1 ENS Live Breaking News

ఫిట్ ఇండియా యూత్ క్లబ్ తో సంపూర్ణ ఆరోగ్యం..కొప్పల

భారత యువత ఆరోగ్యంగా ఉండేందుకు కేంద్రంలో మోదీ సర్కారు ఫిట్ ఇండియా యూత్ క్లబ్ లను ఏర్పాటు చేయడం హర్షనీయమని బీజేపీ సీనియర్ నాయకులు కొప్పల రామ్ కుమార్ అన్నారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఫిట్ ఇండియా యూత్ క్లబ్ కార్యక్రమం ద్వారా యువత రోజుకు గంటపాటు ఫిట్ నెస్ కార్యక్రమాలు చేపడతారని చెప్పారు. వీటని నిర్వహించేందుకు యువజన సర్వీసులశాఖ, నేషనల్ సర్వీస్ స్కీమ్ ద్వారా 75 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారని, వీరి సంక్ష కోటి వరకూ పెంచి  ఈ కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వం అవగాహన కల్పిస్తుందని చెప్పారు. యువత ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఏర్పాటైనా ఫిట్ ఇండియాని కార్యకర్తలు,  ప్రజల్లో మరింతగా తీసుకువెళ్లాలని కేంద్ర యువజన సర్వీసులు క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజీజూ కోరిన విషయాన్ని రామ్ కుమార్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Visakhapatnam

2020-08-16 10:51:49

బొలిశెట్టి గోవిందరావు అక్రమ ఆస్తులపై విచారణ చేయాలి..సోమిరెడ్డి రాజు

స్వాతంత్య్రం సాధించుకోవడం కోసం నాటి మహనీయులు ఆస్తులు దేశం కోసం వదులుకుంటే.. నేటి మన నాయకులు తాను తన బంధువుల పేరున బినామీగా వందల ఎకరాలు భూములు, కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టుకోవడం మన దుర దుష్టకరమని సమాచార హక్కుచట్టం కార్యకర్త సోమిరెడ్డి రోజు ఆవేన వ్యక్తం చేశారు. ఎస్.రాయవరంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ, మాజీ ఎంపిటిసి మాత్రమే అయిన బొలిశెట్టి గోవిందరావు, తన అత్త, మామ ఇద్దరు బావమరుదులు పేరున భూములు బినామీగా కొని విజయనగరముకు చెందిన భార్య కుటుంబసభ్యుల చేతిలో బందీ అయ్యాడన్నారు. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు తమవద్ద ఉన్నాయన్నారు. అంతేకాకుండా కాకినాడలో తన అక్క పేరున, తన స్నేహితుడు దాసరి దొంగబాబు, లాక్కోజు ఆదిమూర్తి, మరి కొందరి పేరున బినామీగా అక్రమ సంపాదనతో ఆస్తులు కొన్నాడని ఆరోపించారు. విచిత్రంగా ఎస్.రాయవరం గ్రామంలో సెంటు భూమి, ఇళ్ళుకాని లేవు. ఇక్కడ రాజకీయనాయకుని ముసుగులో అక్రమంగా సంపాదించి ఇతర ప్రాంతాలలో కొంటున్నాడని చెప్పారు. ఇవి కాక ఇంకా ఉన్న ఇతర ఆస్తులను ఎవరికైనా తెలిసి ఉంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తమకు తెలియజేయాలన్నారు. వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని కూడా రాజు వివరించారు.

Yalamanchili

2020-08-15 21:29:03

మత్తుమందులకు ప్రతీ ఒక్కరూ దూరంగా ఉండాలి..మంత్రి

మత్తు పదార్ధాలకు ప్రతీ ఒక్కరూ దూరంగా ఉండాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.  స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో భాగంగా  ఆయన జిల్లా కలెక్టర్ , సిపిలతో కలిసి  పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో పతాక ఆవిష్కరణ అనంతరం  మాదక ద్రవ్యాల నిషేధం, మత్తుపదార్థాల బానిసలైన వారికి విముక్తి కలిగించడం పై పోస్టర్లను విడుదల చేశారు.  వ్యసన విముక్త భారత్  ప్రచార కమిటీ (నాష్ ముక్త్ భారత్)  రూపొందించిన పోస్టర్లను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ పరంగా మత్తునుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న కేంద్రాలను పూర్తిస్థాయిలో సద్వినాయోగం చేసుకోవాలన్నారు.   ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ పోలీస్ కమిషనర్ ఆర్.కె. మీనా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ సీతామహాలక్ష్మి, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-08-15 21:19:41

త్యాగధనులను సేవలు మరువరానివి

 74 వ  స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా  సమాచార,  పౌర సంబంధాల శాఖ  కార్యాలయంలో  ఉప సంచాలకులు  వి. మణిరామ్  జెండా ఎగురవేసి  వందనం సమర్పించారు.  ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ  దేశ స్వాతంత్రం కొరకు ఎoతో  మంది నాయకులు, ప్రజలు తమ జీవితాలను త్యాగం చేశారన్నారు. వారి త్యాగాలను  ఎల్లప్పుడు  గుర్తుంచుకోవాలని,  వారిని స్ఫూర్తి గా తీసుకోని దేశ అబివృద్ధి కి కష్టపడి పనిచేయాలన్నారు.   ఈ కార్యక్రమంలో పి. ఆర్. ఒ.  వెంకటరాజ్ గౌడ్, అదనపు పి. ఆర్. ఒ. సాయి బాబా  ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

Visakhapatnam

2020-08-15 21:17:33

లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలి..కలెక్టర్

విశాఖపట్నం  జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు,  తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్   హెచ్చరించారు.   ఈ సందర్భంగా డివిజన్, మండల స్థాయి రెవెన్యూ అధికారులు,సిబ్బంది స్థానికంగా పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని, తగు ముందుస్తు చర్యలు చేపట్టాలన్నారు.  ఇందుకు గాను జిల్లా కలెక్టరేట్ నందు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలలో, తహసిల్దార్ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలియజేశారు. విశాఖపట్నం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 08912590102 ఆర్టీవో విశాఖపట్నం 8790310433 ; ఆర్డిఓ అనకాపల్లి: 8143631525;  8790879433;. సబ్ కలెక్టర్ నర్సీపట్నం : 8247899530; 7675977897; ఆర్ డి ఓ పాడేరు : 08935-250228; 8333817955; 9494670039; 8331821499.ఇదే విధంగా ప్రతి  తహసిల్దారు కార్యాలయాలలోకూడా కంట్రోల్  రూం లు ఏర్పాటు చేయ బడతాయని తెలిపారు.

Visakhapatnam

2020-08-15 21:11:24

కొండారాజీవ్ ని ఆశీర్వదించిన విజయసాయిరెడ్డి

క్రమశిక్షణ,నిబద్ధతో నిజజీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధిని కొండారాజీవ్ గాంధీకి సూచించారు. శనివారం రాజీవ్ జన్మదినం సందర్భంగా ఆయన విజయసాయిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా రాజ్యసభ సభ్యులు ఆశీర్వాదంతోపాటు, జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలన్నారు. అనంతరం మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ, ఎమ్మెల్యేలు అమర్నాధ్, అదీప్ రాజ్ , నగర పార్టీ అధ్యక్షులు వంశి కృష్ణ శ్రీనివాస్, సమన్వయకర్తలు కేకే రాజు, యువజన విభాగం మరియు విద్యార్థి  విభాగం  రాష్ట్ర మరియు నగర కమిటీ  నాయకులు సంయుక్తంగా కొండా రాజీవ్ గాంధీకి జన్మదిన శుభాకంక్షాలు తెలియజేసారు. కార్యక్రమంలో యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-08-15 20:52:30

త్యాగధనుల లక్ష్య సాధనకు క్రుషి చేయాలి...ఉమాకాంత్

భారదేశానికి స్వాతంత్య్రం సిద్ధించడానికి త్యాగధనులు చేసిన త్యాగాలను గుర్తించి వారి ఆశయ సాధనకు ప్రతీఒక్కరూ క్రుషి చేయాలని సాక్షి విశాఖ యూనిట్ బ్యూరో చీఫ్ గరికపాటి ఉమాకాంత్ అన్నారు. శనివారం విశాకలోని సాక్షి యూనిట్ లో నిర్వహించిన 74వ స్వాతంత్ర్య దినోత్సవేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వాతంత్య్ర సమరంలో ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను జాతీకోసం త్రుణప్రాయంగా వదిలాన్నారు. వారిని నిత్యం స్మరిస్తూ, దేశాభివ్రుద్ధికి పాటుపడాలన్నారు. ప్రతీఒక్క జర్నలిస్టు రాష్ట్ర అభివ్రుద్ధిలో కీలక పాత్ర పోషించే విధంగా తమ విధినిర్వహణ చేయాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ విజ్రుంభిస్తున్న వేళ జర్నలిస్టులు సామాజిక దూరం పాటిస్తూనే ముఖ్యమైన వార్తలకు మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో యూనిట్ సిబ్బంది, జర్నలిస్టులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-08-15 20:42:26

కోవిడ్ బాధితులంతా త్వరగా విజేతలవ్వాలి...మంత్రులు

ప్రపంచాన్ని కుదేపేస్తున్న కోవిడ్ మహమ్మారి నుండి కోలుకుని విజయవంతంగా బయటకు వచ్చిన విజేతలకు స్వాతంత్య్ర  దినోత్సవం సందర్భంగా జ్ఞాపికలను బహూకరించారు. జిల్లా యంత్రాంగం తరపున ప్రభుత్వ పురుషుల కళాశాలలో శని వారం నిర్వహించిన 74వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు, జిల్లా కలెక్టర్ జె నివాస్ సమక్షంలో ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వర రావు విజేతలకు జ్ఞాపికలను అందజేసి అభినందించారు. విజేతలలో సామాన్య ప్రజలతోపాటు ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, వైద్యులు, ఉద్యోగులు తదితరులు ఉన్నారు. కోవిడ్ అంటే భయం అవసరం లేదు మనోధైర్యం, ఆత్మ నిబ్బరం ఉంటే చాలు అనే స్పూర్తిని కలిగించిన వృద్ధులు, గర్భిణీ మహిళలు ఉండటం విశేషం. భయపడితేనే చంపుతుందని, ఆత్మస్థైర్యం ఉంటే ఏమి చేయదని నిరూపించారు. కరోనా విజేతలలో జ్ఞాపికలు బహూకరించుటకు వృద్ధులు, గర్భిణీలు, ఉద్యోగులు, వైద్యులు, పోలీసు తదితర రంగాల నుండి కొంత మందిని ఎంపిక చేసారు. 291 మందిని స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనుటకు ఆహ్వానించారు. జ్ఞాపికలు పొందిన వారిలో పాలకొండ శాసనసభ్యులు విశ్వసరాయి కళావతి, డిసిసిబి చైర్మన్ పాలవలస విక్రాంత్, రాజకీయ నాయకులు దువ్వాడ శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి,  కలెక్టర్ కార్యాలయ పారిపాలన అధికారి బి.రాజేశ్వరరావు, పోలీసు అధికారి డి.ఎస్.పి డి.ఎస్.ఆర్.వి.ఎస్.ఎన్.మూర్తి,  ఇన్స్పెక్టర్ హెచ్.మల్లేశ్వరరావుతో సహా పలువురు ప్రజలు జ్ఞాపికలు అందుకోగా గర్భిణీగా చేరి సుఖప్రసవంతో బిడ్డతో సహా సంతోషంగా ఇంటికి చేరిన మెరగాన జ్యోత్స్న, గొట్టిపల్లి అనురాధ ఉండగా, వృద్ధులు కె. అప్పల నరసింహులు, మెండా లచ్చయ్య, పెదపూడి వెంకట్రావు ఉన్నారు. పోలీస్ శాఖలో కాశీబుగ్గ పోలీస్ కానిస్టేబుల్ కే.శేఖర్ రావు, మెళియాపుట్టి పోలీసు కానిస్టేబుల్ ఏ.శ్రీనివాస రావు, ఎచ్చెర్ల డి.ఎ.ఆర్ కానిస్టేబుల్స్ జి.సూర్యనారాయణ, సంపతిరావు అప్పారావు, పి. మాధవరావు, కరిమి గరయ్య,  బూర్జ పోలీసు కానిస్టేబుల్ లుట్టా అప్పారావు, ఇచ్చాపురం పోలీసు కానిస్టేబుల్ బేసి రామారావు, సారవకోట పోలీసు కానిస్టేబుల్ మెట్టా సత్యం, రాజాం పోలీసు కానిస్టేబుల్ పైడి రామకృష్ణ ఉన్నారు. డి.ఆర్.డి.ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.నగేష్, వైద్య ఆరోగ్య శాఖ నుండి డాక్టర్ సునీల్ నాయక్,  డాక్టర్ ఎస్. పద్మావతి, డాక్టర్ కె.కృష్ణ కుమార్, ఎంపిహెచ్ఇఓ కె.ధర్మారావు, పి.హెచ్.ఎన్ వి.భాగ్యవేణి, అంపోలు ఎ.ఎన్.ఎం వై.ప్రభావతి, స్టాఫ్ నర్స్ వై.ఎస్ రామలక్ష్మి, ఆశా కార్యకర్త పద్మ., జిల్లా పరిషత్ కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న ఆమదాలవలస మండలం రామచంద్రాపురం వ్యవసాయ సహాయకులు ఏ.రోహిత్ కుమారా, చింతలపేట డిజిటల్ అసిస్టెంట్ పిట్టా ఈశ్వరరావు, శ్రీకాకుళం మండలం గూడెం విలేజ్ సర్వే సహాయకులు డి.జ్ఞానసాగరిక, అలికాం పంచాయతీ కార్యదర్శి ఎం. శ్యామ సుందర్ రావు, ఎస్.ఎస్.వలస వ్యవసాయ సహాయకులు ఏ.లోకేశ్వరరావు, అంపోలు మహిళా ప్రొటేక్షన్ కార్యదర్శులు ఇప్పిలి సాయి శిల్ప, జల్లా శ్రీదేవి., శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ ఇంజనీర్ ఎస్.వెంకటి, ఉప కార్యనిర్వాహక ఇంజనీరు కె.వి.రమణమూర్తి, జూనియర్ అసిస్టెంట్లు ఎస్. చిద్విలాస్ గుప్తా, లోవ శ్రీనివాస రావు ఉన్నారు. కోవిడ్ మృతదేహాల సేవకులకు గుర్తింపు : కోవిడ్ మృతదేహాల సేవకులుగా గుర్తింపు పొందిన భూసి శ్రీనివాస రావు, మైలపల్లి కృపానంద్ కు కోవిడ్ విజేతల జ్ఞాపికలను అందజేసారు. కోవిడ్ తో మృతి చెందుతున్న వారి దహన సంస్కారాలను నిర్వహించుటకు కుటుంబ సభ్యులు సైతం దూరంగా ఉంటున్న సమయంల శ్రీనివాస రావు, కృపానంద్ బృందం చేస్తున్న సేవలు అపారం. ఈ సేవలకు గుర్తింపుగా జ్ఞాపికలను మంత్రి బహూకరించారు.

Srikakulam

2020-08-15 19:54:04

ప్రధమ స్ధానం పొందిన ఆర్.డబ్ల్యు.ఎస్ శకటం

శ్రీకాకుళం ప్రభుత్వ పరుషుల కళాశాల (ఆర్ట్స్ కళాశాల)లో 74వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వర రావు (నాని) ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ, రవాణా, విద్య, గ్రామీణ నీటి సరఫరా విభాగం, జిల్లా జల యాజమాన్య సంస్ధ, గృహ నిర్మాణ సంస్ధ, డి.ఆర్.డి.ఏ, అటవీ, వ్యవసాయ,  పౌరసరఫరాలు, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్ధ, పంచాయతీరాజ్ శాఖలు తమ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలియజేసే శకటాలను ప్రదర్శించాయి.  ఈ ప్రదర్శనలలో గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్.డబ్ల్యు.ఎస్) ప్రధమ స్ధానం దక్కిం చుకోగా,  పౌరసరఫరాల శాఖ శకటం ద్వితీయ స్ధానాన్ని, ఐటిడిఏ శకటం తృతీయ స్ధానాన్ని, డి.ఆర్.డి.ఏ శకటం కన్సోలేషన్ బహుమతులను గెలుచుకున్నాయి. శకటాలు ప్రదర్శించిన  శాఖలతో పాటు బి.సి కార్పొరేషన్, సామాజిక వన విభాగం, ఉద్యానవన శాఖ, సూక్ష్మ నీటి పారుదల సంస్ధ, పశుసంవర్ధక, మత్స్య, మహిళా శిశు సంక్షేమ శాఖలు తమ ప్రదర్శన శాలలను ఏర్పాటు చేసాయి.  లబ్ధిదారులకు పథకాలను అందజేసిన ఇన్ ఛార్జ్ మంత్రి   :    జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధ్వర్యంలో వై.యస్.ఆర్. క్రాంతి పథం క్రింద జిల్లాలోని 2,322 సంఘాలకు బ్యాంకు లింకేజీ క్రింద 92 కోట్ల   1 లక్షా 31 వేల రూపాయల బ్యాంకర్స్ చెక్ ను జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కొడాలి నాని లబ్ధిదారులకు అందజేసారు. అనంతరం బి.సి.కార్పొరేషన్ ద్వారా సబ్సిడీపై రెండు ట్రాక్టర్లను లబ్ధిదారులకు మంత్రి అందజేసారు. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు :    74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యాశాఖ మరియు జిల్లా పౌర సంబంధాల అధికారి ఆధ్వర్యంలో పలు సాంస్కతిక ప్రదర్శనలు జరిగాయి.  ఈ కార్యక్రమాన్ని ఇన్ ఛార్జ్ మంత్రి ఆధ్యంతం తిలకించగా ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ముఖ్యంగా డా. తిమ్మరాజు నీరజా సుబ్రహ్మణ్యం శిష్య బృందం చేసిన భరత ఖండమే నా దేశం పాటకు చేసిన నృత్యాలు ఆహుతులను అలరించగా, శివ శిష్య బృందం చేసిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ, పరిమళ శిష్య బృందం చేసిన నమో నమో భారతాంబే, డా. నీరజా సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో చేసిన భారత జాతి ముద్దు బిడ్డలం అనే పాటలకు చేసిన నృత్యాలు అందరినీ మంత్రముగ్దులను చేసాయి.

Srikakulam

2020-08-15 19:47:58

త్యాగధనులను సేవలను మరువరాదు..జిల్లా జడ్జి

శ్రీకాకుళం  జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ     జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి రామకృష్ణ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు కృషి చేసారన్నారు. మహాను భావుల త్యాగ ఫలాలు జాతి మొత్తానికి అందుటకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత తరుణంలో కోవిడ్ మహమ్మార వ్యాప్తి బాగా పెరిగిందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. కోవిడ్ భారీన పడిన తల్లిదండ్రుల వద్దకు పిల్లలు వెల్లడం, పిల్లలు వద్దకు తల్లిదండ్రులు వెళ్ళడం వంటి పరిస్ధితి లేకుండా పోయిందని అన్నారు. అయితే ఎటువంటి వివక్ష అవసరం లేదని అప్రమత్తంగా ఉండటమే ప్రధానమని చెప్పారు. కోవిడ్ సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు చక్కగా పనిచేసారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, అందుకు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ప్రాణాయామం, యోగా సాధన చేయడం అవసరమని పేర్కొన్నారు.         ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన డి.ఎం.హెచ్.ఓ కార్యాలయం ఐడిఎస్పి డా.కె.అప్పారావు, ఎం.ఎన్.ఓ ఎం.పురుషోత్తం, హోమ్ గార్డు రమణలను సత్కరించారు. బార్ అసోసియేషన్ కార్యాలయంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.రమేష్ బాబు జెండ్ ఎగుర వేసారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు టి.వెంకటేశ్వర్లు, రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-08-15 19:38:14

ఉన్నత విద్యావంతులు సంఖ్య పెంచుతాం..

ఉన్నత విద్యను అభ్యశించే వారి శాతం 31.25 నుంచి 50 శాతానికి పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ధేశిత లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషిచేస్తామని ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. శనివారం  ఏయూలో స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఎగురవేసారు. అనంతరం మాట్లాడుతూ 2029 నాటికి 50 శాతం జిఇఆర్‌ ‌చేరుకోవడం తమ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌ ‌జగన్‌ ‌మోహన రెడ్డి దీనిని సాధించే దిశగా అవసరమైన జగనన్న విద్యా దివేన, జగనన్న వసతి దీవెన పథకాలను నిర్వహించడం ముదావహమన్నారు. విద్యార్థిని ఆవిష్కర్తగా, పారిశ్రామిక వేత్తగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏపి ఎంటర్‌ప్యూనర్‌ ‌బోర్డ్, అటల్‌ ఇం‌క్యుబేషన్‌ ‌సెంటర్‌లు ఉపకరిస్తాయన్నారు.  మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ ‌కలాం చెప్పినట్టుగా అధ్యాపక వృత్తి ఎంతో ఉతృష్టమైనదన్నారు. వ్యక్తి సామర్ధ్యాలను, నైతిక విలువలను, గుణాలను తీర్చిదిద్ధి భవిష్యత్‌ ‌పౌరులను అందించే శక్తి విద్యకు ఉందన్నారు. మేధో సంపదను, నైతికతను పెంపొందించే కేంద్రాలుగా  విశ్వవిద్యాలయాలు నిలుస్తాయని, ఇవి నిరంతరం తమ ప్రమాణాలు మెరుగుపరచుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. దేశభక్తే దేశాన్ని సమైక్యంగా ఉంచుతోందన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన వారిని గుర్తుచేసుకోవడం, వారి త్యాగాల ఫలితంగా లభించిన స్వాతంత్య్రాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎంతో అవసరమన్నారు. ముందుగా ఏయూ పరిపాలనా భవనం వద్దనున్న మహాత్మగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్‌ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌, అకడమిక్‌ ‌డీన్‌ ఆచార్య కె.వెంకట రావు, ప్రిన్సిపాల్స్, ‌డీన్‌లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Andhra University

2020-08-15 19:27:23

భక్తులలో భగవంతుణ్ణి చూస్తూ సేవచేయాలి...ధ‌ర్మారెడ్డి

శ్రీ‌వారి భక్తులలో భగవంతుణ్ణి దర్శిస్తూ అందించే సేవ నిజ‌మైన భ‌గ‌వ‌త్‌ సేవ అని టిటిడి అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డి ఉద్ఘాటించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం ప్రాంగణంలో శ‌నివారం ఉద‌యం 74వ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న అద‌న‌పు ఈవో జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు.   ఈ సందర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ ప్ర‌పంచం న‌లుమూలల‌ నుండి శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు టిటిడి ఉద్యోగులు సేవ‌కుల‌ని, కావున అంకితభావంతో మ‌రింత మెరుగైన సేవ‌లందించాల‌ని పిలుపునిచ్చారు. భ‌క్తులు శ్రీ‌వారి ద‌ర్శ‌నం, వ‌స‌తి, ప్ర‌సాదాల కొర‌కు ద‌ళారుల బారిన ప‌డ‌కుండ, ద‌ళారుల‌ను నిర్మూలించిన టిటిడిలోని అన్ని విభాగాలు అధికారులు, ఉద్యోగుల‌ను అభినందించారు. ఎస్వీబీసీ ద్వారా భ‌క్తుల‌కు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించే కార్య‌క్ర‌మాలు ప్ర‌సారం చేస్తున్నామని, ఇందులో విసూచి మ‌హా మంత్రం, సుంద‌ర‌కాండ‌, విరాట‌ప‌ర్వం పారాయ‌ణం నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. తిరుమ‌ల నాదనీరాజ‌నం వేదిక‌పై ‌ప్ర‌తిరోజు ఉద‌యం 7.00 నుండి 8.00 గంటల వ‌ర‌కు సుంద‌ర‌కాండ పారాయ‌ణం ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా వీక్షిస్తూ ప్ర‌పంచ వ్యాప్తంగా 7 కోట్ల మంది భ‌క్తులు పాల్గొంటున్న‌ట్లు తెలియ‌జేశారు. ఎస్వీబీసీ ట్ర‌స్టుకు ప్ర‌తి రోజు దాదాపు 100 మందికి పైగా భ‌క్తులు క్యూఆర్ కొడుతూ ఒక రూపాయి నుండి రూ.2 కోట్ల వ‌ర‌కు విరాళాలు అందిస్తున్నార‌న్నారు.   దాత‌ల స‌హాకారంతో తిరుమ‌ల‌ శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తులు స‌మ‌ర్పించిన కానుక‌ల‌ను లెక్కించేందుకు రూ.9 కోట్ల‌తో అత్యాధునిక ప‌ర‌కామ‌ణి భ‌వ‌నానికి భూమి పూజ నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. త్వ‌ర‌లో రూ.30 కోట్లతో తిరుమ‌ల న‌డ‌క దారిలో పై కప్పును నిర్మిస్తామ‌న్నారు. తిరుమల  ఎస్వీ మ్యూజియంను మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా రూపొందించ‌డంలో భాగంగా రూ. 15 కోట్ల‌తో శ్రీ‌వారి ఆలయానికి సంబంధించిన  3 డి ఇమేజింగ్‌ను, శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు, బ్ర‌హ్మోత్స‌వాల‌లో వాహ‌న సేవ‌లు, ప్రాశ‌స్త్యం ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. అదేవిధంగా ‌మ్యూజియం మొద‌టి అంత‌స్తులో శ్రీ‌వారి ఆభరణాలు 3 డి డిజైన్‌తో ఉంచేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వివ‌రించారు.            తిరుమ‌ల‌లోని అన్ని వ‌స‌తి స‌మూదాయాలు, అతిథి గృహాల‌ను అధునీక‌రిస్తున్నామ‌ని, ఇందులో గీజ‌ర్లు, ఇత‌ర స‌దుపాయాలు ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. రెండు ఘాట్ రోడ్ల‌లో మ‌ర‌మ‌త్తు ప‌నులు, ప్ర‌మాదాలు నివారించేందుకు నూత‌న పిట్ట గొడ‌ను నిర్మిస్తున్నామ‌న్నారు.   క‌రోనా స‌మ‌యంలో టిటిడిలోని అన్ని విభాగాల‌ అధికారులు, ఉద్యోగులు అద్భుతంగా ప‌నిచేశార‌ని, తిరుమ‌ల‌కు విచ్చేసే భ‌క్తుల‌కు విశేష‌ సేవ‌లు అందిస్తున్నార‌ని అద‌న‌పు ఈవో ప్ర‌శంసించారు.   ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు  హ‌రీంద్ర‌నాధ్‌,సెల్వం,బాలాజీ, నాగ‌రాజ‌, దా‌మోద‌రం, ఆరోగ్యశాఖాధికారి డా. ఆర్.ఆర్.రెడ్డి, ఎస్టేట్ అధికారి  విజయసారధి, వీఎస్వో  మనోహర్, క్యాటరింగ్ ఆఫీసర్  జీఎల్ఎన్ శాస్త్రీ  ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2020-08-15 19:13:47

మహాత్ముల సేవలు మరువరానివి..గంట్ల

భారత స్వాతంత్య్ర పోరాటంలో ఎంతో మంది మహాత్ములు అందించిన సేవలు మహనీయ మని వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్య క్షులు గంట్ల శ్రీనుబాబు కొనియాడారు..శనివారం విశాఖలోని సీతమ్మధార విజేఫ్  వినోద వేదికలో 74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కార్యవర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించింది. ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ జెండాకు సెల్యూట్ చేసారు. అనంతరం శ్రీనుబాబు  మాట్లాడుతూ, ఎంతోమంది త్యాగమూర్తుల త్యాగ ఫలితం వల్లే భారతీయులందరికి  స్వాతంత్ర్య ఫలాలు సిద్దించాయన్నారు.  వారి పోరాట పటిమ,. ప్రశంసనీయమన్నారు. జర్నలిస్ట్ ల సంరక్షణ  కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచేయాలన్నారు. త్వరలో ఇళ్ల స్థలాలు కేటాయించి ప్రభుత్వం పట్టాలు మంజూరు చేయాలన్నారు. విజేఫ్  కార్యదర్శి ఎస్.దుర్గారావు మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రభుత్వ  నిబంధనలకు అనుగుణంగానే నిర్వహించామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ పాలకవర్గం  పూర్తిస్థాయిలో కృషి చేస్తోందన్న ఆయన భవిష్యత్తులో  సభ్యులు సంక్షేమమే లక్ష్యంగా మ పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఆర్.నాగరాజు పట్నాయక్, జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్, కార్యవర్గ సభ్యులు ఇరోతి  ఈశ్వర్ రావు, వరలక్ష్మి, డేవిడ్  తో పాటు ఎల్లేశ్వరరావు, కిల్లి ప్రకాష్ రావు, పి.నగేష్ బాబు, సునీల్ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-08-15 18:41:08

విశాఖ పోలీస్ బేరక్స్ లోనే పంద్రాగస్టు వేడుక...

విశాఖపట్నం జిల్లాలో 2020 స్వాతంత్ర్య దినోత్సవ  వేడుకలు ఆగస్టు 15,  శనివారం ఉదయం  9గంటలకు  విశాఖపట్నం పోలీస్ బారెక్స్ స్టేడియంలో  జరుగుతాయని  జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్  తెలిపారు. శుక్రవారం నాడు  స్థానిక కలెక్టర్ కార్యాలయంలో  ఆయన  జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి  ముత్తం శెట్టి శ్రీనివాసరావు గౌరవ వందనం స్వీకరించి , జాతీయ పతాకాన్ని  ఆవిష్కరిస్తారని  తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన  అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై  మంత్రి  ప్రసంగిస్తారని  తెలిపారు. కోవిడ్ బారిన పడి కోలుకున్న విజేతలను సన్మానిస్తారని తెలిపారు.  ప్రంటులైన్  వారియర్సు గా  కోవిడ్ పై పోరాడుతున్న వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు, శానిటరీ ఉద్యోగులను  అభినందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరూ  తప్పని సరిగా మాస్క్ ధరించాలని  భౌతిక దూరం పాటించాలని  తెలిపారు. ఈ సమావేశంలో  జాయింట్ కలెక్టర్ ఎం .వేణుగోపాలరెడ్డి,  డి ఆర్ ఓ ఎం .శ్రీదేవి,  ఆర్ డి ఓ పి.కిషోర్, ఇతర  జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2020-08-14 18:27:54

పాలకొండలో పోలీసులకు కోవిడి19 పరీక్షలు..

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో పోలీసులకు ప్రత్యేకంగా కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఇన్ స్పెక్టర్ ఆదాం తెలిపారు. జిల్లా పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ ఆదేశాల మేరకు పాలకొండ జూనియర్ కాలేజ్ లో పోలీసులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. 24 మంది పోలీసులు వారి కుటుంబ సభ్యులుకు కరోనా పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు.  గతంలో ఒక హెడ్ కానిస్టేబుల్ కరోనా వైరస్ సోకందిని, శ్రీకాకుళం జెమ్స్ కు తరలించి వైద్యం అందించామని అన్నారు. కరోనా నుండి కోలుకుని విధులకు హజరయ్యారని తెల్పారు. కోవిడ్ పరీక్షలలో పాజిటివ్ వచ్చినంత మాత్రానా కలత చెందవద్దని, దైర్యంగా ఎదుర్కోవాలని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న నియమాలు పాటించాలని చెప్పారు. ముఖ్యంగా పోలీసు సిబ్బంది మాస్కులు ధరించి, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సానిటైజ్ చేసుకోవాలని పిలుపు నిచ్చారు. సిబ్బంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆరోగ్య ఇబ్బందులు తలెత్తితే సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. 

Srikakulam

2020-08-13 20:21:24