1 ENS Live Breaking News

ఆ అధికారులు కక్షగట్టి రూ.215 కోట్లు పెనాల్టీ వేశారు..

రాజకీయంగా కక్షగట్టి లక్షల్లో గ్రానైట్ వ్యాపారం చేసేవారిని ప్రభుత్వ అధికారులు రూ.215 కోట్ల రూపాయాలు పెనాల్టీ కట్టమనడం ఎంతవరకూ సమంసజమని ఎంఎస్పీ గ్రానైట్ అధినేత పళనివేల్ ప్రశ్నించారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, టెక్కలి నియోజకవర్గంలో లింగాలవలస గ్రామంలో గ్రానైట్ క్వారీ విజిలెన్స్ ఎస్పీ పనసా రెడ్డి ఆధ్వర్యంలో 2019 డిసెంబరులో  తనిఖీ నిర్వహించారు3 రోజులపాటు నిర్వహించిన సర్వేలో కేవలం 26క్యూబిక్ మీటర్ల వరకు పెనాల్టీ వేశారన్నారు. దీంతో  తాము హైకోర్టుకి వెళితే అక్కడ తమకు న్యాయం జరిగి1400 క్యూబిక్ మీటర్లకే పెనాల్టీ వేయాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలిచ్చిందన్నారు. తరువాత హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తూ ఇద్దరు అధికారులు కక్షగట్టి ఈరోజు కూడా సర్వేచేసి ఇపక్కక్వారీలన్నింటికి కలిపి ఒక్కరినే పెనాల్టీ కట్టాలని వేధించడం బావ్యంకాదని అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరుపుతారని కుటుంబాలకు ఆదుకుంటారని కోరుతున్నామని ఎం ఎస్ పి గ్రానైట్ అధినేత పళని వేల్ తెలిపారు.

2020-08-25 18:56:29

ఎన్‌ఎన్‌ఆర్‌ కు మరోసారి దక్కిన అరుదైన గౌరవం..

విశాఖకు చెందిన సీనియర్‌ ‌జర్నలిస్ట్ ఎన్‌.‌నాగేశ్వరరావు (ఎన్‌ఎన్‌ఆర్‌)‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. నేషనల్‌ ‌యూనియన్‌ ఆఫ్‌ ‌జర్నలిస్టస్ ఇం‌డియా (ఎన్‌యూజేఐ) ఆధ్వర్యంలో 3 దశాబ్దాలుగా పని చేస్తున్న స్కూల్‌ ఆఫ్‌ ‌జర్నలిజం (ఎస్‌ఓజే) గవర్నింగ్‌ ‌కౌన్సిల్‌లో ఎన్‌.ఎన్‌.ఆర్‌.‌కు స్ధానం లభించింది. వరుసగా రెండవ సారి ఈ అవకాశం ఆయనకు దక్కింది. న్యూఢిల్లీ కేంద్రంగా 1992 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న జర్నలిజం స్కూల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వుంది. ఎన్‌యూజేఐ ఉపాధ్యక్షునిగా వరుసగా 2వసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎన్‌.ఎన్‌.ఆర్‌.‌ను జర్నలిజం స్కూల్‌ ‌పాలకమండలి సభ్యునిగా తీసుకుంది. జర్నలిజం స్కూల్‌ ‌పూర్వ గవర్నింగ్‌ ‌కౌన్సిల్‌లో ఎన్‌.ఎన్‌.ఆర్‌. ‌కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన సేవలను గుర్తించిన పాలకమండలి మరోసారి కౌన్సిల్‌లోకి అవకాశం కల్పించింది. ఈనెల 24వ తేదీన జరిగిన జర్నలిజం స్కూల్‌ ‌సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. 

విశాఖపట్నం

2020-08-25 18:22:29

వైఎస్సార్ క్లినిక్ లకు 500 గజాల్లో సొంతభవనాలు..కలెక్టర్

వై.ఎస్.ఆర్. హైల్త్ క్లినిక్ స్వంత భవనాలు నిర్మాణానికి 400 లేక 450 గజాలు స్థలం పరిశీలించి సిద్దం చేయాలన్నారు.   ఆసుపత్రులలో కావలసిన మానవ వనరులను సమీకరించుకోవాలని అధికారులకు తెలిపారు.  ప్రభుత్వం నుండి ఆమోదం పొందిన  పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు.  అందుకు అవసరమైన ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు.  పోస్టులు భర్తీ ప్రక్రియ నిబంధనల ప్రకారం జరగాలని తెలిపారు.  సిబ్బంది  అటెండెన్స్, పనితీరుపై పర్యవేక్షించేందుకు  కమిటీని ఏర్పాటు చేయాలన్నారు.  జిల్లాకు కేటాయించిన వెంటిలేటర్స్  అవసరమైన ఆసుపత్రులకు సర్దుబాటు చేసారు.  కోవిడ్ బాదిత గర్బిణీలకు, డయాలసిస్  కే.జి.హెచ్. లో చికిత్స అందించే ఏర్పాటు చేయాలని వైధ్యాధికారులు కోరగా పరిశీలించాలని తెలిపారు. 

Visakhapatnam

2020-08-24 20:35:54

విశాఖ నగర పరిధిలో వార్డుకో పీహెచ్సీ...జిల్లా కలెక్టర్

విశాఖనగర పరిధిలోని ప్రతి వార్డుకు అర్బన్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుచేయాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం అర్భన్ వైద్యసేవలసై అధికారులతో సమీక్షించారు. అర్భన్ పీహెచ్సీల్లో ఇద్దరు డాక్టర్లు, సిబ్బందిని నియమించి, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు.   టెస్టులు గ్రామ, వార్డు స్థాయినుండే నిర్వహించాలన్నారు.  గ్రామీణంలో ఆశ వర్కర్లు సేవలు ఉపయోగించుకోవాలన్నారు.  సచివాలయాలలో ఇంటర్నెట్ సదుపాయలు ఏర్పాటుచేసి, డిజిటల్ అసిస్టెంటు ద్వారా డేటా నమోదు చేయించాలన్నారు.  డిజిటల్ అసిస్టెంటు లేకపోతే తాత్కాలిక ప్రాతిపదికన నియమించాలన్నారు. పనులన్నీ సత్వరమే చేయాలని జిల్లా అధికారులను ఆదేశించిన ఆయన ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా వైద్యసిబ్బంది, అధికారులు పనిచేయాలన్నారు.

Visakhapatnam

2020-08-24 20:31:44

సదుపాయాలు కల్పిస్తాం - మెరుగైన సేవలు అందించండి

ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి కోవిడ్ విభాగంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ డాక్టర్లను కోరారు. సోమ వారం ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్యులు, పిజి వైద్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఆస్పత్రిలో చేరిన ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందాలని ఆయన పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించుటకు సిద్ధంగా ఉన్నామని అయితే ఆయా విభాగాలకు చెందిన వైద్యులు పూర్తిగా అంకితభావంతో పనిచేసి మంచి వైద్య సేవలు అందించాలని కోరారు. ఆసుపత్రిలో చేరిన ప్రతి ఒక్కరు సంతృప్తితో ఉండాలని అన్నారు. కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లాలని ఆయన చెప్పారు. కరోనా విషయాలను పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి మానసిక స్థైర్యాన్ని నింపాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల అవసరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యులు స్పంది స్తూ అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కొన్ని విభాగాలకు సంబంధించిన యంత్ర పరికరాలు కొంత మేరకు అవసరం ఉంద ని వాటిని సమకూర్చాలని కోరారు. ప్రతిరోజూ 20 నుండి 30 కేసులు ఆస్పత్రికి వస్తున్నాయని వాటిలో దాదాపు ఐదు కేసులు చివరి దశలు ఉన్నవి వస్తున్నా యని వివరించారు. అదే విధంగా ఎం.ఎన్. ఓలు, ఎఫ్. ఎన్. ఓ లకు విభాగాలలో నియామకాలకు ముందు తగిన శిక్షణ కల్పించాలని ఆయన సూచించారు.

Srikakulam

2020-08-24 20:23:56

విద్యార్ధులకు కంటి అద్దాల పంపిణీకి ఏర్పాట్లు..

శ్రీకాకుళం జిల్లాలో  పాఠశాల విద్యార్ధులకు కంటి అద్దాలను పంపిణీ చేయుటకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా అంధత్వ నివారణ సంస్థ  జిల్లా ప్రోగ్రాం మేనేజర్  డా.జి.వి.రమణకుమార్ తెలిపారు. సోమ వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, డా.వై.యస్.ఆర్.కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. సమగ్ర కంటి వైద్య సేవలు ఉచితంగా అందిoచుటకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి 2019 అక్టోబరు 10వ తేదీన కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. ఇందులో భాగంగా మొదటి, రెండవ దశలలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి 12,069 మంది విద్యార్థులకు కంటి అద్దాలు అవసరమని నిర్ధారించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి 6,872 కంటి అద్దాలను బడి పిల్లలకు పంపిణి చేసామని ఆయన తెలిపారు. ఇంకా 5,197 కంటి అద్దాలను ప్రధానోపాద్యాయలు ద్వారా పంపిణీ చేయాల్సి ఉందని చెప్పారు. 

Srikakulam

2020-08-24 20:18:01

స్పందనకు 123 వినతులు..డీఆర్వో బి.దయానిధి

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 123 వినతులు అందాయని డీఆర్వో బి.దయానిధి చెప్పారు.  ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న డయల్ యువర్ కలెక్టర్, స్పందన కార్యక్రమాల్లో ప్రజల ఆర్జీలను భౌతికంగా కాకుండా ఫోన్ ద్వారా స్వీకరించేందుకు ప్రతీ సోమవారం ఉదయం 09.00గం.ల నుండి మధ్యాహ్నం 12.00గం.ల వరకు స్వీకరించామన్నారు. అందులో భాగంగా సోమవారం జరిగిన  ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు మండలాలకు చెందిన 123 మంది ఆర్జీదారులు తమ ఫిర్యాదులను జిల్లా రెవిన్యూ అధికారికి విన్నవించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ, ప్రజలు స్పందనలో చేసుకున్న అర్జీలపై సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందించి అర్జీలను పరిష్కరించాలని ఆదేశాలు జారీచేసినట్టు ఆయన వివరించారు.

Srikakulam

2020-08-24 20:16:11

కరోనా నియంత్రణలో కలెక్టర్ సేవలు మరువలేనివి..

విశాఖజిల్లా లో కోవిడ్ - 19 ను అరికట్టడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న కలెక్టర్ వి.వినయ్ చంద్ ను సోమవారం  కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ  ఛైర్మన్ కోనాడ సుదర్శన్, కార్యదర్శి జి. అర్. ప్రభు కిరణ్, స్టేట్ కో ఆర్డినేటర్ మారియా, జిల్లా ప్రెసిడెంట్ హిల్డా మ్యాత్యు లు ఘనంగా శాలువా తో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైద్య ఆరోగ్యశాఖ, పోలీసులు, పారిశుధ్య కార్మికుల భాగస్వామ్యంతో జిల్లాలో కరోనా నియంత్రణ బాగా జరుగుతుందని చెప్పారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ చేస్తున్న క్రుషి ఎనలేదని కొనియాడారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించిన అనంతరం కరోనా వ్యాప్తి నివారణకు అన్ని వ్యాపార సంస్థలు వినియోగదారులకు తప్పనిసరిగా శ్యానిటైజర్ ను అందుబాటులో ఉంచేందుకు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. అందరూ మాస్క్ లను ధరించేలా అవగాహన కల్పించాలని కోరారు. 

Visakhapatnam

2020-08-24 20:12:53

డయల్ యువర్ కమిషనర్ కి 19 ఫిర్యాదులు..

జి.వి.ఎం.సి. ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి 19 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్  డా. జి. సృజన చెప్పారు. సోమవారం టోల్ ఫ్రీ నం. 1800-4250-0009 ద్వారా ఉదయం 10.00 గం. నుంచి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా ప్రజలనుండి విజ్ఞప్తులు స్వీకరించివాటిని సమస్య పరిష్కారానికి జెడ్సీలకు, సంబంధిత శాఖల అధికారులకు పంపించి మూడు రోజుల్లో నివేదికలు తయారు చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఫిర్యాదుల్లో 1వ జోనుకు సంబందించి 04, 2వ జోనుకు సంబందించి 04, 3వ జోనుకు సంబందించి 03, 4వ జోనుకు సంబందించి 04, 5వ జోనుకు సంబందించి 02, 6వ జోనుకు సంబందించి 02, మొత్తము 19 ఫిర్యాదులు అందాయి. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఎ. వి. రమణి, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ మంగపతి రావు, ప్రోజెక్ట్ డైరెక్టర్ (యు.సి.డి.) వై. శ్రీనివాసరావు, సి.సి.పి. విద్యుల్లత, సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎల్.ఎస్.జి. శాస్త్రి  తదితర అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-08-24 20:07:20

ఏయూలో బిటెక్‌ ‌హానర్స్ ‌కోర్సులు..వీసీ ప్రసాదరెడ్డి

ఆంధ్రవిశ్వవిద్యాలయంలో విద్యార్థులకు నైపుణ్యాలతో కూడిన విద్యను అందించే దిశగా సిలబస్‌ ‌రూపకల్పన చేయడం జరుగుతోందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం ఏయూ అకడమిక్‌ ‌సెనేట్‌ ‌సమావేశం జరిగింది. సెనేట్‌ ‌మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అద్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్కర పరిస్థితులను అధిగమిస్తూ ముందకు సాగడం జరుగుతోందన్నారు. అన్‌లైన్‌ ‌బోధన విధానాన్ని అవలంభించామన్నారు. వర్సిటీలోని పలు విభాగాలు వెబినార్‌లను సమర్ధవంతంగా నిర్వహించాయన్నారు. కోవిడ్‌ ‌విపత్తు సమయంలో సైతం తమ విశ్వవిద్యాలయం ఆచార్యులు సమర్ధవంతంగా పరిశోధన ప్రాజెక్టలను సాధించడం శుభపరిణామమన్నారు. త్వరలో విశ్వవిద్యాలయం పూర్తిస్థాయిలో సేవలు అందించే దిశగా, విద్యార్థులకు తరగతులు, పరీక్షల నిర్వహణకు విభిన్న వ్యూహాలను అవలంభించడం జరుగుతోందని వివరించారు.

Visakhapatnam

2020-08-24 20:03:47

టంగుటూరి భావితరాలకు ఆదర్శం.. వీసి ప్రసాదరెడ్డి

నిస్వార్ధ ప్రజాసేవకు నిలువెత్తు నిదర్శనంగా టంగుటూరి ప్రకాశం పంతులు నిలుస్తారని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. టంగుటూరి ప్రకాశం జయంతిని ఆదివారం  ఏయూ అకడమిక్‌ ‌సెనేట్‌ ‌మందిరంలో నిర్వహించారు. ముందుగా టంగుటూరి చిత్రపటానికి వీసీ ఆచార్య ప్రసాద రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ బ్రిటీషు వారికి ఎదురొడ్డి ప్రాణాలను సైతం దేశ స్వాతంత్య్రం కోసం అర్పించడానికి సిద్దపడిన ధీశాలిగా టంగుటూరి చరిత్రలో నిలచిపోయారన్నారు. ఆయన చూపిన ధైర్యం, తెగువ నేటి యువతకు ఆదర్శనమన్నారు. ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన చేసిన అభివృద్ది ఎంతో ఆదర్శనమన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌, ఇం‌జనీరింగ్‌ ‌కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య పేరి శ్రీనివాస రావు, ఎన్‌ఎస్‌ఎస్‌ ‌సమన్వయకర్త ఆచార్య ఎస్‌.‌హరనాథ్‌, ‌డీన్‌ ఆచార్య ఎన్‌.‌సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.  

Visakhapatnam

2020-08-23 22:20:01

పంచగ్రామాల సమస్య పరిష్కారానికి క్రుషి..మంత్రి అవంతి

సింహాచలం పంచగ్రామాల సమస్యను త్వరలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రానివాసరావు  అన్నారు. ఆదివారం ఆయన సింహాచలంలో శ్రీ వారహ లక్ష్మి నృసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సింహాచలం దేవస్థానంలో కనీవినీ ఎరుగని అభివ్రద్ధి చేయనున్నట్టు చెప్పారు. భక్తులకు సౌకర్యాలు పెంచడంతోపాటు, రాష్ట్రంలోనే ప్రముఖ దేవస్థానంలా మార్పు చేయడానికా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. స్వామివారికి జరిగే సేవలను ప్రజలకు, పర్యాటకులకు తెలియజేసే కార్యక్రమం చేపడతామన్నారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మంత్రికి స్వాగతం పలికిన ఆలయ  అధికారులు పూజలు, కప్పస్థంభం ఆలింగనం తరువాత తీర్ధ ప్రసాదాలను అందజేసి, వేదపండితులతో ఆశీర్వాదాలను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

Simhachalam

2020-08-23 21:47:20

ఆంధ్రకేసరిని ప్రతీఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి...

ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్  వి.వినయ్ చంద్ అన్నారు.  ఆదివారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో శ్రీ టంగుటూరి ప్రకాశo పంతులు  జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్  వి.వినయ్ చంద్, జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాలరెడ్డి  పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశము పంతులు సేవా స్పూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన అన్నారు.  స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించి, సైమన్ కమిషన్ ను వ్యతిరేకిస్తూ  తుపాకులకు  ఎదురొడ్డిన ధీరుడు అని  అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి గా పనిచేశారన్నారు.  ఈ కార్యక్రమంలో  కలెక్టర్ వి.వినయ్ చంద్, జాయింట్ కలెక్టర్  ఎం . వేణుగోపాలరెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-08-23 15:01:09

స్టీల్ ప్లాంట్ ఆర్ కార్డ్ లు బదిలీ సత్వరమే చేపట్టండి...

విశాఖ స్టీలుప్లాంట్ నిర్వాసితుల ఆర్ కార్డ్ దారులు పడుతున్న ఇబ్బందులు తీర్చాలని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి శుక్రవారం జెసిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆర్ కార్డు దారులు వారి కార్డులను బదిలీలు చేసుకునేందుకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించడం ద్వారా వారికి మేలు చేసినట్టు అవుతుందని జెసికి వివరించారు. ఈ సందర్భంగా స్పందించిన జెసి త్వరలోనే ఒక అధికారిని స్టీలుప్లాంట్ ఆర్ కార్డుల బదిలీ కోసం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గాజువాకలో ఎంత మంది ఎమ్మెల్యేలు పనిచేసినా ఆర్ కార్డుదారులకు న్యాయం జరగలేదు. తాజాగా ఇపుడు ఎమ్మెల్యే చొరవతో ఒక్కో అడుగు ముందుకి పడుతుంది. ఆర్ కార్డులు బదిలీ జరిగితే స్థానికులకు, నిర్వాసితులకు న్యాయం జరిగి, స్టీలు ప్లాంటులో ఉద్యోగాలు వచ్చే అకాశం ఏర్పడుతుంది. తద్వారా ఎన్నో ఏళ్ల నుంచి అరిష్క్రుతంగా ఉన్న సమస్య కూడా పరిష్కారం అవుతుందని నిర్వాసితులు పేర్కొంటున్నారు.

Visakhapatnam

2020-08-21 20:47:49

నిరుద్యోగ యుతకు ఆన్లైన్లో ఉచితర కోర్సులు..సెట్ శ్రీ

యువతకు ఆన్ లైన్ కోర్సులను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ చర్యలు చేపట్టిందని యువజన సర్వీసుల శాఖ (సెట్ శ్రీ) ముఖ్య కార్యనిర్వహణాధికారి జి.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, యువతలో దాగి ఉన్న నైపుణ్యాలు వెలికితీయడం, వారిలో వ్యక్తిత్వ వికాసాలను పెంపొందిచడం, యువతను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లాలోని 15 నుండి 29 సం.ల మధ్య వయస్సు కలిగిన యువతీ, యువకులకు అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పారు. ఉచిత యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్ లో అంతర్జాలము వేదికగా ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాలలో భాగంగా ప్రతీ రోజు యోగా, ధ్యానం కోర్సులు నిర్వహిస్తారని, మిగిలిన అంశములను వారంలో ఒక రోజు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణా కార్యక్రమాలను రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు యండమూరి వీరేంద్రనాథ్, బి.వి. పట్టాభిరామ్, గంపా నాగేశ్వరరావు తదితరులు నిర్వహిస్తారని వివరించారు. ఆసక్తి, అర్హత గల యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్యక్తిత్వ వికాసాన్ని, కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంపొందంచుకోవాలని శ్రీనివాస రావు కోరారు. అభ్యర్ధులు తమ వివరాలు - పేరు, తండ్రి పేరు, పుట్టిన తేది, ప్రస్తుత స్థితి, చిరునామా, మొబైల్ నెంబరు, ఈ మెయిల్ ఐడి, ఆధార్ నంబరు, శిక్షణ పొందుటకు ఆసక్తిగల అంశంను ఒక కాగితంపై రాసి పాస్ పోర్ట్ సైజు ఫోటో అతికించి, సంతకం చేసిన దరఖాస్తును స్కాన్ లేదా పి.డి.యఫ్ చేసి setsrisklm@gmail.com  మెయిల్ అడ్రస్ నకు ఈ నెల 25 వ తేది లోగా పంపించాలని శ్రీనివాసరావు తెలిపారు. ఉచిత కోర్సుల వివరాలపై సందేహాలు, వివరాలకు కార్యాలయం పని దినములలో సెట్ శ్రీ మేనేజరు బి.వి. ప్రసాదరావు (8341478815,  08942 240601) ఫోన్ నంబర్లకు సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

Srikakulam

2020-08-21 20:13:46