గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం తెచ్చామని ప్రకటించుకుంటున్న ప్రభుత్వానికి, కొత్త గ్రామ పంచాయతీ పాలక మండళ్లకు దుర్వాసనతో కూడిన చెత్త స్వాగతం పలుకుతోంది. ఆంధ్రప్రదేశ్ లో పదేళ్ల తరువాత ఏర్పడిన గ్రామ పంచాయతీలకు, వాటినే పేరు మార్చిన గ్రామసచివాలయాలకు అన్ని గ్రామాలు చెత్తతో నిండిపోవడమే దానికి కారణం. ఏంటి కొత్త పంచాయతీలకు చెత్త స్వాగతం చెప్పడమేంటని ఆలోచిస్తున్నారా అయితే మీరు కూడా చెత్తలో కాలుమోపినట్టే. రాష్ట్రంలోని సుమారు పదేవేల చిలుకు గ్రామ పంచాయతీలుంటే అందులోని మేజర్ పంచాయతీల్లో మాత్రమే శానిటేషన్ సిబ్బందిని నియమించుకొని, ట్రాక్టర్లు ద్వారా చెత్తను అరకొరగా తొలగిస్తున్నాయి. మిగిలిన చిన్న పంచాయతీలకు ఎలాంటి శానిటేషన్ సిబ్బంది లేరు. ఎవరైతే గ్రామంలో పనిచేసే తలయారీ వున్నాడో ఆయనే గ్రామం మొత్తం తిరిగి చెత్తను డంపింగ్ యార్డుకి తరలించాల్సిన దుస్థితి ఏర్పండి. ఒక్క తలయారీ గ్రామంలోని చెత్తను మొత్తం ఎత్తాలంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి అర్ధం చేసుకుంటే...నెలలో ఒకసారి కూడా ఏ ఒక్క వీధికి కూడా చెత్తను తీసుకెళ్లడానికి ఆ తలయారీ వచ్చే పరిస్థితులు లేవు. ప్రభుత్వం మేజర్ పంచాయతీల్లో శానిటేషన్ సిబ్బందిని నియమించినట్టుగా చిన్న పంచాయతీలకు కూడా శానిటేషన్ సిబ్బందిని ఎందుకు తీసుకోలేదనే ప్రశ్నకు అధికారులూ, ప్రభుత్వం ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టుగా ఎలాంటి సమాధానం చెప్పకుండా మిన్నకుండి పోతుంది. అయినప్పటికీ యధాప్రకారంగా ఇంటిపన్నులు, లేని గ్రంధాలయానికి ల్రైబ్రెరీ పన్నులు, వీధిలైట్ల పన్నులు, నీరు రాని మంచినీటి కుళాయిలకు కుళాయి పన్ను ఇలా ప్రజల నుంచి చాలా పన్నులే వసూలు చేస్తుంది. గతంలోనే సర్పంచ్ లు పంచాయతీల్లో శానిటేషన్ సిబ్బందిని నియమించే విషయమై మండల అధికారులను కోరితే...ప్రభుత్వం పరిశీలన చేస్తుందని కాలయాపన చేశారు. ఆ తరువాత టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక సంస్థలకు ఎన్నికలే నిర్వహించడం మానేసింది. దీనితో గ్రామంలోని చెత్త సమస్య అలానే ఉండిపోయింది. ఇపుడు కొత్తగా ఎన్నికైన చిన్న పంచాయతీలకు మాత్రం గ్రామాల్లోని చెత్తే వారికి దుర్వాసనతో స్వాగతం పలుకుతోంది. కారణం ఒక్కటే ఎక్కడి చెత్త అక్కడ దారుణంగా పేరుకుపోవడమే. చాలా పంచాయతీల్లో చెత్త ఎత్తని కారణంగా ఇంటి పన్నులు కూడా కట్టమని తెగేసి చెబుతున్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా చిన్నపంచాయతీల్లోని ప్రజలంతా చెత్తకోసం ఉద్యమించే పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం చిన్న పంచాయతీల్లో వున్న వారంతా ప్రజలు కారు...వారి ఇళ్ల నుంచి చెత్త ఎత్తించాల్సిన అవసరం లేదనుకుంటే..నేటి గ్రామసచివాలయ వ్యవస్థలో కూడా శానిటేషన్ సిబ్బందిని నియమించదు. అలాకాకుండా 14 మంది సిబ్బందితో గ్రామసచివాలయాల ద్వారా సేవలందిస్తున్నప్పుడు...చిన్న పంచాయతీలకు చెత్తఏరివేయడానికి శానిటేషన్ కనీసం ఆరుగురు వ్యక్తులనైనా చెత్త ఎత్తడానికి నియమించడానికి చర్యలు తీసుకుంటుంది. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరి..!
రథసప్తమినాడు శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టిటిడి డెప్యుటేషన్ సిబ్బంది, శ్రీవారి సేవకులు భక్తిశ్రద్ధలతో సేవలందించాలని టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి కోరారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో డెప్యుటేషన్ సిబ్బందికి, శ్రీవారి సేవా సదన్-2లో శ్రీవారి సేవకులకు గురువారం అవగాహన సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ ఉద్యోగులు, శ్రీవారిసేవకులు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని, కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని కోరారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించాలని, భక్తులు కూడా ధరించేలా తెలియజేప్పాలని కోరారు. గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులందరికీ తాగునీటి బాటిల్ అందిస్తామని, అది ఖాళీ అవగానే తిరిగి అక్కడే ఉన్న కొళాయిల్లోని జలప్రసాదం నీటిని నింపుకునేలా అవగాహన కల్పించాలని కోరారు. గ్యాలరీల్లో చివర ఉన్న భక్తులకు కూడా తాగునీరు, అన్నపానియాలు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అందుబాటులో ఉన్న మరుగుదొడ్ల గురించి భక్తులకు తెలియజేయాలన్నారు. శ్రీవారి సేవకుల సాయంతో చక్కగా భక్తులకు సేవలు అందించాలన్నారు. ఉదయం నుండి రాత్రి వరకు వాహనసేవలు సజావుగా జరిగేలా చూడాలని కోరారు. ఏవైనా సమస్యలు ఎదురైతే అందుబాటులో ఉన్న అధికారులను వెంటనే సంప్రదించి పరిష్కరించుకోవాలన్నారు. ఈ సమావేశాల్లో టిటిడి డెప్యూటీ ఈవో నాగరాజ, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఆర్.ఆర్.రెడ్డి, విజివో బాలిరెడ్డి, క్యాటరింగ్ అధికారి జిఎల్‌ఎన్.శాస్త్రి, శ్రీవారి సేవా సెల్ ఏఈవో రమాకాంతరావు, టిటిడి అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాల అధికారులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.
నిర్మాతల శ్రేయస్సే కోసం IFMA (ఐ ఎఫ్ ఎం ఏ) ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు తెలంగాణ (ఐ ఎఫ్ ఎం ఏ) ఇంచార్జి "రామచంద్ర రెడ్డి" ప్రోడ్యూసర్లు సినిమాలతో నష్టపోకుండా వారికి అన్ని సేవలు అందించడానికి ఈ అసోసియేషన్ ఏర్పడినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్లో గురువారం పాత్రికేయుల సమావేశం ఏర్పటు చేసి (ఐ ఎఫ్ ఎం ఏ) లోగో లాంచ్ చేశారు. ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఆవిర్భవించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగు పెట్టిందని... ఇప్పటి వరకు మొత్తం 9 రాష్ట్రాల్లో నిర్మాతలకు, సినిమాలోని 24 శాఖలకు పలు సేవలు అందిస్తుందని తెలిపారు.ఐ ఎఫ్ ఎం ఏ లో నిర్మాత సభ్యత్యం తీసుకుంటే నిర్మాతలకు టైటిల్ రెజిస్ట్రేషన్ నుండి పబ్లిసిటీ మరియు సినిమా విడుదల వరకు కార్పోరేట్ స్థాయిలో అన్ని సంస్థే చూసుకుంటుందని ,24 శాఖల వారు సభ్యత్యం తీసుకుంటే వారికి ESI,PF సౌకర్యం ఉంటుందని తెలిపారు.
(ఐ ఎఫ్ ఎం ఏ) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ "విజయ జాలాది" మాట్లాడుతూ...సమాజ శ్రేయస్సు కోసం జాతిని జాగృతి చేయడానికి ఈ అసోసియేషన్ ఏర్పడిందని 24 శాఖల కళాకారులు ఇందులో సభ్యత్వం తీసుకుంటే వారికి సంస్థ అండగా ఉంటుందన్నారు.సెంట్రల్ బ్యూరో నియమ నిబంధనలకు అనుగుణంగా సేవలు అందుతాయని ,నిర్మాతలు ఈ అసోసియేషన్ లో సభ్యత్యం తీసుకుంటే అన్ని విధాలుగా మేము నిర్మాతలకు సినిమా విడుదల వరకు సేవలు అందిస్తామని అన్నారు.
(ఐ ఎఫ్ ఎం ఏ) మీడియా ఎంటర్టైన్మెంట్ సలహాదారులు " ప్రతిభా పులిజాల" మాట్లాడుతూ... ఈ అసోసియేషన్ కు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని,నిర్మాతల క్షేమం కోసం వారు మోసపోకుండా ఉండడానికి మేము వారికి అండగా ఉంటూ సేవలు అందిస్తామన్నారు(ఐ ఎఫ్ ఎం ఏ) సభ్యులు "రాజీవ్ రెడ్డి" మాట్లాడుతూ...కరోనా సమయంలో నిర్మాతలకు ఎవరు అండగా లేరని వీరు ఎంతో నష్టపోయరని ,కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే వీరికి సరైన గుర్తింపు లేదని మా అసోసియేషన్ లో నిర్మాత సభ్యత్యం తీసుకుంటే వారికి ప్రభుత్వం నుండి వచ్చే రాయితీ,సినిమా విడుదల వరకు నిర్మాతకు ఎక్కడ మోసం జరుగకుండా మేము అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతిభా పులిజాల, విజయ జాలాది , పి. రామచంద్ర రెడ్డి , రాజీవ్ ,భీమా నిషాంత్ , కర్ణాటక విభాగం సెక్రెటరీ దిలీప్ తదితరులు పాల్గోన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామసచివాలయ వ్యవస్థతో ఒక్కో సర్పంచ్ కి ఒక్కో చోట మూడు కార్యాలయాలు ఏర్పాటయ్యాయి.. ఏంటి చదవడానికి కాస్త వింతగానూ, ఆశ్చర్యంగానూ ఉంది కదూ..మీ ఆలోచన నిజమే. రాష్ట్రంలోని మేజర్ పంచాయతీల్లో ఒక్కో సర్పంచ్ కి మూడు కార్యాలయాలు వున్నాయి. అదేనండీ జనాభా ప్రాతిపధికన ఏర్పాటు చేసిన గ్రామసచివాలయాల్లో వున్న సర్పంచ్ కి ఉన్న కార్యాలయాల సంఖ్య ఇది. గ్రామసచివాలయాలు ఏర్పాటు కాకముందు ఒక పంచాయతీ కార్యాలయంలోనే సర్పంచ్ ఉండేవారు. ఇపుడు ఆ పరిస్థితి లేదు. గ్రామంలో ఎన్ని గ్రామసచివాలయాలు ఉంటే అన్నింటికీ సర్పంచ్ తిరగాలన్నమాట. ఒక్కో సచివాలయంలో రెండు రోజులు చొప్పున పంచాయతీ సర్పంచ్ విధులు నిర్వహించాల్సి వుంటుంది. ఒక్క సచివాలయం ఉన్నచోట మాత్రం వారానికి ఆరు రోజులు విధులు నిర్వహించాల్సి వుంటుంది. ఇంత వరకూ బాగానే ఉన్నా దీనికి సంబంధించి అధికారులే ఇంకా సచివాలయాల పరిధిలోని రికార్డులను, పరిధిలను విభజన చేయలేదు. కొన్ని చోట్ల గ్రామసచివాలయాల భవనాలు నిర్మాణాల్లోనే ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్ర పూర్తయ్యాయి. పూర్తయిన చోట్ల మాత్రం కొత్త సర్పంచ్ లు మూడు సచివాలయాలకు వెళ్లాల్సిందే. అంటే ఏ ప్రాంత పరిధిలోని ప్రజలు ఆయా గ్రామసచివాలయాల పరిధిలో ఆ కార్యాలయంలోనే సర్పంచ్ ను కలవాల్సి వుంటుంది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం అన్ని సచివాలయాలకు సిబ్బందిని నియమించింది.. కానీ, ప్రాంతాలను బట్టి ఇంకా సచివాలయాల రికార్డులు మాత్రం వేరు చేయలేదు. దీనిపై గత ఏడాది నుంచి రాద్దాంతం జరగుతున్నా కొందరు సీనియర్లు సచివాలయాల పరిధిలను విభజన చేయడానికి మాత్రం అంగీకరించడం లేదు. అలాగని రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి కూడా కార్యదర్శిలకు, ఎంపీడీఓలకు ఆదేశాలు రాలేదు. అదంతా సర్పంచ్ లు రాకముందు. ఇపుడు ఖచ్చితంగా విభజన జరిగి తీరాలి. అలా విభజన జరగకపోతే సచివాలయ కార్యదర్శి నుంచి సర్పంచ్ ఇతర సిబ్బంది విధుల నిర్వహణకు కూడా ఆటంకాలు ఏర్పడే అవకాశం వుంది. రాష్ట్రంలోని మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలను పూర్తిచేసిన తరువాత ప్రభుత్వం కూడా సచివాలయాల వారీగా సిబ్బందిని, శానిటేషన్ పనివారిని, రికార్డులను విభజన చేయాలని నిర్ణయించినట్టు సమాచారం అందుతుంది. ఎంత త్వరగా విభజన జరిగితే అంతే త్వరగా గ్రామాభివ్రుద్ధి, సమస్యలు పరిష్కారం అవుతాయి. లేదంటే రోజుకో సచివాలయం పరిధిలో ఈ విభజనగొడవలను పరిష్కరించేందుకే సర్పంచ్ లకు సమయం మొత్తం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాదు మేజర్ పంచాయతీల్లో సర్పంచ్ లకు తొలి సమస్య గ్రామసచివాలయాల పరిధి విభజనే ప్రధానంగా..తొలి పంచాయతీ సమస్యగా కూడా నిలువనుంది..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ఏర్పాటు చేసిన గ్రామసచివాలయ వ్యవస్థలో నియమించిన ఒక లక్షా 34వేల ఉద్యోగాల్లో కొన్ని శాఖల్లో పోస్టులు నేటికీ భర్తీ కాలేదు.. కొంత మంది చేస్తున్న ఉద్యోగాలను వదిలి కొత్త ఉద్యోగాలకు వెళ్లిపోయారు. దీనితో చాలా విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీ అయపోయాయి.. దీనితో ప్రభుత్వం ఆ ఖాళీలను ఎలా భర్తీ చేయాలనేదానిపై కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా గ్రామసచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్లు, సెరీ కల్చర్, హార్టి కల్చర్ అసిస్టెంట్లు ఉద్యోగాలు రెండు దఫాలుగా నోటిఫికేషన్లు ఇచ్చినా భర్తీ కాలేదు. దీనితో ఖాళీగా వున్న ఉద్యోగాలను ఆయా పోస్టుల సమాన క్వాలిఫికేషన్ ఉన్న వారికి ఇవ్వాలా, లేదంటే ఖాళీ అయిపోయిన అన్ని రకాల పోస్టుల కోసం మరోసారి నోటిఫికేషన్ ఇచ్చి విద్యార్హతలు, పోస్టుల విషయంలో మార్పులు చేర్పులు చేయాలనే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సివుంది. లేదంటే చాలా విభాగాల్లోని ఖాళీలు భర్తీ అయ్యే పరిస్థితి లేదు. అంతేకాకుండా గ్రామసచివాలయ కార్యదర్శిలుగా ఉద్యోగాలు వచ్చిన వారు రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ గ్రేడ్ 4 కార్యదర్శి ఉద్యోగాలకు కూడా ఎంపికయ్యారు. అలాంటి వారంతా సచివాలయ ఉద్యోగాలకు రిజైన్ చేసి వారు ముందుగా రాసిన ఉద్యోగాల్లోకి వెళ్లిపోయారు. మరికొందరు డిఎస్సీలో టీచర్ ఉద్యోగాలకు, మరికొంత మంది బ్యాంకు ఉద్యోగాలకు చేస్తున్న ఉద్యోగాలకు రిజైన్ చేసి వెళ్లిపోయారు. అలా అన్ని విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఏర్పడ్డాయనే సమాచారాన్ని సేకరిస్తున్న ప్రభుత్వం వారికోసం మరోసారి నోటఫికేషన్ ఇవ్వాలని చూస్తున్నట్టు సమాచారం. అలా జరిగితే చాలా సమయం పడుతుందని, అలా కాకుండా ఆయా పోస్టుల క్వాలిఫికేషన్ కు తగ్గట్టుగా వచ్చిన మార్కులు ఆధారంగా వెయింటింట్ లిస్టులో ఉన్నవారికి మిగిలిపోయిన ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ఉన్నతాధికారులు చేస్తున్నారట. కానీ ఏ విషయంలో క్లారిటీ లేదు. ఇదే సమయంలో గ్రామసచివాలయ వ్యవస్థకు ఇటీవలే ఒక కమిషనరేట్ ను ప్రారంభించిన ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగుల ప్రొహిబిషన్ పూర్తవుతున్నందున వారికి విధి విధానాలు రూపొందించడానికి అధికారులు ఈరోజు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఖాళీల భర్తీ, ఉద్యోగుల రెగ్యులరైజేషన్, మిగిలి పోయిన పోస్టుల భర్తీ, కొత్త నోటిఫికేషన్ తదితర అంశాలపై ఒక క్లారిటీ రానుంది.
ఆంధ్రప్రదేశ్ లో 10ఏళ్లకు గానీ గ్రామ పంచాయతీలకు కళ రాలేదు. టిడిపి ప్రభుత్వంలో ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికలకు పంగనామం పెట్టారు. చాలా ఏళ్ల తరువాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించింది. దీంతో పంచాయతీలన్నీ సర్పంచ్ లతో కళ కళ లాడుతున్నాయి. మొన్నటి వరకూ గ్రామంలో ఏ సమస్య వచ్చినా పంచాయతీ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరిగి ఆమ్యామ్యాలు సమర్పిస్తే తప్పా పనులు జరిగేవి కాదు. గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకు వచ్చేందుకు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి భారత దేశంలోనే ఎక్కడాలేని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి అందులో 14 శాఖల సిబ్బందిని నియమించి ఇంటి గుమ్మం ముందే సేవలు అందించే కార్యక్రమం చేపట్టారు. ఆ సిబ్బందికి ఇపుడు సర్పంచ్ లు కూడా తోడవ్వడంతో గ్రామాలు అభివ్రుద్ధి బాట పట్టడానికి సిద్ధమవుతున్నాయి. టిటిడి ప్రభుత్వంలో గ్రామ కమిటీల ఆధారంగానే వారికి నచ్చిన ప్రాంతంలో అభివ్రుద్ధి పనులు చేపట్టేవారు. ఇపుడు సర్పంచ్ లు వచ్చిన తరువాత గ్రామంలోని మెజార్టీ సమస్యలు తీర్చడానికి మార్గం సుగమం అయ్యింది. ఇప్పటికే 80శాతానికి పైగా గ్రామ పంచాయతీలను కైవసం చేసుకున్న అధికారపార్టీ వైఎఎస్సార్సీపీ అదే ఊపుతో మున్సిపల్ కార్పోరేషన్లలో కూడా ఎన్నికలు నిర్వహిస్తోంది. దీంతో చాలా మందికి ప్రజలు కార్పోరేషన్లలో మేయర్ పదవులు, గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులు, మండ కేంద్రాల్లో మండలాధ్యక్షుల పదవులు కోసం మరిచిపోతున్న తరుణంలో వీటిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తిరిగి ప్రజలకు గుర్తుచేయడం శుభపరిణామంగా చెప్పవచ్చు. చాలా సంవత్సరాల తరువాత స్థానిక సంస్థలకు అధ్యక్షులు వస్తున్న తరుణంలో వీరి పాలన, అభివ్రుద్ధి ఎలావుంటుందనే విషయం తెలియాలంటే మరో ఏడాది ఆగాల్సిందే..!
విశాఖలోని పెందుర్తి శ్రీ శారదా పీఠం వార్షికోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యంమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. బుధవారం పెందుర్తి చేరుకున్న సీఎం వైఎస్ జగన్, పీఠంలోని అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పీఠంలోని ఆచార్యులలు సీఎంకీ ఆశీర్వచనం అందించారు. అనంతరం ఇక్కడ విద్యాబ్యాసం చేస్తున్న చిన్నారులతో సీఎం ముచ్చటించారు. పీఠం మరింత అభివ్రుద్ధి చెందాలని, అమ్మవారి దయ ఈ విశాఖ ప్రజలపై ఉండాలని, రాష్ట్రం శుభిక్షింగా ఉండాలని కోరుకున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా పీఠాదిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మనాందేంద్ర సరస్వతిలు స్వయంగా సీఎంకి స్వాగతం పలికి అమ్మవారి తీర్ధ ప్రశాదాలను అందజేశారు. సీఎం రాక సందర్భంగా పెందుర్తిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు పోలీసులు. సీఎంతోపాటు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు, విశాఖ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ ఇతర నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రారంభించిన విశాఖ ఉక్కును ప్రయివేట్ వ్యక్తులకు ధారాధత్తంచేస్తే చూస్తూ ఊరుకోమని పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ హెచ్చరించారు.మంగళవారం విశాఖ నగర కాంగ్రెస్,విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శైలజానాథ్ సారధ్యంలో నగర కాంగ్రెస్ కార్యాలయంవద్ద చేపట్టిన భారీ నిరసన కార్యక్రమంలో అయన మాట్లాడుతూ, దాదాపు రెండులక్షల కోట్ల భూములకోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కును ప్రవేటుపరం చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్య మంత్రి జగన్,చేతకాని పార్లమెంటు సభ్యులు కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని,రాష్ట్ర ప్రజల గౌరవ మర్యాదలని మోడీ కాళ్లదగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు. పోస్కో కంపెనీ ప్రతినిధులతో,కేంద్ర ఉక్కు శాఖామంత్రితో మాట్లాడింది నిజం కదా అని ఘాటుగా ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ప్రవేటీకరణ ఉద్యమం నుంచి ప్రజలను ప్రక్కదారి పట్టించేందుకే జీవీఎంసీ ఎన్నికలను ప్రకటించారన్నారు. విశాఖ ఉక్కు కాంగ్రెస్ ఆంధ్రులకు ఇచ్చిన కానుక అని ఇష్టారీతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదన్నారు.ఇప్పటికైనా రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర ప్రజల మనోభావాలను అర్ధం చేసుకొని పోరాడాలన్నారు. ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ, ఇందిరా గాంధీ శంకుస్థాపన చేసి,పీ.వీ.నరసింహారావు జాతికి అంకితం చేసిన విశాఖ ఉక్కును దాదాపు ప్రపంచదేశాల్లో వెలివేసిన పోస్కోకు కట్టపెట్టడం మోడీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్టగా అభివర్ణించారు.మాజీ కేంద్ర మంత్రి జెడీ.శీలం మాట్లాడుతూ, విశాఖ ఉక్కు 32మంది ఆంధ్రుల ప్రాణత్యాగంతో సాధించుకున్నదని ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటామన్నారు.పీసీసీ ప్రధానకార్యాదర్శి జిఏ నారాయణరావు మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెచప్పుడైనా విశాఖ ఉక్కును ప్రాణత్యాగం చేసైనా కాపాడుకుంటామన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సంకు వెంకటేశ్వర రావు మాట్లాడుతూ బెంగాల్, ఛత్తీస్ గఢ్,ఒరిస్సా రాష్టాల్లో తన్ని తరిమేస్తే విశాఖ ఉక్కును దోచుకోవడానికి పోస్కో కుట్రపన్నిందన్నారు. విశాఖ ఉక్కు ప్రవేటీకరణకు వ్యతిరేకంగా స్పందించింది ముందు కాంగ్రెస్ మాత్రమేనన్నారు. ఉత్తరాంధ్రకు తలమానికమైన విశాఖ ఉక్కును ప్రవేటీకరణ చెయ్యడం వలన అనేక మంది కార్మికులు ఉపాధి కోల్పోతారన్నారు.రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షరాలు పేడాడ రమణి కుమారి మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రవేటీకరణ వల్ల దాదాపు లక్షలాది మంది రోడ్డునపడతాయని ఆవేదన వ్యక్తం చేసారు.అనకాపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీరామ మూర్తి మాట్లాడుతూ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని,నష్టాల పేరుచెప్పి ప్రవేటు వ్యక్తులకు ధారపోస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు భోగి రమణ మాట్లాడుతూ ఇప్పటికైనా విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం వెనక్కు తగ్గకపోతే ఆంధ్రుల పౌరుషాన్ని మోడీకి రుచిచూపిస్తామన్నారు.విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ కన్వీనర్ గోవింద రాజు మాట్లాడుతూ అధిష్టానం ఆదేశాలమేరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వజ్జిపర్తి శ్రీనివాసరావు,మూల వెంకటరావు,బొడ్డు శ్రీనివాస్,నూనెలపోలరావు,శేషంశ్రీనివాస్,తుమ్మల త్రినాధరావు, సుధాకర్,బొడ్డు సత్యవతి,ఆర్.శ్రీనివాసరావు,రాజులునాయుడు,తమ్మిన నాయుడు పరదేశి, ఇంకా జీవీఎంసీ ఎన్నికల్లో పోటీచేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థులు,పెద్ద సంఖ్యలో కార్యకర్తలు,మహిళలు పాల్గొని విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసారు.
ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి నెలకు లక్షల్లో జీతం..పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం..కారు బంగ్లా, మంచి హోదా,ఆస్తి అంతస్తు..కానీ ఇవేమీ అతగాడికి నచ్చలేదు. సుదీర్ఘ కాలం సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేసి దేశ విదేశాలు తిరిగి తిరిగి ఆ కార్పోరేట్ ఉద్యోగాన్ని, జీతాలను ఏమీ కాకుండా వదిలేసి సేవచేయడానికి సొంత గ్రామానికి వచ్చేశాడు.. సర్పంచ్ బరిలో నిలబడి ముగ్గురు ప్రత్యర్ధులను మట్టికరిపించి మరీ సర్పంచ్ అయిపోయాడు ఆయన పేరే పందిరి సత్యన్నారాయణ, ఇతగాడిని అంతా చిన్ననాటి నుంచి సత్యంనాయుడు అని ముద్దుగా పిలుస్తుంటారు. ఈయన తండ్రి పందిరి అప్పారావు 30ఏళ్లు పాతూరుగా పిలబడే క్రిష్ణదేవీపేట గ్రామానికి సర్పంచ్ గా సేవలు అందించారు. పుట్టిన గ్రామానికి తనవంతు సహకారం అందించాలని, గ్రామాన్ని జిల్లాలోనే బెస్ట్ గ్రామంగా అభివ్రుద్ధి చేయాలని నిర్ణయించుకొని సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి ప్రజలు యువత మద్దతులో సర్పంచ్ అయిపోయాడీ యువకుడు. విశాఖజిల్లా, గొలుగొండ మండలం, క్రిష్ణదేవిపేట(అల్లూరి సీతారామరాజు బ్రిటీషు సేనలను ఎదిరించి మన్యం పితూరీ నడిపిన పోరాటాల పురిటిగడ్డ)లో పంచాయతీ పోరులో అల్లూరి సాక్షిగా నిలబడి అందరినీ ఓడించి వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా సర్పంచ్ సీటుకు కైవసం చేసుకున్నాడు. యువత, మహిళలు మొత్తం ఈ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కే మద్దతు పలకడం ఈయన గెలుపునకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకపోయింది. గ్రామంలో ప్రధాన సమస్యలను గుర్తించి వాటికి ప్రత్యేక కార్యాచరణ కూడా తయారు చేసి ఒక క్రమబద్ధంగా గ్రామాన్ని అభివ్రుద్ధి చేయడాని పూనుకుని అదే విషయాన్ని ప్రజలకు చెప్పాడు.. అసలే సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేశాడేమో...గ్రామంలోని సమస్యలన్నింటినీ ఫోటోలు, వీడియోలతో సహా అన్ని ప్రాంతాలను కంప్యూటరీకరణ చేసిమరీ మొత్తం సిద్ధం చేసి అన్ని వార్డుల్లోనూ తిరుగుతూనే ప్రజలందరికీ వివరించాడు. గ్రామంలోని అన్ని వర్గాలకు అనుగుణంగా అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రత్యేక ప్రోగ్రామ్ షీట్ నే తయారు చేసుకుని మరి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాడు. ఇంట్లోనే రెండు కంప్యూటర్లు, ప్రింటర్లు, జెరాక్సు మిషన్లు పెట్టి ప్రభుత్వ పథకాలకు స్థానికులు దరఖాస్తు చేసుకునే ప్రతీ కార్యక్రమానికి తనవంతుగా సహాయం చేయడం మొదలు పెట్టి ప్రజల మనసులను గెలుచుకున్నాడు. అన్ని దగ్గరుండి అన్ని పథకాలకు దరఖాస్తులు చేయిస్తూ గ్రామస్తులకు సహాయ పడుతూ వచ్చాడు. ఒక వేళ మండల కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చినా తానే దగ్గరుండి మరీ వారిని తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడంలో తనవంతుగా చేయూతనిచ్చేవాడు. దీనితో.. ప్రజల మనిషిగా గుర్తింపు పడటం, అదే సమయంలో తన తమ్ముడు పందిరి వెంకటరమణ(ఆర్ఎంపీ బుజ్జి) కూడా ప్రజలకు తనవంతుగా ప్రాధమిక వైద్యం అందించడం, ప్రజలకు చిన్న చిన్న సేవలు చేయడంతో గ్రామస్తులంతా ఏకమై మళ్లీ మరోసారి ఈ కుటుంబం నుంచే సత్యంనాయుడుని సర్పంచ్ గా ఎన్నుకున్నారు. గ్రామంలో వాలంటీర్లు ఉన్నప్పటికీ వారికంటే ఎక్కువగా సేవలదించడంలో ముందుంటడంతో ముఖ్యంగా మహిళలకు, యువతకు బాగా చేరువయ్యాడు ఈ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. మరో విశేషం ఏంటంటే కరోనా సమయంలో గ్రామస్తులకు సేవ చేయడానికి ప్రాధమిక వైద్యం(ఫ్టస్ట్ ఎయిడ్ సర్వీస్) అందించడానికి విశేషంగా క్రుషిచేశారు.. గ్రామంలో ఎవరికి జర్వం వచ్చినా, దగ్గొచ్చినా తక్షణమే ప్రాధమిక వైద్యం చేస్తూ, ఎవ్వరికీ లేదు అనిపించుకోకుండా వైద్యసేవలు చేశారు. కరోనా సమయంలోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లోకే జనాలను రానీయని సమయంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, గ్రామంలోని ప్రజలందరికీ ప్రత్యేకంగా సేవలదించింది ఈ కుటుంబం. పైగా ఆ సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో ఒకసారి కూరగాయలు, మరోసారి మాస్కులు, ఇంకోసారి సబ్బులు పంపిణీ కూడా చేశారు. వీరి కుటుంబం మొత్తం ప్రజాసేవలోనే ఉంటూ గ్రామస్తుల నోట్లో నానుతూ రావడంతో ఈ కుటుంబం నుంచే మరోసారి సత్యంనాయుడు సర్పంచ్ కావడానికి అవకాశం వచ్చింది.. ఒక కుటుంబం మొత్తం ప్రజాసేవకు పూనుకోవడం విశాఖజిల్లాలోనే ఇపుడు హాట్ టాపిక్..అందులోనూ బరిలో నిలబడి కులరాజకీయం చేయాలని చూసినా.. వారందరినీ తోసిరాజని సర్పంచ్ సీటు కైవసం చేసుకున్నాడు సత్యంనాయుడు.. ఎంత చదువు చదువుకున్నా లక్షల జీతం కోసం అంతా అర్రులు చాస్తున్న ఈ రోజుల్లో అదే లక్షల రూపాయల జీతాలన్ని, మంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని సైతం వదులుకొని, గ్రామాభివ్రుద్ధికోసం పంచాయతీ సర్పంచ్ గా బరిలో నిలబడి గెలిచి తన పట్టుని నిరూపించుకున్నాడు. గెలవగానే గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని అందరికి తెలియజేశాడు కూడా. సాఫ్ట్ వేర్ ఇంజనీర్..హార్డ్ వేర్ లాంటి రాజకీయంలో నెగ్గి ఆ విజయాన్ని తమ నియోజకవర్గ ఎమ్మెల్యేతో కూడా పంచుకోవడం కూడా ఇపుడు జిల్లాలోనూ, పార్టీలోనూ హాట్ టాపిక్ మారుతోంది. మంచి ఆలోచనతో, గ్రామాభివ్రుద్ధికి నడుంబిగించి సర్పంచ్ అయిన సాఫ్ట్ వేర్ఇంజనీర్ ని మనమూ అభినందిద్దాం..!