1 ENS Live Breaking News

భారత్ మరింత శక్తివంతమైన దేశంగా ఉండాలి..

ప్రపంచంలో భారత్ అత్యంత శక్తి మంతమైన దేశంగా తయారయ్యే శక్తి ప్రసాదించాలని, చైనా, పాకిస్తాన్ దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు  తొలగించాలని, శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థించానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  కిషన్ రెడ్డి చెప్పారు. శనివారం ఆయన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో  కిషన్ రెడ్డికి అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి ఆయనకు స్వామి వారి ప్రసాదాలు అందించారు. అనంతరం  కిషన్ రెడ్డి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. దేశాన్ని అత్యంత బలవంతంగా తయారు చేయడానికి కృషి చేస్తున్న ప్రధానమంత్రి  నరేంద్రమోదీ, హోంమంత్రి  అమిత్ షా లకు  ఆరోగ్యం, శక్తి ఇవ్వాలని కోరుకున్నట్లు  మంత్రి చెప్పారు. దీపావళి రోజు స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దయతో త్వరలోనే కరోనా నశిస్తుందనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారు   ప్రజలందరికీ ఆరోగ్యం, సంతోషం ప్రసాదించాలని  కిషన్ రెడ్డి అన్నారు.           

Tirumala

2020-11-14 13:43:46

గంటాకీ ఈ రకంగా చెక్ పెట్టారా..!

వైఎస్సార్సీపీలోకి ఒక సామాజిక వర్గం ద్వారా ఎంట్రీ ఇద్దామనుకున్న మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకి మరోసారి చుక్కెదురైందని ప్రత్యూషకి చెందిన అక్రమాస్తుల వ్యవహారం రుజువుచేసినట్టైంది. విజయరామపుర అగ్రహారాల్లో సుమారు రూ.200 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ప్రభుత్వం విశాఖ ఆర్డీఓ పెంచల కిషోర్ ఆధ్వర్యంలో స్వాధీనంచేసుకుంది. అంతేకాకుండా స్వాధీనం చేసుకున్న భూములన్నీ మాజీ మంత్రి గంటా అనుచరులవేనని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భూ ఆక్రమణలకు పాల్పడేవారిపై ఉక్కుపాధం మోపుతామని రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి చేసిన ప్రకనట కూడా పార్టీలో చాల మంది నేతలకు వార్నింగా వుంది. గతంలో ఓ భూమి వ్యవహారంలో కొయ్యప్రసాదరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పుడే గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇపుడు మళ్లీ పార్టీలోకి ఒక సామాజిక వర్గం ద్వారా వద్దామనుకొంటున్న గంటాకి ఈ ప్రత్యూష కంపెనీకి చెందిన భూ ఆక్రమిత మచ్చ వేసి పార్టీలోకి రానీయకుండా అడ్డుకట్ట వేశారనే ప్రచారం కూడా గుప్పుమంటుంది. ఈ కంపెనీకి చెందిన భూములను స్వాధీనంచేసుకోవడంతో అక్రమార్కులకు పార్టీలో చోటులేదని గట్టివార్నింగ్ ఇచ్చేటట్టుగా ప్రభుత్వం వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆక్రమణల్లో వున్న భూములను స్వాధీనం చేసుకొని, పేదలకు పంచి ఇవ్వడంతోపాటు, వారికే ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచన. సమగ్ర భూ సర్వే చేపట్టకుండానే వందల కోట్ల విలువైన భూములు ఆక్రమణల నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే...ఇక సమగ్ర భూ సర్వే చేపడితే చాలా మంది అక్రమార్కులు వెలుగులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది..

Visakhapatnam

2020-11-14 13:36:16

రాష్ట్ర ప్రజలకు పోలాకి దీపావళి శుభాకాంక్షలు..

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, విద్యుత్ ఉద్యోగులు, సంఘనాయకులు,  సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రధాని నరేంద్రమోదీలకు విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షలు పోలాకి శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం విశాఖలో ఆయన మీడియాలో మాట్లాడుతూ, ప్రజలు అందరూ సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. దీపాల పండుగ దీపావళి సరికొత్త కాంతులను ప్రసరించి చీకటిని పారద్రోలి సరికొత్త కాంతుల జీవితాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. దీపావళి వెలుగులలో కరోనా వైరస్ రక్కసి పూర్తిగా నశించి దేశంలోనూ ఇటు  రాష్ట్రంలోనూ నూతన అధ్యయనం ప్రారంభం కావాలని పోలాకి ఆశించారు. కరోనా వ్యాప్తి నివారణకు మాస్కే రక్షణ కవచం అని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని కోరారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలు పెద్ద ఎత్తున సహకరించారని, వచ్చే మూడు నెలల కాలంపాటు అదే సహకారం కొనసాగించి కరోనా రహిత జిల్లాగా చేయుటకు నాంది పలుకుదామని పిలుపునిచ్చారు. మాస్కు ధారణ, భౌతిక దూరం పాటించడం, చేతులను తరచూ సబ్బుతోగాని, శానిటైజర్ తోగాని శుభ్రపరచుకోవడం అనే మూడు ప్రాథమిక సూత్రాలను పాటిద్దామని పేర్కొన్నారు. వ్యక్తిగత అనారోగ్యానికి గురికావద్దని, అదే సమయంలో కుటుంబంలో ఉన్న అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు, చెల్లి, అక్క, తాత, అమ్మమ్మ, నాన్నమ్మలకు కరోనా సోకకుండా ఆలోచించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుందాం ... దీపావళి కాంతుల్లో కరోనాను మట్టికరిపిద్దాం .... సరి కొత్త అధ్యయనానికి నాంది పలుకుదాం అని పోలాకి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

Visakhapatnam

2020-11-13 20:11:50

రాష్ట్ర ప్రజలకు మంత్రి అవంతి దీపావళి శుభాకాంక్షలు..

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు  సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, ప్రధాని నరేంద్రమోదీల, రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, గవర్నర్ భిశ్వభూషన్ హరిచందన్ , రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, సహచర మంత్రులు, రాష్ట్ర వైఎస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరునా రాష్ట్ర పర్యాటశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం విశాఖలో ఆయన మీడియాలో మాట్లాడుతూ, ప్రజలు అందరూ సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. దీపాల పండుగ దీపావళి సరికొత్త కాంతులను ప్రసరించి చీకటిని పారద్రోలి సరికొత్త కాంతుల జీవితాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. దీపావళి వెలుగులలో కరోనా వైరస్ రక్కసి పూర్తిగా నశించి దేశంలోనూ ఇటు  రాష్ట్రంలోనూ నూతన అధ్యయనం ప్రారంభం కావాలని మంత్రి అవంతి ఆశించారు. కరోనా వ్యాప్తి నివారణకు మాస్కే రక్షణ కవచం అని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని కోరారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలు పెద్ద ఎత్తున సహకరించారని, వచ్చే మూడు నెలల కాలంపాటు అదే సహకారం కొనసాగించి కరోనా రహిత జిల్లాగా చేయుటకు నాంది పలుకుదామని పిలుపునిచ్చారు. మాస్కు ధారణ, భౌతిక దూరం పాటించడం, చేతులను తరచూ సబ్బుతోగాని, శానిటైజర్ తోగాని శుభ్రపరచుకోవడం అనే మూడు ప్రాథమిక సూత్రాలను పాటిద్దామని పేర్కొన్నారు. వ్యక్తిగత అనారోగ్యానికి గురికావద్దని, అదే సమయంలో కుటుంబంలో ఉన్న అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు, చెల్లి, అక్క, తాత, అమ్మమ్మ, నాన్నమ్మలకు కరోనా సోకకుండా ఆలోచించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుందాం ... దీపావళి కాంతుల్లో కరోనాను మట్టికరిపిద్దాం .... సరి కొత్త అధ్యయనానికి నాంది పలుకుదాం అని అవంతి పిలుపునిచ్చారు.

Visakhapatnam

2020-11-13 19:25:24

గవర్నర్ కు సీఎం జగన్ దీపావళి శుభాకాంక్షలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం సీఎం వైఎస్‌ జగన్‌, వైఎస్‌ భారతిరెడ్డి ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లి సాంప్రదాయ పద్దతిలో గవర్నర్ ను కలిశారు.  హిందువులకు అత్యంత ప్రాశస్త్యమైన దీపావళి పండుగ సందర్భంగా సీఎం జగన్‌.. గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలియచేశారు. ముఖ్యమంత్రులు రాష్ట్ర గవర్నర్ లకు జాతీయ పండుగలకు శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీగా వస్తుంది. ఆ కార్యక్రమంలో భాగం సీఎంతోపాటు ఆయన సతీమణి వెళ్లి గవర్నర్ ను కలిశారు.  అనంతరం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, అమలవుతున్న సంక్షేమ పథకాలు తదితర అంశాలపై గవర్నర్‌తో ముఖ్యమంత్రి వివరించారు. ముఖ్యంగా విద్య, వైద్యం, ఆరోగ్యం, గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి ప్రజలకు ఏ స్థాయిలో సేవలు అందుతున్నాయో సీఎం గవర్నర్ కు వివరించారు. ఆంధ్రప్రదేశ్ లోని గ్రామసచివాలయ వ్యవస్థపై దేశవ్యాప్తంగా చర్చజరుగుతున్న వేళ సీఎం వైఎస్ జగన్ గవర్నర్ ను కలిసి వాటి యొక్క ఫలితాలు వివరించడం ప్రాధాన్యత సంతరించుకుంది...

Velagapudi

2020-11-13 14:31:46

అర్భన్ ప్రాంతాల్లో కార్పోరేట్ వైద్యానికి చెల్లుచీటి..

ఆంధ్రప్రదేశ్ లోని అన్నిజిల్లాల్లోని అర్భన్ ప్రాంతాల్లో కార్పోరేట్ వైద్యం పేరుతో చేస్తున్న నిలువుదోపిడికీ వైఎస్సార్సీపీ చరమగీతం పాడనుంది. రాష్ట్రంలో 562 కోట్ల రూపాయలతో 560 డా.వైఎస్సార్ అర్భన్ హెల్త్ క్లినిక్ లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం 331 క్లినిక్ లు ఉండగా వాటిని అభివ్రుద్ధి చేయడంతోపాటు, కొత్తగా 229 అర్భన్ క్లినిక్ లను ఏర్పాటు చేయనుంది. తద్వారా ప్రజల ముంగిటే ప్రాధమిక వైద్యం అందనుంది. ఒకప్పుడు కడుపునొప్పి వచ్చినా, కాలునొప్పి వచ్చినా, జ్వరమొచ్చినా, తుమ్మొచ్చినా కార్పోరేట్ ఆసుపత్రులు రక్తపరీక్షలు చేసి మందులు ఇవ్వడానికి కనీసం రూ.5వేలు వసూలు చేసేవి. ఇపుడు అలాంటి నిలువుదోపీడికి అడ్డుకట్ట పడనుంది. అర్భన్ వార్డు సచివాలయాల పరిధిలోని వీటిని ఏర్పాటు చేసి ప్రజలకు ప్రాధమిక వైద్యం అందించనున్నారు. తద్వారా చాలా ప్రైవేటు ఆసుపత్రుల ఆదాయానికి గండి పడనుంది. ప్రస్తుతం పదివేల 30 వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తుండగా, కొత్తగా అర్భన్ ప్రాంతాల్లో మరిన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రజలకు కార్పోరేట్ స్థాయి వైద్యాన్ని అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తద్వారా దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి కలలు గన్న ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కానుందని సర్వాత్ర ఆనందం వ్యక్తమవుతుంది..

Velagapudi

2020-11-13 11:45:58

ఉయ్ సపోర్ట్ విశాఖకు ఉప్పెనలా జనం..

వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖను పరిపాలనా రాజధానని చేస్తున్న తరుణంలో ఉయ్ సపోర్ట్ విశాఖ పేరిట శుక్రవారం విశాఖలో నిర్వహించిన వాక్ థాన్ కు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. మహా విశాఖ నగరపాలక సంస్థ  ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వాక్ థాన్ ను రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి సభ్యులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులతోపాటు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ఒకప్పుడు విశాఖ వ్యాపారానికి పనిచేస్తే ఇప్పుడు విశాఖ పరిపాలనా రాజధాని కాబోతుందని దానికి ప్రజల మద్దతు కూడా అదే స్థాయిలో వుందని అన్నారు. మూడు రాజధానులపై కొందరు అసత్యప్రచారం చేస్తున్నారు. అభివ్రుద్ధి వికేంద్రీకరణ ద్వారా మాత్రమే రాష్ట్రం అభివ్రుద్ధి చెందుతుందని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంతో ముందుచూపుతో ఆలోచించారన్నారు. విశాఖ పరిపాలనా రాజధాని కావడం ద్వారా ఉత్తరాంధ్రాతోపాటు, కోస్తాంధ్రా కూడా ఎంతో అభివ్రుద్ధి చెందుతుందన్నారు. విశాఖ నగరాధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, విశాఖరాజధానిని చేయాలని ప్రజలు ఎంతలా కోరుకుంటున్నారో ఈ వాక్ ధాన్ నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే అమర్నాధ్ మాట్లాడుతూ, విశాఖ పరిపాలనా రాజధాని అయితే విశ్వనగరంగా విశాఖఅభివ్రుద్ధి చెందుతుందని, ఎన్నో పెట్టుబడులు ఇక్కడికి తరలి వస్తాయన్నారు. ఇంకా కార్యక్రమంలో నాలుగు నియోజకవర్గాల వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

ఆర్కేబీచ్

2020-11-13 10:46:40

2020-11-13 10:42:33

13న శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల టికెట్ల కోటా విడుదల..

శ్రీవారి కళ్యాణోత్సవం, డోలోత్స‌వం, బ్ర‌హ్మోత్స‌వం, సహస్ర దీపాలంకరణ సేవలు న‌వంబ‌రు 13వ తేదీ శుక్ర‌వారం ఉద‌యం 11.00 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ (వ‌ర్చువ‌ల్‌) కోటాను విడుదల చేయనుంది. అంతేకాకుండా న‌వంబ‌రు 22 నుంచి 30వ తేదీ వరకు ఈ సేవ టికెట్లు బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.  కాగా, క‌ల్యాణోత్స‌వం, డోలోత్స‌వం, బ్ర‌హ్మోత్స‌వం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు బుక్ చేసుకున్న గృహ‌స్తులు  శ్రీ‌వారి ద‌ర్శ‌నం కొర‌కు వారికి ప్ర‌త్యేకంగా కేటాయించిన దర్శనం స్లాట్‌ల‌ల్లో ద‌ర్శ‌న టికెట్లు పొంద‌వ‌ల‌సి ఉంటుంది.  కల్యాణోత్సవం టికెట్లు పొందిన‌ గృహస్తులు(ఇద్దరికి) ఆ టికెట్‌పై ఉచితంగా శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. డోలోత్స‌వం, బ్ర‌హ్మోత్స‌వం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు బుక్ చేసుకున్న గృహ‌స్తులు వారికి కేటాయించిన ప్ర‌త్యేక స్లాట్‌ల‌ల్లో రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లు పొంద‌వల‌సి ఉంటుంది. టికెట్లు బుక్‌ చేసుకున్నతేదీ నుండి 90 రోజుల్లోపు శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని గృహ‌స్తులకు టిటిడి కల్పించింది.

తిరుమల

2020-11-12 21:46:59

2020-11-12 21:45:19

2020-11-12 21:19:13

గ్రామసచివాలయంలో 3ప్రభుత్వ భవనాలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతీ గ్రామసచివాలయం పరిధిలోని మూడు ప్రభుత్వ భవనాలను నిర్మిస్తోంది. అందులో ఒకటి గ్రామసచివాలయం, రెండవది రైతు భరోసా కేంద్రం, మూడవది విలేజ్ క్లినిక్. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గ్రామసచివాలయాలకు భవనాలు పూర్తవుతుండగా, కొన్ని చోట్ల రైతు భరోసా కేంద్రాలకు కూడా భవనాలు మొదలయ్యాయి. ఇక పదివేల 30 విలేజ్ క్లినిక్ లను ఏర్పాటు చేసి గ్రామస్థాయిలోనే ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. గ్రామసచివాలయాల్లో సుమారు లక్ష 26 వేల ఉద్యోగాలు భర్తీ కాగా, ఇంకా విలేజ్ క్లినిక్ లకు 10030 స్టాఫ్ నర్సులను భర్తీచేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఒకప్పుడు 104 మొబైల్ వాహనాల ద్వారా వారంలో ఒక్కరోజు మాత్రమే వైద్యసేవలు అందించేవారు. మార్చి 2021 నుంచి ప్రతీరోజూ గ్రామస్థాయిలోనే ప్రాధమిక వైద్యం అందించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. దీనికోసం సుమారు 26 రకాల మందులను విలేజ్ క్లినిక్ లు ఏర్పాటు అయ్యేంతవరకూ గ్రామసచివాలయాల్లోనే వాటిని నిర్వహించి తరువాత, వారిని కొత్తభవనాల్లోకి తరలించనున్నారు. అక్కడ బిఎస్సీ నర్సింగ్ చేసిన వ్యక్తితోపాటు, ప్రస్తుతం గ్రామసచివాలయాలకి కేటాయించిన ఆరోగ్యసహాయకులను కూడా విలేజ్ క్లినిక్ లకే కేటాయిస్తారు. సాధారణ జ్వరాలు, ఒళ్లునొప్పులు, గర్భిణీ స్త్రీలకు రక్తపరీక్షలు, ఇమ్యునైజేషన్ కార్యక్రమాలు వంటివి ఈవిలేజ్ క్లినిక్ లలో ఏర్పాటు చేస్తారు. అయితే ఇదే విలేజ్ క్లినిక్ లలో ల్యాబ్ టెక్నీషియన్ ను కూడా ఏర్పాటు చేయడం ద్వారా మరిన్ని వైద్యపరీక్షలు చేయడానికి వీలుపడుతుందనే డిమాండ్ సర్వత్రా పెరుగుతుంది. అయితే ఈ విషయం ప్రభుత్వం కూడా ఆలోచిస్తోంది. కాని విలేజ్ క్లినిక్ లలో ల్యాబ్ టెక్నీషియన్ల నియామకంపై ఇంకా క్లారిటీ రాలేదు..

Amaravati

2020-11-12 10:11:57

ఎస్వీబీసీపై బూతు ప్రయోగం కావాలనే చేశారా..

శ్రీవారిని ఎంతో భక్తితో భక్తులకు చూపించే శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ పై బురదచల్లేందుకు స్వయాన ఉద్యోగులే ఉపక్రమించడం సంచలనం రేపుతోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పోర్న్‌ సైట్‌ లింక్‌ కలకలం రేపింది. పరమ భక్తితో శ్రీవారి ప్రసారాలు చేయాల్సిన ఎస్వీబీసీ ఉద్యోగుల నిర్వాకంపై తీవ్రంగా స్పందించిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌ రెడ్డిలు విచారణకు ఆదేశించారు. దీంతో డొంక మొత్తం కదిలింది. కాగా ‘శతమానం భవతి’ కార్యక్రమానికి సంబంధించి ఓ భక్తుడు మెయిల్‌ చేయగా, అతడికి ఎస్వీబీసీ ఉద్యోగి పోర్న్‌ సైట్‌ లింక్‌ పంపించాడు.  దీంతో ఆ లింక్ సైట్ చూసిన భక్తుడు ఈ విషయాన్ని తక్షణమే టీటీడీ చైర్మన్‌, ఈవోకి ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో ఎస్వీబీసీ కార్యాలయంలో విజిలెన్స్, సైబర్‌క్రైమ్, ఈడీపీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో టిటిడి అధికారులకు కళ్లు చెదిరే వాస్తవాలు కనిపించాయి. నేరుగా ఉద్యోగులే పోర్న్‌సైట్‌ వీడియో చూస్తూ విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డారు. అదేసమయంలో భక్తుడికి పోర్న్ లింక్  పంపిన అధికారితోపాటు.. అశ్లీల సైట్లు చూస్తున్న మరో ఐదుగురు ఉద్యోగులతో పాటు, విధులు నిర్వహించకుండా ఇతర వీడియోలు చూస్తున్న మరో 25మంది సిబ్బందిని గుర్తించారు. విధినిర్వహణలో స్వామివారికి చెందిన కార్యక్రమాలు కాకుండా పోర్న్ వీడియోలు చూస్తూ, కావాలనే శ్రీవారి భక్తి ఛానల్ పై దురాభిప్రాయం కలిగించే విధంగా ఉద్యోగులే ప్రయత్నించినట్టు అవగతమవుతోంది. విజిలెన్స్ పరిశీలనలో బయటపడిన వాస్తవాలు, శ్రీవారి భక్తుడి ఫిర్యాదు వెరసీ బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఎస్వీబీసీ యంత్రాంగం సిద్ధం అవుతోంది. ఇలాంటి బూతు అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోకపోతే..త్వరలో జాతీయస్థాయి భక్తిఛానల్ కాబోతున్న ఎస్వీబీసీపై భక్తుల నమ్మకం సన్నగిల్లే ప్రమాదముందని భక్తులు భావిస్తున్నారు.

తిరుమల

2020-11-11 15:37:54

15న శ్రీవారి లక్ష్మీకాసుల హారం ఊరేగింపు..

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా న‌వంబ‌రు 15న తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని తిరుచానూరుకు తీసుకెళ్ల‌నున్నారు. శ్రీవారి ఆభరణాలలో అత్యంత ప్రధానమైన లక్మీకాసుల హారాన్ని ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల‌లోని ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగిస్తారు. అనంత‌రం తిరుమల నుండి బయల్దేరి తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యానికి ఊరేగింపుగా తీసుకొస్తారు. ఆది‌వారం రాత్రి జ‌రిగే గజ వాహనసేవలో అమ్మవారికి ఈ లక్ష్మీకాసుల హారాన్ని అలంకరిస్తారు. శ్రీవారి కాసులహారాన్ని ప్రతి ఏటా గజ వాహనం సంద‌ర్భంగా అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఈ హారం ఏర్పాటుకి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ ను ద్రుష్టిలో ఉంచుకొని టిటిడి ఈ ఏర్పాట్లను చేస్తోంది..

తిరుచానూరు

2020-11-11 14:42:14

10వేల విలేజ్ క్లినిక్ లకు లైన్ క్లియర్..

ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలోనే ప్రాధమిక వైద్యం అందించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని గ్రామసచివాలయాల పరిధిలో పదివేల 30 విలేజ్ క్లినిక్ లను ఏర్పాటు చేయనుంది. అవి మార్చి నెల నుంచి పనిచేయడం ప్రారంభిస్తాయని సమాచారం. కొన్ని నెలల పాటు విలేజ్ క్లినిక్ లోనే వైద్యసేవలు అందించిన తరువాత ప్రత్యేకంగా విలేజ్ క్లినిక్ లను కూడా నిర్మించి శాస్వతంగా అందులోనే గ్రామ ప్రజలకు 12 రకాల వైద్యసేవలు అందిస్తారు. తద్వారా గ్రామంలో ఎప్పుడు ఎవరికి జ్వరమొచ్చినా, ఒళ్లు నొప్పులు వచ్చినా వెంటనే విలేజ్ క్లినిక్ లకు వెళ్లి మందులు తీసుకోవడానికి వీలుపడుతుంది. గ్రామసచివాలయాల పరిధిలోనే విలేజ్ క్లినిక్ లను కూడా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. కొన్ని సచివాలయాల్లో స్థలాలు లేని చోట సచివాలయంలో ఏదో ఒక ప్రాంతంలో దీనిని ఏర్పాటు చేస్తారు. ఆ మేరకు భవనాలకు సంబంధించిన స్థలాల ఎంపిక, భవన నిర్మాణాలకు గ్రౌండింగ్ చేపట్టడానికి ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలొచ్చాయి. ఆ మేరకు అన్నిజిల్లాల్లో స్థల పరీశీలన దాదాపు పూర్తయింది. బహుసా మార్చి నుంచి విలేజ్ క్లినిక్ ల నిర్మాణాలు ప్రారంభమై మూడు నెలల్లో పూర్తిస్థాయిలో భవనాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. భవనాలన్నీ అందుబాటులోకి వస్తే..ప్రస్తతుం గ్రామసచివాలయాల్లో పనిచేస్తున్న ఆరోగ్య సహాయకులను విలేజ్ క్లినిక్ లకు అనుసంధానం చేస్తారు. వీరితోపాటు, బిఎస్సీ నర్శింగ్ చదివిన వారిని కూడా ఇందులో నియమిస్తారు. అంటే మరో పదివేల 30 మందికి ఉద్యోగ కల్పన జరగబోతుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మార్చినెల నుంచే విలేజ్ క్లినిక్ లను ఏర్పాటు ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఇదే విలేజ్ క్లినిక్ లలో ల్యాబ్ టెక్నీషియన్లను కూడా ఏర్పాటు చేస్తే షుగర్, మలేరియా, టైఫాయిడ్, రక్తపరీక్షలకు అవకాశం వుంటుందనే వాదన వినిపిస్తుంది. ఇక్కడ పరీక్షలు చేయించుకున్నవారు ప్రాధమికంగా ఇక్కడైనా లేదంటే, దగ్గర్లోని పీహెచ్సీ దగ్గరైనా నేరుగా వెళ్లి మందులు తీసుకోవడానికి అవకాశం వుంటుందని చెబుతున్నారు. అదే సమయంలో పీహెచ్సీల్లో సమయం వ్రుధాకాకుండా ఇక్కడ చేసిన రక్త పరీక్షలతో వైద్యుని రోగం తెలియజేసేందుకు అవకాశం వుంటుందని  అంటున్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి..

వెలగపూడి

2020-11-11 10:59:35