1 ENS Live Breaking News

రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది..సీఎం

రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైయస్సార్ రైతు దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రతి రైతు గుండెలో చెరగని ముద్ర వేసుకున్నారని, రైతులు వ్యవసాయం చేసుకునేందుకు వీలుగా ఉచిత విద్యుత్తు పై తొలి సంతకం చేసిన మహానుభావుడని కొనియాడారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతు పక్షపాతి అని, వారి సంక్షేమానికి పలు పథకాలను ప్రవేశపెట్టారన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా పనిచేస్తున్న భీమసింగి , చోడవరం సుగర్ ఫ్యాక్టరీ లతో పాటు పనిచేయని అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీకు సైతం బకాయిలను ఇచ్చారంటే రైతులంటే ఎంత అభిమానమో అర్థం చేసుకోవచ్చునన్నారు. రాష్ట్రంలో 62 శాతం మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని, రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని బలంగా నమ్మే మనస్తత్వం గల వ్యక్తి అని కొనియాడారు. అర్ బీ కే ల ద్వారా విత్తనాల దగ్గర్నుండి పంట కొనే వరకు పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకొనేవిధంగా రైతులకు భరోసా ,నమ్మకాన్ని కలిగించిన వ్యక్తిగా చరిత్ర లో నిలిచి పోతారన్నారు. జిల్లా ఎం ఎల్ ఏ లు, మరియూ రైతాంగం తరఫున తన ప్రత్యేక ధన్య వాదాలను తెలియ జేసుకొంటున్నానన్నారు. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ జిల్లాలో 739 గ్రామ సచివాలయాలలో 622 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, 5 ఆర్ బి కే హబ్స్ మరియు అనకాపల్లి నందు శాస్త్ర సాంకేతిక సహాయం అందించుటకు జిల్లా వనరుల కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కియోస్క్ ద్వారా రైతులు తమకు కావాల్సిన ఉత్పాదకాలను ఆర్డర్ పై తీసుకోవడం జరుగుతుందన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా 2019 సంవత్సరానికి గాను 3,40,134 మంది రైతులకు 277.50 కోట్లు,2020-21 సం. కు 3,48,388 మంది రైతులకు మొదటి విడతగా 194.4 2కోట్లు లబ్ది చేకూరుతుందన్నారు. వైయస్సార్ రైతు దినోత్సవ వేడుకలలో భాగంగా (1) సమగ్ర ఎరువుల యాజమాన్యం తో సూక్ష్మ పోషకాల లోపాలను నివారిద్దాం, (2) వైయస్సార్ పొలంబడి, (3) వైయస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, (4) పంట సాగు దారు హక్కు పత్రం,(5) సరైన సమయంలో సరైన మోతాదు ఎరువులతో పంటకు బలం,(6) ప్రత్తి పంట వివిధ దశలలో గులాబిరంగు పురుగు ఉధృతి మరియు యాజమాన్యం,(7) వైయస్సార్ రైతు భరోసాలకు సంబంధించిన పోస్టర్లను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆవిష్కరించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలక్టర్ వేణు గోపాల్ రెడ్డి,శాసన సభ్యులు కన్న బాబు రాజు ,కరణం ధర్మశ్రీ, గొల్ల బాబురావు, గుడివాడ అమర్నాథ్ ,అదీప్ రాజు , పెట్ల ఉమా శంకర్ గణేష్ ,డీ సి సి బి చైర్మన్ సుకుమార్ వర్మ, వ్యవసాయ శాఖ జేడీ లీలావతి , పశు సంవర్ధక, ఉద్యాన, పట్టు,మత్స్యశాఖ,ఇరిగేషన్ తదితర శాఖ ల అధికారులు హాజరయ్యారు.

District Collector And Magistrate Office

2020-07-08 22:40:03

అన్నవరం సత్యదేవునికి ఈ హుండీలో మొక్కులు వేయోచ్చు

అన్నవరం శ్రీవీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి ఆలయం లో భక్తుల సౌకర్యార్ధం ఈహుండీలు ఏర్పాటు చేసింది దేవస్థానం. బుధవారం ఈ హుండీల క్యూఆర్ కోడ్ బోర్డులను స్వామివారి పాదాల మండపం వద్ద ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈఓ వేండ్ర త్రినాధరావు మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్ధం వీటిని ఏర్పాటు చేశామన్నారు. అన్నధానం, గో సంరక్షణ, హుండీలకు వేర్వేరు ఈ హుండీలను ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. నేరుగా స్వామివారిని దర్శిం చుకోలేని భక్తులు ఈ హుండీ ద్వారా తమ కానుకలు సమర్పించు కోవచ్చునని చెప్పారు. బక్తులకు తెలియడం కోసం ఏర్పాటు చేసిన భోర్డుల్లో యుపిఐ నెంబరుతోపాటు వాట్సప్ నెంబరు కూడా పొం దుపరి చినట్టు ఆయన వివరించారు. అన్నదానానికి విరాళా లు ఇచ్చే దాతలు కూడా వీటిద్వారా నగదు బదిలీ చేయవచ్చునని అన్నారు. భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా రు.

Annavaram Temple

2020-07-08 14:09:41

ఏపీలో ప్రత్యేక కోవిడ్-19 మొబైల్ పరీక్షా వాహనాలు

కోవిడ్-19ను కట్టడి చేయడం కోసం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముం దంజలో ఉంది. జాతీయస్థాయి సగటుతో పోలిస్తే ప్రతి మిలియన్ టెస్ట్ లలో అత్యధికంగా పరీక్షలు చేస్తున్న రాష్ట్రాల్లో దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం మరో సరికొత్త ఆలోచనతో ముం దుకు వచ్చింది. అవే మొబైల్ నమూనా సేకరణ కేంద్రాలు. ఒక మొబైల్ వాహనంలో 10 కౌంటర్లు ఉంటాయి. ఒకేసారి 10 మంది వారి వివరాలు నమోదు చేసుకోవడంతోపాటు కోవిడ్-19 పరీక్షల నమూనాలు ఇవ్వవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మొబైల్ వాహనాలు ఇప్పటికే 20 ఏర్పాటు చేసింది. ఈ మొబైల్ వాహ నాలు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్ పోర్టులు, రాష్ట్రాల సరిహ ద్ధు ప్రాంతంలోని చెక్ పోస్టుల దగ్గర ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి వచ్చే వారి నుంచి కోవిడ్ నమూనాలను తీసుకుంటున్నారు. ఈ మొబైల్ పరీక్షా వాహనాలు ఒకేసారి 10మందికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకోవడం, పరీక్ష నమూనాలు సేకరించడం ద్వారా అటు ప్రయాణీకుల సమయం ఆదాకావడంతోపాటు సరిహద్దులోనే ప్రజల నుంచి నమూనాలు సేకరించి కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడం ద్వారా వైరస్ వ్యాప్తి జరగకుండా ఉపయోగ పడుతున్నాయి. అంతే కాకుండా ఈ వాహనాలను కంటైన్మెంట్ జోన్లలో కూడా కోవిడ్ నమూనాలు సేకరించేందుకు వినియోగిం చవచ్చు. కంటైన్మెంట్ జోన్ లో నివాసం ఉండే ప్రజలు టెస్టు చేయించుకోవడం కోసం బయటకు రావాల్సిన అవసరం లేకుండా.. మొబైల్ వాహనమే వారి ప్రాంతానికి వెళ్లి నమూనాలు సేకరించవచ్చు. ఈ మొబైల్ వాహనాల ద్వారా సేకరించిన కోవిడ్ నమూనాల ఫలితాలు కూడా అతితక్కువ సమయంలో ఇస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరో 50 మొబైల్ టెస్టింగ్ వెహికిల్స్ ను రాష్ట్రంలో ని వివిధ ప్రాంతాలలో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోం ది. తద్వారా కోవిడ్ వైరస్ వ్యాప్తిని తక్కువ చేయగలమని అం చనా! వేస్తోంది. ఈ మొబైల్ టెస్టింగ్ వాహనం ద్వారా కేవలం పది నిమిషాల్లో ప్రతి కౌంటర్ దగ్గర కోవిడ్ నమూనాలు తీసుకుంటారు. ఆ తర్వాత వారి ఆరోగ్య పరిస్థితి, కోమార్బిడిటీ తదితర లక్షణాల కారణంగా వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లకు పంపడమా లేక హోమ్ క్వారంటైన్ లో ఉండాలా? అన్నది నిర్ణయిస్తారు. ఒకవేళ వారు ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నట్టయితే వారిని ప్రతిరోజూ స్థానికంగా ఉండే ఎఎన్ఎం పర్యవేక్షిస్తూ ఉంటారు. ఒక్కసారి ప్రయాణీకుడి సమాచారాన్ని మొబైల్ వాహనంలో నమోదు చేసుకున్న వెంటనే అవి స్థానిక ఎఎన్ఎంకి చేరుతాయి. దీనిద్వారా సంబంధిత వ్యక్తిపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణకు అవకాశం ఉండండతోపాటు సమర్థవంతమైన నిఘాతోపాటు సమయం వృధా కాకుండా ఉంటుంది. *విజయవాడలో ఈ మొబైల్ టెస్టింగ్ వాహనాల ద్వారా కోవిడ్ నమూనాలు తీసుకునే ప్రాంతాలు:* 1. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం 2. గాంధీ మున్సిపల్ హైస్కూల్, వన్ టౌన్ 3. కృష్ణలంక 4. విజయవాడ రైల్వే స్టేషన్ 5. బసవపున్నయ్య స్టేడియం, అజిత్ సింగ్ నగర్ 6. మేరీమాత టెంపుల్, గుణదల ఉదయం 8 నుంచి 5గంటల వరకు అపాయింట్మెంట్ కోసం కాల్ చేయాల్సిన నంబర్: 9963112781 ఆన్ లైన్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు: https://covid-andhrapradesh.verahealthcare.com/ ప్రభుత్వం ఎన్ని సదుపాయాలు కలిగి చేసిన కూడా మనం జాగ్రత్తగా లేకుం టే వీధిలో ఉన్న కరోనా ని ఇంట్లోకి ఒంట్లోకి ఆహ్వానించినట్లే!!! ======================

Amaravathi

2020-07-08 06:59:32

కేబుల్ ఆపరేటర్లను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి

కేబుల్ ఆపరేటర్లపై పడే పన్నుల భారాలను మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర కేబుల్ ఆపరేటర్స్ గౌరవాధ్యక్షుడు, వైసీపీ నేత గౌతమ్ రెడ్డి కోరారు. అనేక సమస్యలతో సతమతమవుతున్న కేబుల్ ఆపరేటర్లను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నగరంలో రాష్ట్ర కేబుల్ ఆపరేటర్స్ ముఖ్య కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గౌతమ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కేబుల్ ఆపరేటర్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేబుల్ వ్యవస్థలో వినూత్నమైన మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. భద్రత లేని రంగమే కేబుల్ రంగం అని, 50వేల మంది ఆపరేటర్లు ఏపీలోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఏపీ ఫైబర్‌తో కేబుల్ ఆపరేటర్లకు నష్టం లేకుండా చూడాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. 2020 వచ్చినా ఆపరేటర్ల స్థితిగతులు మాత్రం మారలేదన్నారు. కరోనా సమయంలో కేబుల్ ఆపరేటర్లు ప్రాణాలకు తెగించి ఇంటింటికీ సర్వీసు అందిస్తున్నారని అన్నారు. మంత్రుల కమిటీని కలిసి సమస్యలన్నీ వివరించి పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని గౌతమ్ రెడ్డి తెలిపారు

Vijayawada

2020-07-07 23:11:25

బాధ్యులను ఉపేక్షించేది లేదు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

సప్తగిరి మాసపత్రికపై రాజకీయ కుట్రకోణం దాగుందని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ గతంలోనూ సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని, దేవుడిని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ‘‘గతంలో ఆర్టీసీ బస్సుల్లో అన్యమత ప్రచారం, తిరుమల కొండల్లో సిలువ పెట్టారని సోషల్ మీడియాలో టీడీపీ తప్పుడు ప్రచారం చేసింది. దేవుడిని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని ఎవరు చూస్తున్నారో.. వారి ఇంగిత జ్ఞానానికి వదిలి వేస్తున్నాం. మధ్యలో ఎవరైనా కవర్లు మార్చారా? అనేది విచారణలో తేలాల్సి ఉంది. టీటీడీ కార్యాలయంలో అన్యమత పుస్తకాలు ఎందుకు ఉంటాయి? దేవుడిపైనే నింద వేయాలని చూస్తున్నారని’’ ఆయన ధ్వజమెత్తారు. గతంలో ఇలాంటి ప్రయత్నాలు చేసిన వారిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ ఘటనలో ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దీనిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ సమయంలో ప్రజలను కాపాడమని సుందరకాండ, వేద పారాయణం టీటీడీ తరపున చేశామని, భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత కష్ట కాలంలో రాజకీయ దురుద్దేశ్యం తో చేస్తున్న ఆరోపణలు సరికావని వైవీ సుబ్బారెడ్డి ఖండించారు.

Tirumala

2020-07-07 20:23:41

ఏపీలో విద్యార్ధుల కోసం ఉచిత ఎంసెట్ మాక్ పరీక్ష

ఎంసెట్ పరీక్షలో భాగంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆన్‌లైన్‌లో ఉచిత ఎంసెట్ మాక్ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం మాక్‌ టెస్ట్‌ వివరాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ ఈ నెల 19న మాక్‌ టెస్ట్‌ను నిర్వహిస్తుందన్నారు. ఎంసెట్‌ మాదిరిగానే ఈ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. మరుసటి రోజున ఫలితాలు వెల్లడిస్తారన్నారు. ఫలితాలతో పాటు విద్యార్థులు ఏ ఏ అంశాలలో ఎక్కువ కృషి చేయాలో తెలుపుతారన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎంసెట్ మాక్ పరీక్షలో పాల్గొనదలచిన విద్యార్ధులు www.csihyderabad.org/eamcet లేదా www.eamcet.xplore.co.in లలో ఈ నెల 18వ తారీఖు లోగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

Guntur

2020-07-06 23:02:37

ఏపీలో విద్యార్ధుల కోసం ఉచిత ఎంసెట్ మాక్ పరీక్ష

ఎంసెట్ పరీక్షలో భాగంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆన్‌లైన్‌లో ఉచిత ఎంసెట్ మాక్ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం మాక్‌ టెస్ట్‌ వివరాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ ఈ నెల 19న మాక్‌ టెస్ట్‌ను నిర్వహిస్తుందన్నారు. ఎంసెట్‌ మాదిరిగానే ఈ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. మరుసటి రోజున ఫలితాలు వెల్లడిస్తారన్నారు. ఫలితాలతో పాటు విద్యార్థులు ఏ ఏ అంశాలలో ఎక్కువ కృషి చేయాలో తెలుపుతారన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎంసెట్ మాక్ పరీక్షలో పాల్గొనదలచిన విద్యార్ధులు www.csihyderabad.org/eamcet లేదా www.eamcet.xplore.co.in లలో ఈ నెల 18వ తారీఖు లోగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

Guntur

2020-07-06 23:02:31

నెలాఖ‌రు వ‌ర‌కు శ్రీవారి ద‌ర్శ‌న టికెట్ల సంఖ్య పెంచేదిలేదు

 దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నానికి సంబంధించి రోజువారీ భ‌క్తుల సంఖ్య‌ను ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పెంచ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా జూన్ 8వ తేదీ నుంచి శ్రీ‌వారి ద‌ర్శ‌నం తిరిగి ప్రారంభించామ‌ని తెలిపారు. స్వామి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన ఏ ఒక్క భ‌క్తుడికీ క‌రోనా పాజిటివ్ రాలేద‌ని స్ప‌ష్టం చేశారు. భ‌క్తుల కోరిక మేర‌కు ఆన్‌లైన్ ద్వారా స్వామివారి క‌ల్యాణోత్స‌వం సేవ ప్రారంభించే విషయం గురించి అర్చకులతో చర్చించి తగు నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌న్‌లో శ‌నివారం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో  అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Tirumala

2020-07-04 19:43:18

అనాధలను ఆదుకోవడమే తన లక్ష్యం..గంట్ల

విశాఖ పాతనగరంలో ఎంతో మంది అనాధలకు వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తూ పలువురు కి బాసటగా నిలిచిన శ్రీ వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థకు గడచిన 2నెలల్లో లక్ష రూపాయలు తనవంతు  విరాళంగా అందించినట్టు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు  అన్నారు. సోమవారం డాబాగార్డెన్స్ విజేఫ్  ప్రెస్ క్లబ్ లో రూ.25 వేల చెక్ ను ఆ సంస్థ అధ్యక్షుడు సూరాడ  అప్పారావుకు  శ్రీనుబాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ అనాధ ఆశ్రమానికి 50నుంచి 75 వేల రూపాయలు తాను  విరాళంగా ఇవ్వడం జరుగుతుందన్నారు.. దీంతోపాటు మంచాలు, ఆయా సందర్భాల్లో నిత్యావసర సరుకులు, పౌష్టికాహారం అందజేస్తున్నామన్నారు. భవిష్యత్తు లో కూడా తనసాయం కొనసాతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యురాలు ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Dabagarden Main Road Bus Stop

2020-06-22 13:13:07

కరోనా వైరస్ కేసుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న కరోనా కేసుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ సంఘ సేవకులు, సామాజిక వేత్త సానా రాధ అన్నారు. విశాఖలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, కరోనా కేసులు విశాఖలోనూ పెరుగుతున్నాయని, వీటి నియంత్రణకు ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ ఖచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలను, ముసలి వారిని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. కరోనా వైరస్ దరచేరకుండా ఉండేందుకు నిత్యం వేడినీరు అధికంగా తాగాలని సూచించారు. అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. పరిశరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు అవసరం అయితేనే బయటకు వెళ్లాలని లేదంటే ఇంట్లోనే ఉండాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ఆరోగ్యసేతు యాప్ ని అంతా ఇనిస్తాల్ చేసుకొని అందులోని సూచనలు పాటించాలని సారా రాధ కోరారు.

2020-06-21 15:27:47