1 ENS Live Breaking News

తిరుమల శ్రీ‌వారికి మిని లారీ విరాళం

చెన్నైకి చెందిన అశోక్ లైలాండ్ కంపెనీ నూతనంగా ‌తయారుచేసిన రూ.18.38 లక్షల విలువగల మిని లారీని ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్  సంజీవ్ కుమార్ ఆదివారం ఉద‌యం తిరుమల శ్రీవారికి విరాళంగా అందించారు.  ఈ మేర‌కు లారీ రికార్డుల‌ను తిరుమలలోని శ్రీవారి ఆలయం చెంత ఆలయ డెప్యూటీ ఈఓ  రమేష్ బాబుకు అందించారు. ముందుగా వాహనానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ, అశోక్ లైలాండ్ కంపెనీ నూతన లారీని స్వామివారికి సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో డిఐ  జానకిరామ్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తిరుమల

2022-05-08 13:29:33

New Delhi

2022-05-08 06:28:32

Visakhapatnam

2022-05-07 03:04:56

New Delhi

2022-04-30 09:08:12

నవీ ముంబైలో శ్రీ‌వారి ఆలయం..

మహారాష్ట్రలోని నవీ ముంబైలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర‌ ప్రభుత్వం విరాళంగా ఇచ్చిన భూమికి సంబంధించిన పత్రాలను మహారాష్ట్ర ప్ర‌భుత్వం తరపున ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి  ఆదిత్య ఠాక్రే టీటీడీకి భూమి పత్రాలను అందజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం ఉద‌యం బోర్డు మీటింగ్‌ ప్రారంభానికి ముందు  చైర్మన్‌ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, బోర్డు స‌భ్యులు, టీటీడీ ఉన్నతాధికారుల స‌మ‌క్షంలో మ‌హారాష్ట్ర మంత్రి పత్రాలను అందించారు.  రేమండ్ గ్రూప్ చైర్మన్, ఎండి  గౌతమ్ సింఘానియా తరపున, రేమండ్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ సరిన్ ఆలయ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును తామే భరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆదిత్య ఠాక్రే,  సంజీవ్ సారిన్‌లను టీటీడీ చైర్మన్ సత్కరించారు. నవీ ముంబయిలోని ఉల్వేలో 10 ఎకరాల భూమిని కేటాయించినందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. శ్రీవారి ఆలయ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చినందుకు రేమండ్ గ్రూప్ చైర్మన్‌కు  గౌతమ్ సింఘానియాకు టీటీడీ చైర్మ‌న్ కృతజ్ఞతలు తెలిపారు.

Tirumala

2022-04-30 09:05:59

శ్రీశ్రీ పుట్టినరోజు వెనుక దాగిన అసలు నిజం..

ఇవాళ మహాకవి శ్రీశ్రీ పుట్టిన రోజు. ఏప్రిల్  30వ తేదీ రాగానే శ్రీశ్రీ  పుట్టిన రోజుగా ఆయన అభిమానులు మరొక్కసారి ఆయన్ని తలుచుకుంటూ సభలు, సమావేశాలూ నిర్వహిస్తు న్నా రు గాని ఓ పాతిక ముప్ఫై ఏళ్ల కిందట శ్రీశ్రీగారు పుట్టిన రోజు విషయంలో కొంత గంద రగోళం ఉండేది. ఫలానా తేదీన పుట్టాడని కొందరూ..కాదు, ఇదే తేదీన పుట్టాడని మరి కొందరూ వా దించుకునేవారు. ఎవరికి తోచిన తేదీన వారు శ్రీశ్రీగారి పుట్టినరోజును జరుపుకునేవారు. ఈ గందరగోళానికి తెర దించుతూ, '1910 ఏప్రిల్ 30వ తేదీనాడే శ్రీశ్రీ గారు పుట్టారహో" అని మొట్టమొదట  సాధికారికంగా ప్రకటించిన వ్యక్తి ఒకరున్నారు. ఆయనే శ్రీశ్రీ వీరాభిమాని, విరసం నేత చలసాని ప్రసాద్. ఆ విషయం నాటి ఆంధ్రభూమి విశాఖ ఎడిషన్ లో పనిచేసి న సీనియర్ జర్నలిస్టు, సంపాదకులు, నిర్వార్ధ విమర్శకులు మంగు రాజగోపాల్ ముఖ పుస్త కంలో తెలియజేశారు. ముఖ్య విషయం కనుక దానిని అక్షరం మార్చకుండా అలాగే అందిం చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా రాజగోపాల్ అందించిన వివరాల ప్రకారం.. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. నేనప్పుడు ఆంధ్రభూమి, విశాఖ ఎడిషన్ లో న్యూస్ ఎడిటర్ గా ఉన్నాను. చలసాని ప్రసాద్ మెళ్లో ఓ సంచీతో మా ఆఫీసుకి రొప్పుకుంటూ వచ్చారు. ఆయన నాకు ఏవీఎన్ కాలేజీలో చదువుకున్నప్పట్నించీ పరిచయం.  ఆయన అక్కడ లెక్చరర్ గా కూడా పని చేశారు.  ప్రసాద్ కుర్చీలో కూర్చుని, స్తిమితపడి సంచీలోంచి కొన్ని కాయితాలు తీస్తూ.. నీకోవిషయం చెప్పాలి అన్నారు. చెప్పండి పర్లేదు అన్నారు. చలసాని వంటి పెద్దాయన పనిగట్టుకొని కార్యాలయానికి వచ్చారంటే ఏదో పెద్ద విషయమే వుందని నా మనసులో ఆలోచన మెదులుతోంది. 

ఇంతలోనే  " రాజగోపాలూ..నా శ్రమ ఫలించిందయ్యా..శ్రీశ్రీ  బర్త్ డే డేటు దొరికేసింది " అంటూ ఆయన చిన్న పిల్లాడి మాదిరిగా సంబరపడిపోతూ చెప్పారు. శ్రీశ్రీ పుట్టిన తేదీ మీద సందిగ్ధత, వాదోపవాదాలకు తెర దించడానికి చలసాని ప్రసాద్ అంతకుముందే రంగంలోకి దిగి పరిశోధన ప్రారంభించిన విషయం నాకు తెలుసునని చెప్పుకొచ్చారు. ఆ పరిశోధన కోసం రికార్డులు తవ్వి తీయించడానికి ఆయన విశాఖ మున్సిపల్ ఆఫీసు చుట్టూ కాళ్లరిగేటట్టు ఎన్నిసార్లు తిరిగారో అది కూడా తాను గమనిస్తున్నానని వివరించారు. మొత్తానికి ఆయన కృషి ఫలించినందుకు నాకూ చాలా సంతోషం కలిగింది. చలసాని మాటల ద్వారా  " శ్రీశ్రీ 1910, ఏప్రిల్ 30న పుట్టాడయ్యా! కన్ఫర్మ్ అయిపోయింది. మున్సిపల్ రికార్డుల్లో ఈ విషయం నమోదయి ఉంది. ఈ న్యూసు వెంటనే  పేపర్లో వేసెయ్యాలి" అన్నాయాన. అంతే  నాకు భలే ఎక్సయిటింగ్ గా అనిపించింది. మహాకవి శ్రీశ్రీ పుట్టిన రోజు ఇదీ అని  ప్రసాద్ లాంటి వ్యక్తి సాధికారంగా చేస్తున్న ప్రకటనను మొదటిసారిగా లోకానికి చాటి చెప్పే అదృష్టం నాకు దక్కినందుకు పొంగిపోయాను. అంతేకాదు మొత్తం విషయాన్ని వార్తలా మలచి ఆ మర్నాడే మా పేపర్ లో ఆయన పేరు మీద శ్రీ శ్రీ పుట్టిన రోజు గురించి వార్త వేశామని ద్రువీకరించారు.. దురదృష్టవశాత్తూ ఆ పేపర్ కటింగ్ ని నేను దాచుకోలేకపోయాని మదన పడ్డారు కూడా.  శ్రీశ్రీ  పుట్టిన రోజునాడు శ్రీశ్రీ తోపాటు చలసాని ప్రసాద్  కూడా నాకు ఎప్పటికీ గుర్తుండి పోతారని ఈ విషయం మీతో పంచుకోవాలని ఫేస్ బుక్ లో రాశానని తెలియజేశారు. 

ఈ మొత్తం కధకు, రచనకు ఆధ్యులు మంగురాజగోపాల్, ఆయన ఫేస్ బుక్ పేజి నుంచి సమాచారం సేకరించి, కధనంలా మలిచి మాత్రమే ఈఎన్ఎస్ లైవ్ పాఠకులకు అందజేస్తున్నాం. శ్రీశ్రీ వంటి కవులు, రచయతల విషయంలో రేగిన గందర గోళం చాలా మందికి చాలా రకాలుగా గుర్తిండిపోవచ్చు. అదే సమయంలో వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత కూడా సమాజం మేలు కోరే మీడియా చేపట్టాలి. ఆ బాధ్యతను ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారి మొబైల్ న్యూస్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net స్వయాన బుజంపై వేసుకొని శ్రీశ్రీ  పుట్టిన రోజు విషయం వెనుక దాగి వున్న నిజాన్ని మా గురు సమానులు, సీనియర్ జర్నలిస్టు, సంపాదకులు, మంగు రాజగోపాల్ గారి సహకారంతో అందించాం..ధన్యవాదములు.

హైదరాబాద్

2022-04-30 05:57:01

ఆ హోటల్ లో ఫ్రీగా భోజనం చేయొచ్చు..

మథుర నుండి ఆగ్రా దారిలో ఫరా  గ్రామం ఉంది. ఫరా దాటాక  రహదారిపై "బ్రజ్ కీ రసోయి " పేరు గల రెస్టారెంట్ కనిపిస్తుంది. హోటల్ పేరు ఉన్న పెద్దబోర్డు  పై "మట్టిపాత్రలలో  వడ్డించబడును" అని కూడా రాసి ఉంది. 25 ,26 తేదీల్లో మథుర లో జరిగిన ఐ.జే.యు. జాతీయ కార్యవర్గసమావేశాలు   ముగిసాక  ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ , మహారాష్ట్ర , రాష్ట్రాల ప్రతినిధులం పదకొండు మంది 27 వ తేదీ ఉదయం మథుర నుండి ఆగ్రా బయలుదేరాం. బ్రేక్ ఫాస్ట్ కోసం మా డ్రైవరు "బ్రజ్ కీ రసోయి"  దగ్గర ఆపాడు. మట్టిపాత్రల  వడ్డన గురించిన ప్రకటన కొంచెం  ఆసక్తి కలిగించింది. లోనికి వెళ్ళేసరికి గోడల నిండా ప్రముఖ యత్రాస్థలాల పెద్ద పెద్ద చిత్రపటాలు  అలంకరించి ఉన్నాయి. అందులో లక్ష్మీనారాయణ మందిర్ పటం కూడా ఉంది. ఆపటం పై హిందీలో రాసిన మరో ప్రకటన ఇంకా ఆసక్తి కలిగించింది. "ఎవరైనా పరదేశీయులు డబ్బులు లేకపోతే ఆ విషయాన్ని ముందుగా చెప్పి భోజనం చేయవచ్చు" అని ఆ ప్రకటన సారాంశం ! ఆశ్చర్యం కలిగించిన ఆ విషయం గురించి తెలుసుకోవాలని కుతూలం కలిగింది. మా బృందం కోసం "చోలే బటురా" ఆర్డర్ ఇచ్చాం! కౌంటర్ లో కూచున్న సుబేదార్ ఠాకూర్ ని మాటల్లోకి దింపాను! తన అన్నగారయిన  విమల్ ఠాకూర్ హోటల్ కు యజమాని అనీ , హిందూస్థాన్ దినపత్రిక కు ఫరా బ్లాక్ కేంద్రానికి విలేఖరిగా  పనిచేస్తున్నారని చెప్పారు. "మేంకూడా   పాత్రికేయులమే , విమల్ ఠాకూర్ తో మేం  మాట్లాడవచ్చా"   అని అడిగాను. సుబేదార్ ఠాకూర్ తన అన్నకు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఇరవై నిముషాల్లో వస్తానని ఆయన చెప్పారు. ఆబోర్డు  మీద ఉన్న ప్రకటన గురించి సుబేదార్ ను అడిగాను. ఆయన ఆ ప్రకటన నేపథ్యాన్ని , తన అన్నగారి సేవా కార్యక్రమాల గురించి  ఉత్సాహంగా వివరించారు. సైకిల్ పై దేశయాత్ర  చేస్తున్న ఒక వ్యక్తి కొన్నేళ్ళక్రితం  ఆ హోటల్ కు వచ్చారట.

భోజనానికీ సరిపడా తనదగ్గర   డబ్బులు లేకపోవడంతో కొన్ని ఐటమ్స్ తగ్గించి తక్కువధరకు  భోజనం పెడతారా అని ఆ యాత్రికుడు అడిగాడట! కౌంటర్ లో ఉన్న  విమల్ ఠాకూర్ ఆ సైకిల్ యాత్రీకుని   వివరాలన్నీ తెలుసుకుని  , తనదగ్గరకు వచ్చిన ఒకయాత్రికుడు ఆకలితో వెళ్ళిపోవడం ఇష్టంలేక  ఉచితంగా భోజనంపెట్టి  పంపించారు.  చాలామంది యాత్రీకులు డబ్బులు లేక ,  ఉచితభోజనం కోసం యాచించలేక   భోజనం చేయకుండా  ఆకలితోనే   వెళ్ళిపోతారు కదా ,  వారి పరిస్థితి ఏమిటోనని   విమల్ ఠాకూర్ కు ఆలోచన వచ్చింది.
దాంతో డబ్బులు లేకపోయినా యాత్రికులకు భోజనం పెట్టాలన్న తలపు కలిగింది. ఆరోజే  తనహోటల్లో  ఆప్రకటన  రాయించారు.  తరచూ ఎవరోఒకరు వచ్చి ఉచిత భోజనం చేసి వెళ్తుంటారట. ఒక్కోసారి నలుగురైదుగురు కూడా ఆ సదుపాయాన్ని   వినియోగించు కుంటారట! ఇంతలో అడ్డాకు విస్తరిలో వడ్డించిన  మా టిఫిన్ వచ్చింది. మట్టిచట్టిలో కూరతెచ్చి ఇచ్చారు. నా  బ్రేక్ ఫాస్ట్ పూర్తయ్యేసరికి  విమల్ వచ్చారని సిబ్బంది చెప్పారు. హోటల్ భవనం షట్టర్లలో  చివరి షట్టర్ వైపుగా  చూపించారు. బైట హిందూస్థాన్ విలేఖరి అంటూ ఒక బోర్డు కూడా ఉంది. లోన కూచున్న నలభై ఏళ్ళ  విమల్ ఠాకూర్  నన్నూ , నాతో పాటు వచ్చిన ఖమ్మం మిత్రుడు రామ్ నారాయణ్ ను "రాధే రాధే"  అంటూ  సాదరంగా లోనికి  ఆహ్వానించారు. మథుర ప్రాంతంలో "రాధే రాధే"  అనేది సంబోధనాపదం. చాలా సేపు  ముచ్చటించాం !

ఆయన వివరాలన్నీ తెలుసుకున్నాం ! ఫరా గ్రామానికి దగ్గర్లోనే ఉన్న రెండువందల కుటుంబాలు ఉన్న  నాగలా చంద్రభాన్ గ్రామం తనది. ఆర్.ఎస్.ఎస్. సిద్ధాంతకర్తలలో  ఒకరు , భారతీయ జన్ సంఘ్ వ్యవస్థాపకుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్వగ్రామం అది. ఆ గ్రామంలోని ఒక పేద  రైతుకుటుంబంలో విమల్ ఠాకూర్  పుట్టాడు. ఆరుగురు సోదరులలో  పెద్దవాడు. ఒక చెల్లికూడా ఉంది. తినడానికి తిండి కూడా కష్టమైన కుటుంబం అది. రెక్కలకష్టమే జీవనాధారం. తల్లితండ్రులు ఎంతో  కష్టించారు. బడికి వెళ్ళడానికి కనీసం  యూనిఫారం ,చెప్పులులేని స్థితిలో  విమల్ ఎంతో  కష్టపడి చదువుకున్నాడు. బీఎస్సీ , బి.ఇడి , ఎం. ఏ. చదివాడు. ఊళ్ళోవాళ్ళ  ఆర్థికసహాయంతో  హోటల్  వ్యాపారాన్ని  చిన్నస్తాయిలో ప్రారంభించారు. అది విజయవంతం  అయ్యింది. ఇంకా రకరకాల పనులు చేశారు. కుటుంబం అంతా కష్టపడ్డారు. ఇప్పుడు ఒకస్థాయికి ఎదిగారు.
2008 లో విమల్ ఠాకూర్  హిందూస్థాన్ పత్రికకి "ఫరా " బ్లాక్ కేంద్రం విలేఖరి అయ్యారు.

"హిందూస్థాన్"  అత్యధిక సర్క్యులేషన్ కలిగిన పత్రిక కావడంతో  దాని విలేఖరిగా అధికారులతో ,  ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. గ్రామాల్లో సర్పంచ్ లు , ప్రజలు  ఏ సమస్యవచ్చినా విమల్ ఠాకూర్ దగ్గరికే వస్తారు. తనకున్న పరిచయాలను వినియోగించి వీలయినమేరకు  ఆయన  వాటిని పరిష్కరిస్తూ ఉంటారు. పోలీస్ కేసులు , అనారోగ్యాలు , త్రాగునీరు , రైతులకు విద్యుత్ సరఫరా, నీటిపంపులు , రహదారులు , బడుల్లో సదుపాయాలు ,లాంటి సమస్యల పరిష్కారంలో విమల్ ఠాకూర్ తనవంతు సహాయం చేస్తుంటారు. మథుర - ఆగ్రా ప్రధాన రహదారి , రైల్వే లైన్ కూడా ఫరా  గ్రామం మీదుగా పోతుండటంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయి. గుర్తుతెలియని వ్యక్తులు ప్రమాదాల్లో చనిపోతుంటారు. శవపంచనామా  , పోస్ట్ మార్టం , దర్యాప్తుతో   పాటు వాటి అంతిమ సంస్కారాలు చేసే పనికూడా  పోలీసులే చూడాలి. పోలీసుల దగ్గర అందుకు అవసరమైన సొమ్ము ఉండదు. ఈ లేనిపోని తలనొప్పిని  తప్పించుకోవడానికి పోలీసులు అన్ని చోట్లా చేసేపని ఒక్కటే. తమ స్టేషన్ పరిధి నుండి శవాలను పక్క స్టేషన్ పరిధిలోకి పోయేటట్లు చేయడానికి కాల్వల్లో పడేస్తారు.  వారికి కేసుగొడవా  ఉండదు.
డబ్బుఖర్చు  గొడవా ఉండదు. విలేఖరిగా తరచూ  ఈ వ్యవహారాలను  చూసిన విమల్ ఠాకూర్  శవాల అంతిమ సంస్కారాల బాధ్యత తన  భుజాలపై వేసుకున్నారు. ప్రతి అంతిమ సంస్కారానికి 3500 రూపాయల చొప్పున  ఖర్చుచేస్తూ ఇంతవరకూ  100 వరకూ  మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తనకున్న పరిచయాలను వినియోగించి గ్రామాల్లో మహిళలకు ఉపాధి కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. జిల్లాలో బడిపిల్లల యూనిఫారం కుట్టే పనిని కాంట్రాక్టు  తీసుకుని యాభైమంది  గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించారు. వితంతువులు ,  యజమాని అనారోగ్యంతో మంచానబడిన  కుటుంబాల స్త్రీలు ఇంటిదగ్గర కూచుని యూనిఫారం కుట్టే పని చేసుకునే విధంగా వారికి కుట్టు మిషన్లు  అందచేశారు. తనహోటల్లో మట్టిపాత్రల వాడకం వెనకఉన్న కథను కూడా విమల్ చెప్పారు. తమగ్రామానికి  చెందిన కుమ్మరి (ప్రజాపతి) కుటుంబానికి చెందిన 28 ఏళ్ళ యువకుడు ప్రమాదంలో మరణించాడు.
తల్లితండ్రులు  , అన్నదమ్ములు , భార్యాబిడ్డలు   మొత్తం 12 మంది సభ్యులున్న కుటుంబం అది.

జీవనాధారంగా  ఉన్న కొడుకు కాస్తా చనిపోవడంతో వృద్ధాప్యంలో పెద్దాయన  మళ్లీ కుటుంబభారాన్ని  నెత్తిన వేసుకోవాల్సి వచ్చింది. విమల్ ఠాకూర్ ఆయనకు అండగా నిలిచారు.
పెద్దాయనకు మోటారుతో  తిరిగే పాటర్స్ వీల్ ను కొనిపెట్టారు.  తనహోటల్లో వాడుతున్న  క్రోకరీని పక్కనపెట్టారు. మట్టిపాత్రల వినియోగం మొదలు పెట్టారు. చెక్కగరిటలు , చెక్కచెంచాలు కూడా ప్రవేశపెట్టారు. కరోనా వచ్చాక మట్టి పాత్రల ,చెక్క వస్తువుల ప్రయోగానికి ఆదరణ లభించింది. నెలకు 40 వేల రూపాయల ఆర్డర్ ను పెద్దాయనకు ఇస్తున్నట్లు విమల్ చెప్పారు.
ఫీజు కట్టలేని ,పుస్తకాలు కొనుక్కోలేని పిల్లల చదువులకు కూడా సహకారం అందిస్తున్నారు. గ్రామసర్పంచ్  గా పోటీ చేయాల్సిందిగా వివిధ పార్టీల నాయకులూ , గ్రామస్తులూ ,  కోరినా విమల్ ఠాకూర్ అంగీకరించలేదు. తనకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ భావజాలంపై అభిమానం ఉంది. దీన్ దయాళ్ చెప్పిన  "అంత్యోదయ" భావన తనకు నచ్చిందని , తన పరిధిలో పేదలకు సహకరించే పని చేస్తున్నానని విమల్ చెప్పారు. ఒకప్పుడు సంఘ్ లో ప్రచార కార్యదర్శిగా పనిచేసినా బీజేపీలో సభ్యునిగా చేరలేదనీ  విమల్ చెప్పారు. తనగ్రామం  నుండి ఎవరు ఎన్నికైనా గ్రామానికి సంబంధించిన పనుల్లో  వారికి విమల్  సహకరిస్తూ ఉంటారు. మేం ఆయనతో  మాట్లాడుతుండగానే వేరే గ్రామానికి చెందిన  బీజేపీ సర్పంచ్ ఒకాయన అనుచరులతో  ఏదో పనిపై విమల్ దగ్గరకు వచ్చారు. 

"పేదరికం నుండి వచ్చాను , ఆకలి అంటే ఏమిటో నాకు   తెలుసు అందుకే చేతనైన మేరకు సేవ చేస్తున్నాను, కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టడం ముఖ్యం, దానిపై దృష్టి పెడుతున్నాను " అన్నారు విమల్ ఠాకూర్. మేం టీ త్రాగిన తర్వాత ఆయన కార్యాలయం నుండి హోటల్లోకి వచ్చాం ! అప్పటికి  మాబృందం  కూడా బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసింది.
ఐ.జే.యు. అధ్యక్షుడు కె.శ్రీనివాస రెడ్డి , ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు , సీనియర్ నాయకులు దాసరి కృష్ణారెడ్డి , ఆలపాటి సురేష్ కుమార్ , వై.నరేందర్ రెడ్డి , నల్లి ధర్మారావు , కే. రామ నారాయణ , చెన్నుపాటి  రాంబాబు , మహారాష్ట్ర కు చెందిన జి. శ్రీనివాస్ , ప్రమోద్ కరాత్ , సహా మా బృందసభ్యులను  పరిచయం చేశాను. జాతీయస్థాయి నాయకులు , వివిధ రాష్ట్రాల సీనియర్ పాత్రికేయులు తన హోటల్ కి రావడం ఎంతో  సంతోషం కలిగిస్తోందని విమల్ ఠాకూర్ అన్నారు. సుమారు గంటసేపు "బ్రజ్ కి రసోయి" లో గడిపిన మేం విమల్ ఠాకూర్ కు , అతని సోదరునికి  సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పి బయలుదేరాం! అందరికీ "రాధే రాధే"  అంటూ అభివాదం చేస్తూ విమల్  వీడ్కోలు పలికారు. నలభైఏళ్ల వయసున్న ఒక గ్రామీణ విలేఖరి తన కుటుంబాన్ని నిలబెట్టుకున్న  తీరు ,ఇతరులకు  సహాయం చేస్తున్నతీరు  అద్భుతం అనిపించింది.

రచన, స్వీయ అనుభవం
డి.సోమసుందర్, 
సీనియర్ పాత్రికేయుడు,

Agra

2022-04-29 06:16:31

మే నెలలో బ్యాంకులకు సెలవులు ఇవే

మే నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయి. అవి ఏఏ తేదీలలో ఉన్నాయో తెలుసుకోండి. ప్రతి నెల బ్యాంకులకు సెలవులనేవి అంటాయి. అయితే ఈ నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు ఉన్నాయనే విషయాన్ని రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. దీని ప్రకారం మే నెలలో బ్యాంకులకు 11 రోజులు సెలవులున్నాయి. ఈ సెలవులనేవి జాతీయ సెలవులు కాకుండా రాష్ట్రాల పరంగా కూడా కొన్ని సెలవులున్నాయి. అవి ఏ రోజులంటే..?  మే 1 : ఆదివారం , మేడే, మే 2 : సోమవారం, మహర్షి పరుశురామ జయంతి (కొన్ని రాష్ట్రాల్లో సెలవు), 
మే 3 : మంగళవారం, ఈద్ ఉల్ ఫితర్, బసవ జయంతి,( కర్ణాటక), మే 4 : బుధవారం, ఈద్ ఉల్ ఫితర్( తెలంగాణ), మే 8 : ఆదివారం, మే9 : సోమవారం, రవీంద్ర నాధ్ ఠాగూర్ జన్మదినం (పశ్చిమ బెంగాల్, కలకత్తా, త్రిపుర), మే 14 : రెండో శనివారం, మే15 : ఆదివారం, మే 16 : సోమవారం, బుద్ధ పూర్ణిమ, బ్యాంకు సెలవు, మే 24 : మంగళ వారం, ఖాజీ నజ్రుల్ ఇస్మాల్ పుట్టిన రోజు (సిక్కిం), మే 28 : నాలుగో శనివారం, అన్ని చోట్ల సెలవు, మే 29 : ఆదివారం గా ఉన్నాయి.. ఈ రోజుల ను  బట్టి మీ ఆర్ధిక లావాదేవీలు  చేసుకోవాల్సి వుంటుంది.

Tadepalli

2022-04-26 10:45:53

ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తిలో ఏపీ టాప్ వన్

హెచ్ఐవీ/ఎయిడ్స్ ఈ భయంకరమైన వ్యాది అంటెనే తెలియని వారు ఉండరు. ఈ వ్యాధి పేరు చెబితే భయపడుతుంటే.. ఇపుడు ఏకంగా ఆ హెచ్ఐవీ వ్యాధి ఆంధ్రప్రదేశ్ లోనే దేశంలో తొలి స్థానంలో ఉందనే విషయం సమాచార హక్కుచట్టడం ద్వారా బయటకు రావడం మరింత కలవర పెడుతోంది. రక్షణలేని లైంగిక కార్యకలాపాలతో మన దేశంలో ఎంతో మంది ఎయిడ్స్ బారిన పడుతున్నారు. కండోమ్స్ వాడకుండానే శృంగారంలో పాల్గొంటుండటం వల్ల ఎయిడ్స్ వ్యాధికి గురవుతున్నారు. మన దేశంలో గత పదేళ్లలో 17.08 లక్షల మంది ఎయిడ్స్ బారిన పడినట్టు ఎయిడ్స్ నివారణ సంస్థ తాజాగా ప్రకటించింది. 2011 నుంచి 2021 మధ్య కాలంలో 17,08,777 మందికి ఎయిడ్స్ సోకిందని పేర్కొంది. కాగా  ఎయిడ్స్ బారిన పడుతున్న వారి సంఖ్య గత దశాబ్ద కాలంగా క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2011-12 మధ్య కాలంలో 2.4 లక్షల మంది ఎయిడ్స్ బారిన పడగా... 2020-21 మధ్య కాలంలో ఆ సంఖ్య 85,268కి పడిపోయింది. ఏపీలో గత పదేళ్లలో 3,18,814 మందికి ఎయిడ్స్ సోకింది. దీనితో ఆ వ్యాధి సోకిన వారిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రంగా నిలవడం కలవరపాటుకి గురిచేస్తుంది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ కు చెందిన చంద్రశేఖర్ అనే సమాచార హక్కు చట్టం కార్యకర్త అడిగిన ప్రశ్నకు ఈ మేరకు ఎయిడ్స్ నివారణ సంస్థ సమాధానమిచ్చింది. అయితే దానికి కారణాలు కూడా లేకపోలేదు. గతంలో ఎయిడ్స్ నియంత్రణా మండలి ద్వారా పరీక్షలు చేసి మందులు ఇచ్చేవారు.. స్వచ్చంద సంస్థల ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కూడా పెట్టేవారు. గత పదేళ్ల కాలం నుంచి ఆ కార్యకలాపాలు తగ్గించేయడంతో, వున్న హెచ్ఐవీ రోగుల నుంచి ఆ వ్యాధి లైంగిక సంపర్కం ద్వారి మరింత మందికి చేరింది. అందులోనూ కోవిడ్ లాంటి వైరస్ లు వచ్చిన క్రమంలో కూడా ఈహెచ్ఐవీ వ్యాధి వ్యాప్తి అధికంగా మారడం అందులోనూ ఏపీలోనే అత్యధిక కేసులు కావడం పట్ల తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది.

New Delhi

2022-04-25 09:18:08

పురాతన విజ్ఞానాన్ని భావితరాలకు చేర్చాలి

పూర్వీకులు మనకు అందించిన విజ్ఞానాన్ని పరిరక్షించి, భావితరాలకు అందివ్వాల‌ని టీటీడీ ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అన్నారు. తిరుప‌తి ఎస్వీ విశ్వ‌విద్యాల‌యంలోని ప్రాచ్య ప‌రిశోధ‌న సంస్థ‌ను శ‌నివారం సాయంత్రం ఈవో ప‌రిశీలించారు.  ఈ సంద‌ర్బంగా ఈవో మాట్లాడుతూ,  టీటీడీ స‌హ‌కారంతో  పురాత‌న తాళపత్ర గ్రంథాలను డిజిటైజేెషన్‌ చేసి పాఠకులకు, పరిశోధకులకు అందుబాటులో ఉంచాలన్నారు. ఎస్వీ విశ్వ‌విద్యాల‌యంలో ప్రాచ్య ప‌రిశోధ‌న సంస్థ‌లో 16వ శ‌తాబ్ధం నుండి దాదాపు 60 వేల తాళ‌ప‌త్ర గంథ్రాలు, 4 వేల కాగిత‌పు ప్ర‌తులు ఉన్న‌ట్లు తెలిపారు.  ఈ సంద‌ర్బంగా ప్రాచ్య ప‌రిశోధ‌న సంస్థ‌ లైబ్ర‌రీలోని తెలుగు, సంస్కృతం, త‌మిళం, క‌న్న‌డ భాష‌ల్లోని వేదాలు, ఉప‌నిష‌త్తులు, రామాయ‌ణం, మ‌హా భార‌తం, భాగ‌వ‌తం, పురాణాలు, ఇతిహ‌సాలు, చ‌రిత్ర‌,, వృక్ష శాస్త్రం, ఆయుర్వేదం, ఆముక్తమాల్య‌ద‌, విజ‌య విలాసం, నాగానందం,  త‌దిత‌ర అరుదైన గ్రంథాల‌ను ప్ర‌పంచానికి అందివ్వాల‌ని ఎస్వీ విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య రాజారెడ్డిని ఈవో కోరారు.   ప్రాచీన తాళ‌ప‌త్ర గ్రంథాల‌ను, డిజిటైజేష‌న్, గ్రంథాల ప‌రిర‌క్ష‌ణ‌ను ఈవో ప‌రిశీలించారు. జెఈవో వీర‌బ్ర‌హ్మం, ప్రాచ్య ప‌రిశోధ‌న సంస్థ డైరెక్ట‌ర్  సురేంద్ర రెడ్డి, విశ్వ‌విద్యాల‌యం స‌ల‌హాదారు సుబ్బారెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2022-04-23 13:46:14

శ్రవణానందంగా అఖండ పారాయ‌ణం

ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై గురువారం ఉద‌యం 7 నుండి 9 గంటల వరకు 8వ విడ‌త బాల‌కాండ అఖండ పారాయ‌ణం శ్రవణానందంగా సాగింది. ఇందులో 33 నుండి 37 సర్గల వ‌ర‌కు గ‌ల 134 శ్లోకాలను పారాయణం చేశారు. వేద పండితుల అఖండ పారాయ‌ణం చేయ‌గా ప‌లువురు భ‌క్తులు భ‌క్తిభావంతో వారిని అనుస‌రించి శ్లోక పారాయ‌ణం చేశారు. ఈ సంద‌ర్భంగా ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఆచార్యులు ఆచార్య రామ‌కృష్ణ సోమ‌యాజులు మాట్లాడుతూ  రామనామం పలికితే బాధ‌లు తొల‌గి, సుఖ సంతోషాలు కలుగుతాయన్నారు. బాల‌కాండలోని శ్లోకాలను, విషూచికా మ‌హ‌మ్మారి నివార‌ణ మంత్రమును ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంలో కోట్లాది మంది ప్ర‌జ‌లు ఒకేసారి పారాయ‌ణం చేస్తే ఫ‌లితం అనంతంగా ఉంటుంద‌ని వివ‌రించారు.  రామానుజాచార్యులు,  మారుతి శ్లోక పారాయ‌ణం చేశారు. అఖండ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేద అధ్యాయ‌న సంస్థకు చెందిన వేద పారాయ‌ణ దారులు, రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యానికి చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నా‌రు. ఈ సందర్భంగా నెల్లూరుకు చెందిన శ్రీమతి బాలార్క బృందం త్యాగరాజ కీర్తన "ముచ్చట బ్రహ్మాదులకు...", ముత్తుస్వామి దీక్షితులు రచించిన "స్వామినాథ పరిపాలయ..." కీర్తనలను ఆలపించారు.  ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అధికారులు, పండితులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

Tirumala

2022-04-21 15:42:39

25న ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

తిరుమలలోని శ్రీవారి ఆర్జిత కోటా టిక్కెట్లు జులై నెల‌కు సంబంధించి విడుదల చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఏప్రిల్ 25వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నున్నట్టు టిడిడి గురువారం మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ విషయాన్ని గమనించుకొని  భ‌క్తులు ఈ సేవా టికెట్ల‌ను బుక్ చేసుకోవాల్సిందిగా అధికారులు కోరుతున్నారు. కోవిడ్ తరువాత మళ్లీ శ్రీవారి ఆర్జిత కోటా టిక్కెట్లు విడుదల చేయడంతో అధిక సంఖ్యలో భక్తులు పోటీ పడే అవకాశాల కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే ఆన్ లైన్ సర్వర్ పై ఒత్తిడి పడినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు టిటిడి అన్ని ఏర్పాట్లు చేసింది.

Tirumala

2022-04-21 14:00:03

శ్రీవారి ఆలయ పనులను పూర్తిచేయాలి..

జమ్మూ సమీపంలోని మాజిన్ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనుల ను ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఆలయ  నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులు  పనుల పురోగతిని చైర్మన్ కు  వివరించారు. ఆలయ నిర్మాణానికి ఉపయోగించాల్సిన వాటిలో ఏపీలోని కోటప్పకొండలో తయారు చేస్తున్న రాతి స్తంభాలు తదితరాలు  అందాల్సి ఉందని,  మరికొన్ని స్థానికంగా కొనుగోలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. పనులు ఈ ఏడాదిలోగా పూర్తి చేసేందుకు తగిన విధంగా ప్రణాళికలు తయారు చేసుకుని కార్యాచరణ అమలు చేయాలని చైర్మన్  సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.

Jammu

2022-04-19 15:40:13

స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రల పై అధ్యయనాలు జరగాలి.. ఉపరాష్ట్రపతి

భారత స్వరాజ్య సంగ్రామం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన స్వేచ్ఛా ఇతిహాసమని ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. భవిష్యత్ తరాలు స్వేచ్ఛా వాయువులు పీల్చాలన్న ఆకాంక్షతో నాటి స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ముఖ్యంగా యువతరం నాటి స్వరాజ్య సమరయోధుల స్ఫూర్తితో నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని, అదే వారికి అందించే నిజమైన నివాళి అని ఉపరాష్ట్రపతి తెలిపారు. ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి, మంగళవారం  పాండ్రంగిలో ఉన్న అల్లూరి సీతారామరాజు జన్మస్థలాన్ని సందర్శించారు. అనంతరం బర్లపేటకు విచ్చేసిన ఆయన, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు  రూపాకుల సుబ్రహ్మణ్యం,  రూపాకుల విశాలాక్షి విగ్రహాలను ఆవిష్కరించారు.  అల్లూరి సీతారామరాజు జన్మప్రదేశాన్ని సందర్శించిన సమయంలో తమ అనుభవాలను ఫేస్ బుక్ వేదికగా పంచుకున్న ఉపరాష్ట్రపతి, రూపాకుల దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేసిన వారి చొరవను అభినందించారు. స్వరాజ్యం సముపార్జించుకుని 75 ఏళ్ళ మైలురాయిని చేరుకుంటున్న తరుణంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ఉత్సవాలను ప్రారంభించడం ఆనందదాయకమన్న ఉపరాష్ట్రపతి, ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ముఖ్యంగా యువత ఈ సందర్భా్న్ని వినియోగించుకుని, నాటి స్వాతంత్ర్య సమరయోధుల జీవితాలను అధ్యయనం చేసి, వారి నుంచి స్ఫూర్తి పొందాలని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచి తాను ఎంతగానో అభిమానించే స్వరాజ్య సమరయోధుల్లో అల్లూరి ముందు వరుసలో ఉంటారన్న ఉపరాష్ట్రపతి, ఆయన జన్మప్రదేశాన్ని సందర్శించిన క్షణాలు జీవితంలో గుర్తుంచుకోదగిన సందర్భాల్లో ప్రత్యేకమైనవని పేర్కొన్నారు. సరైన బలం ఉంటే ఎవరైనా పోరాడగలరని, అయితే పరిమిత వనరుల మధ్య. అమాయకులైన మన్యం ప్రజల మధ్య, తానే వనరులను సృష్టించుకుంటూ, ప్రజల్లో ప్రేరణ నింపుతూ బ్రిటీష్ సామ్రాజ్య పెత్తనాన్ని ఎదిరించడం తనను ఎంతో ఆకట్టుకుందని తెలిపారు. 27 ఏళ్ళ వయసులోనే వీరమరణం పొందిన  అల్లూరి దేశభక్తి, ఆత్మవిశ్వాసం, కార్యదీక్ష, చిత్రశుద్ధి యువతకు ఆదర్శనీయమన్న ఉపరాష్ట్రపతి, అల్లూరి సాహసి అంటూ మహాత్ముడు యంగ్ ఇండియా పత్రికలో రాసిన మాటలను ఉటంకించారు. స్థానిక సంస్థల అభివృద్ధి, మద్యపాన నిషేధం, అందరికీ విద్య వంటి మహోన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగిన అల్లూరి ముందు  చూపు ఆదర్శనీయమన్న ఆయన, వారిది విప్లవ మార్గమే అయినా, ప్రజల బాగు కోరిన సంక్షేమ మార్గంగా భావిస్తానని తెలిపారు. అల్లూరి జన్మస్థలాన్ని సందర్శించడం తన జీవితాన్ని సింహావలోకనం చేసుకునే అవకాశాన్ని అందించిందన్న ఉపరాష్ట్రపతి, అల్లూరి స్ఫూర్తి తెలుగు వారికే పరిమితం కాకూడదని ఆకాంక్షించారు. భారత స్వరాజ్య సంగ్రామం స్వాతంత్ర్యం కోసం మాత్రమే సాగిన పోరాటం కాదన్న ఉపరాష్ట్రపతి, మన సంస్కృతిని, భాషను, సమాజంలో విస్తరిస్తు్న్న సామాజిక దురాచారాలను అణచివేసేందుకు కూడా ఈ పోరాటం సాగిందన్నారు. ముఖ్యంగా రూపాకుల దంపతులు గాంధీజీ చూపిన బాటలో, ఇదే మార్గంలో ముందుకు సాగారన్న ఆయన, వివిధ ఉద్యమాల్లో ఈ దంపతులు పోషించిన పాత్ర, వారి ధైర్య సాహసాలు, ఒకే తాటి మీద నిలబడ్డ ఆ దంపతుల స్ఫూర్తి ఆదర్శం కావాలన్నారు.  కుటుంబం బాగోగులు చూసుకుంటూనే భర్తతో కలిసి స్వరాజ్య ఉద్యమం దిశగా నడిచిన  విశాలాక్షి, మహిళా శక్తికి, త్యాగాలకు నిలువెత్తు నిదర్శనమన్న ఉపరాష్ట్రపతి, ఆమె ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం ఈతరం యువతకు ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర్య సమరయోధుల గౌరవార్థం ప్రభుత్వం అందించిన ఫించనులోనూ, అధిక భాగం సమాజ సేవకు వెచ్చించిన ఆమె దేశభక్తి, సమాజం పట్ల ప్రేమ ప్రతి ఒక్కరికీ ప్రేరణ కావాలని ఆకాంక్షించారు. బ్రిటీష్ పాలన భారతదేశ అభివృద్ధికి సంకెళ్ళు వేసి, దేశాన్ని బలహీనపరచిందన్న ఆయన, ఘనమైన గతాన్ని కోల్పోయి, పాశ్చాత్య మనస్తత్వంతో కొట్టుకుపోతున్న యువత బయటపడాలని సూచించారు. భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవంతో పాటు, మన జాతీయ భాషల సాహిత్యం, కళాత్మక వ్యక్తీకరణలకు పునర్వైభవం తీసుకువచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రను పాఠ్యప్రణాళికలో భాగం చేయాలని సూచించారు.

Pandrangi

2022-04-19 06:00:27

తిరుమలలో గ్రీన్ పవర్ ఉత్పత్తి..

పర్యావరణ పరిరక్షణ లో భాగంగా తిరుమల లో టీటీడీ చేపట్టిన గ్రీన్ పవర్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడానికి ముందుకు వచ్చింది. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసిఎన్సీ డైరెక్టర్ జనరల్  అభయ్ బాక్రే  టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తో సమావేశమయ్యారు. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం లో ప్రస్తుతం ఉపయోగిస్తున్న గ్యాస్ ఆధారిత ఆవిరికి బదులుగా సోలార్ ఆధారిత ఆవిరిని ఉపయోగించేందుకు జరుగుతున్న ఏర్పాట్ల గురించి టీటీడీ అధికారులు వివరించారు. అలాగే కాకుల కొండ వద్ద పవన విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన విషయాలు తెలియజేశారు.  ప్రత్యామ్నాయ విద్యుత్ కు సంబంధించి తిరుమల ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి గల అన్ని అవకాశాలు పరిశీలించడానికి ఒక బృందాన్ని పంపుతామన్నారు. టీటీడీ అధికారులు ఈ బృందంతో కలసి ప్రతిపాదనలు పంపితే ఇందుకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహకారం అందిస్తామని వారు వివరించారు.  జెఈవో  సదా భార్గవి, ఎస్ ఈ జగదీశ్వర్ రెడ్డి, విద్యుత్ విభాగం డిఈ  రవిశంకర్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి అభయ్ బాక్రే ను శాలువతో సత్కరించి, స్వామివారి 12 షీట్ క్యాలెండర్, పంచగవ్య ఉత్పత్తులు, అగరబత్తులు అందించారు.

Tirumala

2022-04-15 11:55:06