1 ENS Live Breaking News

భారత్ లోనూ త్వరలో భూకంపం వచ్చే అవకాశం

టర్కీ, సిరియా తరహాలోనే భారత్ లో త్వరలోనే భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని ఎన్ జీఆర్ఐ(ngri)చీఫ్ సైంటిస్ట్ డా.పూర్ణ చంద్రరావు హెచ్చరించారు. ఈరోజు ఆయన ఒక జాతీయ వార్త సంస్థలో మాట్లాడారు. ‘భూపొరల్లో ఉండే ప్లేట్లు నిరంతరం కదులుతాయి. భారత భూభాగం కింద ఉన్న ఓ ప్లేట్ ఏడాదికి 5 సెం.మీ వేగంతో కదులుతోంది. దీంతో హిమాలయాలపై ఒత్తిడి పెరిగి హిమాచల్ ప్రదేశ్, యూకేలో భారీ విపత్తు సంభవించొచ్చు.’ అని పేర్కొన్నారు. అయితే ముందస్తు చర్యలతో ముప్పు తప్పించుకోవచ్చనని హెచ్చరించారు. కాగా ఇటీవలే టర్కీ, సిరియాలో కూ భూకంప హెచ్చరికలు వచ్చాయి. అయితే హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో లెక్కకు మించిన ప్రజలు భూకంపంతో మ్రుత్యువాత పడగా, వేలల్లో భవంతులు పేకమేడల్లా కూలిపోయాయి. ఈ నేపథ్యంలో  ఎన్జీఆర్ఐ శాస్త్రవేత చేసిన హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.

New Delhi

2023-02-21 16:40:03

టిటిడిలో దేశీయ గోజాతులను అభివృద్ధి చేసేదిశగా

 శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి రోజువారి అవసరమయ్యే పాలు,పెరుగు, నెయ్యి సొంతంగా తయారు చేసుకోవడానికి కార్యాచరణకు దిగిన టీటీడీ దేశంలోని అత్యుత్తమ దేశీయ గోశాలలు, డెయిరీల పనితీరును పరిశీలిస్తోంది. ఇందులోభాగంగా జేఈవో సదా భార్గవి నేతృత్వంలో బృందం మంగళవారం సాయంత్రం పూణె కు సమీపంలోని మంచార్ లో పర్యటించింది. ఆ గ్రామంలో ఉన్న పరాగ్ డెయిరీ కి చెందిన భాగ్యలక్ష్మి డెయిరీ ఫామ్ ను పరిశీలించారు. ఈ డెయిరీ లోని  గో జాతుల ద్వారా అత్యధిక పాల ఉత్పత్తికి అనుసరిస్తున్న విధానాలను వీరు క్షేత్ర స్థాయిలో తెలుసుకున్నారు. ఆ డెయిరీ  యాజమాన్యం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తక్కువ మంది సిబ్బందితో  మంచి ఫలితాలు సాధిస్తున్న తీరును అధికారుల బృందం అధ్యయనం చేసింది. యంత్రాల సాయంతో  గోవులకు కష్టం లేకుండా ఒకే సారి 50 గోవుల నుంచి సులువుగా పాలు పితికే విధానాన్ని పరిశీలించి అక్కడి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  డెయిరీ నిర్వహణ, సాంకేతిక వ్యవస్థ, ఖర్చు తదితర వివరాలన్నింటితో తమకు ఒక నివేదిక అందించాలని జేఈవో సదా భార్గవి భాగ్యలక్ష్మి డెయిరీ యాజమాన్యాన్ని కోరారు. వీలైనంత త్వరగా నివేదిక అందించడానికి వారు అంగీకరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి, పశువైద్య విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ వెంకటనాయుడు పాల్గొన్నారు.

Pune

2023-02-21 12:02:47

ఫిబ్రవరి 22న శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి మార్చి, ఏప్రిల్, మే నెలల కోటాను ఫిబ్రవరి 22న సాయంత్రం 4  గంట‌ల‌కు టిటిడి ఆన్‌లై న్‌లో విడుదల చేయ‌నుంది. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ఉన్నాయి.  అదేవిధంగా, మార్చి, ఏప్రిల్, మే నెలల కు సంబంధించిన మిగతా ఆర్జిత‌సేవా టికెట్లకు ఆన్‌లైన్ ల‌క్కీడిప్ న‌మోదు ప్ర‌క్రియ జనవరి 22న ఉదయం 10 గంట‌ల‌ నుండి ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.  భ‌క్తులు ఈ విష‌యాల‌ను గుర్తించి శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌ను బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది. కాగా టిక్కెట్ల విడుదలకు సంబంధించి టిటిడి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.

Tirumala

2023-02-21 10:11:10

తిరుమల శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని సోమవారం అర్ధరాత్రి వరకూ 61,374 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ. 4.20 కోట్లు వచ్చింది. 19, 691 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. ఇంకా 1 కంపార్ట్ మెంట్ లో భక్తులు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. స్వామివారి దర్శనానికి 14 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.


tirumala

2023-02-21 06:36:55

చట్ట ప్రకారమే నిర్ణయాలు అమలు చేయాలి..సుప్రీం

అమర్ రాజా బ్యాటరీస్ కాలుష్యం వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం విచారణ జరిగింది.. షోకాజ్ నోటీస్ పై పబ్లిక్ హియరింగ్ నిర్వహించి.. చట్ట ప్రకారం  నిర్ణయం తీసుకోవాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలిని సుప్రీంకోర్టు ఆదేశించింది.  పీసీబీ ఆదేశాలపై అభ్యంతరాలు ఉంటే హైకోర్టుకు వెళ్లాలని అమర్‌ రాజాకు సూచించింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి షోకాజ్ నోటీసులపై గతంలో ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తేసిన సంగతి తెలిసిందే. అయితే.. 34 సార్లు నోటీసులు ఇచ్చి రాజకీయ కారణాలతో తమను వేధిస్తున్నారని అమర్ రాజా తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదించారు. ఈ తరుణంలో న్యాయస్థానం.. రాజకీయ కారణాలు ఏవైనప్పటికీ చట్టప్రకారం ముందుకు పోవాల్సిందే అని స్పష్టం చేసింది.  

అమర్ రాజా బ్యాటరీస్ తీవ్ర కాలుష్యం వెదజల్లుతోందని, పరిసర ప్రాంతాల జలాల్లో  లెడ్ కంటెంట్ పెరిగిందని  గతంలో నోటీసులు ఇచ్చింది ఏపీ కాలుష్య నియంత్రణ మండలి. జల, వాయు కాలుష్యాలను వెదజల్లుతూ కార్మికులు సహా చుట్టుపక్కల ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్న అమర్‌రాజా ఫ్యాక్టరీ యాజమాన్యంపై.. గతంలో అధికారుల విధులను అడ్డుకున్నందుకు పోలీసు కేసు నమోదైంది. ప్రస్తుతం సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ లో ప్రాధాన్యత సంతరించుకుంది.

New Delhi

2023-02-20 11:02:20

తిరుమల శ్రీవారి దర్శనానికి 7 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఆదివారం అర్ధరాత్రి వరకూ 79,555 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ. 4.44 కోట్లు వచ్చింది. 21,504మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. ఇంకా 1 కంపార్ట్ మెంట్ లో భక్తులు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. స్వామివారి దర్శనానికి 07 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-02-20 03:54:45

భారత్ లో 450 ఉద్యోగలను తొలగించిన గుగూల్

భారత్‌లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 453 మంది ఉద్యోగులను గూగుల్‌ ఇండియా తొలగించినట్లు తెలిసింది. ఉద్యోగం నుంచి తొలగించినట్లు సంబంధిత ఉద్యోగులకు గూగుల్‌ కంట్రీ హెడ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ సంజయ్‌ గుప్తా మెయిల్‌ పంపినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. ‘మేం తీసుకున్న నిర్ణయాలకు పూర్తి బాధ్యత వహిస్తామ’ని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ కూడా ఉద్యోగులకు మెయిల్‌ ద్వారా తెలియజేశారు. ‘అమెరికాలో ఉద్యోగాల నుంచి తొలగించిన వాళ్లకు ఇప్పటికే ప్రత్యేక మెయిల్‌ ద్వారా సమాచారం తెలియజేశామని పేర్కొన్నారట. ఇతర దేశాల్లో ఈ ప్రక్రియ కొంత ఆలస్యం కావచ్చునని కానీ.. అక్కడి చట్టాలు, విధానాలే ఇందుకు కారణమ’ని ఆయన మెయిలో పేర్కొన్నట్టు తెలిసింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది అనగా మొత్తం సిబ్బందిలో 6 శాతం మందిని తొలగిస్తున్నట్లు గత నెలలో గూగుల్‌ ప్రకటించిన తరువాత వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

Delhi

2023-02-18 10:17:58

సెల్ నెట్వర్క్ ల మోసాలపై ట్రాయ్ కి ఫిర్యాదు చేయొచ్చు

భారత దేశ వ్యాప్తంగా వివిధ సెల్ నెట్వర్క్ లు వినియోగదారుల విషయంలో చేస్తున్న మోసాలపై నేరుగా వినియోగదారుడు పోస్టు కార్డు ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లేదంటే ఈమెయిల్  ద్వారా, నేరుగా ల్యాండ్ లైన్ ఫోన్ నెంబరుకి కూడా కాల్ చేసి( హిందీ లేదా ఇంగ్లీషులో) మాట్లాడి చెప్పవచ్చు.  వినియోగదారుల  సౌకర్యార్ధం న్యూ ఢిల్లీలోని ట్రాయ్ ప్రధాన కార్యాలయం అడ్రసు, ఫోన్ నెంబరు, ఫ్యాక్స్ నెంబరు, ఈమెయిల్ ఐడీ, ల్యాండ్ లైన్ నెంబర్లును  ప్రత్యేకంగా అందిస్తున్నాం.. మీ సమస్యలను ఇకపై మీరే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. Telecom Regulatory Authority of India, Mahanagar Doorsanchar Bhawan (next to Zakir Hussain College),Jawaharlal Nehru Marg (Old Minto Road),New Delhi: 110 002,E-mail ID : ap@trai.gov.in, daca@trai.gov.in Phone No: 91-11-2323 6308 (Reception), FAX No: 91-11-2321 3294 (Reception)


New Delhi

2023-02-18 10:07:46

తిరుమల శ్రీవారి దర్శనానికి 19 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని గురువారం అర్ధరాత్రి వరకూ 65,633 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ. 3.68 కోట్లు వచ్చింది. 23,352 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. ఇంకా 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. స్వామివారి దర్శనానికి 19 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-02-18 03:48:48

షిర్డీ సాయిని దర్శనానికి వెళ్లే భక్తులకు డిజిసిఏ శుభార్త

మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబాను దర్శించుకునే భక్తులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. షిర్డీ ఎయిర్ పోర్టులో రాత్రివేళల్లోనూ విమానాల రాకపోకలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA)అనుమతించిందని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. మార్చి లేదా ఏప్రిల్ లో రాత్రి సమయాల్లో విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి షిర్డీకి ప్రస్తుతం 13 సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయని, కేవలం పగలు మాత్రమే విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అనుమతి ఉందని అన్నారు. కొత్తగా వచ్చిన అనుమతితో షిర్డీ సాయిబాబాను దర్శించుకోవడానికి వచ్చే భక్తులతోపాటు, పలు విమాన సంస్థలు కూడా విమానాలను నడిపే అవకాశం వుంటుందని అన్నారు. కాగా నైట్ సర్వీసులు అందుబాటులోకి రావడం ద్వారా సుదూర ప్రాంతాలను వచ్చే భక్తులకు మార్గమం సుగమం కానుంది.

Shirdi

2023-02-17 04:25:46

తిరుమల శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని గురువారం అర్ధరాత్రి వరకూ 54,469 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ. 3.85 కోట్లు వచ్చింది. 25,484 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. ఇంకా 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. స్వామివారి దర్శనానికి 30 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.


Tirumala

2023-02-17 01:14:35

తిరుమల శ్రీవారి దర్శనానికి 24గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని బుధవారం అర్ధరాత్రి వరకూ 66,033 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ. 4.33 కోట్లు వచ్చింది. 25,688 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. ఇంకా 12 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-02-16 09:16:19

తిరుమల శ్రీవారి దర్శనానికి 24గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మంగళవారం అర్ధరాత్రి వరకూ 70,789 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ. 4.13 కోట్లు వచ్చింది. 21,215 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. ఇంకా 10 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.


Tirumala

2023-02-15 02:56:53

తిరుమల శ్రీవారి దర్శనానికి 14గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని సోమవారం అర్ధరాత్రి వరకూ 71,434మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ. 3.78 కోట్లు వచ్చింది. 24,212 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. ఇంకా 15 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. స్వామివారి దర్శనానికి 14 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-02-14 04:16:56

14న వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారికి ఆన్‌లైన్ కోటాను ఫిబ్రవరి 14న ఉదయం 9 గంటలకు  విడుదల చేయనున్నట్టు  తిరుమల తిరుపతి దేవస్థానం తెలియజేసింది. ఈ మేరకు మీడియాకు ప్రకటన విడుదల చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి నిర్ణీత సమయంలో ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది.

Tirumala

2023-02-13 06:02:50