1 ENS Live Breaking News

జనవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.123 కోట్లు

జనవరిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్లు దాటింది. జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు తిరుమల శ్రీవారికి హుండీలో రూ.123  
కోట్లను భక్తులు కానుకల రూపంలో సమర్పించారు. జనవరి 2 తేదీన శ్రీవారికి రూ.7.68 కోట్ల హుండీ ఆదాయం లభించింది. టీటీడీ చరిత్రలోనే ఇది
అత్యధిక ఆదా యాల్లో రెండోది. శ్రీవారి హుండీ ఆదాయం ప్రతి నెలా రూ.కోట్లు దాటుతుండడం గమనార్హం. స్వామివారి వచ్చే ఆదాయంలో టిటిడి ఆలయాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. 

Tirumala

2023-02-01 03:41:37

తిరుమల శ్రీవారి దర్శనానికి 8గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని బుధవారం అర్ధరాత్రి వరకూ 60,939 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.5.17 కోట్లు వచ్చింది. ఇంకా 2 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-02-01 02:45:35

విశాఖ శారదాపీఠంలో ఏపీ గవర్నర్ ప్రత్యేక పూజలు

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ మంగళవారం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. పీఠం వార్షిక మహోత్సవాల్లో పాల్గొన్నారు. రాజశ్యామలా అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వాములను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. రాజశ్యామలా అమ్మవారి దర్శనం కోసం విశాఖ శారదాపీఠాన్ని సందర్శించడం ఇది రెండోసారని గవర్నరు గుర్తు చేసుకున్నారు. అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతుల ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

Pendurthi

2023-01-31 13:02:46

తిరుమల శ్రీవారి దర్శనానికి 8గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సోమవారం అర్ధరాత్రి వరకూ 74,242 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.4.08 కోట్లు వచ్చింది. ఇంకా 2 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-01-31 02:47:34

విశాఖ శారదా పీఠంలో వేదపోషణ అభినందనీయం

హర్యానా గవర్నరు బండారు దత్తాత్రేయ సోమవారం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. రాజశ్యామల యాగానికి హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం టీటీడీ నిర్వహణలోని శ్రీనివాస చతుర్వేద హవనం, సచ్చిదానంద విద్వత్‌ సభ నిర్వహణలో జరుగుతున్న శాస్త్ర, శ్రౌత సభలకు హాజరయ్యారు. పండిత ప్రముఖులు ఇచ్చిన ధర్మ సందేశాలను ఆసక్తిగా విన్నారు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వాముల ఆశీస్సులు అందుకున్నారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వేద పోషణ కోసం విశాఖ శారదాపీఠం శ్రమిస్తున్న తీరు అభినందనీయమని చెప్పారు. పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొని, పీఠాధిపతుల ఆశీర్వచనాలు అందుకోవడం ఆనందాన్నిచ్చిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మంచి వాతావరణం ఎల్లపుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు వివరించారు. శంకరాచార్య అడుగుజాడల్లో నడుస్తున్న విశాఖ శారదాపీఠం చేస్తున్న అద్వైత ప్రచారం సంతోషదాయకంగాఉందన్నారు.

Pendurthi

2023-01-30 12:23:04

తిరుమ‌ల‌లో విష్ణు సహస్రనామ అఖండ పారాయణం

భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 నుంచి 9 మధ్య తిరుమల నాదనీరాజనం వేదిక‌పై విష్ణు సహస్రనామ అఖండ  పారాయణం నిర్వహించనున్నారు.  వేదపండితులు  రామానుజచార్యులు పర్యవేక్షణలో, జాతీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి డా. జి.ఎస్.ఆర్.కృష్ణమూర్తి, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం పండితులు డా. వెంకటాచలపతి విష్ణు సహస్రనామ విశిష్టతను భక్తులకు వివరిస్తారు. 3సార్లు విష్ణు సహస్రనామం పారాయణం జరుగుతుంది. ఎస్.వి.వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి. వేద విశ్వవిద్యాలయం, టిటిడి వేదపండితులు, టిటిడి సంభావన పండితులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాల పండితులు, అధ్యాపకలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయనుంది.

Tirumala

2023-01-30 09:45:40

తిరుమల శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ఆదివారం అర్ధరాత్రి వరకూ 78,639 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.4.16 కోట్లు వచ్చింది. ఇంకా 16 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. స్వామివారి దర్శనానికి 20 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-01-30 01:43:08

తారకరత్నకు ఎక్మో అమర్చలేదు..జూ ఎన్టీఆర్

తారకరత్నకు ఎక్మో అమర్చినట్టు వస్తన్న వార్తలో నిజం లేదనం జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. బెంగళూరులోని ఆసుపత్రలో చికిత్స పొందుతున్న తారకరత్నను ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తో కలిసి ఆదివారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతోందన్నాడు. 'తారకరత్న కూడా పోరాడుతున్నారు. ఆయన ఆత్మబలం, మనోబలం, అభిమానుల ఆశీర్వాదం, తాతగారి ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలి. ఆయన ఈ పరిస్థితి నుండి త్వరలోనే బయటికి వస్తారని ఆశిస్తున్నట్టు చెప్పాడు. ప్రస్తుతం వైద్యానికి తారకతర్న స్పందిస్తున్నారని పేర్కొన్నాడు జూనియర్ ఎన్టీఆర్.

Bengaluru

2023-01-29 07:36:09

తిరుమల శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శనివారం అర్ధ రాత్రి వరకూ 80.094 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.3.15 కోట్లు వచ్చింది. ఇంకా 2 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. స్వామివారి దర్శనానికి 20 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirupati

2023-01-29 02:34:27

10లక్షల పైగా డౌన్లోడ్ చేసుకున్న టీటీడీ మొబైల్ యాప్

"తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిన్న విడుదల చేసిన "TTDevasthanams" మొబైల్ యాప్ సుమారు పది లక్షల పైచిలుకు యూజర్స్ కేవలం 24 గంటల్లోనే డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంత తక్కువ సమయంలో 10 లక్షల పైచిలుకు యూజర్లు మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం అనేది ఐటీ చరిత్రలో చాలా అరుదని ఐటీ నిపుణులు వెల్లడించారు. ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగం, స్వామివారికి చెందిన సమాచారం, సేవలు తదితర వివరాలన్నీ ఒకే చోట ఉండటంతో ఇంత పెద్ద మొత్తంలో డౌన్లోడ్ చేసుకున్నారని టిటిడి అధికారులు చెప్పారు.

Tirumala

2023-01-28 16:13:52

గత్యంతరం లేక ఇంటి దగ్గరే శవాల దహనం

కర్ణాటకలోని ఉడుపి జిల్లాలోని జడ్కల్, ముదురు గ్రామాల్లో శ్మశాన వాటికలు లేవు. ఒక రకంగా దారుణం, మరో రకంగా వినూత్నంగా అక్కడి ప్రజలు మరణించిన వారి పార్ధీవ శరీరాలను దహనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పండింది. శ్మశానం నిర్మించాలని దశాబ్దాలుగా చేస్తున్న డిమాండ్​ను అధికారులు పెడచెవిన పెట్టారు. దీంతో వ్యవసాయ సహకారం సంఘం సాయంతో ఆ గ్రామస్థులు ఓ సంచార శ్మశానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరైనా చనిపోతే వారి ఇంటి వద్దకే వచ్చి దహన సంస్కారాలు చేసిన తరువాత కుటుంబీకులకు చితాభస్మాన్ని ఇచ్చి వెళతారు. ఈ మిషీన్ గ్యాస్, విద్యుత్‌తో పనిచేస్తుంది.

Udupi

2023-01-28 15:18:51

కేంద్రం కీలకనిర్ణయం ఇక ఆ గార్డెన్ పేరు అమృత్ ఉద్యాన్

కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ఇటీవల కాలంలో ద్వీపాలకు పేర్లు పెట్టిన ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్ పేరును కేంద్ర ప్రభుత్వం శనివారం 'అమృత్ ఉద్యాన్‌'గా మార్చింది. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా 'అమృత్ మహోత్సవ్' థీమ్‌కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ నవికా గుప్తా వెల్లడించారు.

Delhi

2023-01-28 14:01:25

తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంగల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శుక్రవారం అర్ధ రాత్రి వరకూ 59,695 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.4.06 కోట్లు వచ్చింది. ఇంకా 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-01-28 02:49:24

తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ మొబైల్‌ యాప్‌ ప్రారంభం


భక్తులకు మరింత మెరుగైన డిజిటల్‌ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా టిటిదేవస్థానమ్స్ పేరుతో రూపొందించిన మొబైల్‌ యాప్‌ను టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి అన్నమయ్య భవన్ లో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ భక్తుల కోసం ఇప్పటివరకు గోవింద మొబైల్‌ యాప్‌ ఉండేదని, దీన్ని మరింత ఆధునీకరించి మరిన్ని అప్లికేషన్లు పొందుపరచి నూతన యాప్‌ను రూపొందించామని తెలిపారు. ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ బుక్‌ చేసుకోవచ్చన్నారు. విరాళాలు కూడా ఇదే యాప్‌ నుండి అందించవచ్చని చెప్పారు. పుష్‌ నోటిఫికేషన్ల ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకోవచ్చని, ఎస్వీబీసీ ప్రసారాలను లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా ఈ యాప్‌ ద్వారా చూడవచ్చని తెలిపారు.

తిరుమలకు సంబంధించిన సమస్త సమాచారం ఈ యాప్‌లో ఉందని, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. జియో సంస్థ సహకారంతో  టిటిడి ఐటి విభాగం ఈ యాప్‌ను రూపొందించినట్టు వివరించారు. సామాన్య భక్తులకు స్వామివారి సేవలు, దర్శనం, టికెట్లు, వసతి సులువుగా అందించేందుకు ఆన్లైన్‌ ద్వారా క్లౌడ్‌ టెక్నాలజిని ఉపయోగిస్తున్నామని తెలిపారు. తద్వారా ప్రతినెలా దర్శనం, సేవలు, శ్రీవాణి టికెట్లతో పాటు తిరుమల, తిరుపతిలో వసతి కూడా ముందుగానే బుక్‌ చేసుకోగలుగుతున్నారని వివరించారు. నూతన యాప్‌ సేవలపై భక్తుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించి అవసరమైతే మరిన్ని  పొందుపరుస్తామని చెప్పారు.


భక్తులకు డిజిటల్‌ గేట్‌ వే : టిటిడి ఈవో  ఎవి.ధర్మారెడ్డి
భక్తులకు సంబంధించిన అన్ని అవసరాల కోసం డిజిటల్‌ గేట్‌ వేగా ఈ యాప్‌ ఉపయోగపడుతుందని టిటిడి ఈవో  ఎవి.ధర్మారెడ్డి అన్నారు. భక్తులు లాగిన్‌ అయ్యేందుకు యూజర్‌ నేమ్‌తోపాటు ఓటిపి ఎంటర్‌ చేస్తే చాలని, పాస్‌వర్డ్‌ అవసరం లేదని చెప్పారు. కంప్యూటర్‌ వాడడం తెలియనివారు కూడా వినియోగించేందుకు వీలుగా ఈ ప్రపంచస్థాయి యాప్‌ను రూపొందించినట్టు చెప్పారు.ఈ కార్యక్రమంలో టిటిడి జెఈవో  వీరబ్రహ్మం, సివిఎస్వో  నరసింహకిషోర్‌, జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌  అనీష్‌ షా, ఐటి సలహాదారు  అమర్‌, ఐటి జిఎం  సందీప్‌, యాప్‌ను రూపొందించిన బృందం పాల్గొన్నారు.

Tirumala

2023-01-27 08:41:08

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 58,379 మంది

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని గురువారం అర్ధ రాత్రి వరకూ 58,379 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.3.73 కోట్లు వచ్చింది. ఇంకా రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 36 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-01-27 03:03:10