1 ENS Live Breaking News

సీఎం జగన్ విద్యకు పెద్దపీట వేసి అభివ్రుద్ధిచేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి విద్యకు పెద్దపీట వేసి కార్పోరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను అభివ్రుద్ధి చేస్తున్నారని వైఎస్సార్సీపీ సిఇసి నాయకులు పైలశ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం పరవాడలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జగనన్న కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, దేశ చరిత్రలోనే ప్రప్రథమంగా అమ్మఒడి, నాడు-నేడు, జగనన్న గోరుముద్ద, వసతి దీవెనపథకాల ద్వారా  సీఎం పేద పిల్లల విద్యోన్నతికి పాటుపడుతున్నారన్నారు. అందులో భాగంగానే విద్యార్థుల కోసం మన ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం జగనన్న విద్య కానుకను నిర్విరామంగా కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్కా రామునాయుడు, పరవాడ సర్పంచ్ సిరిపురపు అప్పల నాయుడు,  పరవాడ ఉప సర్పంచ్ బండారు రామారావు, మండల పార్టీ అధ్యక్షులు కోన రామరావు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు బొద్దపు చిన్నారవు, తదితరులు పాల్గొన్నారు.

Paravada

2023-06-12 12:31:03

జనసేన వారాహి యాత్రను విజయవంతం చేయాలి

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈనెల 14న చేపట్టనున్న వారాహి యాత్రను జయప్రదం చేయాలని యలమంచిలి యాత్ర ఇన్చార్జి కృష్ణాజిల్లా పార్టీ అధ్యక్షులు బం డ్రెడ్డి రామకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ శేఖర్ పిలుపునిచ్చారు. ఎలమంచిలి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇంచార్జ్ సుందరపు విజ య్ కుమార్ అధ్యక్షతన జనసైనికులతో పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి సన్నిధి నుండి ప్రారంభం అవుతుందని.. అదే రోజు కత్తిపూడి లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. ఈ యొక్క బహిరంగ సభకు నియోజకవర్గంలో గల జనసైని కులు వీర మహిళలు అత్యధికంగా తరలిరావాలని కోరారు. అనంతరం వారాహి యాత్రకు సంబంధించి పోస్టర్ను విడుదల చేశారు. ఈసమావేశంలో జనపరెడ్డి శ్రీనివా సరావు, బైలపూడి శ్రీరామదాసు, లాలం చందు, పప్పల నూకన్న దొర, పైల రాము నాయుడు, కాళ్ళ చంద్రమోహన్, చొప్ప శ్రీను, పొట్నూరి శివశంకర్, బొద్ధపు శ్రీనివాస రావు, లాలం సోమనాయుడు, పవన్ విజయ్, నియోజవర్గపు జనసేన నాయకులు జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

యలమంచిలి

2023-06-12 12:06:22

జనసేన వారాహి యాత్రను జయప్రదం చేయండి

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్వహించే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అన్నవరం నుంచి ఈ నెల 14 నుంచి వారాహి యాత్రను జయప్రదం చేయాలని అరకు పార్లమెంట్ ఇంచార్జ్, నర్సీపట్నం వారాహి యాత్ర సమన్వయకర్త వంపూరి గంగులయ్య పిలుపునిచ్చారు. సోమవారం జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీర సూర్యచంద్ర ఆధ్వర్యంలో గొలుగొండలో వారాహి రధయాత్రకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా గంగులయ్య మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు. వారాహి యాత్ర ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు సంక్షేమం పేరుతో సంక్షోభం వైపు అడుగులేస్తున్న ప్రభుత్వ విధానాలను పవన్ కళ్యాణ్ ప్రజలకు వివరిస్తారన్నారు. పవన్ కళ్యాణ్ చేపడుతున్న వారాహి యాత్ర ప్రత్యర్థులపై పారాటయాత్ర అన్నారు. ఈ యాత్రను నర్సీపట్నం నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం నుంచి జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు జయప్రదం చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ. అధికారంలోకి రావడానికి అందరూ శ్రమించాలన్నారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ మండల అధ్యక్షులు గండెం దొరబాబు, సీనియర్ నాయకులు రేగుబళ్ల శివ, సలాదుల ప్రసాద్, ఎస్సీ సెల్ బోయిన చిరంజీవి, కోన నారాయణరావు, వాసం వెంకటేష్, వూడి చక్రవర్తి, కేడీపేట ఉప సర్పంచ్ దుంపలపుడు సహదేవుడు లింగంపేట ఉపసర్పంచ్ లంకసత్యనారాయణ నాతవరం మండలం నాయకులు వెంకటరమణ, పాలుపర్తి సూరిబాబు, బంగారు నాయుడు జన సైనికులు  పాల్గొన్నారు.

Golugonda

2023-06-12 07:56:05

1990 బ్యాచ్ క్రిష్ణదేవిపేట పూర్వ విద్యార్ధుల దాత్రుత్వం

వాళ్లంతా ఏఎల్ పురం జిల్లా పరిషత్ హైస్కూలులో 1990-91 బ్యాచ్ 10వ తరగతిలోని పూర్వవిద్యార్ధులు ఏడాది క్రితం అంతా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకు న్నారు. ఆ తరువాత ప్రతీ ఏడాది ఏదోఒక ప్రాంతంలో కలుసుకోవాలని నిర్ణయించుకుని వారి వారి శుభకార్యాలకు హాజరవుతూ వస్తున్నారు. ఈరోజు అల్లూరి సీతారా మరాజు పాడేరు జిల్లా, చింతపల్లి మండలం లంబసింగి పర్యాటక ప్రాంతంలో మళ్లీ ఆత్మీయ సమావేశంలో కలుసుకున్నారు. ఎంతో సరదాగా గడిపారు. కలవడం సరదాగానే అయినా వారి సహచర విద్యార్ధులు కష్టాల్లో ఉన్నవారిని గుర్తించి వారికి తమవంతు సహాయం చేసి ఆదర్శంగా నిలిచారు. వారితో కలిసి చదవుకున్న స్నేహితుల్లో ఒకరికి పక్షవాతం రావడంతో స్నేహితుడికి రూ.4వేలు.. ప్రమాదంలో చేయి విరిగిపోయిన మరో స్నేహితుడికి రూ.2వేలు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్ధిక సహాయం అందించారు. గత ఏడాది ఇదే బ్యాచ్ లోని స్నేహితురాలి ఇల్లు కాలిపోవడంతో ఆమెకు రూ.30వేలు ఆర్ధిక సహాయం చేశారు. ఇలా ఒకరికి ఒకరు మేమున్నామంటూ భరోసా ఇచ్చుకుని ముందుకి సాగుతున్నారు.ఈనాటి కార్యక్రమంలో సుమారు 50మంది పూర్వవిద్యార్ధులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర ఐదు గంటల వరకూ అక్కడే ఉండి సరదాగా గడిపారు. ఈ ఆత్మీక కలయికకు పైల చంద్రశేఖర్, బెన్నయ్యనాయుడు, భాస్కర్రావు సంధాన కర్తలుగా వ్యవహరించి కార్యక్రమాన్ని నిర్వహించారు.

Lambasingi

2023-06-11 15:36:08

సియం జగన్ చిత్రపటానికి లెక్చిరర్ల పాలాభిషేకం

ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేస్తూ మంత్రివర్గ సమావేశంలో సీఎం. జగన్మోహన్ రెడ్డి ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తారువాలోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి బూడి ముత్యాలనాయుడు సమక్షంలో సీఎం.జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇందుకు సహకరించిన ఉపముఖ్యమంత్రి ముత్యాలనాయుడు గారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు బిఎస్ఆర్.శర్మ మాట్లాడుతూ, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, మేనిఫెస్టోను అమలు చేస్తున్న   ముఖ్యమంత్రి జగన్ గారికి తమ కుటుంబాలు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బిఎస్ఆర్.శర్మ, అనకాపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజేష్, అప్పారావు, పార్థసారథి, రామకోటి, కోటేశ్వరరావు, లక్ష్మణరావు, రమణ, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Anakapalle

2023-06-11 15:09:36

స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ జాయింట్ సెక్రెటరీ పర్యటన

స్వచ్ఛ భారత్ అర్బన్ జాయింట్ కార్యదర్శి రూపామిశ్ర ఆదివారం నగరంలోని పలు ప్రాంతాలలో జివిఎంసి కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కాపులుప్పాడులోని జిందాల్ విద్యుత్ కేంద్రాన్ని, బయోమైనింగ్, ఘన వ్యర్ధాల విభజనతో పాటు ఋషికొండ, వైయస్సార్ వ్యూ పాయింట్, బీచ్ రోడ్ లోని వైఎంసిఏ వద్ద ఆధునికరించిన మోడ్రన్ మరుగుదొడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె హోటల్  ర్యాడిసన్ లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా ఏ అంశాలు, ఏ ఏ పనులు చేపడుతున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జివిఎంసి కమిషనర్ స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ఇప్పటివరకు చేపట్టిన పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అర్బన్ జాయింట్ సెక్రెటరీకి వివరించారు. ముఖ్యంగా ఘన వ్యర్ధాల విభజన, సేంద్రియ ఎరువు తయారీ, మెరుగైన పారిశుధ్యం, భూగర్భ మురుగనీటి వ్యవస్థ, నిషేధిత ప్లాస్టిక్ నిర్మూలన, కాలుష్యం నియంత్రణ, బహిరంగ మలమూత్ర విసర్జనతో పాటు సామూహిక మరుగుదొడ్లు పరిశుభ్రత పాటించడం తదితర అంశాలపై చర్చించిన అనంతరం ఆమె కొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి అదనపు కమిషనర్ డాక్టర్ వి.సన్యాసిరావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-06-11 15:02:23

క్రైస్తవ సేవా సంస్థలకు ఆస్తి పన్ను రద్దు చేయండి

విశాఖపట్నంజిల్లా, నగరం పరిధిలోని క్రైస్తవ సేవా సంస్థలకు ఆస్తి పన్ను రద్దు చేయాలని డయాసిస్ సోషల్ సర్వీస్ సొసైటీ, సెయింట్ ఆన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ కళాశాల సంయుక్తంగా, ఆంధ్ర ప్రదేశ్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ బొల్లవరపు జాన్ వెస్లీని అభ్యర్ధించారు. ఆదివారం ఆయన కార్యాలయంలో కలిసి లాభాపేక్ష లేకుండా నడుపుతున్న క్రిస్టియన్ మైనారిటీ కి సంబంధించిన  చారిటీల సంస్థలకు ఆస్తి పన్ను తగ్గించాలన్నారు. అవకాశం ఉంటే పూర్తిగా మాఫీ చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.ఈమేరకు ప్రత్యకంగా వినతి పత్రాలను అందించారు. వారి వినతిపై చైర్మన్ జాన్ వెస్లీ సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తానని జాన్ వెస్లీ చెప్పినట్లు ఆయా సంస్థలు మీడియాకి తెలియజేశాయి. ఈ కార్యక్రమంలో ఫాదర్ జాన్ ప్రకాష్, ఫాదర్ సుధాకర్, ప్రిన్సిపల్ సిస్టర్ ప్రేమ, సిస్టర్ రెజీ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-06-11 14:24:07

14 నుంచి విష్ణు సహస్రనామ సోత్రాల పారాయణం

అన్నవరంలోని శ్రీశ్రీశ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఏకాదశి పర్వదినం నుంచి ప్రతీరోజూ సాయంత్రం 4.30 గంటల నుండి 6.00 గంటల వరకూ విష్ణు సహస్రనామ స్తోత్రం,  లలితా సహస్రనామ స్తోత్ర పారాయణములు నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలియజేశారు. ఈమేరకు ఆదివారం అన్నవరంలోని మీడియాకి ప్రకటన విడుదల చేశారు.  వైదిక కమిటీ సూచనల ప్రకారం వీటిని నిర్వహిస్తుననట్టు పేర్కొన్నారు. ఆశక్తి కలిగిన భక్తులు ఈ పారాయణ కార్యక్రమంలో పాల్గొనాలంటే ముందుగా పీఆర్వో విభాగంలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతీఏటా మాదిరిగానే, ఈఏడాది కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం,  లలితా సహస్రనామ స్తోత్ర పారాయణములు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని దేవస్థాన అధికారులు కోరారు.

Annavaram

2023-06-11 13:18:34

జనసేన వారాహి యాత్రను విజయవంతం చేయాలి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈనెల 14 నుంచి నిర్వహించనున్న వారాహి యాత్రను విజయవంతం చేయాలని రాష్ట్రకార్యదర్శి చిలకం మధుసూధనరెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆదివారం అన్నవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరోజు పవన కళ్యాణ్ స్వామవారిని దర్శించుకుని అన్నవరం నుంచే యాత్ర ప్రారంభిస్తారని.. ఈ కార్యక్రమానికి జనసే నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. ఇప్పటికే తమ అధినేత పర్యటన ఖరారు అయినందున జిల్లాతోపాటు, అన్ని నియోజకవర్గాలు, దారిపొడవునా ఉన్న గ్రామాల్లోని జనసేన కార్యకర్తలకు వర్తమానం పంపినట్టు తెలియజేశారు. యాత్ర ప్రారంభం అయిన దగ్గర నుంచి ఏఏ గ్రామాల మీదుగా వారాహి ప్రయాణిస్తుందో మొత్తం టూర్ షెడ్యూలు నియోజవకర్గాల వారీగా ప్రకటించారని పేర్కొన్నార. ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జ్ తమ్మయ్య బాబు అక్కల గాంధీ కరణం సుబ్రహ్మణ్యం  నల్ల రామకృష్ణ గాబు బండారు రామారావు మరియు జనసేన నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Annavaram

2023-06-11 10:07:23

ప్రాథమిక దశలోనే మలేరియాను గుర్తించడం మేలు

దోమ కాటు ద్వారా  సోకే మలేరియాను ప్రారంభ దశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించవచ్చని డాక్టర్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో మలేరియా వ్యతిరేక  మాసోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆడ అనాలసిస్ దోమ కుట్టినప్పుడు దాని శరీరంలోని ప్లాస్మోడియం సూక్ష్మజీవులు కాలేయంలో వృద్ధి చెంది ఎర్ర రక్తకణాలను దెబ్బతీస్తాయని అన్నారు. చలి, జ్వరం, తల నొప్పి, కండరాల నొప్పి, చాతిలో నొప్పి, దగ్గు, చెమటలు, వాంతులు, విరేచనాలు ,నీరసంగా ఉండటం ,ఆయాసం మలేరియా లక్షణాలని అన్నారు. దీని నివారణకు గాను ఇంటి పరిసరాల్లో దోమలు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. దోమతెరలు వినియోగించాలని డాక్టర్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రేలంగి బాపిరాజు, రాజా తదితరులు పాల్గొన్నారు.

Sarpavaram

2023-06-11 07:17:58

సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం

కాంట్రాక్టు ఉద్యోగుల రెండు దశాబ్దాల కలను నెరవేరుస్తూ క్రమబద్ధీకరణ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రుణం తీర్చుకుంటామ‌ని  ఉద్యోగు లు తెలిపారు. ఈ మేరకు కొవ్వూరు నియోజకవర్గంలో హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం రాత్రి సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కొవ్వూరు డివిజన్ లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి (మెడికల్ అండ్ హెల్త్) ఉద్యోగులు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనితను కలిసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం థాంక్యూ సీఎం సార్ అంటూ నినాదాలు చేస్తూ పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ... గత 20 ఏళ్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న తమని రెగ్యుల‌రైజ్ చేయడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ ముఖ్యమంత్రి తమకు న్యాయం చేశారని తెలిపారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. అటువంటి ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని వ్యాఖ్యానించారు. అవసరం వచ్చినప్పుడు మేం కృతజ్ఞతలు తెలియజేస్తూ రుణం తీర్చుకుంటామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఎస్.వి.వి. సత్యనారాయణ, ఎం. దుర్గాప్రసాద్, డి. ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

Kovvur

2023-06-10 16:47:01

ఇంగ్లీషు భాషతో పాటు భావం కూడా ముఖ్యం

భాషతో పాటు భావం ముఖ్యం అని  లెగ్జిగ్రాఫర్-విఎస్డి తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ రచయిత సనపల జీవన్ కుమార్ అన్నారు. అమెరికన్ ఇంగ్లీష్ శైలి మెళకువలతొ తెలుగు వారూ టాప్ లొ నిలవొచ్చునని ఆయన పేర్కొన్నారు.  మాతృభాషతోనూ ద బెస్ట్ గ నిలవొచ్చునని అభిప్రాయపడ్డారు. -లెగ్జిగ్రాఫర్-విఎస్డి తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ రచయిత సనపల జీవన్ కుమార్ తొ నగరంలోని 36 ఏళ్లుగ నడుస్తున్న తన్మయి క్రియేటివ్స్ సాంస్కృతిక సంస్థ ప్రత్యేకం అమెరికన్ ఇంగ్లీషుభాష శైలికి సంబంధించి శిక్షణ 2వ రోజు చేపట్టారు. ఈ సందర్భంగ భాషతో పాటు భావం ముఖ్యం అని చెప్పారు.  ఇంగ్లీష్ శైలి మెళకువలతొ తెలుగు వారూ టాప్ లొ మాతృభాషలోనూ అత్యుత్తమంగ నిలవొచ్చు నన్నారు. అమెరికన్ ఇంగ్లీష్ శైలి, భాష ఉచ్ఛారణ, రాయడంలోనూ మాట్లాడడం లొ ఉండే వ్యత్యాసం తదితర అంశాలను ప్రస్థావించారు. సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధి చెందిన తరుణంలో ఆంగ్ల భాష మరీ ముఖ్యంగ అమెరికన్ శైళి అవసరం ఎంతో ఉందని అన్నారు.

  36 ఏళ్లుగ నడుస్తున్న సాంస్కృతిక సంస్థ తన్మయి క్రియేటివ్స్ శనివారం ద్వారకా నగర్ పౌరగ్రంధాలయంలొ రెండు రోజుల అమెరికన్ ఇంగ్లీష్ శైలిలో ఉచిత శిక్షణ కార్యక్ర మం  2వ రోజు కార్యక్రమంలొ  అమెరికన్ ఇంగ్లీష్ ప్ధాధాన్యత వివరించి ప్రాక్టికల్ గ అమెరికన్ ఇంగ్లీష్ కు సంబంధించిన కొన్ని పదాల వాడకం తీరుతెన్నులు విశ్లేషించారు. తన్మయి క్రియేటివ్స్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, అక్షరసారధి బిఎస్ చంద్రశేఖర్ స్వాగత ఉపన్యాసం చేసిన కార్యక్రమంలొ సీనియర్ క్రీడా జర్నలిస్టు, పర్వతారోహకులు నాగనబోయిన నాగేశ్వరరావు, తన్మయి క్రియేటివ్స్ కార్యదర్శి సీహెచ్వి సత్యనారాయణ, కొణతాల రాజు, గ్రంధి సతీష్ కుమార్, ఉప్పాడ రఘు,  ఆధ్యాత్మిక వేత్త ఎంవి రాజశేఖర్ లు   మాట్లాడారు. కార్యక్రమ సమన్వయకర్త బాదంగీర్ సాయి మాట్లాడుతూ ఇంగ్లీష్ భాషకు అమెరికన్ వాడుక భాషతో కూడినసోదాహరణ అంశాల సహితం జీవన్ కుమార్ పేర్కొనడం ప్రశంసనీయం అన్నారు.  సీనియర్ జర్నలిస్టు, లెగ్జిగ్రాఫర్ గ జీవన్ కుమార్ ప్రసంగం వంటి కార్యక్రమాలు  భవిష్యత్తులో మరిన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ వర్క్ షాప్ లో పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లను కూడా అందజేశారు. డి.సి.డిజిటల్స్ సునీల్, సనపల రూపేష్ కుమార్, వియ్యపు రామకృష్ణ, యస్.దుర్గారావు తదితరులు నిర్వహణలో సహకరించారు.

Visakhapatnam

2023-06-10 16:03:59

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుకు తొలిప్రాధాన్యత

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించే కార్యక్రమాలకు తొలి ప్రాధాన్యత ఇస్తానని బొబ్బిలి ఎంపీ డిఓ పి.రవికుమార్ అన్నారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మండలంలో ప్రభుత్వ అభివ్రుద్ధి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ.. ప్రభుత్వ లక్ష్యం మేరకు చెత్తరహిత మండలంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా క్రుషిచేస్తానని చెప్పారు. త్వరలోనే మండంలోని అన్ని గ్రామ పంచాయతీలు, సచివా లయాలను సందర్శిస్తానని చెప్పారు. గ్రామాల్లో మౌళిక సదుపాయాలు, మంచినీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మండలంలోని గ్రామాలు, సచివా లయాల పరిధిలోని సమస్యలు తన ద్రుష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు క్రుషి చేస్తానని అన్నారు. ప్రజలు గ్రామ సచివాలయాల ద్వారా జగనన్నకు చెబుదాం కార్యక్ర మంతో ప్రజలు తమ సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా పలువురు సచివాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా ఎంపీడీఓని కలిసి పరిచియం చేసుకున్నారు. 

Bobbili

2023-06-09 07:06:26

ఎమ్మెల్యే పర్వతను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీడీఓ

శంఖవరంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓ జి.శివరామక్రిష్ణయ్య ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతపూర్ణచంద్రప్రసాద్ ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అదేవిధంగా ఎంపీపీ పర్వత రాజబాబును కూడా కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మండలాన్ని అభివ్రుద్ధి పధంలో నడిపించాలనే ఎమ్మెల్యే సూచనలు, ఆలోచనలకు అనుగుణంగా ముందుకి వెళతానన్నారు. దశలవారీగా మండలంలోని అన్ని పంచాయతీలు, గ్రామసచివాలయాలను సందర్శించి అక్కడ ప్రధాన సమస్యల పరిష్కరించడానికి క్రుషిచేస్తానని అన్నారు. మంచి వాతావరణం కలిగిన ప్రాంతానికి పదోన్నతి రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, మీడియా సహకారంతో సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు  సిబ్బందితో కార్యాచరణ రూపొందిస్తానన్నారు. అందరికీ అందుబాటులో ఉంటాననని చెప్పిన ఎంపీడిఓ ప్రజలు ఎప్పు డైనా తనను కలవడానికి నేరుగా ఎంపీడీఓ కార్యాలయానికి రావొచ్చునన్నారు. అదేవిధంగా ప్రభుత్వ సిబ్బంది సేవల్లో ఎక్కడ లోపాలు ఉన్నా తనకు తెలియజే వచ్చు న న్నారు.

Sankhavaram

2023-06-08 15:05:10

శంఖవరం ఎంపీడీఓగా జి.శివరామక్రిష్ణయ్య

కాకినాడ జిల్లా శంఖవరం మండల పరిషత్ డెవలెప్ మెంట్ అధికారిగా జి.శివరామక్రిష్ణయ్య నియమితులయ్యారు. ఈయన మామిడికుదురులో ఈఓపీఆర్డీగా విధులు నిర్వహించేవారు. పదోన్నతిపై శంఖవరం ఎంపిడీఓగా వచ్చారు. ఈరోజు ఆయన విధుల్లోకి చేరారు. శివరామక్రిష్ణయ్య విధినిర్వహణలో ముక్కుసూటి అధికారిగా అక్కడ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామ సచివాలయాల్లో ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించే విషయంలో చురుగ్గా వ్యవహరిస్తారనే మంచిపేరు ఈయనకు ఉంది. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది నూతన ఎంపీడీఓను మర్యాదపూర్వకంగా కలిసి పరిచియం చేసుకున్నారు. పలువురు సచివాలయ కార్యదర్శిలు, సిబ్బంది కూడా ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, మండలంలో ప్రభుత్వ అభివ్రుద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ.. ప్రభుత్వ లక్ష్యం మేరకు చెత్తరహిత మండలంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా క్రుషిచేస్తానని చెప్పారు. త్వరలోనే మండంలోని అన్ని సచివాలయాలు పర్యటిస్తానని చెప్పారు.

Sankhavaram

2023-06-08 14:20:41