1 ENS Live Breaking News

ప్రధాన మోదీతో సమావేశమైన ఐఎఫ్ఎస్ అధికారులు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్‌) 2022 బ్యాచ్‌ శిక్షణార్థి అధికారులు ఇవాళ లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌ నం.7లోగల ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని వారితో విస్తృతంగా సంభాషించారు. ఉద్యోగ బాధ్యతులు స్వీకరించిన తర్వాత ఇప్పటిదాకా వారి అనుభవాల గురించి ఆరాతీశారు. ఈ మేరకు వారు తమ శిక్షణ సమయంలో గ్రామ సందర్శన, భారత్ దర్శన్‌, సాయుధ దళాలతో సంధానంసహా అనుభవాలను ఆయనతో పంచుకున్నారు. మొట్టమొదటగా తాము గమనించిన జల్ జీవన్ మిషన్, పీఎం ఆవాస్ యోజన వంటి పలు ప్రభుత్వ సంక్షేమ పథకాల పరివర్తన ప్రభావం గురించి కూడా వారు ప్రధానికి వివరించారు. సంక్షేమ పథకాల అమలులో సంతృప్త స్థాయి సాధించడంపై ప్రభుత్వం దృష్టి సారించడం గురించి, ఎలాంటి వివక్షకు తావులేకుండా ప్రతి పేదకూ వాటి లబ్ధిని అందించడం ద్వారా ఒనగూడిన ఫలితాల గురించి ప్రధాని వివరించారు. దక్షిణార్థ గోళంలోని దేశాలను అభివృద్ధి పథంలో నడిపించేలా తోడ్పాటునివ్వడంలో ఈ అవగాహన దోహదం చేస్తుందన్నారు. అలాగే ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం అమలు, విజయాలను అధ్యయనం చేయాల్సిందిగా శిక్షణార్థి అధికారులకు ప్రధాని సూచించారు. అంతేకాకుండా భారత జి-20 అధ్యక్షత గురించి కూడా వారితో చర్చించారు. అలాగే జి-20 సమావేశాలకు హాజరైనప్పటి వారి అనుభవాల గురించి వాకబు చేశారు. పర్యావరణ సమస్యలను ప్రస్తావిస్తూ, ‘మిషన్ లైఫ్’ (పర్యావరణం కోసం జీవనశైలి) గురించి ప్రధాని వారికి విశదీకరించారు. ప్రతి ఒక్కరూ జీవనశైలి మార్పు ద్వారా వాతావరణ మార్పు సమస్యను సమర్థంగా ఎదుర్కొనవచ్చునని స్పష్టం చేశారు.



New Delhi

2023-07-26 12:48:50

ఆగస్టు1 నుంచి 31వరకు శ్రీవారి పుష్కరిణి మూత

తిరుమ‌లలో శ్రీ‌వారి ఆల‌యం వద్ద గల పుష్క‌రిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు గాను ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు పుష్క‌రిణిని మూసివేస్తారు. ఈ కారణంగా నెలరోజుల పాటు పుష్క‌రిణి హార‌తి ఉండ‌దు. సాధారణంగా స్వామి పుష్క‌రిణిలో నీరు నిల్వ ఉండే అవ‌కాశం లేదు. పుష్క‌రిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్త‌మ రీసైక్లింగ్ వ్య‌వ‌స్థ‌ అందుబాటులో ఉంది. నిరంత‌రాయంగా కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తారు. శ్రీవారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ఒక నెల రోజుల పాటు పుష్క‌రిణిలో నీటిని తొల‌గించి చిన్న చిన్న మ‌ర‌మ్మ‌తుల‌ను పూర్తి చేస్తారు. పుష్క‌రిణి మ‌ర‌మ్మ‌తుల కోసం మొద‌టి ప‌ది రోజుల పాటు నీటిని తొల‌గిస్తారు. ఆ త‌రువాత ప‌ది రోజులు మ‌ర‌మ్మ‌తులు ఏవైనా ఉంటే పూర్తి చేస్తారు. చివ‌రి ప‌ది రోజులు పుష్క‌రిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు. పుష్క‌రిణిలోని నీటి పిహెచ్ విలువ 7 ఉండేలా చూస్తారు. టీటీడీ వాట‌ర్ వ‌ర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు చేపడతారు.

Tirumala

2023-07-25 14:08:24

తిరుమల శ్రీవారి దర్శనానికి 18గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సోమవారం అర్ధరాత్రి వరకూ 73,796 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.5  కోట్లు వచ్చింది. 28,840 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. 15 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. కాగా స్వామివారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతున్నది. స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలియజేసింది.

Tirumala

2023-07-25 07:58:48

లక్కీడిప్ లో సేవాటికె భక్తులకు "పేలింక్" ఎస్ఎంఎస్

తిరుమలలో ఆఫ్ లైన్ విధానంలో శ్రీవారి ఆర్జితసేవలు, బ్రేక్ దర్శనం పొందిన భక్తులు టికెట్లు పొందే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు టీటీడీ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. "పే లింక్" ఎస్ఎంఎస్ ద్వారా భక్తులు కౌంటర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లను ప్రింట్ తీసుకోవచ్చు.  సిఆర్ఓలో లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవాటికెట్లను భక్తులకు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఈ విధానంలో టికెట్లు పొందిన భక్తులు కౌంటర్ వద్దకు వచ్చి సొమ్ము చెల్లించి టికెట్లు పొందాల్సి వచ్చేది. నూతన విధానంలో ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్ ను పంపుతారు. భక్తులు ఆ లింక్ పైన క్లిక్ చేసి యుపిఐ లేదా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్ లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చు. ఈ నూతన విధానాన్ని ప్రస్తుతం సిఆర్వోలోని లక్కీడిప్ కౌంటర్ల వద్ద ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. త్వరలో ఎంబీసీ-34 కౌంటర్ వద్ద విచక్షణ కోటాలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు, బ్రేక్ దర్శన టికెట్లకు కూడా ఈ విధానం అమలుకానుంది.

tirumala

2023-07-21 03:32:32

హస్తినకు బయలేర్దిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహనరెడ్డి‌..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి బయలుదేరివెళ్ళారు. ప్రధాని నరేంధ్రమోడీ , హోంమంత్రి ఆమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ఆయన కలవనున్నారు. ఏపీకి రావలసిన నిధులు, బకాయిలపై వారితో చర్చించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హోంమంత్రి అమిత్‌షా, సాయంత్రం 4:30కి ప్రధాని మోదీ, 6 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్మోహనరెడ్డి భేటీ కానున్నారు.ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం.. అక్కడ నుంచి ఢిల్లీకి బయల్దేరారు. 

Tadepalli

2023-07-05 06:33:05

తిరుమల శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని మంగళవారం అర్ధరాత్రి వరకూ 76,254 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.4.09  కోట్లు వచ్చింది. 28,091 మంది భక్తులు స్వామివారికి శిరోజాలు సమర్పించారు. 2 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు. స్వామివారి సర్వ దర్శనానికి 15 గంటల సమయం పడుతున్నది. ఇంకా దర్శనానికి 15 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి వున్నారు.  స్వామివారికి యధావిధిగా అన్ని సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు టిటిడి ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-07-05 03:31:16

బ్రిటీషువాడంటే భారత్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భయమే..?!

భారత దేశంలో మద్రాస్ ప్రావిన్సుతో విశాఖలో పరిపాలించిన బ్రిటీషువారంటే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు గడుస్తున్నా ఇంకా భయం వీడలేదు. అవును దానికి తార్కాణం విశాఖలో నేటికీ అప్పటి భవనాలైన కెజిహెచ్, విక్టోరియా ఆసుపత్రి, ఓల్డ్ లైబ్రెరీలకు, కాన్వెంట్ లకు ప్రభుత్వ కార్యాలయాలకు ఇంకా బ్రిటీషు వారి పేర్లే ఉండటం. వాస్తవానికి కింగ్ జార్జి ఆసుపత్రి నిర్మాణానికి నాడు విశాఖను పరిపాలించిన జమిందార్ గోడె నారాయణరావు గజపతి స్వయంగా భూమి ఇచ్చి..వాటిని నిర్మించారు కూడా. ఒక్కవిశాఖలోనే కాకుండా దేశంలో నేటికీ చాలా చోట్ల బ్రిటీషు పాలనకు గుర్తుగా భవనాలకు, ప్రాంతాలకు వారి పేర్లనే ప్రభుత్వాలు ఉంచేశాయి. ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్యప్రధాయినిగా వున్న కింగ్ జార్జి ఆసుపత్రికి స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు పెట్టాలనే ప్రతిపాద ఉన్నప్పటికీ వాటిని ప్రభుత్వాలు పెద్దగా పరిశీలించలేదు. అంతేకాదు, మహానుభావుల జయంతికి, వర్ధంతికి సభలు సమావేశాల్లో ఘనంగా కీర్తించే అధికారులు సైతం ప్రభుత్వాలకు బ్రిటీషు వాడి పేరుతో ఉన్న కట్టడాల పేర్లను మాప్పించే ప్రతిపాదన కూడా ప్రభుత్వం ముందు చేయడంలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఉమ్మడి విశాఖజిల్లో అల్లూరి సీతారామరాజు మన్యం పితూరి పేరుతో క్రిష్ణదేవిపేట వేదికగా చేసిన ఉద్యమం ప్రపంచంలోని బ్రిటీషు దేశాలకి నేటికి సింహస్వప్నం. భారదేశం నుంచి బ్రిటీషువాడిని తరిమికొట్టడానికి బ్రిటీషు ప్రభుత్వానికి సమాంతరంగా ఏర్పాటు చేసిన రచ్చబండ పంచాయతీ వ్యవస్థ అతిపెద్ద విజయమనే చెప్పాలి. ఆ వ్యవస్థ దేశవ్యాప్తంగా ఒకేసారి ప్రాకితే బ్రిటీష్ ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందని భావించిన తెల్లవాడు అల్లూరి సీతారామరాజుని దొంగదెబ్బతీసి.. చెట్టుకి కాల్చిచంపాడు. అగ్గిపిడుగు నేడు మన మధ్యలేకపోయినా..ఆయన చేసిన విరోచిత స్వాతంత్ర్య పోరాటం భావి తరలాకు నేటికీ దిక్సూచిగా మిగిలిపోతుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75ఏళ్లుదాటుతున్నా నేటికీ దేశంలో ఏర్పడ్డ కేంద్ర రాష్ట్రప్రభుత్వాలకి బ్రిటీషు వారన్నా..నిర్మించిన కట్టడాల పేర్లు మార్చాలన్నా ఒల్లమాలిన భయం అందుకే నాటి బ్రిటీషు పరిపాలకుల పేర్లతోనే చారిత్రాత్మక కట్టడాలు అలానే మిగిలిపోయాయి. తెల్లవాడిపై పోరాటం చేసి భరతమాత కోసం ప్రాణాలను త్రుణప్రాయంగా త్యధించిన అల్లూరి సీతారాయమరాజు జయంతి సందర్భంగా నైనా నాటి బ్రిటీషు కట్టడాల పేర్లను తొలగించి స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు పెట్టాలని విశాఖజిల్లా వాసులు కోరుతున్నారు. ముఖ్యంగా కేజిహెచ్ కి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ద్వారా నాడు బ్రిటీషువాడిని తరిమికొట్టే క్రమంలో అసువులు బాసిన యోధుడి కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుందని కూడా సూచిస్తున్నారు. చూడాలి ఇప్పటికైనా పాలకులు ఈ విషయంలో ఏం చేస్తారనేది..!

Visakhapatnam

2023-07-04 09:00:52

తిరుమల శ్రీవారి దర్శనానికి 18గంటల సమయం

కలియుగ వైంకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతున్నది. ఆదివారం అర్ధరాత్రివరకూ శ్రీవారిని 87,967మందిభక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.20 కోట్లు రాగా, 32,083 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇంకా దర్శనంకోసం 5 కంపార్ట్ మెంట్లలో  భక్తులు వేచి ఉన్నారు. స్వామివారికి నిత్యంచేసే సేవలు,దర్శనాలు యధావిధిగా కొనసాగుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలియజేసింది.

Tirumala

2023-07-03 06:40:32

తిరుమల శ్రీవారి దర్శనానికి 20గంటల సమయం

కలియుగ వైంకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి 20 గంటల సమయం పడుతున్నది. శనివారం అర్ధరాత్రివరకూ శ్రీవారిని 82,999మందిభక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.27కోట్లు రాగా, 38,875 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇంకా దర్శనంకోసం కంపార్ట్ మెంట్ల బయటకూడా భక్తులు వేచి ఉన్నారు. స్వామివారికి నిత్యంచేసే సేవలు,దర్శనాలు యధావిధిగా కొనసాగుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలియజేసింది.

Tirumala

2023-07-02 03:27:56

Ens Live వార్తకు స్పందన.. గ్రామ పంచాయతీల్లో డిజిటల్ చెల్లింపులు..!

ఒక్కోసారి మీడియా నుంచి వచ్చే సందేశాత్మక, సూచనాత్మక వార్తలపై కేంద్రం సుమోటాగా స్పందిస్తూ ఉంటుంది..ఈ కోవలోనే ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికా రిక మొబైల్ న్యూస్ యాప్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా పంచాయతీలు, సచివాలయాల్లో చేపట్టే చెల్లింపులు డిజిటల్ రూపంలో చేపడితే సత్వర ఫలితాలు వస్తాయనే కథనాన్ని ప్రచురించింది. అంతేకాకుండా వాటి వలన వచ్చే ఉపయోగాలను సైతం ప్రత్యేక కథనాల ద్వారా తెలియజేసింది. దీనితో రాష్ట్రప్రభుత్వం స్పందించకపోయినా..నేరుగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామపంచాయతీల్లోని చెల్లింపులన్నీ డిజిటల్, యూపిఐ పేమెంట్ల ద్వారా స్వీకరించాలని నిర్ణయించింది. దానికి మంచి ముహూర్తాన్ని కూడా ఖరారు చేసింది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ఈ చెల్లింపులను ప్రారంభిస్తుందని ప్రకటించింది. ఫోన్ పే, గుగూల్ పే, భీమ్ యాప్ ల ద్వారా చెల్లింపులు చేపట్టాలని ఉత్తర్వులు కూడా జారీ చేసింది. చెల్లింపులన్నీ ఆన్ లైన్, డిజిటల్ విధానాల్లోకి మార్చడం ద్వారా ప్రభుత్వానికి పంచాయతీల ద్వారా వచ్చే ఆదాయం నేరుగా సదరు ఖాతాల్లోకి వెళ్లి నిధులు అన్ని రష్ట్రాల నుంచి ఒకేసారి కనిపిస్తాయి.

దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే గ్రామ పంచాయతీలన్నీ గ్రామ సచివాలయాలుగానూ, వార్డులన్నీ వార్డు సచివాలయాలుగానూ ప్రభుత్వం 2020లో మార్చింది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వం సేవలను అందిస్తోంది. వాటితోపాటు కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఇచ్చే ద్రువీకరణలు కూడా  సచివాలయాల ద్వారానే ఇవ్వడం, అందరికీ డిటిజల్ చెల్లింపులపై అవగాహన కలగడం కూడా కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఊతమిచ్చాయి. అయితే ప్రస్తుతం ఏపీలోని అన్ని సచివాలయాల్లో డిజిటల్ చెల్లింపులు సచివాలయ సిబ్బంది అలవాటు చేస్తూ వస్తున్నారు. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఆ విధానం తొలుత ఏపీ ప్రభుత్వమే ప్రవేశపెట్టింది. కాగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో డిజిటల్ పేమెంట్లను తప్పని సరిచేస్తూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీచేయడంతో ఇక రాష్ట్రప్రభుత్వం కూడా అదే విధానాన్ని అమలు చేయాల్సి వుంటుంది. ఇప్పటివరకూ గ్రామపంచాయతీల్లోని చెల్లింపులన్నీ నగదు రూపంలో జరిగేవి. వాటిని పంచాయతీ సిబ్బంది వారికి తీరిక దొరికినపుడు బ్యాంకుల్లో జమచేసేవారు. లేదంటే వాటిని ఖర్చుచేసి వాటి బిల్లులును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందించేవారు. ఇపుడు అధికారికంగా ప్రవేశపెట్టిన ఈ డిజిటల్ చెల్లింపుల విధానం ద్వారా అన్ని చెల్లింపులు ఆన్ లైన్ ద్వారా చేపట్టడంతో ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత మొత్తాలు ప్రతీరోజూ వస్తున్నాయో కేంద్రం, రాష్ట్రం తెలుసుకోవడానికి వీలుపడుతుంది.

ప్రజా ప్రయోజనాల విషయంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా ప్రజలను చైతన్యం చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటుందనే అంశం మేము అందించే వార్తలు, వాటిపై వచ్చే స్పందనలే తెలియజేస్తున్నాయనడానికి కేంద్ర ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులన్నీ ఆన్ లైన్ లోనే చేయాలన్న విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ప్రజలు, ఉద్యోగులు, ప్రభుత్వాలు వారు చేపట్టే కార్యక్రమాలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ అన్ని వర్గాల వారికి తాజా సమాచారం అందించేందుకు,  Ens Live యాప్ ద్వారా ముందుంటామని మరోసారి తెలియజేస్తున్నాం.

Delhi

2023-07-01 03:06:05

ఇద్దరిమధ్య పాఠశాలల కోసం జరిగే సంభాషణ హిందీలో

1)నమస్కారం..నమస్కార్..नमस्कार 2)మీకు ఏం కావాలి.. ఆప్ క్యా చహతే హై.. आप क्या चाहते हैं 3)విశాఖలో మంచి పాఠశాలు ఉన్నాయా?.. క్యా విశాఖపట్నం మే అచ్చా స్కూల్ హై क्या विशाखापत्तनम में अच्छे स्कूल हैं? 4)విశాఖలో 5 మంచి  పాఠశాలు ఉన్నాయి.. విశాఖపట్నం మే పాంచ్ అచ్చా స్కూల్ హై विशाखापत्तनम में 5 अच्छे स्कूल हैं 5)ఆ పాఠశాలల వివరాలు కాస్త చెప్పగాలరా.. క్యా ఆప్ ముజే ఉన్ స్కూలోంకా వివరణ బతా సకత్ హై.. क्या आप मुझे उन स्कूलों का विवरण बता सकते हैं? 6) మీకు ఆ స్కూల్ వివరాలు చెబుతాను..మై ఆప్ కో ఉస్ స్కూల్ కా వివరణ్ బతాఊంగా मैं आपको उस स्कूल का विवरण बताऊंगा 7)ఖచ్చితంగా ..బిల్ కుల్ बिल्कुल 8) మంచి స్కూల్ కోసం చెప్పండి ఏక్ అచ్చా స్కూల్ కేలియే కహో एक अच्छे स्कूल के लिए कहो 9)ఆ పాఠశాల కూడా దగ్గర్లోనే ఉంది.. స్కూల్ భీ పాస్ మే హై.. स्कूल भी पास में है 10) ఓహో అలాగా అయితే అదే చెప్పండి.. అగర్ ఎసాహై తో కహో अगर ऐसा है, तो कहो

Visakhapatnam

2023-06-21 06:19:22

తిరుమల శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

కలియుగ వైంకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి 15 గంటల సమయం పడుతున్నది. సోమవారం అర్ధరాత్రివరకూ శ్రీవారిని 71,935  మందిభక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.11కోట్లు రాగా, 31,831 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇంకా దర్శనంకోసం 17 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారికి నిత్యంచేసే సేవలు,దర్శనాలు యధావిధిగా కొనసాగుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలియజేసింది.

Tirumala

2023-06-21 03:58:27

రైల్వే స్టేషన్ దగ్గర ఇద్దరిమధ్య జరిగే సంభాషణ హిందీలో

1)నమస్కారం..నమస్కార్..नमस्कार 2)మీకు ఏం కావాలి.. ఆప్ క్యా చహతే హై.. आप क्या चाहते हैं 3)మేము నర్సీపట్నం నుంచి వస్తున్నాం..హమ్ నర్సీపట్నం సే ఆ రహే హై हम नरसीपट्टनम से आ रहे हैं.. 4)సరే మీకు ఎం కావాలి?..అచ్చా తుమ్ క్యా చహతే హో. अच्छा तुम क्या चाहते हो? 5) మేము విశాఖపట్నం వెళ్లాలి..హమే విశాఖపట్నం జానే హై हमें विशाखापत्तनम जाना है 6)ఇక్కడి నుంచి ఏ రైళ్లు ఉన్నాయి?.. యహా సే కౌన్ సీ ట్రైన్ హై..7)यहां से कौन सी ट्रेनें हैं? 8)ఒక్క నిమిషం ఆగండి  చూసి చెప్తాను.. ఏక్ మినిట్ రుకో ఔర్ ముజే దేక్ నే దో एक मिनट रुको और मुझे देखने दो 9)మేము వేచి ఉంటాము.. హమే ఇంతజార్ రహేగా..हमें इंतज़ार रहेगा 10)కొద్దిగా సమయం పడుతుంది..ఇస్ మే తోడా సమయ్ లగ్తా హై इसमें थोड़ा समय लगता है.. 11) మీరు వైజాగ్ వెళ్లడానికి తిరుమల ట్రైన్ ఉంది వైజాగ్ జానే కేలియే ఆప్ కో లియే తిరుమల ట్రైన్ హై विजाग जाने के लिए आपके लिए तिरुमाला ट्रेन है..12)మళ్లీ కలుద్దాం.. ఫిర్ మిలేంగే फिर मिलेंगे.. 13)మంచిది వెళ్లిరండి..అచ్చా జావో..अच्छा जाओ..

Visakhapatnam

2023-06-20 03:47:07

తిరుమల శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

కలియుగ వైంకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి 15 గంటల సమయం పడుతున్నది. సోమవారం అర్ధరాత్రివరకూ శ్రీవారిని 69,879  మందిభక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.82కోట్లు రాగా, 29,519 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇంకా దర్శనంకోసం 20 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారికి నిత్యంచేసే సేవలు,దర్శనాలు యధావిధిగా కొనసాగుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-06-20 02:54:02

ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా స్పోకెన్ హిందీ ఉచితంగా..!

ప్రస్తుత రోజుల్లో హిందీ భాష మాట్లాడే అవసరం ప్రతీ ఒక్కరికీ వస్తున్నది. ఆ సమయంలో అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడినపుడు మనికి హింది భాష రాకపోతే పడే ఇ బ్బందులు అన్నీ ఇన్నీకావు. దానికోసం మనమూ కూడా హిందీలో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. వేలకు వేలు పోసి స్పోకెన్ హిందీ నేర్చుకోలేని నిరుపేద విద్యార్ధు ల కోసం ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా ఉచితంగా హింది భాష మాట్లా డటం నేర్పించాలని సంకల్పించింది. తెలుగు భాష ద్వారా హింది నేర్పించడానికి రోజుకి పది పదాలను ప్రచురించనుంది. మనం బయటకు వెళ్లినపుడు, ప్రయాణాలు చేసే టపుడు, షాపులకి వెళ్లినపుడు ఏ విధంగా హిందీలో మాట్లాడాలనే అంశానికి సంబంధించి ఎలా భాషను పద ప్రయోగం చేయాలో చెప్పే ప్రశ్నలు, సమాధానాల రూ పంలో అందించనున్నాం. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే Ens Live యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకొని రోజూ ఇచ్చే పదాలను ప్రాక్టీసు చేయడమే..!

Visakhapatnam

2023-06-19 05:31:39