ఈరోజు-ఈఎన్ఎస్ చెప్పిందే నిజమైంది.. సచివాలయ ఉద్యోగుల బదలాయింపు షురూ..!


Ens Balu
55
visakhapatnam
2025-08-19 19:01:49

ఈరోజు-ఈఎన్ఎస్ గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగుల విషయంలో ఏం రాసినా దానిని కూటమి ప్రభుత్వం నిజం చేసి పారేస్తున్నది. దానికి అనుంబంధంగా ప్రత్యేకంగా జీఓలను కూడా జారీ చేస్తున్నది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను భారీగా ఖాళీలు అయిపోతున్న ఇతర శాఖలకు బదలాయిస్తారని ఈరోజు-ఈఎన్ఎస్ రాసిన వార్త నేడు  కూటమి ప్రభుత్వం నిజం చేస్తూ.. జీఓఆర్టీ నెంబరు 12 జారీ చేసింది.  చెప్పినట్టుగా సచివాలయ ఉద్యోగుల బదలాయింపు బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ కూటమిప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పనీ పాట లేదు.. ఏది నోటికొస్తే అది రాసేస్తున్న ఈరోజు-ఈఎన్ఎస్ అని కూసిన నోళ్లన్నింటికి ఇపుడు ప్రభుత్వం జారీ చేసిన జీఓ ద్వారానే సమాధానం చెప్పినట్టు అయ్యింది. 2019లో గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటు అయిన దగ్గర నుంచి గత ప్రభుత్వ, చర్యలు, ఆ తరువాత కూటమి ప్రభుత్వ చర్యలపై లోతుగా పరిశోధించి మరీ వరసు కథనాలు ప్రచురించింది ఈరోజు-ఈఎన్ఎస్. ఇప్పటి వరకూ ఒక్క వార్త విషయంలో అక్షరం కూడా ఒమ్ము కాకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనూ.. నేడు కూటమి ప్రభుత్వంలో అన్నీ నిజమవుతూనే వచ్చాయి. దీనిని బట్టి ఈరోజు-ఈఎన్ఎస్ వార్తలకు ఎంతటి శచ్చీలత ఉందో మేము చెప్పడం కాదు ప్రభుత్వాలే జీఓలు జారీ చేసి మరీ నిజం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏ మీడియా రాయనన్ని కథనాలు ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖ విషయంలో ఈరోజు-ఈఎన్ఎస్ మాత్రమే రాసిందంటే అతిశయోక్తి కాదేమో..!

తాడిని తన్నినోడు ఒకడైతే.. వాడి తల తన్నినోడు ఇంకోడనే సామెత సరిగ్రా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. నేటి కూటమి ప్రభుత్వం చేస్తున్న చర్యలతో సరిగ్గా సరిపోతుంది.. ఏ సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్, జాబ్ క్యాడర్ ఇవ్వకుండా ఎలాగైతే గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను నియమించిందో.. దానికి మించి కూటమి ప్రభుత్వం ఉన్న ఉద్యోగులను వివిధ శాఖలకు బదలాయింపు చేసుకోవచ్చునని  చక చకా ఉత్తర్వులు జారీ చేసేసింది. పేరుకి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులే అయినా ప్రభుత్వం ఇపుడు జారీ చేసిన జీఓఆర్టీ నెంబరు 12 ఆధారంగా డిఎస్సీ చైర్మన్ గా జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వంలో భారీగా ఖాళీలు ఏర్పడిన ప్రభుత్వ శాఖల్లోకి వీరిని బదలాయించ వచ్చు. అంతే శాఖ ఒకటి.. విధులు మరో శాఖలో అన్నమాట.  రాజ్యాంగ బద్ధంగా కల్పించాల్సిన చట్టబద్దత విషయంలో ఎలాంటి జోళికి వెళ్లని కూటమి ప్రభుత్వం.. వేల సంఖ్యలో రిటైర్ అవుతున్న వివిధ శాఖల ఉద్యోగుల ఖాళీల్లో సచివాలయ ఉద్యోగులతో పనిచేయించడానికి మాత్రం ప్రత్యేకంగా జీవోలు జారీ చేస్తున్నది.

రాజు తలచుకుంటే డబ్బులకు, దెబ్బలకు కొదవలేదన్నట్టుగా.. తలా తోకలేక ప్రభుత్వశాఖ ఉద్యోగులుగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంటే భిన్నంగా.. కూటమి ప్రభుత్వం వినియోగించుకోవాలని చూస్తున్నది. దానికోసం పదోన్నతులు అనే పదాన్ని ముందు చేర్చి.. ఆ తరువాత డిప్యూటేషన్లు, అదనపు విధులు పేరట ప్రత్యేక జీఓ జారీ  సచివాలయ ఉద్యోగులను బదలాయించ నుంది. మొన్నటి వరకూ రేషనలైజేషన్, క్లస్టరైజేషన్ పేర్లు వల్లె వేసిన ప్రభుత్వం ఇపుడు ప్రమోషన్ల పేరుతో ఇపుడు ఉన్న సచివాలయ ఉద్యోగులను వారి మాత్రు శాఖలకు అనుగుణంగా బదలాయింపులు చేయడానికి సిద్దమై జీఓ జారీ చేసింది. అన్ని ప్రభుత్వశాఖల కోసం ఈ జీఓలో ప్రస్తావించిన కూటమి ప్రభుత్వం ఎక్కడా మహిళా పోలీసులను ఏం చేస్తుందనే విషయాన్ని మాత్రం ఎక్కడ ఉటంకించలేదు. కారణం వీరి నియామకాల విషయంలో కోర్టులో కేసులు నడుస్తుండటమే. అయినా.. వీరిని సముచిత స్థానాలు కల్పించి.. వారి చదువులు, హోదాకి తగ్గట్టుగా వారిని ప్రత్యేక స్థానాల్లో కూర్చోబెడతామన్న హోం మంత్రి చేసిన ప్రకటనలు, అసెంబ్లీలో సచివాలయ ఉద్యోగుల విషయంలో చేసిన హడావిడి ఏమైపోయిందో హోం మంత్రి ప్రకటించాల్సి వుంది.

రాజ్యాంగ బద్దంగా ఒక ప్రభుత్వశాఖను ఏర్పాటు చేసినపుడు సదరు ఉద్యోగులకు జాబ్ క్యాడర్, సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్, పేస్కేలు వర్తింపజేస్తారు. దాని ప్రకారం సర్వీసులోకి వచ్చిన తరువాత రెండేళ్ల తరువాత ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తారు. కానీ విచిత్రంగా ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖ విషయంలో అవేమీ లేకుండా ఆరేళ్లు సర్వీసు చేయించాయి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం, నేటి కూటమి ప్రభుత్వం. విధుల్లోకి చేరిన ఉద్యోగుల ప్రొబేషన్ రెగ్యులర్ చేసే సమయంలో రెండు ఇంక్రిమెంట్లు వేస్తారు. కానీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకాలే సెపరేటేమో.. అలాంటివేమీ చేయకుండానే వీరి ఉద్యోగాలను అదనంగా 9నెలలు అంటే రెండేళ్ల 9నెలలు పనిచేయించుకున్నారు. అదీ తొలుత ప్రకటించిన ఆ రూ.15వేలు జీతానికే. తరువాత రెగ్యులర్ చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. అసలు మీ ఉద్యోగాలు రెగ్యులర్ చేయడమే ఎక్కువ అన్నట్టుగా ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్లు కోత విధించేసింది. ఆ తరువాత పేస్కేలు అమలు చేసే సమయంలో హెచ్ఆర్ఏ, డీఏలను పూర్తిగా కుదించేసి.. ఆతరువాత మళ్లీ సరిచేసి వీరికి పేస్కేలు వర్తింపజేసింది.. 

అంటే కుదించిన హెచ్ఆర్ఏ ఆధారంగానే సుమీ.. సవరించిన పాత విధానంతో కాదు. అదే సమయంలో పీఆర్సీని అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులకు అమలు చేసి.. వీరికి మాత్రం ప్రత్యేకంగా పేస్కేలు వరకూ అమలు చేసి.. సాధారణ ప్రభుత్వ ఉద్యోగికి రావాల్సిన అరియర్సుని ఎగ్గొట్టారు. సరిగ్గా ఉద్యోగులకు పదోన్నతలు కల్పించే సమయానికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో మహిళా పోలీసు నియామకాలపై కోర్టులో కేసులు పడ్డాయి. దానితో అసలు మహిళా పోలీసులకు పోలీసుశాఖకు సంబంధమే లేదని హైకోర్టుకి పోలీసుశాఖ లిఖిత పూర్వకంగా రాసిచ్చేసింది. కానీ విధులు మాత్రం అనధికారికంగా పోలీసు స్టేషన్లు, ఎన్నికల విధులు, ఇతర ప్రభుత్వశాఖల్లో సహాయకులుగానేవినియోగించుకుంటున్నది. ఈ లోగా ఉద్యోగులకు ఐదేళ్లు పూర్తయిపోయింది. కొన్ని శాఖల ఉద్యోగులకు నియామకాల సమయంలో పేర్కొన్న ఉత్తుత్తి  ప్రమోషన్ ఛానల్ ఆధారంగా పదోన్నతులు కల్పించాలి.. కానీ అదిగో ఇదిగో అనేసరికి వైఎస్సార్సీ ప్రభుత్వ టైమ్ అయిపోయింది. వీరు మాత్రం అలా గాల్లోనే ఉండిపోయారు.

ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లోనే సచివాలయ ఉద్యోగుల సమస్యలన్నీ తీర్చేస్తాం.. పదోన్నతులు కల్పించేస్తాం.. ఖాళీలు భర్తీచేస్తాం.. జాబా చార్ట్, జ్యాబ్ కేడర్ రూపొందిస్తామంటే ఉద్యోగులు కూడా అంతా నిజమని నమ్మేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు నెలల పాటు అసెంబ్లీలో ఒకటే చర్చలు దానికి ప్రాతినిథ్యం వహించిన హోం మినిస్టర్.. గ్రామ, వార్డు సచివాలయ శాఖకు తలా తోకా లేదని.. కూటమి ప్రభుత్వం అన్నీ సెట్ చేసేస్తుందని ప్రకటించారు. ప్రకటించి సుమారు రెండేళ్లు దగ్గర పడుతున్నా.. వారి విషయం అతీ గతీ లేదు. కారణం గ్రామ, వార్డు సచివాలయశాఖకు గత ప్రభుత్వమే చట్టబద్దత కల్పించడం మానేసింది. ఏ ప్రభుత్వశాఖకైనా చట్టబద్దత కల్పించకపోయినా.. సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకపోయినా.. ప్రభుత్వం కాదు కదా.. సుప్రీం కోర్టులో కేసులు వేసినా అవెందుకూ పనిచేయవు. సరిగ్గా కూటమి ప్రభుత్వానికి అదే కలిసొచ్చింది. అదిగో ప్రమోషన్ ఇదిగో ప్రమోషన్ అంటూ..కాలయమాప చేసి.. ఒక దశలో ఈ శాఖలు పూర్తిగా రద్దు చేసే స్థితికి వచ్చింది.

 అలా చేస్త ప్రజల నుంచి ప్రభుత్వం నుంచి ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించిన ప్రభుత్వం ఈ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసే చర్యలకు పూనుకుంది. అందులో భాగంగానే రేషనలైజేషన్, క్లస్టర్ విధానాలు తెరమీదకు తీసుకొచ్చింది.  అయితే ఈలోగా గత ప్రభుత్వం పెంచేసిన రెండేళ్ల అదనపు జాబ్ సర్వీసు పూర్తయిన ఉద్యోగులు వేల సంఖ్యలో రిటైర్ అయిపోతుంటే కంగారు పడిన ప్రభుత్వం.. సచివాలయ ఉద్యోగులను ఆయా శాఖల్లోకి నేరుగా కాకుండా అదనపు విధుల పేరుతో పంపేయాలని సిద్ద పడింది. దానికోసం డిప్యూటేషన్లు అంటే మళ్లీ వ్యతిరేత వస్తుందని ఆలోచించిన ప్రభుత్వం... ప్రమోషన్ అనే పదాన్ని ముందు చేర్చి.. ఆతరువాత డిప్యూటేషన్, ఓడీ అరేంజ్ మెంట్స్ పేరుతో జీఓ జారీ చేసింది. దాని ప్రకారం డిఎస్సీ కమిటీ చైర్మన్ గా ఉన్న జిల్లా కలెక్టర్లు ప్రస్తుతం ఉన్న సచివాలయ ఉద్యోగులను వారి శాఖల ఆధారంగా మాత్రుశాఖలు, లేదా వాటి అనుబంధ శాఖల్లోకి డిప్యూటేషన్ పై పంపించడానికి చర్యలు మొదలు పెట్టింది. 

అయితే ఇవేమీ తెలియని సచివాలయ ఉద్యోగులు మాత్రం తమకు ప్రమోషన్లు వచ్చేస్తున్నాయనే త్రిశంఖు స్వర్గంలో ఊగిస లాడుతున్నారు. సచివాలయ ఉద్యోగులను ఆయా మాత్రుశాఖలకు బదిలీ చేస్తే అక్కడి రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చే పేస్కేలు, ఇతర ప్రయోజనాలు ఇవ్వాల్సి వుంటుంది. అదీ ప్రభుత్వానికి భారం అనుకున్న కూటమి ప్రభుత్వం..తెలివిగా డిప్యూటేషన్ ఓడీ అరేంజ్ మెంట్స్ పేరుతో జీఓ జారీ ఉద్యోగులను ఇతర శాఖలకు బదలాయించనున్నది. ప్రభుత్వ అవసరాలకోసం ఏ జీఓ అయినా వెంటనే వస్తుంది.. అదే ఉద్యోగుల సమస్యలు, వారికి రాజ్యాంగ బద్దంగా కల్పించాల్సిన ప్రయోజనాల విషయంలో అయితే మాత్రం ఆ ఒక్కటీ అడక్కు.. దానికి చాలా సాంకేతిక కారణాలు అడ్డున్నాయని చెప్పి తప్పించుకుంటున్నట్టుగానే కనిపిస్తున్నది. మాట్లాడితే తమకు పదోన్నతలు ఇచ్చేయండన నానా గోల చేస్తున్న సచివాయల ఉద్యోగ సంఘాలు అసలు.. చట్టబద్దత ఇవన్నీ ఎలా సాధ్యపడయోననే విషయాన్ని ఆలోచించడంలేదు. వారి వెర్రి ఆలోచనలను మాత్రం ప్రభుత్వం చాల చక్కగా క్యాష్ చేసుకుంటూ.. కాలయాపన చేస్తున్నది తప్పి ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల్లా సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్, జాబ్ చార్టు మాత్రం ఏర్పాటు చేయడం లేదు.  చూడాలి ప్రభుత్వం జారీ చేసిన జీఓఆర్టీ నెంబరు 12 ఆధారంగా గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులను ప్రభుత్వం ఏ రీతిలో బదలాయింపు చేపడుతుందనేది...?!