1 ENS Live Breaking News

ఆ ప్రకటనలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవు

కేంద్ర ప్ర‌భుత్వం గ్యాంబ్లింగ్‌, ఆన్‌లైన్‌ బెట్టింగ్ కార్యకలాపాలకు సంబంధించికీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రస్తుతం ఆన్ లైన్ మోసాలు దేశ వ్యాప్తంగా అత్యధికంగా జరుగుతు న్నందున ప్రభుత్వం హెచ్చరిక జారీచేసినట్టు తెలుస్తుంది. బెట్టింగుల తరహా కార్యకలాపాలను నిర్వహించే వేదికలకు సంబంధించిన ప్రకటనలను ప్ర‌చురించ‌డం లేదా ప్ర‌సారం చేయ‌డం మానుకోవాల‌ని వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లు, డిజిటల్‌ మీడియా, సామాజిక మాధ్యమ సంస్థలకు అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆన్ లైన్ బెట్టింగ్ లకు సంబంధించిన అనేక రకాల యాప్ లు అందుబాటులో ఉన్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి అనేక మంది వీటి భారీన పడి లక్షలాది రూపాయలు మోసాలకు గురవుతున్నారు. దీనితో వీటిని పూర్తిగా నిషేధించే క్రమంలో కేంద్రం జారీ చేసింది. ఈ ఉత్తర్వులను పాటించని సంస్థలు న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవా ల్సి ఉంటుంది. ఆన్ లైన్ మోసాలపై ప్రతినిత్యం వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.

New Delhi

2023-08-25 11:33:39

తిరుమల శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

కలియుగ వైంకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి 15 గంటల సమయం పడుతున్నది. గురువారం అర్ధరాత్రివరకూ శ్రీవారిని 67,308 మందిభక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు రాగా, 26,674 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇంకా దర్శనంకోసం 18 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారికి నిత్యంచేసే సేవలు,దర్శనాలు యధావిధిగా కొనసాగుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలియజేసింది.

Tirumala

2023-08-25 01:25:21

తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

కలియుగ వైంకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతున్నది. సోమవారం అర్ధరాత్రివరకూ శ్రీవారిని 69,909మందిభక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.37 కోట్లు రాగా, 29,327 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇంకా దర్శనంకోసం 12 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారికి నిత్యంచేసే సేవలు,దర్శనాలు యధావిధిగా కొనసాగుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలియజేసింది.

Tirumala

2023-08-22 02:15:03

తిరుమల శ్రీ‌హ‌రికి రెండు బ్ర‌హ్మోత్స‌వాలు

పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవున్ని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. స్వామివారి ఆజ్ఞ ప్రకారమే శ్రీవేంకటేశ్వరుడు ఆనందనిలయం మధ్యలో ఆవిర్భవించిన కన్యామాసం(ఆశ్వయుజం)లోని శ్రవణా నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించార‌ట‌. అందువల్లే ఇవి 'బ్రహ్మోత్సవాలు'గా ప్రసిద్ధిచెంది అప్పటినుండి నిరాటంకంగా కొనసాగుతున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడో ఏటా అధికమాసం వస్తూ ఉంటుంది. ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ రెండు బ్రహ్మోత్సవాలకు పెద్ద తేడా లేదుగానీ, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ఈ ఏడాది అధికమాసం ఉన్న కారణంగా సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

          సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌ధానంగా సెప్టెంబ‌రు 18న ధ్వ‌జారోహ‌ణం, సెప్టెంబ‌రు 22న గ‌రుడ వాహ‌నం, సెప్టెంబరు 23న స్వ‌ర్ణ‌ర‌థం, సెప్టెంబ‌రు 25న ర‌థోత్స‌వం(మ‌హార‌థం), సెప్టెంబ‌రు 26న చ‌క్ర‌స్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణం జ‌రుగ‌నున్నాయి.  న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌ధానంగా అక్టోబ‌రు 19న గ‌రుడ‌వాహ‌నం, అక్టోబ‌రు 22న స్వ‌ర్ణ‌ర‌థం, అక్టోబ‌రు 23న చ‌క్ర‌స్నానం జ‌రుగ‌నున్నాయి.  బ్ర‌హ్మోత్స‌వాల కార‌ణంగా సెప్టెంబ‌రు 18 నుండి 26వ తేదీ వ‌ర‌కు, అక్టోబ‌రు 15 నుండి 23వ తేదీ వ‌ర‌కు అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌, తిరుప్పావ‌డ‌, క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. ముంద‌స్తుగా ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం సేవా టికెట్లు బుక్ చేసుకున్న భ‌క్తుల‌ను నిర్దేశిత వాహ‌న‌సేవ‌కు మాత్ర‌మే అనుమ‌తిస్తారు. న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల అంకురార్ప‌ణ కార‌ణంగా అక్టోబ‌రు 14న స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.

Tirumala

2023-08-21 16:12:42

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

కలియుగ వైంకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నది. ఆదివారం అర్ధరాత్రివరకూ శ్రీవారిని 57,443 మందిభక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.90 కోట్లు రాగా, 28,198 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇంకా దర్శనంకోసం అన్ని కంపార్ట్ మెంట్లు దాటి బయట లైనువరకూ  భక్తులు వేచి ఉన్నారు. స్వామివారికి నిత్యంచేసే సేవలు,దర్శనాలు యధావిధిగా కొనసాగుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలియజేసింది.

Tirumala

2023-08-11 01:47:40

తిరుమల శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని మంగళవారం అర్ధరాత్రి వరకూ 75,594 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.4.69  కోట్లు ఆదాయం వచ్చింది. 26,213  మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు.  16 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచిఉన్నారు. కాగా స్వామివారి సర్వ దర్శనానికి 15 గంటల సమయం పడుతున్నది. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలియజేసింది.

Tirumala

2023-08-10 02:15:04

కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా ఆడికృత్తిక

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం ఆడికృత్తిక పర్వదినం వేడుకగా జరిగింది.  ఈ సందర్భంగా ఉదయం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వ ర స్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. మధ్యాహ్నం మూలవర్లకు అభిషేకం చేపడతారు. సాయంత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
  ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో దేవేంద్ర‌బాబు, ఏఈఓ  సుబ్బరాజు, సూప‌రింటెండెంట్ భూప‌తి పాల్గొన్నారు.

Tirupati

2023-08-09 09:09:56

తిరుమల శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని మంగళవారం అర్ధరాత్రి వరకూ 73,879 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.4.05  కోట్లు ఆదాయం వచ్చింది. 26,144 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచిఉన్నారు. కాగా స్వామి వారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతున్నది. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకట నలో తెలియజేసింది.

Tirumala

2023-08-09 07:14:54

తిరుమల శ్రీవారి దర్శనానికి 18గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సోమవారం అర్ధరాత్రి వరకూ 69,733 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.4.37  కోట్లు ఆదాయం వచ్చింది. 28,403 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. బయట వరకూ భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచిఉన్నారు. కాగా స్వామివారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతున్నది. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలియజేసింది.

Tirumala

2023-08-08 01:45:51

తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.5.11 కోట్లు విరాళం

చెన్నై సలహామండలి అధ్యక్షుడు  శేఖర్ రెడ్డి నేతృత్వంలో 9 మంది దాతలు కలిసి టీటీడీకి రూ.5.11 కోట్లు విరాళం అందించారు. దాతలు ఈ మొత్తానికి సంబంధించిన డీడీని సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఛైర్మన్  వైవి.సుబ్బారెడ్డికి అందజేశారు. చెన్నై టి.నగర్‌లోని వెంకటనారాయణ రోడ్‌లో ప్రస్తుతం ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ కోసం స్థలం కొనుగోలుకు ఈ మొత్తాన్ని అందించారు. ఈ ఆలయానికి ఆనుకుని ఉన్న రూ.35 కోట్ల విలువైన 5.5 గ్రౌండ్ల స్థలాన్ని చెన్నై సలహామండలి గుర్తించింది. ఈ స్థలం కొనుగోలుకు గతంలో కొంతమంది దాతలు 8,15,15,002 రూపాయలను విరాళంగా అందించారు.  ప్రస్తుతం విరాళం అందించిన దాతలు ర్యాపిడ్‌కేర్ గ్రూపు రూ.1.50 కోట్లు, కోయంబత్తూరుకు చెందిన  వెంకట సుబ్రహ్మణ్యం,  నాగరాజన్, సిఆర్ కన్ స్ట్రాక్షన్స్  ఒక్కొక్కరు కోటి రూపాయలు, శరణ్,  శెంబగమూర్తి  ఒక్కొక్కరు 20 లక్షలు, నరేష్ సుబ్రహ్మణ్యం,  బలహా కెమికల్స్(పి) లిమిటెడ్ వారు ఒక్కొక్కరు రూ. 10లక్షలు, నీలాద్రి ప్యాకింగ్స్ రూ.1లక్ష రూపాయలు  విరాళంగా అందించారు.  ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో ఎవి ధర్మారెడ్డి, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

Tirumala

2023-08-07 09:43:39

పార్లమెంటులో రాహుల్ గాంధీ రీ ఎంట్రీ అదుర్స్

కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు రాహుల్‌ గాంధీ సోమవారం పార్లమెంట్‌‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.  సుప్రీంకోర్టు స్టేతో లోక్‌సభ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్‌ పునరుద్ధరించింది. దీనితో నాలుగు నెలల తర్వాత తొలిసారి రాహుల్‌ లోక్‌సభకు వచ్చారు. సభలోకి వచ్చేముందు ఆయన పార్లమెంట్‌ ప్రాంగణంలోని మహాత్ముడి విగ్రహానికి నివాళులర్పించారు. రాహుల్ వస్తున్న వస్తున్న విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు ఆయనకు  ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్లమెంట్ బయట కోలాహలంగా మారింది. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం పూర్తిగా రద్దవుతుందనుకున్న తరుణంలో పార్లమెంటులోకి తిరిగి అడుగుపెట్టడంతో దేశ రాజకీయాలు వేడెక్కాయి. పార్లమెంటులోకి అడుగుపెట్టనీయకుండా ఉండేలా ఆఘమేఘాలపై ప్రత్యేక సమావేశం ద్వారా వేటు వేసినా అది ఎక్కువ కాలం నిలవలేదు.

New Delhi

2023-08-07 09:21:25

తిరుమల శ్రీవారి దర్శనానికి 15గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ఆదివారం అర్ధరాత్రి వరకూ 83,856 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.4.9  కోట్లు ఆదాయం వచ్చింది. 28,403 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. 25 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. కాగా స్వామివారి సర్వ దర్శనానికి 15 గంటల సమయం పడుతున్నది. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలియజేసింది.

Tirumala

2023-08-07 04:17:02

త్వరలో టీటీడీ వెబ్‌సైట్‌లో రీఫండ్ ట్రాకర్..తిరుమల ఈఓ

తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసి గదులు పొందిన భక్తులకు ప్రస్తుతం రీఫండ్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎస్ఎంఎస్‌ ద్వారా పంపుతున్నామని, త్వరలో రీఫండ్‌ను ట్రాక్‌ చేసేందుకు టీటీడీ వెబ్‌సెట్‌లో ట్రాక్‌ర్‌ను పొందుపరుస్తామని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన పాల్గొని భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.  ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ స్పీడ్ పోస్టు చేసిన‌పుడు ఏవిధంగా క‌వ‌ర్‌ను ట్రాక్ చేయ‌వ‌చ్చో అదే త‌ర‌హాలో రీఫండ్ సొమ్ము స‌మాచారాన్ని తెలుసుకోవ‌చ్చ‌న్నారు. తిరుమలలో యుపిఐ విధానంలో చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు వారు గదులు ఖాళీ చేసిన వెంటనే కాషన్‌ డిపాజిట్‌ మొత్తం రీఫండ్‌ చేయడం జరుగుతోంద‌ని చెప్పారు. క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు ద్వారా చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు 3 నుంచి 5 పనిదినాలలోపు వారి ఖాతాలకు కాషన్‌ డిపాజిట్‌ మొత్తం జమ చేస్త‌న్నామ‌ని తెలిపారు. ఈ సమాచారం ధ్రువీకరించుకోకుండా కొందరు భక్తులు కాల్‌ సెంటర్లకు ఫోన్లు చేసి, అధికారులకు మెయిళ్లు పంపుతున్నార‌ని, భక్తులు తమ బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను పరిశీలించుకుని కాషన్‌ డిపాజిట్‌ మొత్తం రీఫండ్‌ కాకపోతేనే సంప్రదించాలని కోరారు.

 రీఫండ్‌ కోసం కొందరు భక్తులు సొమ్ము చెల్లించిన బ్యాంకును కాకుండా మరో బ్యాంకు స్టేట్‌మెంట్‌ను తప్పుగా సరిచూసుకుంటున్నార‌ని, ఎస్ఎంఎస్‌లో సూచించిన విధంగా 3 నుండి 5 రోజులు వేచి ఉండడం లేదని వివ‌రించారు. మ‌రికొందరు టీటీడీ నిబంధనల ప్రకారం గది ఖాళీ చేయడం లేదని, వెరిఫికేషన్‌ కోడ్‌ సబ్‌మిట్‌ చేయకపోవడం, ఫొటో సరిపోలకపోవడంతో రీఫండ్‌ జనరేట్‌ కావడం ఈఓ వివరించారు. ఈ ఈ కార్య‌క్ర‌మంలో జెఈవోలు  స‌దా భార్గ‌వి,  వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో  న‌ర‌సింహ కిషోర్‌, ఎస్వీబీసీ సీఈవో  ష‌ణ్ముఖ్ కుమార్‌, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ-2 జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఆరోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ , విజివో  బాలిరెడ్డి, డెప్యూటీ ఈవోలు  భాస్క‌ర్‌, రాజేంద్ర త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2023-08-04 09:53:14

మణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

మణిపూర్ లో జరిగిన హింసపై భారతదేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సదరు ఘటనపై మహిళా జడ్జితో సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ లో మహిళా న్యాయమూర్తులు మణిపూర్ లోని హింస జరిగిన ప్రాంతానికి వెళ్లి విచారణ జరుపుతారని, అక్కడి బాధితులతో నేరుగా మాట్లాడతారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ స్పష్టం చేశారు. ఆ రాష్ట్రంలో ఇద్దరు మహిళలను సభ్య సమాజం తలదించుకునే విధంగా నగ్నంగా ఊరేగించిన విషయాన్ని కోర్టు సుమోటా స్వీకరించి ఈరోజు విచారణ జరిపింది. మణిపూర్ రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంచనలం రేపింది. మహిళా జడ్జిలతో కూడిన ఈ సిట్ పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహించి సుప్రీం కోర్టు సిజెకి నివేదిక సమర్పించనుంది. ఆ తరువాత సదరు ఘటన, దానికి సంబంధించిన బాద్యులపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.

Delhi

2023-07-31 10:08:07

తెలుగురాష్ట్రల్లో కనపడకుండా పోయినవారెంతమందంటే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కనిపించకుండా పోయిన బాలికలు, మహిళల మిస్సింగ్ కేసుల వివరాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. 2019 నుంచి 2021 వరకు ఏపీలో 22,278 మంది మహిళలు, 7,928 మంది బాలికల ఆచూకీ దొరకలేదని కేంద్రం వివరించింది. ఇక తెలంగాణలో 34,495 మంది మహిళలు, 8,066 మంది బాలికలు మిస్ అయ్యారని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ లో కొందరు వాలంటీర్లు చేష్టల వలన మహిళలపై అఘాయిత్యాలు, కనపించకుండా పోతున్నారని ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ గణాంకాలు చర్చనీయాంశంగా మారాయి. కాగా తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో తప్పిపోయిన మహిళలు, బాలికల సంఖ్య తక్కువగానే ఉన్నది. మరోవైపు గ్రామాల్లో గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసు ద్వారా ప్రభుత్వం రక్షణ కల్పిస్తున్నది. మహిళల సంరక్షణకోసే ప్రత్యేకంగా వీరు పనిచేస్తున్నారు.

Delhi

2023-07-26 13:01:33