1 ENS Live Breaking News

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

కలియుగ వైంకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నది. శుక్రవారం అర్ధరాత్రివరకూ శ్రీవారిని 72,299 మందిభక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.92 కోట్లు రాగా, 36,378 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇంకా దర్శనంకోసం 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారికి నిత్యంచేసే సేవలు,దర్శనాలు యధావిధిగా కొనసాగుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-06-17 03:11:13

జూన్ 19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టిటిడి షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబరు నెల కోటాను జూన్ 19న విడుదల చేయనుంది. భక్తులు  https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో వీటిని బుక్ చేసుకోవచ్చు.  సెప్టెంబరు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం జూన్ 19వ తేదీ ఉదయం 10 గంటల నుండి 21వ తేదీ వరకు ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వాళ్లు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. సెప్టెంబర్ నెల కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవ వర్చువల్ సేవల కోటాను, అదేవిధంగా వాటికి సంబంధించిన దర్శన టికెట్ల కోటాను జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

సెప్టెంబర్ నెల ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూన్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.జూన్ 22న శ్రీవారి పవిత్రోత్సవాల సేవాటికెట్ల విడుదల తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.  భక్తులు ఈ విషయాలను గమనించి సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.


Tirumala

2023-06-16 15:47:58

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

కలియుగ వైంకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నది. గురువారం అర్ధరాత్రివరకూ శ్రీవారిని 70,896 మందిభక్తులు ద ర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.07 కోట్లు రాగా, 37,546 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇంకా దర్శనంకోసం అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోగా.. క్రిష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ భక్తులు వేచి ఉన్నారు. స్వామివారికి నిత్యంచేసే సేవలు,దర్శనాలు యధావిధిగా కొనసాగుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-06-16 04:44:55

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 సమయం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నది. సోమవారం అర్ధరాత్రివరకూ శ్రీవారిని 79,087 మందిభక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.41కోట్లు రాగా, 35,640 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇంకా దర్శనంకోసం 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారికి నిత్యంచేసే సేవలు,దర్శనాలు యధావిధిగా కొనసాగుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రటకనలో తెలియజేసింది.

Tirumala

2023-06-13 06:10:37

2023 సివిల్స్ ప్రిలిమ్స్ లో 14,624 మంది ఉత్తీర్ణత

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించిన సివిల్ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ ఎగ్జామ్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. మొత్తం 1,105 సివిల్ సర్వీస్‌ ఉద్యోగాల భర్తీకి  మే 28న దేశ వ్యాప్తంగా పలు కేంద్రాల్లో ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించగా 14,624 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరు ఈ ఏడాది సెప్టెంబరు 15న జరిగే మెయిన్స్‌ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత సాధించారు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్ష కోసం ఇప్పుడు మళ్లీ డిటైల్డ్‌ అప్లికేషన్‌ ఫామ్‌ - 1 (DAF-I)లో దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్పీ తెలిపింది. ఇందుకు చివరి తేదీని కమిషన్‌ త్వరలోనే వెల్లడించనుంది. ప్రిలిమ్స్‌ కటాఫ్‌, ఆన్సర్‌ కీని సివిల్స్‌ సర్వీసెస్‌ పరీక్ష మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత వెల్లడించనున్నట్లు యూపీఎస్సీ తెలిపింది.  వాటిని అధికారిక వెబ్ సైట్లలో పొందు పరిచింది. నెంబర్ల వారీగా ఒక జాబితా..నెంబర్లు, అభ్యర్ధుల పేర్లతో మరో జాబితాను వేర్వేరుగా విడుదల చేసింది. అదేవిధంగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ కి సంబంధించిన ఫలితాలను కూడా విడుదల చేసింది.

Delhi

2023-06-12 09:34:17

సింహాద్రి అప్పన్ను దర్శించుకున్న సుప్రీంకోర్టు జడ్జి

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారిని ఆదివారం సుప్రీంకోర్టు జడ్జి  జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ దంపతులు, ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఏవి శేష సాయి,  హైకోర్టు రిజిస్టర్ జనరల్ వై.లక్ష్మణరావు, జస్టిస్ యు.దుర్గాప్రసాద్ రావులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు, ప్రధాన పురోహితులు శ్రీనివాసాచార్యులు వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా జస్టిస్ దంపతులు కప్పస్తంభాన్ని అలింగణం చేసుకున్నారు. అనంతరం స్వామివారి సేవలో పాల్గొని అనంతరాలయ దర్శనం చేసుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరము వేద పండితులచే వేద ఆశీర్వచనము చేశారు. ఈఓ స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి పటమును, ప్రసాదాలను అందజేశారు. వీరితో విశాఖపట్నం డిస్ట్రిక్ జడ్జి ఆలపాటి గిరిధర్ తదితర న్యాయమూర్తులు,భీమిలి ఆర్ డి ఓ భాస్కర్ రెడ్డి, చిన్న గదిలి ఆర్ఐ, గోపాలపట్నం ఎస్సై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-06-11 14:19:07

జూన్24 నుంచి శ్రీనివాసుని సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు జూన్ 24 నుండి 26వ తేదీ వరకు వైభవంగా  జరుగను న్నాయి.  ఈ సందర్భంగా జూన్ 22వ తేదీన ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.  ఇందులో భాగంగా మూడు రోజులపాటు ఉదయం 10 నుండి 11 గంటల వరకు  శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.  జూన్ 24న పెద్ద శేష వాహనం, జూన్ 25న హనుమంత వాహనం, జూన్ 26న గరుడ వాహనంపై స్వామివారు  రాత్రి 7 నుండి 8 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించ నున్నారు. 

జూన్ 27న పార్వేట ఉత్సవం :  శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాల మరుసటి రోజైన జూన్ 27వ తేదీన పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీవారిమెట్టు సమీపంలోని మండపంలో ఉదయం 7 నుండి  ఈ ఉత్సవం నిర్వహిస్తారు.  ఈ సందర్భంగా ప్రత్యేక ఆస్థానం, పార్వేట ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు. 

ఆర్జిత సేవలు రద్దు : జూన్ 22వ తేదీన తిరుప్పావడసేవ, జూన్ 24 నుండి 27వ తేదీ వరకు ఆర్జిత కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.
 టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్తు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

చారిత్రక ప్రాశస్త్యం : క్రీ.శ 14వ శతాబ్దం నుండి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలు ప్రారంభమైనట్టు శాసనాధారాల ప్రకారం తెలుస్తోంది. క్రీ.శ 1433వ సంవత్సరంలో చంద్రగిరిని పాలించిన విజయనగర రాజుల వంశానికి చెందిన రెండవ దేవరాయ తిరుమలలో క్రమపద్ధతిలో వేదపారాయణం చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఇది బహుళ ప్రజాదరణ పొందింది. ఈ విషయాన్ని ఆలయాధికారి తెలుసుకుని సిద్ధకోట్టై అని పిలవబడే శ్రీనివాసపురానికి(ఇప్పుడు శ్రీనివాసమంగాపురం) చెందిన 24 మంది మహాజనులను స్వామివారి ఆస్థానంలో వేదాలను పారాయణం చేసేందుకు నియమించారు. దీనికి ఆమోదం తెలిపిన రాజుగారు ఇందుకయ్యే ఖర్చు కోసం తన రాజ్య పరిధిలోని సిద్ధకోట్టై గ్రామం నుండి రాజ్య భాండాగారానికి వచ్చే సొమ్ములో అర్ధ భాగాన్ని మంజూరు చేశారు.అనంతరం శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల మనవడైన శ్రీ తాళ్లపాక చిన తిరుమలాచార్యులు శ్రీ కళ్యాణ వేంకటేశ్వరుడి ఆలయానికి జీర్ణోద్ధరణ చేసి స్వామివారికి పూజలను తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో క్రీ.శ 1540లో చంద్రగిరిని పాలించే అచ్యుతరాయలు మంగాపురం గ్రామాన్ని సర్వమాన్య అగ్రహారం(పన్నులేని భూమి)గా శ్రీ తాళ్లపాక చిన తిరుమలాచార్యులకు అందజేశారు.  అనంతరం క్రీ.శ 1780లో ముస్లిం రాజులు ఈ ఆలయాన్ని లూటీ చేశారు. ఆలయ ప్రధాన రాజగోపురం, గర్భాలయ గోపురం, విగ్రహాలను పూర్తిగా ధ్వంసం చేశారు. పాక్షికంగా ధ్వంసమైన కొన్ని విగ్రహాలు ప్రస్తుతం చంద్రగిరికోటలో భారత ప్రభుత్వ పురావస్తు శాఖ సంరక్షణలో ఉన్నాయి. 1920వ సంవత్సరంలో బ్రిటీషు ప్రభుత్వం ఈ ఆలయాన్ని జాతీయ పురాతన కట్టడంగా గుర్తించి భారత ప్రభుత్వ పురావస్తు శాఖ పరిధిలోకి తెచ్చింది. అప్పటి నుండి ఈ ఆలయం భారత ప్రభుత్వ పురావస్తు శాఖ రక్షిత కట్టడాల జాబితాలో ఉంది.  అనంతరం 1940వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం కాంచీపురానికి చెందిన మధ్వ బ్రాహ్మణుడు సుందరరాజ మంగాపురానికి వచ్చి శ్రీనివాసుడు తనకు కలలో కనిపించాడని తెలిపారు. ''శ్రీనివాసమంగాపురంలో ఉన్న నాకు ధూపదీప నైవేద్యాలు కరువయ్యాయి. నా ఆలయానికి పూర్వ వైభవం కల్పించు'' అని స్వామి ఆదేశించారని వివరించారు. తరువాత గ్రామపెద్దలైన వెంకటకృష్ణయ్య, నరసింగాపురం రెడ్డివారి నాధమునిరెడ్డి, గుర్రప్ప 
ఆచారి మరియు తొండవాడ మొగిలి సుందరరామిరెడ్డి తదితరులను సుందరరాజ కలిసి స్వామివారు తనకు కలలో కనిపించిన విషయాన్ని వివరించి 
సాయం చేయాలని కోరారు. ఆ సమయంలో ఆలయం మొత్తం ముళ్లపొదలు, చీమలపుట్టలు, విషపు కీటకాలు, పాములతో నిండి గోపురాలు కూలిపోయే 
స్థితిలో ఉండేది. గ్రామపెద్దల సాయంతో సుందరరాజ ముళ్లపొదలు, చీమలపుట్టలను తొలగించి ఆలయాన్ని పరిశుభ్రం చేశారు. స్వామివారు కలలో 
సూచించిన విధంగా 1940 జులై 11న ఆషాడ శుద్ధ షష్ఠి రోజున తొలిపూజ చేశారు. అదే విధంగా అర్చకుడైన సుందరరాజకు స్వామివారు కలలో కనిపించి చెప్పిన విధంగా టీటీడీ అప్పటినుండి నిత్యపూజా కైంకర్యాలు నిర్వహిస్తోంది. అలాగే మొదటి పూజను నిర్వహించిన ఆషాడ శుద్ధ షష్ఠి రోజున ''సాక్షాత్కార వైభవం'' పేరిట టీటీడీ ప్రతి ఏడాదీ ఉత్సవం నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాన్ని బ్రహ్మోత్సవాల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి టీటీడీ నిర్వహిస్తుండడం విశేషం.

Tirupati

2023-06-10 09:44:48

జమ్మూ ఆల‌యంలో వైభవంగా శ్రీవారి కల్యాణం

జమ్మూలోని మజీన్ గ్రామంలో తావి(సూర్యపుత్రి) నది ఒడ్డున టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి  ఆలయంలో గురువారం సాయంత్రం శ్రీవారి క‌ల్యాణం వేడుకగా జరిగింది.  ముందుగా వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవా యిద్యా ల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో వేదమంత్రాలు పఠిస్తూ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవా రు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన జమ్మూ భక్తులు భక్తిపారవశ్యంతో పులకించారు.  ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు గుణభూషణ్ రెడ్డి,  శివప్ర సాద్, ఇఇ  సుధాకర్, డెప్యూటీ ఇఇలు  రఘువర్మ,  చెంగల్రాయలు, ఏఈవో కృష్ణారావు, సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం, టెంపుల్ ఇన్స్పెక్టర్  సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Jammu

2023-06-08 14:41:16

వైభవంగా శ్రీవేద నారాయ‌ణ స్వామి పుష్పయాగం

నాగ‌లాపురం శ్రీ వేద నారాయ‌ణ స్వామివారి ఆలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేద నారాయ‌ణస్వామివారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు ఆలయంలోని రాములవారి మండపంలో అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, రోజా, తామర, కలువ, మొగలిరేకులు వంటి 10 రకాల పూలు, 3 రకాల ఆకులతో స్వామి, అమ్మవార్లకు యాగం నిర్వహించారు.  ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి 
ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.పుష్పయాగం అనంతరం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో  నాగరత్న, ఏఈఓ  మోహన్,  సూపరింటెండెంట్‌  ఏకాంబరం, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌  శ్రీనివాసులు పాల్గొన్నారు. 

Tirupati

2023-06-08 14:33:31

జమ్మూ ఆలయ మహాసంప్రోక్షణ ఏర్పాట్లు పరిశీలన

జమ్మూలోని మజీన్ గ్రామంలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 8న జరుగనున్న మహాసంప్రోక్షణ ఏర్పాట్లను మంగళవారం టీటీడీ జెఈవో వీరబ్రహ్మం పరిశీలించారు. గర్భాలయం, యాగశాల, వేదిక వద్ద ప్రముఖులు కూర్చునేందుకు ఏర్పాట్లు, విచ్చేసే భక్తులకు అన్నప్రసాద వితరణ, పార్కింగ్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ పరిసరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జమ్ములో చేపట్టే కార్యక్రమం స్థానికులకు తెలియజేసే విధంగా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు, ఎస్ఇలు  సత్యనారాయణ,  వెంకటేశ్వర్లు, విజివోలు  మనోహర్, గిరిధర్ రావు, డెప్యూటీ ఈవోలు  గుణభూషణ్ రెడ్డి,  శివప్రసాద్, ఇఇ  సుధాకర్, డెప్యూటీ ఇఇలు  రఘువర్మ,  చెంగల్రాయలు, ఏఈవో  కృష్ణారావు,  తదితరులు పాల్గొన్నారు.

Jammu

2023-06-06 13:52:45

గుగూల్ పే, పేటిఎం, ఫోన్ పే లకు కాలం చెల్లిపోతుంది..!

భారత దేశంలో గుగూల్ పే, పేటిఎం, ఫోన్ పే లకు మెల్లగా కాలం చెల్లిపోతుంది. మొదట్లో అన్నివర్గాలకు చేరువైన ఈ పేమెంట్ యాప్ లు త్వరలో తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతున్నాయి. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో యాప్ లో యూపిఐ పేమెంట్ విధానాన్ని పెద్ద ఎత్తున అమలు చేసింది. నేడు ఆన్ లైన్ ఫుడ్ డెలవరీ యాప్ జొమోటా కూడా యూపీఐ పేమెంట్ విధానాన్ని అందుబాటులోకి తీసు కు వచ్చింది. అందులోనూ ఫోన్ పే లో చేసే పేమెంట్లకు ఒక రూపాయి నుంచి రూ.2 లు అధనంగా ఛార్జ్ చేయడంతో వినియోగదారులు ప్రభుత్వ యాప్ లను ఆశ్రయిస్తున్నారు. యూపిఐ విధానం అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతీ సంస్థ ఇపుడూ థర్డ్ పార్టీ యాప్ లపై ఆధారపడ టం మానేస్తున్నాయి. ప్రస్తుతం వాట్సప్ ద్వారా కూడా యూపిఐ పేమెంట్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా త్వరలో మరిన్ని సోషల్ మీడియా యాప్ లు కూడా యూపిఐ పేమెంట్ విధానాలను అందుబాటులోకి తేనున్నాయని సమాచారం. 

New Delhi

2023-05-18 01:09:39

మే31 నుంచి శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు మే 31 వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగను న్నాయి. ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు అమ్మవారు పద్మసరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.  ఈ ఉత్సవాల్లో శ్రీ  అలమేలు మంగమ్మ పద్మసరోవర తీరంలో పాంచరాత్ర ఆగమపూజలు అందుకుని భక్తులను అనుగ్రహిస్తారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. తెప్పోత్స వాల్లో పాల్గొన్న భక్తులకు తిప్పలు, సంసార దుఃఖాలు తొలగి, మోక్షం సిద్ధిస్తుంది. పద్మసరస్సులో బంగారు పద్మం నుండి ఆవిర్భవించిన అలమేలు మంగ జీవకోటికి మాతృమూర్తిగా మారి భవజలధిలో మునిగిపోకుండా రక్షించి, సర్వసౌఖ్యాలు ప్రసాదిస్తారని తెప్పోత్సవాల అంత రార్థం.

           మే 31వ తేదీ మొదటి రోజు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి, రెండో రోజు శ్రీ సుందరరాజస్వామి, చివరి మూడు రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తారు. చివరి మూడు రోజుల పాటు పద్మసరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం 3.30 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు అమ్మవారికి స్నపనతిరుమంజనం నిర్వహించ‌నున్నారు. అమ్మవారికి జూన్ 3వ తేదీ రాత్రి 8 గంట లకు గజవాహనం, జూన్ 4వ తేదీ రాత్రి 8 గంటలకు గరుడ వాహనసేవ నిర్వ‌హిస్తారు. తెప్పోత్సవం  అనంతరం ప్రతిరోజు ఆలయ మాడ వీధు ల్లో అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు. తెప్పోత్సవాల కారణంగా అమ్మవారి ఆలయంలో ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజ ల్‌సే వను రద్దు చేశారు.  ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

Tiruchanur

2023-05-16 06:52:51

Whats Appలో ఇక మెసేజుని ఎడిట్ చేసుకోవచ్చు..

సోషల్ మీడియా దిగ్గజం వాట్సప్ సరికొత్త ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మనం ఎవరికైనా పంపే మెసేజులో తప్పులుంటే వా టిని ఎడిట్ చేసుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. గతంలో ఏదైనా సమాచారం పంపితే అది నేరుగా అవతలి వ్యక్తికి దగ్గరకు వెళ్లి పోయేది..తప్పులున్నా..ఒప్పులున్నా..అయితే ఇపుడు కొత్తగా వచ్చిన అప్డేట్ లో వాట్సప్ మెసేజ్ ను ఎడిట్ చేసుకునే సౌలభ్యం కూడా అం దుబాటులోకి వచ్చింది. ఈ విధానం కూడా కేవలం మెసేజ్ పంపిన 15 నిమిషాలలో మాత్రమే ఏమైనా తప్పులు ఉంటే ఎడిట్ చేసుకోవడా నికి వీలుపడుతుంది. ఆ సమయంలో సదరు మెసేజ్ ని ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకోవచ్చు. మెసేజ్ పంపేసిన 15 నిమిషాల తరువాత మాత్రం ఎ డిట్ చేసుకునే వీలు లేదు. అయితే ఈ కొత్త ఫీచర్ వచ్చిన విషయం చాలా మందికి తెలియదు. ఈ కొత్త ఫీచర్ వినియోగించాలంటే వాట్సప్ లేటెస్ట్ వెర్షన్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ చేసుకోవాల్సి వుంటుంది. ఇకపై ఎప్పుడైనా కంగారులో అరకొర సమాచారాన్ని పంపేసినా..వెంటనే గు ర్తించి సరిచేసుకునే వీలు కలగడం ఇపుడు వాట్సప్ యూజర్లకు ఊరట నిచ్చే అంశమనే చెప్పాలి..

అమెరికా

2023-05-15 10:19:01

తిరుమలలో ముగిసిన బాలకాండ పారాయణం

ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై 2021  జులై 25న ప్రారంభిం చిన బాలకాండ పారాయణం సోమవారం ఘనంగా ముగిసింది.   తిరుమ‌ల‌ ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్  కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవ ధాని మాట్లాడుతూ, లోక క‌ల్యాణార్థం టీటీడీ నిర్వ‌హిస్తున్న పారాయణ యజ్ఞంలో భాగంగా, మంత్ర పారాయణం ప్రారంభించిందన్నారు. ఇం దులోని ప్ర‌తి శ్లోకం మంత్ర‌మేన‌న్నారు. బాల‌కాండలోని మొత్తం 77 స‌ర్గ‌ల్లో 2,232 శ్లోకాలను  649 రోజులపాటు పారాయణం చేశామన్నారు. ప్ర‌తి శ్లోకానికి అర్థంతోపాటు ప్ర‌స్తుత స‌మాజానికి అన్వ‌యించి పండితులు వ్యాఖ్యానం అందించార‌ని వివ‌రించారు.

          శ్రీ బేడి ఆంజనేయ‌స్వామి, శ్రీ‌రాముని అవ‌తార‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి స‌మ‌క్షంలో నాద‌నీరాజ‌నం వేదిక‌పై బాలకాండ పారాయ‌ణం చేయ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. రామ‌నామ‌స్మ‌ర‌ణ ఎక్క‌డ జ‌రిగితే అక్క‌డ హ‌నుమంతుడు ఉంటార‌ని వాల్మీకి మ‌హ‌ర్షి తెలియ‌జేశార‌ని, ఆవిధంగా ఇన్నిరోజులు ఆంజ‌నేయుడు మ‌న‌మ‌ధ్యే ఉన్నార‌ని చెప్పారు. వాల్మీకి మహర్షి గురువుగా మారి రామాయణాన్ని లోకానికి అందించారన్నారు.   బాలకాండ పారాయణం నిర్వహించిన ఎస్వీ వేద విశ్వవిద్యాల‌యం అధ్యాప‌కులు డా. ప్ర‌వ రామ‌కృష్ణ సోమయాజులు, ధ‌ర్మ‌గిరి వేద‌విజ్ఞాన‌పీఠం పండితులు  రామానుజచార్యులు,  మారుతి,  శేషాచార్యులకు, ఈ కార్య‌క్ర‌మాన్ని కోట్లాది మంది భ‌క్తులకు చేరువ చేసిన‌ ఎస్వీబీసీ సిఈఓ షణ్ముఖ కుమార్ కు, అద్భుత‌మైన కీర్త‌న‌లు ఆల‌పించిన అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియజేశారు. అనంత‌రం పండితుల‌ను, క‌ళాకారుల‌ను స‌న్మానించారు.

          బాలకాండలోని 74 నుండి 77వ సర్గ వరకు 4 సర్గలు, యోగ వాశిష్ఠం, ధన్వంతరి మహామంత్రం, అష్టాక్షర  శ్రీరామమంత్ర స్త్రోత్రం కలిపి మొత్తం 166 శ్లోకాలను శ్రీ అవధాని పర్యవేక్షణలో పండితులు పారాయ‌ణం చేశారు. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు తమ ఇళ్ల నుంచే పారాయణంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు వందన బృందం "శ్రీరామ జయరామ  శృంగార రామాయని..", కార్యక్రమ ప్రారంభంలో, హైదరాబాద్ కు చెందిన సాంప్రదాయ కళాశాల విద్యార్థుల బృందం "ప్రతి వారం వారం మానస భజారే రఘువీరం.." సంకీర్తనను చివరిలో ఆలపించారు. 

Tirumala

2023-05-15 10:09:57

ఈనెల 28న న్యూఢిల్లీలో CNNEO సమవేశం

కాన్ఫెడరేషన్ ఆఫ్ న్యూస్ పేపర్ ,న్యూస్ ఏజెన్సీస్ ఎంప్లాయిస్ ఆర్గనైజేషన్ సమావేశం దేశరాజధాని న్యూ ఢిల్లీ చాణిక్యపురి లోని హోటల్ సామ్రాట్ లొ జరుగుతుందని కాన్ఫెడరేషన్ సభ్యులు, అల్ ఇండియా న్యూస్పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జాతీయ సీనియర్ ఉపాధ్యక్షుడు చలాది పూర్ణచంద్రరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా జర్నలిస్టుల సమస్యలు, నూతన వేతన సంఘ ఏర్పాటు,  రిటైర్డ్ జర్నలిస్టులకు జాతీయ పెన్షన్, యూఎన్ఐ వార్త సంస్థ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేకసమస్యలు పరిష్కరించి యూ ఎన్ ఐ పిటిఐ లను జాతీయం చెసి 1977 కి ముందు కేంద్రం పరిధిలో పని చేసినట్లే సమాచార్ గా మార్చాలన్న ప్రతిపాధనలతో పాటు ఇతర అంశాలు కేంద్రం ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళనున్నట్టు పేర్కొన్నారు. ఈ కాన్ఫడరేషన్ సమావేశనికి పిటిఐ ఎంప్లాయిస్ ప్రధాన కార్యదర్శి ఎం.ఎస్ యాదవ్,యూ ఎన్ ఐ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, మరియు కాన్ఫెడరేషన్ కొసధికారి ఎం.ఎల్ జోషి, నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (i)(NUJI) అధ్యక్షులు రాస్ బీహారి,ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్, (IJU),ది ట్రిబ్యున్ ఎంప్లాయిస్ యూనియన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (IFWJ), నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ప్రతినిధులతో పాటు ఈ సభ్య యూనియన్ లనుండి మొత్తం 80 మంది ప్రతినిధులు పాల్గొంటారని ఆ ప్రకటనలో తెలిపారు.

Machilipatnam

2023-05-12 11:02:29