టమేమీ కాదని ఈవిషయంలో మరోసారి రుజువైంది. యస్.రాయవరం గ్రామంలో గుండ్రుబిల్లీ దగ్గర 3 ఎకరాలు ప్రభుత్వ భూమిని అధికారం అడ్డుపెట్టుకొని బొలిశెట్టి గోవిందరావు అండదంటలతో  తమ సొంత స్థలం లాగా గేట్లు వేసి మరీ సాగు చేసుకుంటున్నారు. ఈవిషయంపై స్థానికులు అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా, అవతలి వ్యక్తులను బెదిరించి మరీ సాగుచేసుకునేవారు. ఆ విషయాన్ని సమాచారహక్కుచట్టం కార్యకర్త సోమిరెడ్డి రాజు ప్రభుత్వం ద్రుష్టికి ఆధారాలతో సహా తీసుకెళ్లడంతో వాస్తవాలు తెలుసుకున్న రెవిన్యూ అధికారులు అనధికారికంగా వేసిన గేట్లను తొలగించి, ఆ భూమిని 84 కుటుంబాల పేదలకు ప్లాట్లు వేసి రిజిస్టర్ చేసింది. గ్రామంలో ఒక వ్యక్తిద్వారా జరిగిన మంచిపని ద్వారా అధికారపార్టీ నేతల భూ ఆక్రమణ వ్యవహారం బయటకు రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Yalamanchilli

2020-08-23 14:30:09

రోడ్డుకోసం ఆదివాసీ గిరిజనుల వినూత్న నిరసన..

రోలుగుంట మండలం పనసలపాడు గిరిజనులు తమ గ్రామానికి రహదారి నిర్మిం చాలంటూ రోడ్డుపై మొక్కలు నాటుతూ వినూత్న నిరసన చేపట్టారు. శనివారం 15 కుటుంబాలకు చెందిన గిరిజ నులు తమ గోడు వెల్లబోసుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టారు. పనసలపాడు నుండి రత్నం పేట పంచాయతీ కేంద్రానికి వెళ్లాలం టే బురదతో కూడిన ఇరుకు రోడ్డు చాలా దారుణంగా ఉంటుంది. కనీసం 108 వెళ్లే పరిస్థితి లేకపోవడంతో.. అనారోగ్యం వస్తే డోలు తో రోగులను రోడ్డు ప్రాంతానికి మోసుకొస్తున్నామని ఆవేదన వ్య క్తం చేశారు గ్రామస్తులు. రోడ్డు వేయడానికి ఉపాది పనుల క్రింద రూ. లక్ష విడుదల చేసినా ఆ రోడ్డు మాజీ సర్పంచ్ తన జిరాయితీ భూమిలో ఉందని పనులను అడ్డుకున్నారని చెబుతున్నారు. ఈ విషయమై ఆర్డీఓకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్న గ్రామస్తులు గత్యంతరం లేక వివిధ రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నామని కెవిపిఎస్ జిల్లాకార్యదర్శి చిరంజీవి చెబుతు న్నారు. తమ గ్రామానికి రోడ్డు వేసే వరకూ వివిధ రూపాల్లో ఆందోళన తప్పదని చెబుతున్నారు. కార్యక్రమంలో సిపిఎం జి కార్యవర్గ సభ్యుడు ఆదివాసీ నాయకులు చంద్ర రావు గ్రామ మహిళలు పాల్గొన్నారు.

Ratnampeta

2020-08-22 15:37:24

వరదల సమాచారం కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్...

విశాఖజిల్లాలో అధిక వర్షాల నేపథ్యంలో ఎటువంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా తెలియజేసేందకు ప్రత్యేక కంట్రోల్  రూం ఏర్పాటు చేసినట్టు  కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలియజేశారు. పది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తాండవ నీటిమట్టం గరిష్టస్థాయికి చేరుకోవడంతో ఆయన గురువారం నర్సీపట్నం సబ్ కలెక్టర్ మౌర్యతో కలిసి ప్రాజెక్టు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, వరదల నేపథ్యంలో ఇన్ఫ్లో కొనసాగుతోందన్నారు. దీని గరిష్ట నీటిమట్టం 380 అడుగులు కాగా, ప్రస్తుతం  379.1 అడుగులకు చేరిందన్నారు. దీనివల్ల అవసరాన్ని బట్టి నీటిని విడుదల చేయడం జరుగుతుందని, దానికి సంబంధించి కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్టు వివరించారు. దీంతో పాటు నీటిని విడుదల చేసే సమయంలో ప్రజలను అప్రమత్తం చేసే విధంగా అధికారులను ఆదేశించామన్నారు. 

Tandava

2020-08-20 20:46:19

ఆ గ్రామాల్లో తారురోడ్డు వేస్తాం.ఐటిడిఏ పీఓ..

పాడేరు మండలంలోని గుత్తులపుట్టు పంచాయతీ పరిధిలోని కోడాపల్లి కుముడుపల్లి రహదారిని పూర్తిగా తారురోడ్డుగా మారుస్తామని ఐటిడిఏ పీఓ డా.వెంకటేశ్వర్ సలిజామల ప్రకటించారు.  "అధ్వాన్నంగా  కోడాపల్లి ,కుముడుపల్లి, గోమంగి రహదారి " బుధవారం మీడియాలో  ప్రచురితమైన వార్తపై స్పందించిన ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి డా.వెంకటేశ్వర్  క్లిప్పింగ్లను పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులకు పంపించి తగిన మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు పన్నెండు గంటల వ్యవధిలోనే రూ.2లక్షలతో మరమ్మతులు చేసి  రవాణాకు అనుకూలంగా తీర్చి దిద్ది  రవాణాకు అనువుగా రోడ్డును అభివృద్ధి చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఎవరూ ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని పిఓ చెప్పారు. పనుల పురోగతి, తాజా పరిస్థితి తెలియజేయాలని ఆదేశించడంతో మరమ్మత్తు పనులను ఈఈ  కుసుమభాస్కర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

Paderu

2020-08-20 12:51:02

23న మరో బంగాళాఖతంలో మరో అల్పపీడనం..

బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి ఒడిసా ఉత్తర ప్రాంతం వద్ద కేంద్రీకృతమైందని వాతారవరణ శాఖ తెలియజేసింది. ఇది రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్న వాతావరణశాఖ  వాయువ్య బంగాళాఖాతంలో ఈనెల 23న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. వీటి కారణంగా గురు, శుక్రవారాల్లోనూ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, విశాఖ నుంచి ప్రకాశం జిల్లా వరకు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్రోంలో ఆటుపోట్లు అధికంగా వుంటాయని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లకూడాదని కూడా హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రభుత్వం ముందస్తుగా అన్ని కలెక్టరేట్లు, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటుచేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది...

Amaravati

2020-08-20 12:35:32

విశాఖమన్యంలో 528కి చేరి కరోనా పాజిటివ్ కేసులు

విశాఖ మన్యంలో కరోనా సోమవారం కొత్తగా 23 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. కె లీలాప్రసాద్ చెప్పారు. దీంతో మొత్తంగా కరోనా పాజిటివ్ ల సంఖ్య 528 కి చేరిందన్నారు. కాగా 258 మంది డిశ్చార్జ్ అయ్యారని వివరించారు. గెన్నెల పిహెచ్సీ పరిదిలో 7, కిలగాడ పీహెచ్సీలో1, హుకుంపేటలో 2, మినుమూలు పీహెచ్సీలో 2, లోతుగెడ్డ పీహెచ్సీలో 5, ఆర్వీనగర్ పీహెచ్సీలో 6 కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసు ఉద్రుతి ఏజెన్సీ ప్రాంతలోనూ అధికంగా వున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర సమయాల్లో తప్పా బయటకు రాకూడదన్నారు. మాస్కులు విధిగా ధరించాలని, సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలన్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే తక్షణమే దగ్గర్లోని పీహెచ్సీలోని ఆరోగ్య సిబ్బందికి, లేదా గ్రామసచివాలయాల్లోని వాలంటీర్లకు తెలియజేసి పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.

Paderu

2020-08-17 20:10:44

జర్నలిస్టులను కరోనా వారియర్స్ గా గుర్తించాలి

జర్నలిస్టులు కరోనా సమయంలో ప్రభుత్వం నిర్ధేశించిన జాగ్రత్తలు పాటిస్తూ తమవిధులు నిర్వహించాలని గొలుగొండ తహశీల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ డేవిడ్రాజు, ఎస్.నారాయణరావులు సూచించారు. సోమవారం ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవాన్ని గొలుగొండ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.  గొలుగొండ. క్రిష్ణదేవిపేట ప్రాంతాలకు చెందిన విలేకరులు ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ , ఎంపీడీవో, ఎస్ఐలు ఆవిర్భావ దినోత్సవానికి గుర్తుగా  మొక్కలు నాటారు.  ఈ కార్యక్రమంలో  ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సింగంపల్లి చిన్నయ్యనాయుడు మాట్లాడుతూ, జర్నలిస్టులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వారియర్స్ గా గుర్తించాలన్నారు. ఎవరైనా కరోనా వైరస్ తో మ్రుతి చెందితే తక్షణమే రూ.50 లక్షల భీమా వర్తింపచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు .పి సత్యనారాయణలు ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు.ఎస్ నానాజీ,  జిల్లా కార్యవర్గ సభ్యుడు జె.నరసింహమూర్తీ , ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యుడు ఆర్ .బాబులు  తదితరులు పాల్గొన్నారు.

Golugonda

2020-08-17 18:06:22

ఏజెన్సీలో నిర్విరామ వర్షం-స్థంభించిన జనజీవనం

విశాఖ ఏజన్సీలో గద వారం రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. కనీసం ఒక్క గంటపాటు కూడా విరామంలేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.  కరోనా వైరస్‌ ‌ప్రభావంతో నిర్మానుష్యంగా మారిన బహిరంగప్రదేశాలు ఇప్పుడు ఎడతెరిపిలేని వర్షాలతో మరింత బోసిపోయి కనబడుతున్నాయి. తుఫాన్‌ ‌ప్రభావంతో గతమూడు రోజులుగా వర్షాలు మరింత ఎక్కువయ్యాయి. రోజుకు సుమారు 11సెంమీ.. నుండి 12సెంమీల వరకూ వర్షం నమోదు అవుతుంది. ఈ వర్షాల ప్రభావతో వ్యాపారాలు లేక వ్యాపారులు విచారం వ్యక్తం చేస్తుండగా, వ్యవసాయ పనులు కూడా సక్రమంగా సాగడంలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని రేవడివీధి గ్రామానికి నిర్మించిన గ్రావెల్‌రోడ్డు పూర్తిగా దమ్ముపట్టిన పొలంగా మారిపోగా, మంప-కించవానిపాలెం మద్య నిర్మాణంలో ఉన్న వంతెన రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఆదివారమైతే కించవానిలెం కాలువ నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో ప్రజలు రేవళ్ల మీదుగా మండలకేంద్రానికి చేరుకంుటున్నారు. కాలువలు పొంగిప్రవహిస్తున్నాయి. యు.చీడిపాలెం పంచాయితీ పలకజీడి మార్యంలోని బండిగెడ్డవద్ద రోడ్డుపైనుండి కాలువ ప్రవహించడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. విద్యుత్‌ ‌సరఫరాలో కూడా అంతరాయం ఏర్పడి వినియోగదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. 

koyyuru

2020-08-16 20:01:12

కరోనా మాగ్రామం విడిచిపో అంటూ గ్రామదేవతకి పూజలు

’కరోనా మహమ్మారి..మా గ్రామం నుంచి విడిచిపోమరి’ అని వేడుకొంటూ ఆదివారం మండలంలోని శరభన్నపాలెం గ్రామస్థులు గ్రామదేవతకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. గ్రామంలో ఇటీవల వరసగా కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదవుతుండటంతో ఆందోళనకు గురైన గ్రామస్థులు, ఊరిపొలిమేరవద్ద ఉన్న గ్రామదేవతకు పసుపునీటిని వారధిగాపోసి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కరోనా వైరస్ గిరిజన గ్రామాల్లో ప్రబలడం వలన, తెలిసీ తెలియని వారు ఈ రోగం భారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైరస్‌ను గ్రామం నుంచి పారద్రోలి,మరలా రాకుండా నిరోధించాలని గ్రామదేవతను వేడుకొన్నారు. అంతేకాకుండా తమ గిరిజన గ్రామాలపై ఇటు ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకొని ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని శరభన్నపాలెం గ్రామస్తులు కోరుతున్నారు. కార్యక్రమంలో పెద్దలు దారకొండ నారాయణమూర్తి, ఎన్‌.‌జానకిరావు, పండాసత్తిబాబు, సాతాసత్యనారాయణ, ఎస్‌.‌జోగిరాజు, ఎల్‌.‌శివప్రసాద్‌, ఎల్‌విఎస్‌గాంధీ, ఎన్‌.‌చంద్రశేఖర్‌, ‌బి.శ్రీధర్‌ అలాగే అల్లూరియూత్‌సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Koyyuru

2020-08-16 19:15:00

కిముడు పల్లి గేదెగెడ్డ ఉద్రుతితో దిన దిన గండమే

విశాఖ ఏజెన్సీలో గెడ్డ పాయలకు వంతెనలు లేకపోవడంతో భారీ వర్షాల సమయంలో అనే గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. పాడేరు ఐటిడిఏ పరిధిలోని పెదబయలు మండలం కిముడుపల్లి గ్రామ పంచాయతీ  గేదెగెడ్డ వద్ద ఇలాంటి పరిస్థితే నెలకొంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు రావడంతో గేదెగెడ్డ నీరు పూర్తిగా రోడ్డుపైకి వచ్చేస్తుంది. కారణంగా రాకపోకలు చేసేవారంతా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వరద ఉద్రుతికి ఎక్కడ కొట్టుకుపోతామనే భయంతో గెడ్డకు ఇవతల ఒడ్డునే ఉండిపోతున్నారు.  ఈ ప్రాంతంలో వంతెన దగ్గర వర్షపు నీరు అధికంగా వస్తే సుమారు 20 గ్రామాలకు పైనే రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయ్. ఇప్పటికైనా అధికారులు ఇలాంటి ప్రాంతాల్లో వంతెనలు నిర్మించాలని గిరిజనులు ముక్త కంఠంతో కోరుతున్నారు.

pedabayalu

2020-08-16 13:00:48

మీసేవ ద్వారా మంచి సేవలు అందించాలి..సోమిరెడ్డిరాజు

మీసేవ, ఇంటర్నెట్ సెంటర్ ద్వారా గ్రామ ప్రజలకు మంచి సేవలు అందించాలని సామాజిక కార్యకర్త సోమిరెడ్డి రాజు ఆకాంక్షించారు. యస్.రాయవరం గ్రామంలో పంచాయితీ పక్కన ఉన్న మీసేవ(నెట్ సెంటర్) ని గురజాడ సెంటర్, రాము టిఫిన్ షాప్ ఎదురుగా మార్చారు. నూతన నెట్ సెంటర్ ని రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం అన్ని కార్యకలాపాలు నెట్ లేనిదే జరగడం లేదన్నారు. అలాంటి సమయంలో ప్రజలకు సత్వర సేవలు అందించడం ద్వారా వారికి సహాయం చేసినట్టు వుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో  కందుల నాగేశ్వరావు, అధికంశెట్టి జగన్నాధరావు, బత్తుల వాసు, దండు గణపతిరాజు, దుబాసి రమేష్,  గాలి దివానం , మురుకుర్తి గణేష్, సిలపరశెట్టి క్రిష్ణ, తాడేల సంతోష్, తదితరులు పాల్టొన్నారు.

Yalamanchilli

2020-08-16 12:01:57

గ్రామాల అభివ్రుద్ధికి ప్రతీఒక్కరూ సహకరించాలి..

గ్రామాల సర్వతోఖాభివ్రుద్ధి సాధించాలంటే ప్రతీ ఒక్కరూ తనువంతుగా సహకారం అందంచాలని ఎంపిడిఓ ఎం.అరుణశ్రీ అన్నారు.  శనివారం మండలం కేంద్రం మాకవరపాలెం సచివాలయంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవవేడులు ఘనగా నిర్వహించారు.  వైఎస్సార్సీపీ నాయకులు రుత్తల శ్రీనివాసు, రుత్తల సర్వం అధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సచివాలయ ప్రత్యేకాధికారి ఎంపిడిఓ అరుణశ్రీ తహశీల్ధార్‌ ‌రాణిఅమ్మాజీ ముఖ్యఅతిధిలుగా పాల్గోన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసి జాతీయ జెండాను ఎంపిడిఎ అరుణశ్రీ అవిష్కరించారు. ఈసందర్భంగా అమె మాట్లాడుతూ, ఎందరో మహాను భావుల త్యాగఫలితమే మనం అనుభవిస్తున్న స్వాతంత్య్ర ఫలాలనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు.  రెవిన్యూ కార్యాలయంలో తహశీల్థార్‌ ‌రాణి అమ్మాజీ మండల పరిషత్‌లో ఎంపిడిఓ అరుణశ్రీ పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అయా అధికారులు త్రివర్ణపతకాలు ఎగురవేసారు. మాకవరపాలెం కార్యక్రమంలో డి.టి.చైనులు గ్రామరెవిన్యూ అధికారి కన్నయ్య పంచాయితీ కార్యదర్శి ఎల్‌.‌శివరామ్‌ ‌సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Makavarapalem

2020-08-15 20:33:05

త్యాగధనుల స్పూర్తితో డివిజన్ అభివ్రుద్ధి..సబ్ కలెక్టర్

నర్సీపట్నంలో వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం వేడుకగా జరిగాయి. సబ్‌కలెక్టర్‌ ‌కార్యాలయంలో సబ్‌కలెక్టర్‌ ‌నూతనంగా బాధ్యతలు చేపట్టిన నారపురెడ్డి మౌర్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్‌ ‌మౌర్య మాట్లాడుతూ, ఈ వేడుకులకు హాజరైన అదంరికీ 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మొదటిసారిగా నర్సీపట్నంలో జాతీయ పతాకాన్ని ఎగురవేయడం చాలా ఆనందంగా వుందన్నారు. మనమందరం స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో నర్సీపట్నం డివిజన్‌ను మరింతగా అభివృద్ధి చేయడానికి కరిషి చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. నాడు దేశం కోసం పోరాడిన త్యాగధనుల సేవలను కొనియాడారు. స్వాతంత్య్ర ఫలాలను భావితరాలకు అందించిన వారిని ప్రతిఒక్కరూ గుర్తించుకోవాలని సూచించారు. అనంతరం జాతీయ గీతాలాపన కార్యక్రమం జరిగింది.

Narsipatnam

2020-08-15 20:04:22