1 ENS Live Breaking News

తిరుమల శ్రీవారి దర్శనానికి 14గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ఆదివారం అర్ధరాత్రి వరకూ 80,969 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ. 4.18 కోట్లు వచ్చింది. 26,777 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. ఇంకా 15 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. స్వామివారి దర్శనానికి 14 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-02-13 03:43:33

ఆంధ్రప్రదేశ్ లో 72 రైల్వే స్టేషన్లకు మహర్ధశ

‘అమృత్‌ భారత్‌ స్టేషన్స్‌’ పథకం కింద దేశంలో 1,275 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ సహా 72 రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ అభివృద్ధి చేయనుంది.  ఈ పథకం కింద రైల్వే స్టేషన్లలో 53 రకాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తారు. దానికోసం ప్రతి స్టేషన్‌ అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్‌ప్లాన్‌ రూపొందిస్తారు. దానికోసం నిపుణుల కమిటీలను నియమిస్తామని రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి. అనంతరం బడ్జెట్‌ను రూపొందించి దశలవారీగా పనులు ప్రారంభించనున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో చాలా వరకూ రైల్వే స్టేషన్లు కొత్త అభివ్రుద్ధి శోభను సంతరించుకోనున్నాయి. అంతేకాకుండా ప్రాధాన్యత కలిగిన లైన్లలో రైళ్ల పెంపుపైనా ప్రకటన వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

రాష్ట్రంలో అభివృద్ధి చేయనున్న రైల్వే స్టేషన్లు ఇవే..
విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం, విజయనగరం, తెనాలి, గుంటూరు, ఆదోని, అనకాపల్లి, అనపర్తి, అరకు, బాపట్ల, భీమవరం టౌన్, బొబ్బిలి, చీపురుపల్లి, చీరాల, చిత్తూరు, కడప, కంభం, ధర్మవరం, డోన్, దొనకొండ, దువ్వాడ, యలమంచిలి, ఏలూరు, గిద్దలూరు, గుత్తి, గుడివాడ, గూడురు, గుణదల, హిందూపూర్, ఇచ్ఛాపురం, కదిరి, కాకినాడ టౌన్, కొత్తవలస, కుప్పం, కర్నూలు సిటీ, మాచర్ల, మచిలీపట్నం, మదనపల్లి రోడ్, మంగళగిరి, మార్కాపూరం రోడ్, మంత్రాలయం రోడ్, నడికుడి, నంద్యాల, నరసరావు­పేట, నరసాపూర్, నౌపడ, నెల్లూరు, నిడద­వోలు, ఒంగోలు, పాకాల, పలాస, పార్వతీపురం, పిడుగురాళ్ల, పీలేరు, రాజంపేట, రాజమహేంద్రవరం, రాయనపాడు, రేణిగుంట, రేపల్లె, సామర్లకోట, సత్తెనపల్లి, సింహాచలం, సింగరాయకొండ, శ్రీకాళహస్తి, శ్రీకాకుళం రోడ్, సూళ్లూరుపేట, తాడేపల్లిగూడెం, తాడిపత్రి, తుని, వినుకొండ.  

స్టేషన్లలో కల్పించనున్న  సౌకర్యాల్లో మచ్చుకు కొన్ని..
ప్రతి స్టేషన్‌లో భవనాలు, ఫ్లోరింగ్‌ ఆధునిక శైలిలో నిర్మాణం ,  ప్రస్తుతం ప్లాట్‌ఫామ్‌లు 600 మీటర్ల పొడవుతో ఉన్నాయి. వాటి పొడవు 760 మీటర్ల నుంచి 840 మీటర్ల వరకు పెంచనున్నారు.  స్టేషన్ల వద్ద ట్రాక్‌ల శుభ్రత, సులభమైన నిర్వహణ కోసం ‘బ్యాలస్ట్ట్‌లెస్‌ ట్రాక్‌’ల ఏర్పాటు చేస్తారు.  ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండే ఎన్‌ఎస్‌జీ 1 – 4, ఎస్‌జీ 1– 2 కేటగిరీ స్టేషన్లలో ఎస్కలేటర్ల ఏర్పాటుతోపాటు  దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్‌ చెయిర్లు, ప్రత్యేక ప్రవేశ మార్గాలు, ఇతర సదుపాయాలు  ఏర్పాటు చేస్తారు. వీటితో పాటు వెయిటింగ్‌ హాల్స్, వాటికి అనుబంధంగా కేఫెటేరియా,  స్థానిక ఉత్పత్తుల విక్రయానికి  కనీసం రెండు స్టాల్స్‌ ఏర్పాటు చేస్తారు.  ప్రతి స్టేషన్‌ మొదటి అంతస్తులో ప్రత్యేకంగా రూఫ్‌ ప్లాజా, సమావేశ మందిరాలు,  స్టేషన్‌కు రెండు వైపులా అప్రోచ్‌ రోడ్లు, పార్కింగ్‌ ఏరియా, పాదచారులకు ప్రత్యేక దారులు నిర్మిస్తారు. ల్యాండ్‌ స్కేపింగ్, ఆధునిక లైటింగ్‌ తోపాటు వేగవంతమైన వైఫై సేవలకు 5జీ టవర్లు నిర్మించనున్నారు. ఇంకా మరికొన్ని అభివ్రుద్ధి పనులు చేపట్టనున్నారు. కాగా నిపుణుల కమిటీ త్వరలోనే వీటిని ప్రకటించనుంది.


New Delhi

2023-02-12 14:23:46

ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ గా ఎస్.అబ్దుల్ నజీర్

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ జడ్డి ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ ని నియమించింది. దేశంలో 12 రాష్ట్రాల గవర్నర్ లను మార్పుచేసిన కేంద్రం ఏపీలోనూ గవర్నర్ ను మార్చింది. నిన్నటి వరకూ ఏపీ గవర్నర్ గా భిశ్వభూషన్ హరిచందన్ గవర్నర్ గా వ్యవహరించేవారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశియారి, లద్దాక్ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్ రాధాకృష్ణ రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.  అరుణాచల్‌ ప్రదేశ్ కి. త్రివిక్రమ్‌ పర్నాయక్‌,  సిక్కింకి లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య,  ఛత్తీస్‌ఘఢ్ కి బిశ్వభూషణ్‌ హరిచందన్‌, మహారాష్ట్ర కి రమేష్‌, మేఘాలయకి చౌహాన్‌ లను మార్పు చేసింది.

Delhi

2023-02-12 05:10:26

తిరుమల శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శనివారం అర్ధరాత్రి వరకూ 75,728 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.4.15  కోట్లు వచ్చింది. 38,092  మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. అన్ని కంపార్ట్ మెంట్లతో పాటు టిబిసీ కాంప్లెక్ బయట వరకూ భక్తులు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. స్వామివారి దర్శనానికి 30 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-02-12 04:37:20

తిరుమల శ్రీవారి దర్శనానికి 14గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని బుధవారం అర్ధరాత్రి వరకూ 63,315 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.5.07 కోట్లు వచ్చింది. 25,259 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. ఇంకా 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-02-09 03:37:25

తిరుమల శ్రీవారి దర్శనానికి 8గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సోమవారం అర్ధరాత్రి వరకూ 71,496 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.5.33 కోట్లు వచ్చింది. 26,908 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. ఇంకా 2 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-02-07 02:24:41

తిరుమల శ్రీవారి దర్శనానికి 24గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ఆదివారం అర్ధరాత్రి వరకూ 78,340 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.4.30 కోట్లు వచ్చింది. 27,063 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. ఇంకా 10 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-02-06 08:46:45

తిరుమల శ్రీవారి దర్శనానికి 14గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శుక్రవారం అర్ధరాత్రి వరకూ 57,147 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.3.78 కోట్లు వచ్చింది. 26,094 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. ఇంకా 18 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. స్వామివారి దర్శనానికి 14 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-02-04 04:11:49

తిరుపతి సిమ్స్ కి ఐఓసిఎల్ రూ.22 కోట్లు విరాళం

సిమ్స్ లో వైద్య పరికరాల కొనుగోలు కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ రూ.22 కోట్లు విరాళంగా అందించేందుకు ముందుకొచ్చింది. టీటీడీ  పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్ లో శుక్రవారం సాయంత్రం ఈ మేరకు ఈవో ఏవి ధర్మారెడ్డి సమక్షంలో ఐఓసీఎల్ ,స్విమ్స్ అధికారులు ఎంఓయు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మార్కెటింగ్ డైరెక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ, స్విమ్స్ లో రోగులకు వైద్య సహాయం అందించడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ఈ నిధులను అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి టీటీడీ తిరుమలలో భక్తులకు, సిమ్స్, బర్డ్, చిన్న పిల్లల ఆసుపత్రుల్లో  రోగులకు అందిస్తున్న సేవలను వివరించారు. తిరుపతి ఎంపి డాక్టర్ గురుమూర్తి, జేఈవో సదా భార్గవి, సిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, ఎఫ్ఏసీఏవో బాలాజీ, సిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, ఐఓసీఎల్  ఎపి, తెలంగాణ ఇంచార్జ్ అనిల్ కుమార్, రాయలసీమ రీజనల్ హెడ్  రోహిత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Tirumala

2023-02-03 14:00:47

బిబిసి డాక్యుమెంటరీపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

భారత ప్రధాని మోదీపై బీబీసీ చిత్రీకరించిన2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి డాక్యుమెంటరీ నిషేధాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటీషన్లు విషయంలో కేంద్రానికి చుక్కెదురైంది. ఈ పిటీషన్లపై ఈరోజు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లోగా దీనిపై సమాధానమివ్వాలని కోరింది. తదుపరి విచారణను ధర్మాసనం ఏప్రిల్‌కు వాయిదా వేసింది. దీనితో బిబిసి డాక్యుమెంటరీ విషయంలో కేంద్రానికి బంగపాటు  తప్పలేదు. మోదీ వలనే అల్లర్లు జరిగాయనే సారాంశంతో ఈ డాక్యుమెంటరీని దేశవ్యాప్తంగా పలు యూనివర్శిటీలో కూడా ప్రదర్శించడం విశేషం.

Delhi

2023-02-03 10:15:18

ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం

తిరుపతికి చెందిన ఆల్ ఇండియా ఆర్యవైశ్య వాసవి నిత్య అన్నదాన ట్రస్టుకు చెందిన ఉమామహేశ్వరి దంపతులు రూ.10 లక్షలు విరాళం అందించారు.ఈ మేర‌కు విరాళం డిడిని శుక్రవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈఓ  ఎవి.ధర్మారెడ్డికి అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో ఎస్విబిసి సిఇవో  షణ్ముఖ కుమార్ పాల్గొన్నారు. అనంతరం దాతలు స్వామివారిని దర్శించుకున్నారు. వారికి టిటిడి అధికారులు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.

Tirumala

2023-02-03 07:13:48

తిరుమల శ్రీవారి దర్శనానికి 12గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని గురువారం అర్ధరాత్రి వరకూ 60,609 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.3.13 కోట్లు వచ్చింది. 23,394 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. ఇంకా 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-02-03 02:04:24

తిరుమలలో ఫిబ్రవరి 5న శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి

తిరుమల దివ్య క్షేత్రంలో ఫిబ్రవరి 5వ తేదీ శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి అత్యంత వైభవంగా జరుగనుంది. పురాణాలపరంగా తిరుమలలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయి. అయితే ఈపుణ్యతీర్థాలలో, సప్తగిరులలో వెలసి ఉన్న సప్త తీర్థములు ప్రముఖమైనవి. వీటిలో స్వామి పుష్కరిణీ తీర్థము, కూమారధార తీర్థము, తుంబురు తీర్థము, శ్రీరామకృష్ణ తీర్థము, ఆకాశగంగ తీర్థము, పాపవినాశన తీర్థము, పాండవ తీర్థము అత్యంత ప్రసిద్ధమైనవి. ఈ తీర్థాలలో స్నానమాచరించిన యెడల భక్తులు పరమ పావనులై ముక్తి మార్గం పొందగలరని ఆర్యోక్తి. ''శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి'' ప్రతి ఏటా మాఘ మాసం నందు నిర్వహించడం ఆనవాయితి. ఈ పుణ్యతీర్థము స్వామివారి ఆలయానికి 6 మైళ్ళ దూరంలో వెలసివున్నది. పౌర్ణమినాడు ఈ రామకృష్ణ తీర్థ పర్వదినమును ఆలయ ఆర్చకులు అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

స్కంద పురాణాను సారం పూర్వకాలమున శ్రీరామకృష్ణుడను మహర్షి వేంకటాద్రిపై తపస్సు చేసి, తాను స్నానమాచరించడానికి ఈ తీర్థాన్ని రూపొందించుకున్నాడు. ఈ తీర్థ తీరమున నివసించుచూ, స్నానపానాదులు చేయుచూ, శ్రీమహావిష్ణువును గూర్చి కఠోర తపస్సు ఆచరించి విష్ణువు సాక్షాత్కారంతో ముక్తి పొందెను. ఎవరైన మానవులు అజ్ఞానంతో తల్లి దండ్రులను, గురువులను దూషించినందు వల్ల కలిగినటువంటి దోషమును, ఈ పుణ్యతీర్థమునందు స్నానమాచరించుట వలన ఆ దోషము నుండి విముక్తి పొంది సుఖముగా జీవించగలరని ప్రాశస్త్యం.  ఈ పర్వదినంనాడు ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు మొదలగు పూజా సామగ్రిని తీసుకు వెళ్ళి శ్రీరామకృష్ణ తీర్థంలో వెలసివున్న శ్రీరామచంద్ర మూర్తి మరియు శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఉత్సవంలో ఆలయ అర్చకులు, టిటిడి అధికారులు, భక్తులు పాల్గొంటారు.

Tirumala

2023-02-02 12:59:26

ఫిబ్రవరి 5న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

తిరుమలలో ఫిబ్రవరి 5వ తేదీ పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తూ వస్తున్నారు.     ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. గరుడసేవకోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటి అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. స్వామివారికి చేసే సేవలను ఎస్వీబీసీ ద్వారా భక్తులకు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా అందిస్తారు.

Tirumala

2023-02-02 12:56:08

తిరుమల శ్రీవారి దర్శనానికి 12గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని బుధవారం అర్ధరాత్రి వరకూ 61,368 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.3.96 కోట్లు వచ్చింది. ఇంకా 7 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-02-02 04:43:08