1 ENS Live Breaking News

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఆదివారం అర్ధరాత్రి వరకూ 82,398మంది దర్శించుకున్నారు. హుండీ కాను కల ద్వారా రూ.4.40 కోట్లు వచ్చింది. 30,076 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శనాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నది.  14 కంపార్ట్ మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-04-03 03:15:22

3నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 3 నుండి 5వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగను న్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. ఏప్రిల్ 3వ తేదీన ఉదయం 7 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన  అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

   రెండవరోజు ఏప్రిల్ 4న శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరిరోజు ఏప్రిల్ 5న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి  చేరుకుంటారు. 

ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు. వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి 'వసంతోత్సవ'మని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా  నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ.

    వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 4న అష్టదళ పాదపద్మారాధన, ఏప్రిల్ 3 నుండి 5వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

Tirumala

2023-04-01 07:41:57

తిరుమల శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని  శుక్రవారం అర్ధరాత్రి వరకూ 61,425 మంది దర్శించుకున్నారు. హుండీ కా నుకల ద్వారా రూ.3.01 కోట్లు వచ్చింది. 26,430 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శ నాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 14 గంటల సమయం పడుతున్నది.  7 కంపార్ట్ మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామి వారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-04-01 01:35:06

మళ్లీ దేశంలో భయపెడుతున్న కరోనా కేసులు

భారత దేశంలో కరోనా కేసులు మళ్లీ భయపెడుతున్నాయి. గత 24 గంటల్లో 3,016 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.73%గానూ, వారపు పాజిటివిటీ రేటు 1.71% గా నమోదు అవుతుంది. దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 13,509గా ఉంది. గత 24 గంటల్లో 15,784 డోసులు అందించారు. దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.65 కోట్ల డోసులు ( 95.20 కోట్ల రెండో డోసులు + 22.86 కోట్ల ముందు జాగ్రత్త డోసులు )అందించారు. ప్రస్తుత రికవరీ రేటు 98.78%గా నమోదైంది. కాగా గత 24 గంటల్లో 1,396 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,41,68,321 కు పెరిగింది. గత 24 గంటల్లో చేసిన 1,10,522 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 92.14 కోట్ల పరీక్షలు చేశారు.  మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.03% గా నమోదైంది. కేసులు పెరగ కుండా ఉండేందుకు ఖచ్చితంగా మాస్కులు ధరించాలని చెబుతున్నారు.

Delhi

2023-03-30 08:52:32

ఆ మందులు & ఆహారంపై కస్టమ్స్ సుంకం రద్దు

అన్ని అరుదైన వ్యాధుల చికిత్సల్లో వ్యక్తిగతంగా ఉపయోగించుకునేందుకు దిగుమతి చేసుకునే అన్ని రకాల మందులు & ఆహారంపై విధించే ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి కేంద్ర ప్రభుత్వం పూర్తి మినహాయింపును ప్రకటించింది. 'అరుదైన వ్యాధుల కోసం జాతీయ విధానం 2021' కింద ఈ మినహాయింపును ఇచ్చింది. ఈ మినహాయింపును పొందేందుకు, వ్యక్తిగత దిగుమతిదారు కేంద్ర లేదా రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారి లేదా జిల్లా వైద్యాధికారి లేదా జిల్లాలోని సివిల్ సర్జన్ నుంచి ధృవపత్రం తీసుకువచ్చి సమర్పించాలి. సాధారణంగా, మందులు/ఔషధాలపై 10% ప్రాథమిక కస్టమ్స్ సుంకం చెల్లించాలి. కొన్ని రకాల ప్రాణ రక్షణ మందులు/టీకాలపై రాయితీ కింద 5% లేదా అసలు సుంకం ఉండదు. వెన్నెముక కండరాల క్షీణత చికిత్స కోసం ఉపయోగించే ఔషధాలకు ఇప్పటికే మినహాయింపులు అందించింది. ఇతర అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మందులపై కస్టమ్స్ సుంకం మినహాయింపు కోరుతూ ప్రభుత్వానికి చాలా విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వ్యాధుల చికిత్సకు అవసరమైన మందులు లేదా ప్రత్యేక ఆహారాలు ఖరీదైనవి, దిగుమతి చేసుకోవలసి ఉంటుంది. 10 కిలోల బరువున్న పిల్లల విషయంలో, కొన్ని అరుదైన వ్యాధుల చికిత్సకు ఏడాది ఖర్చు ₹10 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఉండవచ్చు. జీవిత కాల చికిత్స అవసరం పడవచ్చు, పిల్లల వయస్సు, బరువుతో పాటే వ్యయం పెరుగుతుందని అంచనా. ఈ మినహాయింపు వల్ల వ్యయంలో గణనీయంగా ఆదా అవుతుంది, రోగులకు చాలా ఉపశమనం లభిస్తుంది. వివిధ రకాల క్యాన్సర్ల చికిత్సలో ఉపయోగించే పెంబ్రోలిజుమాబ్‌పై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది.

New Delhi

2023-03-30 08:44:22

ప్రధానిని కలిసిన రష్యా భద్రతామండలి కార్యదర్శి

రష్యా భద్రతామండలి కార్యదర్శి  నికొలాయ్  పాత్రుషెవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు.  వారిరువురూ ద్వైపాక్షిక సహకారానికి  సంబంధించిన అంశాలమీద చర్చించారు. అదే విధంగా పరస్పర దేశ  ప్రయోజనాలకు సంబంధించిన అంతర్జాతీయ అంశాలను కూడా చర్చించారు.  రానున్న రోజుల్లో రష్యా దేశంతో స్నేహపూర్వక సహకారం తదితర అంశాలు కూడా ఇరువురి మధ్య చర్చకు వచ్చాయి.

Delhi

2023-03-30 08:22:17

అక్కడ నాడిగణపతి ఆలయం కోసం తెలిస్తే..!

మన భారతదేశం ఎన్నో అద్భుత ఆలయాలకు నెలవు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆలయం భక్తులకు ఆకట్టుకుంటుంది. అలాంటి అద్భుత ఆలయాల్లో అరుదైన ఈ గణపతి ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. బ్రిటిష్ కాలంలో అప్పటి గవర్నర్ ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట చేస్తుంటే వచ్చి రాతికి ప్రాణం ఉంటుందా అని హేళన చేశారట. ఒక సిద్ధయోగి దాన్ని రుజువుచేయడంతో ఆ గవర్నర్ స్వయంగా వచ్చి గణపతికి నమస్కరించి మరీ వెళ్లాడట. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది...? ఆ ఆలయంలో విగ్రహ ప్రతిష్టప్పుడు ఏం జరిగిందనే విషయాల గురించి తెలుసుకుంటే దేవుళ్ల ఆలయాలకు అంతటి శక్తి ఉందా అని ఆశ్చర్యపోవడం ఖాయం. తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లాలో కుర్తాళం ఉంది. ఇక్కడే మౌనస్వామి మఠం, కుర్తాల పీఠం, గణపతి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ అద్భుత జలపాతం ఉండగా ఇందులోని మూలికలు ఎన్నో రకాల వ్యాధులను నయం చేస్తాయని నమ్ముతారు. అంతేకాదు చాలా పరిశోధనలలో కూడా రుజువు అయింది. ఇక్కడ ఉన్న చిత్రావతి జలపాతం దాదాపుగా అరవై అడుగుల ఎత్తు నుండి చాలా వేగంగా క్రిందకు దూకుతుంది. ఇక్కడ అనేక రకాల మూలికలు దొరకడమే కాదు మానసిక వికలాంగులు ఈ నీటిలో స్నానం చేస్తే మానసిక రుగ్మతతో పాటు ఎన్నో శారీరక సమస్యలు తొలగిపోతాయని చెబుతారు.

ఇక గణపతి ఆలయ విషయానికి వస్తే, ఇక్కడ ఉన్న గణపతిని ‘నాడి గణపతి’ అని పిలుస్తారు. ఇలా నాడి గణపతి అని పిలవడానికి కారణం ఏంటంటే, మహా సిద్ధయోగి మౌనస్వామి తపస్సు చేయడానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ ఒక మఠాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ముందుగా శ్రీ సిద్దేశ్వరి అమ్మవారిని ప్రతిష్టించారు. ఆ తరువాత ఇక్కడ గణపతి దేవుడిని ప్రతిష్టించి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయాలని భావించగా, అది తెలిసిన మద్రాస్ గవర్నర్ ఎడ్వార్డ్ రాతికి ప్రాణ ప్రతిష్ట ఏంటి అంటూ హేళనగా అనడంతో, ఆ సిద్ద యోగి ఒక వైద్యుడిని పిలిపించమని చెప్పాడు. వెంటనే అతడు వైద్యుడిని పిలిపిస్తాడు, మౌనస్వామి వైద్యుడితో విగ్రహానికి నాడి పరీక్షించమని చెప్పగా... అతడు కూడా విగ్రహానికి ప్రాణం ఉండదు కదా అంటూనే, పరీక్షించి నాడి చప్పుడు లేదని చెప్తాడు. అప్పుడు మౌనస్వామి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసి ఇప్పుడు చూడండి అని చెబుతాడు. వైద్యుడి మెడలోని స్టెతస్కోప్ తో పరిశీలించగా ఆ వైద్యుడిలో ఒక ఆశ్చర్యం గణపతి విగ్రహానికి మనిషి వలె నాడి కొట్టుకుంటుందని చెప్పాడు. అందరూ ఒక్కసారిగా బిత్తరపోతారు. 

దీంతో ఈ అద్భుతాన్ని చూసిన ఆ వైద్యుడు ఇంకా బ్రిటిష్ గవర్నర్ మౌనస్వామి దగ్గర ఆశీర్వాదాన్ని తీసుకొని గణపతికి నమస్కరించి అక్కడి నుండి వెళ్లారు. ఇలా మౌనస్వామి మహిమతో ఇక్కడ వెలసిన గణపతి దేవుడికి నాడి గణపతి అనే పేరు వచ్చినది. అయితే ఇక్కడ స్వామివారి తొడల నుండి శబ్దం వచ్చినదని అందుకే స్వామివారి విగ్రహానికి తొడలు కనిపించకుండా ధోవతి కడతారని చెబుతారు. నాటి నుంచి నేటి వరకూ ఈ నాడి గణపతి ఆలయాన్ని దర్శించడానికి, ఆలయ చరిత్రను తెలుసుకోవడానికి వేలు, లక్షల సంఖ్యలో భక్తులు వెళుతుంటారు. దైవం లేదని అనుకునేవారికి ఈ నాడి గణపతి ఒక ప్రత్యేక నిదర్శమని ఇక్కడి వారు చెబుతుంటారు. గణపతి ఆలయాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయి. కానీ ఇక్కడి ఆలయం మాత్రం ప్రపంచంలోనే ప్రశిద్ధి చెందిన ఆలయంగా చరిత్రకెక్కింది. అయితే స్వామివారి విగ్రహంలో నుంచి నాడి ఎందుకు కొట్టుకుంటుంది అనే విషయం నేటికీ ఎవరూ గుర్తించలేకపోయారంటే అది ఇక్కడి వెలసిన స్వామివారి మహిహ అనే భక్తుల నమ్మిక..!

Tirunelveli

2023-03-29 02:20:53

గుడ్ న్యూస్.. పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు

పాన్-ఆధార్ లింక్ గడువును మరోసారి పెంచుతూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. పాన్-ఆధార్ లింక్ గడువును జూన్ 30 వరకు పెంచు తున్నట్లు కేంద్రం ప్రకటించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) ఈమేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ట్యాక్స్ చెల్లిం పుదారులకు ఈ విషయంలో మరికొంత సమయం ఇచ్చే ఉద్దేశంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీనివల్ల ఎందరో వినియోగదారు లకు మేలు జరగనుంది. జూన్ 30 లోపు పాన్-ఆధార్ లింక్ చేసుకోవాల్సిందే. లేదంటే జూలై 1 నుంచి పాన్ నిరుపయోగంగా మారుతుంది. ఆ తర్వాత పన్నులు చెల్లించాల్సి వస్తే అదనపు జరిమానాల్ని కూడా కేంద్రం వసూలు చేస్తుంది.  ప్రస్తుతం రూ.1,000 ఫైన్ చెల్లించి, మార్చి 31 వరకు ఆధార్-పాన్ అనుసంధానించుకోవాల్సి వుంది. అయితే, 3 రోజుల్లో ఈ గడువు ముగియనున్న నేపథ్యంలో మరోసారి గడువు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోగా ఇప్పటివరకు 51 కోట్ల పాన్ కార్డులు ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. 

Delhi

2023-03-28 16:04:05

ఏప్రిల్1న 15వ విడ‌త‌ బాలకాండ అఖండ పారాయ‌ణం

లోక‌క‌ల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఏప్రిల్ 1న15వ విడ‌త‌ బాలకాండ అఖండ పారాయణం జ‌రుగ‌నుంది. ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. బాలకాండలోని 71 నుండి 73వ సర్గల వ‌ర‌కు గ‌ల 89 శ్లోకాలను పారాయణం చేస్తారు. అదేవిధంగా యోగవాశిస్టం, ధన్వంతరి మహామంత్రం కలిపి 25 శ్లోకాల పారాయణం జరుగుతుంది. మొత్తం 114 శ్లోకాలను పారాయణం చేస్తారు. ఎస్.వి. వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి.వేద విశ్వవిద్యాలయం, టిటిడి వేదపండితులు, టిటిడి సంభావన పండితులు, అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తులు ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని టిటిడి కోరింది.

Tirumala

2023-03-26 06:54:45

విశాఖ మీడియాకి జి-20 సదస్సుల్లోకి నో ఎంట్రీ

విశాఖ వేదికగా ఈనెల 28, 29 తేదీల్లో జరుగనున్న జి-20 సదస్సుల కవరేజికి స్థానిక మీడియాకి నో ఎంట్రీ. మొత్తమంతా ఢిల్లీ నుంచి మానటరింగ్ చేస్తున్నారు. ఇది కేం ద్ర ప్రభుత్వం నిర్వహించే సదస్సుకావడంతో జిల్లా అధికారులు ప్రోటోకాల్ డ్యూటీలు చేయడం తప్పితే మరేమీ చేయడం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విశాఖ లో జరుగుతున్న ఈ ప్రపంచస్థాయి సదస్సుకి ప్రచారం మొత్తం స్థానిక మీడియానే రెండు నెలలుగా ఇస్తూ వస్తోంది. అయితే ఇపుడు అధికారులు చాలా తేలిగ్గా లోకల్ మీడి యాకి నో ఎంట్రీ ఏం చేసినా మొత్తమంతా డిల్లీ నుంచే అంతా చూసుకుంటున్నారు అని చేతులెత్తేశారు జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున. కార్యక్రమాల వివరాలు మాత్రం ఏ యూలో ఒకచోట షార్ట్ బ్రీఫింగ్ ఇస్తామని చెబుతున్నారు. విశాఖలో జరిగే కార్యక్రమాల ప్రచారానికి మీడియా కావాలికానీ, కవరేజికి మాత్రం డిల్లీ మీడియానా.. ఇన్వెస్టిమెం ట్ సమ్మిట్ లోనూ అలానే చేశారంటూ విశాఖ జర్నలిస్టులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Visakhapatnam

2023-03-23 11:11:59

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని బుధవారం అర్ధరాత్రి వరకూ 53,146 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.03  కోట్లు వచ్చింది. 18,655 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. 2 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నది. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులకు వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-03-23 06:16:27

తిరుమల శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని  సోమవారం అర్ధరాత్రి వరకూ 62,824 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.4.96 కోట్లు వచ్చింది.27,982 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. సుదీర్ఘ లైనులో భక్తులు స్వామి దర్శ నాలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 15 గంటల సమయం పడుతున్నది.  4 కంపార్ట్ మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. రూ.300 టోకెన్లు, ఫ్రీ క్యూలైన్ల ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్వామి వారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-03-21 02:30:34

భారతదేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ XBB1.16

భారతదేశంలో కరోనా కొత్త వేరియంట్ ఇపుడు కలవరపాటుకి గురిచేస్తున్నది. ఇండియాలోకి SARSCOV2 (కొవిడ్)ను గుర్తించినట్టు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే ఈ వేరియంట్ భారిన పడకుండా వుండేందుకు మాస్కు తప్పనిసరిగా ధరించాల్సి వుంటుందని సూచిస్తున్నారు. ఈ కొత్త వేరియంట్ XBB1.16జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా జాగ్రత్తలు చెబుతున్నారు. జనాలు ఒకేదగ్గర గుమిగూడి ఉన్నప్పుడు కాస్త దూరం పాటించాలని, ఖచ్చితంగా చేతులకు శానిటైజర్ రాసుకోవడంతో పాటు వెంటిలేషన్ లేని చోట్ల ఖచ్చితంగా వెలుతురు, కిటికీలు ఏర్పాటు చేసుకోవాలని..మరీ ముఖ్యంగా పాఠశాలల్లో కిటికీలను తెరిచే ఉంచాలని జాగ్రత్త చెబుతున్నారు.  ఇండోర్ క్లోజ్డ్ రూమ్లలో గుమికూడినప్పుడు మరింత జాగ్రత్త అవసరమనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాలని పేర్కొంటున్నారు.

Delhi

2023-03-20 16:30:31

మార్చి 21న శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదల

శ్రీవాణి టికెట్లకు సంబంధించిన జూన్ నెల ఆన్ లైన్ కోటాను మార్చి 21వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి విడుదల చేయనుంది.  తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూన్ నెల కోటాను మార్చి 23న ఉదయం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ఉన్నాయి.  అదేవిధంగా, జూన్ నెలకు సంబంధించిన మిగతా ఆర్జిత‌సేవా టికెట్లకు ఆన్‌లైన్ ల‌క్కీడిప్ న‌మోదు ప్ర‌క్రియ మార్చి 24న ఉదయం 11 గంట‌ల‌కు మొదలవుతుంది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. 

 జూన్ నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి 24న ఉదయం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఏప్రిల్ నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను మార్చి 24వ తేదీన మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.  భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

Tirumala

2023-03-20 16:07:15

శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మార్చి 22న ఉగాది ఆస్థానాన్ని పుర‌స్క‌రించుకుని మార్చి 21వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవా యితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహి స్తారు.  మార్చి 21న ఉదయం 6 నుండి 11 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంత‌రం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

Tirumala

2023-03-20 15:17:49