1 ENS Live Breaking News

వృద్ధులు, దివ్యాంగులకు ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్లు

తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులు ఏప్రిల్ నెల ప్ర‌త్యేక ద‌ర్శ‌న టోకెన్ల కోటాను ఏప్రిల్ 8వ తేదీన శుక్రవారం ఉద‌యం 11 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. సాఫ్ట్‌వేర్‌లో ఏర్ప‌డిన సాంకేతిక స‌మ‌స్య వ‌ల్ల ఏప్రిల్ 1వ తేదీకి బ‌దులుగా ఏప్రిల్ 8వ తేదీకి ద‌ర్శ‌న టోకెన్ల‌ను వాయిదా వేశారు. రోజుకు వెయ్యి టోకెన్ల చొప్పున జారీ చేస్తారు. ఏప్రిల్ 9వ తేదీ నుండి నిర్దేశించిన స్లాట్‌లో వీరిని ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో రెండేళ్ల త‌రువాత వృద్ధులు, దివ్యాంగుల ప్ర‌త్యేక ద‌ర్శ‌నాన్ని టిటిడి పున‌రుద్ధ‌రించింది.   కాగా, వీరిని ప్ర‌తిరోజూ ఉద‌యం 10 గంట‌ల స్లాట్‌లో దివ్యాంగుల క్యూలైన్ ద్వారా ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. శుక్ర‌వారం నాడు మాత్రం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స్లాట్ కేటాయించారు.  వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ఆన్‌లైన్‌లో ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టిటిడి కోరుతోంది..

Tirumala

2022-04-07 13:19:48

తిరుమలలో ప‌తాంజ‌లి యోగ దర్శ‌నం..

 తిరుమల నాదనీరాజనం వేదికపై ఏప్రిల్ 10వ తేదీ నుండి ప‌తాంజ‌లి దర్శ‌నం కార్యక్రమాన్ని ప్రారంభించ‌నున్న‌ట్లు అదనపు  ఎవి.ధర్మా రెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం ధ‌ర్మ‌గిరి వేద విజ్ఙాన పీఠం, కేంద్రీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం పండితుల‌తో అద‌న‌పు ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా టిటిడి నిర్వ‌హించిన సుంద‌ర‌కాండ‌, స‌క‌ల కార్య‌సిద్ధి శ్రీ‌మ‌ద్ రామాయ‌ణ పారాయ‌ణం, యుద్ధ‌కాండ‌, బాల కాండ, విరాట‌ప‌ర్వం, గీతా పారాయ‌ణ కార్యక్ర‌మానికి ప్ర‌పంచ వ్యాప్తంగా భ‌క్తుల నుండి విశేష ఆద‌ర‌ణ ల‌భించింద‌న్నారు.  ఈనెల  9వ తేదీకి విష్ణు సహస్రనామ పారాయణం పూర్తవుతుందని దాని స్థానంలో శ్రీ కుప్పా విశ్వనాథ శర్మ ఆధ్వర్యంలో శ్రీ‌రామ‌న‌వ‌మి ప‌ర్వ‌దినాన్న‌ సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు యోగ దర్శ‌నం కార్య‌క్ర‌మం ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపారు. దీనితో పాటు భ‌గ‌వ‌ద్గీత శ్లోక పారాయ‌ణం నిర్వ‌హిస్తార‌ని చెప్పారు. అదేవిధంగా గరుడ పురాణం, స‌భా పర్వం, అరణ్యపర్వం వంటి ఇతర పారాయ‌ణ కార్యక్రమాలు ఒకటి పూర్త‌యిన తర్వాత ఒకటి ప్రారంభమవుతాయని వివరించారు. కాగా అంతకుముందు ప్రతి నెలా నిర్వహించే అధికారుల స‌మ‌న్వ‌య‌ సమావేశం నిర్వహించారు. ఇందులో తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి ప‌నుల‌పై ఆయా విభాగాల అధికారుల‌తో ఆయన సమీక్షించారు.

ఏప్రిల్ 16న చెన్నైలో శ్రీనివాస కళ్యాణం : ప‌ర్వ‌దినాన్న‌

టిటిడి ఆధ్వర్యంలో ఏప్రిల్ 16న చెన్నైలోని ఐలాండ్ గ్రౌండ్ లో శ్రీనివాస కళ్యాణం నిర్వ‌హించ‌నున్న‌ట్లు అద‌న‌పు ఈవో తెలిపారు. శ్రీ‌వారి కళ్యాణానికి ఆయా విభాగాలు చేయవలసిన ఏర్పాట్లపై అధికారులతో ఆయ‌న సమీక్షించారు.  శ్రీ‌వారి ఆలయ ప్రధాన అర్చకులు  వేణుగోపాల్ దీక్షితులు, కృష్ణ‌శేషాచ‌ల దీక్షితులు,  గోవిందరాజ‌ దీక్షితులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. ఎస్ఇ - 2  జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్‌బాబు, ఎస్వీబిసి సిఈవో  సురేష్ కుమార్‌, జియం  శేషారెడ్డి, ఇత‌ర విభాగాల అధికారులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

Tirumala

2022-04-06 14:17:46

రాష్ట్రీయ సాంస్క్రుతిక మహోత్సవ్.. రాజమండ్రి నుంచి ప్రత్యక్ష ప్రసారం..

రాష్ట్రీయ సాంస్క్రుతిక మహోత్సవ్ కార్యక్రమం రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల  కేంద్రంగా జరుగుతుంది. ఆ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ మాట్లాడుతున్నారు. భారత స్వాతంత్ర్య ఫలాలు భారతీయులు అందరికీ అందాలి. వాటికోసం ప్రభుత్వాలు శ్రమించాలి అని పేర్కొన్నారు. క్విట్ ఇండియా పోరాటాన్ని ప్రపంచం మొత్తం చూసిందన్నారు. ఆ ప్రత్యక్ష ప్రసారాలను ఈఎన్ఎస్ లైవ్ ప్రేక్షకుల కోసం అందిస్తున్నాం..

రాజమండ్రి

2022-03-26 11:10:25

విశాఖలో జరుతున్న మిలాన్ 2022..ఈఎన్ఎస్ లైవ్ ప్రసారాలు

విశాఖ వేదికగా మిలాన్ 2022 వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఆ ప్రత్యక్ష ప్రసారాలను ఈఎన్ఎన్ లైవ్ మొబైల్ యాప్ ద్వారా (సప్తగిరి తెలుగు సహకారంతో) మీకు అందిస్తున్నాం. మీరూ వీక్షించండి.. మీ అరచేతిలోనే ఇపుడు మిలాన్ 2022 ప్రత్యక్ష ప్రసారం..

Visakhapatnam

2022-02-27 13:18:07

పోర్టు కార్మికుల సమస్యలు పరిష్కరించండి..

కేంద్ర పోర్టులు, షిప్పింగ్ మంత్రిత్వశాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ ను విశాఖ  పోర్టు ట్రస్టు మాజీ సలహాదారు, అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు  ఘనంగా సత్కరించారు. గురువారం విశాఖలోని  బీచ్ రోడ్ లోని అతిధి గృహంలో  కేంద్రమంత్రికి సింహాద్రినాధుడి జ్ఞాపికను అందజేసి స్వామి గొప్పతనాన్ని శ్రీనుబాబు వివరించారు. సింహాద్రినాధుడు అత్యంత మహిమాన్వితుడని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం కేంద్రమంత్రికి పలు అంశాలుతో కూడిన వినతిపత్రంను శ్రీనుబాబు అందజేశారు. విశాఖ పోర్టులో కార్మికులకు న్యాయం చేయాలని, వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్. భాజాపా ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు, సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ సాగి కాశీవిశ్వనాధరాజు. పార్టీ నగర అధ్యక్షులు మేడపాటి రవీంద్రనాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-02-24 04:37:27

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి..

భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి గురువారం ఉద‌యం తిరుమ‌ల శ్రీ‌వారిని దర్శించుకున్నారు.   అంతకుముందు వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా మహద్వారం వద్దకు చేరుకున్నారు.   ఉపరాష్ట్రపతికి టిటిడి చైర్మ‌న్  వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి స్వాగతం ప‌లికారు. త‌రువాత‌ ఆయ‌న శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు.  అనంత‌రం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఉపరాష్ట్రపతికి చైర్మ‌న్‌, ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు, క్యాలెండర్‌, డైరీ, కాఫీ టేబుల్‌ పుస్తకాన్ని అంద‌జేశారు. ఇటీవల డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో త‌యారు చేసిన ల్యామినేటెడ్ ఫోటో, అగ‌ర‌బ‌త్తులు, పంచగవ్య ఉత్పత్తులు మరియు ఆరు షీట్ల క్యాలెండర్‌ ఈవో అందజేస్తూ, వాటి తయారీ, ప్రాముఖ్యతను ఉపరాష్ట్రపతికి వివరించారు.  ఈ సందర్భంగా గౌ. ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళికి శ్రీవేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రసాదించాలని ప్రార్థించిన్నట్లు తెలిపారు. టిటిడి అనేక కొత్త కార్యక్రమాలు చేపట్టడంతోపాటు, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా స‌నాత‌న హిందూ ధర్మ ప్రచారాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకు వెళుతున్నందుకు ఆయన ప్రశంసించారు. గురువారం వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న తన మనుమ‌రాలు సుష్మ‌కు ఆనందకరమైన వైవాహిక జీవితాన్నిఅనుగ్రహించాలని శ్రీవారిని కోరినట్లు ఆయన తెలిపారు.  చెన్నై స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షులు  శేఖర్ రెడ్డి, ఢిల్లీ స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షురాలు ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి, సివిఎస్వో  గోపీనాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్ బాబు, రిసెప్షన్ డెప్యూటీ ఈవో  లోకనాథం తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2022-02-10 06:52:21

2022-01-26 03:55:29

జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శిగా గంట్ల.. 2వసారి కీలకబాధ్యతలు అప్పగించిన ఎన్ఏజె..

జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శిగా విశాఖకు (ఆంధ్రప్రదేశ్ ) చెందిన గంట్ల శ్రీనుబాబును నియమిస్తూ జాతీయ జర్నలిస్టుల సమాఖ్య (నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎన్ఏజె అధ్యక్షులు ఎస్.కె.పాండా సోమవారం ఢిల్లీలో ఈ ఉత్తర్వులను విడుదల చేశారు. ఇటీవల జరిగిన జాతీయ స్థాయి సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా పాండా వెల్లడించారు. నగరానికి చెందిన గంట్ల శ్రీనుబాబు 24 ఏళ్లుగా జర్నలిజంలో కొనసాగుతూ సుమారు 20 ఏళ్లుగా అనేక యూనియన్లకు నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఎన్ఏజెకు జాతీయ కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనియన్) రాష్ట్ర కార్యదర్శిగా, కీలకమైన వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ నేపధ్యంలోనే మరోసారి శ్రీనుబాబు సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయించి ఎన్ఎజె ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాండా వెల్లడించినట్లు శ్రీనుబాబు తెలిపారు. ఈ సందర్భంగా తనను నియమించిన ఎన్ఏజె అధ్యక్షులు ఎస్.కె.పాండాతో పాటు జాతీయ సమాఖ్య  కార్యవర్గానికి శ్రీనుబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. తాను రాష్ట్రస్థాయి కార్యవర్గంతో పాటు జాతీయ స్థాయి కార్యవర్గంలోనూ కొనసాగుతూ జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేయనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తనను జాతీయ స్థాయి కార్యవర్గానికి ప్రతిపాదించిన ఏపి వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటరావు, ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులతో పాటు ఎన్ఏజె కోశాధికారి  ఆకుల అమరయ్య, రాష్ట్ర కార్యవర్గానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. పెందుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా తాను నాయకత్వ బాధ్యతలు తొలిసారిగా చేపట్టడం జరిగిందని ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఉపాధ్యక్షులుగా మూడు పర్యాయాలు, రాష్ట్ర కార్యదర్శిగా నాలుగు పర్యాయాలు పనిచేయడం జరిగిందని, ప్రతిష్టాత్మకమైన వైజాగ్ జర్నలిస్టుల ఫోరం కార్యదర్శిగా, తదుపరి అధ్యక్షులుగా తన వంతు సేవలందించడం జరుగుతూ వస్తుందన్నారు. రెండోసారి జాతీయ స్థాయి కార్యవర్గంలో తనకు అవకాశం కల్పించారన్నారు. ఇందుకు సహకరించిన జాతీయ స్థాయి నేతలతో పాటు రాష్ట్ర, జిల్లా కార్యవర్గాలకు తాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న బాధ్యతలుతో పాటు భవిష్యత్తులో కూడా తన వంతు సేవలు జర్నలిస్టులకు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. జర్నలిస్టుల సంక్షేమంతో పాటు నేవల్ డాక్ యార్డ్  ఉద్యోగుల కేటీబీ సంఘం గౌరవ అధ్యక్షుడిగా, పోర్టు ట్రస్టు సలహాదారుగా సేవలందించడం జరిగిందన్నారు. ప్రస్తుతం సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. వీటితో పాటు పలు ఆలయాలు ధర్మకర్తల మండల్లు గౌరవ అధ్యక్షులుగా సేవలు అందిస్తున్న ట్లు చెప్పారు.. తన కెరీర్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నుంచి మూడు సార్లు రాష్ట్ర స్థాయ అవార్డ్ లు, జాతీయం స్థాయిలో వేర్వేరు సంస్థల నుంచి , వివిద సంస్థల నుంచి మొత్తం 26 అవార్డ్లు స్వీకరించడం  జరిగిందన్నారు.. ప్రతీ ఒక్కరు సహకారం వల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగామన్నారు.

New Delhi

2022-01-24 06:12:08

2022-01-18 07:43:43

విజేఎఫ్ డైరీని ఆవిష్కరించిన లోక్ సభ స్పీకర్..

భారత దేశం అన్ని రంగాల్లో ప్రగతి సాధించడానికి మీడియానే మార్గదర్శకంగా నిలుస్తోందని లోక్ సభ  స్పీకర్ ఓం బిర్లా అన్నారు. బుదవారం న్యూఢిల్లీలోని లోక్  సభ  స్పీకర్ కార్యాలయంలో వైజాగ్ జర్నలిస్టుల ఫోరం 2022 నూతన డైరీని స్పీకర్ ఓం బిర్లా  ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రపంచ  దేశాలతో పోటీపడి భారత్  అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబడడానికి జర్నలిస్టులు సేవలు ఎంత గానో దోహద పడుతున్నాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి  జర్నలిస్ట్ లు అందిస్తున్న సహకారం అభినందనీయం అన్నారు. దేశములో అన్ని రంగాల అభివృద్ధికి మీడియా తమ వంతు సేవలు సంపూర్ణంగా అందిస్తుందన్నారు. ఈ అంశంలో భారత్ ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు.సమాజ చైతన్యం లో జర్నలిస్టుల పాత్ర అత్యంత ప్రశంసనీయమైనది అని పేర్కొన్నారు... విశాఖ అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అని అంతేకాకుండా అందమైన నగరాల్లో కూడా ముందువరుసలో ఉందన్నారు. మూడున్నర దశాబ్దాలుగా వైజాగ్ జర్నలిస్టుల ఫోరం  చేపడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు అత్యంత ప్రశంసనీయమని స్పీకర్ కొనియాడారు. విశాఖ ఎంపి ఎంవీవీ సత్య నారాయణ మట్లాడుతూ జర్నలిస్ట్ లు సంక్షేమానికి వీజేఎఫ్ ఎంతగానో కృషి చేస్తుంది అన్నారు. అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో అందరినీ భాగస్వామ్యం చేసిన ఘనత ఫోరమ్ కే దక్కుతుందన్నారు. కార్య క్రమం లో తొలుత స్పీకర్ ను వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తిరుమల  శ్రీ వేంకటేశ్వరస్వామి శేషవస్త్రం తో ఘనము గా సత్కరించి సింహాద్రి నాధుడు జ్ఞాపికతో సత్కరించారు. ఫోరమ్ అధ్యక్ష, కార్యదర్శి లు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి ఎస్.దుర్గారావులు ఈ సందర్భముగా జర్నలిస్టులకు తమ
ప్రెస్ క్లబ్ కు  సంబందించిన పలు అంశాలు తెలిపారు. విజేఎఫ్ ఉపాధ్యక్షులు ఆర్. నాగరాజ్ పట్నాయక్, జాయింట్ సెక్రటరీ దాడి రవి కుమార్, కార్య వర్గ సభ్యులు ఐరోతి ఈశ్వర రావు, ఎం ఎస్ ఆర్ ప్రసాద్, దొండ గిరిబాబు, నగేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Delhi

2021-12-15 13:47:00

విశాఖ ఉక్కుకోసం న్యూఢిల్లీలో గళమెత్తిన విజెఎఫ్..

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు పేరిట ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను  పరిరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన  ఉందని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కె.రామకృష్ణ, ఏపి  మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ లు అన్నారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి ఎస్ దుర్గారావులు ఆధ్వర్యంలో  మంగళవారం ఢిల్లీలోని ఏపీ భవన్  అంబేద్కర్ విగ్రహం వద్ద  వైజాగ్ జర్నలిస్టుల ఫోరం కార్యవర్గం శాంతియుత ప్రదర్శన నిర్వహించింది. ఈ కార్యక్రమములో రామకృష్ణ, చలసానిలు మాట్లాడుతూ 32 మంది ప్రాణాలు త్యాగ ఫలితం వల్లే నాడు విశాఖ ఉక్కు ఏర్పాటైందన్నారు. తాజాగా దేశములో రైతుచట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం  తక్షణమే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా సానుకూల వైఖరి తీసుకోవాలనే తామంతా కోరుకుంటున్నామన్నారు. విశాఖ ఉక్కు పై సుమారు లక్ష  కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు.  విశాఖ ఉక్కువిషయంలో కేంద్రం మరోసారి పునఃసమీక్ష చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల చిరకాల వాంఛ గా విశాఖ రైల్వేజోన్ మిగిలిపోయింతని వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో కేంద్రం ప్రకటించిన విధంగా తక్షణమే దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు విశాఖ వేదికగా ప్రారంభించాలని అయన  కోరారు. ఇందుకు సంబంధించి పలువురు ప్రముఖులకు వినతి పత్రాలు సమర్పించినట్లు కార్యదర్శి దుర్గారావు  చెప్పారు. ఈ కార్యక్రమంలో విజేఎఫ్ ఉపాధ్యక్షుడు ఆర్ నాగరాజు పట్నాయక్, జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్, కార్యవర్గ సభ్యులు దొండ  గిరిబాబు, రోతి ఈశ్వరరావు, ఎంఎస్ఆర్ ప్రసాద్, నగేష్ బాబుతదితరులు పాల్గొన్నారు.

ఏపీ భవన్ న్యూఢిల్లీ

2021-12-14 05:58:20

సర్వభూపాల వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం..

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం రథోత్సవం బదులుగా సర్వభూపాల వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు కటాక్షించారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ఉదయం 8 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.  శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న కరుణాంతరంగ అలమేలుమంగ.  సర్వభూపాలురు వాహనస్థానీయులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. ఇందులో దిక్పాలకులు కూడా ఉన్నారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా ఉన్నారు. వీరంతా నేడు జగదేకవీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు. వాహనసేవలో శ్రీశ్రీశ్రీ  పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి బోర్డు సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈఓ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో  కస్తూరిబాయి,  ఏఈవో  ప్రభాకర్ రెడ్డి, పాంచరాత్ర ఆగ‌మ‌స‌ల‌హాదారు శ్రీ‌నివాసాచార్యులు, అర్చకులు  బాబుస్వామి, సూప‌రింటెండెంట్లు  శేషగిరి,  మధుసుదన్, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tiruchanur

2021-12-07 05:08:43

మోహినీ అలంకారంలో శ్రీ అల‌మేలుమంగ‌ దర్శనం..

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం ప‌ల్ల‌కీపై మోహినీ అలంకారంలో శ్రీ అల‌మేలు మంగ‌ అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. కోవిడ్-19 నేపథ్యంలో ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ఉదయం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు పల్లకీ ఉత్సవం ఏకాంతంగా జ‌రిగింది. ఆ దివ్య మోహినీ మాయాశక్తికి వశమైన జగత్తు వాహ్య వాహకభేదాన్నిగుర్తుంచుకోలేకపోయింది. ఈనాటి అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తోంది. వాహనసేవలో శ్రీశ్రీశ్రీ  పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈఓ  వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో కస్తూరిబాయి, ఏఈవో  ప్రభాకర్ రెడ్డి, పాంచరాత్ర ఆగ‌మ‌స‌ల‌హాదారు  శ్రీ‌నివాసాచార్యులు, అర్చకులు బాబుస్వామి, సూప‌రింటెండెంట్లు  శేషగిరి,  మధుసుదన్, ఏవిఎస్వో  వెంకటరమణ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tiruchanur

2021-12-04 08:09:14

తిరుమల శ్రీవారి అన్న ప్రసాదం ట్రస్టుకి రూ.కోటి విరాళం..

తిరుమలలోని శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకి భల్లారికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎన్.సూర్యనారాయణ రెడ్డి ఒక కోటి రూపాయాలను విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని దేవస్థానం అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టు నుంచి నిత్యం కొన్ని వేల మందికి అన్నప్రసాదం అందుతోందని, అలాంటి ట్రస్టుకి విరాళం ఇవ్వడం శ్రీవారి సేవగా భావిస్తున్నట్టు చెప్పారు. స్వామివారి అన్నప్రసాదం మరింత మందికి అందాలనే లక్ష్యంతో తమవంతుగా ఈ విరాళాన్ని అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దాతల కుటుంబ సభ్యులు, టిటిడి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2021-12-04 03:34:19

ఎంపీ విజయ సాయిరెడ్డిని కలసిన ఎమ్మెల్సీ వంశీ..

రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జి  వి. విజయసాయిరెడ్డిని ఎమ్మెల్సీ, వైసీపీ విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జీవీఎంసీ పరిధిలోని పలు అంశాలపై రాజ్యసభ సభ్యులతో చర్చించారు. అంతేకాకుండా మొదటి నుంచి పార్టీ కి అహర్నిశలు కృషి చేస్తున్న పలువురికి నామినేటడ్ పదవులలో అవకాశాలు కల్పించాలని వంశీ విజయసాయిరెడ్డిని కోరారు.  పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వంశీ  ప్రస్తావించారు. ఎమ్మెల్సీ గా తనకు అవకాశం కల్పించిందుకు మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. త్వరలో విశాఖలో పర్యటన లో ప్రజాదర్బార్, జీవీఎంసీ పరిధిలోని పలు కీలక  అంశాలపై త్వరలో  తెలియజేస్తామని ఆయనకు తెలియజేశారు.

New Delhi

2021-12-02 15:30:13